Brahmani
-
Babu Case : లోకేషా.. ఈ ప్రశ్నలకు జవాబేదీ?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రకటనలేంటీ? వాటి అంతరార్థమేంటీ? లోకేష్ : తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిది. సిద్ధమవడానికి సమయం పడుతుంది. సందేహాలు : పార్టీని ఏనుగులా పోల్చడమేంటీ? అసలు ఏనుగు అనడంలో లోకేష్ ఉద్దేశ్యమేంటీ? ఎవరూ కదలలేకపోతున్నారనా? లేక పార్టీ బలంగా ఉందని చెప్పడమా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏనుగే అనుకుంటే, సిద్ధమవడానికి సమయం పడుతుందనుకొందాం. కానీ తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది కాదు కదా. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న ఒక పార్టీలో చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి అవినీతి పాలయి జైల్లోకి వెళ్లాడు. ఒక్క అరెస్ట్‌తోనే పార్టీ తలకిందులయిందన్నది లోకేష్ ఉద్దేశ్యమా? లేక పార్టీ నిద్రాణంగా ఉందన్న భావనలో ఉన్నారా? లోకేష్ : చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో, ఆ వ్యవస్తను మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సందేహాలు : లోకేష్ రాజకీయాల్లోకి 2014 తర్వాత వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటున్న లోకేష్ ముందెక్కడ పోటీ చేయలేదు. అప్పటికే పార్టీ అధికారంలో ఉంది. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ నేరుగా ఎమ్మెల్సీ అయ్యాడు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. పార్టీ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి జాతీయ కార్యదర్శి పదవి తీసుకున్నాడు. అధికారం తమదే కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. అంతే తప్ప.. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సాధించుకోలేదు. తెలుగు రాజకీయాలను భ్రష్టు పట్టించి ఓటుకు కోట్లు కెమెరాల సాక్షిగా ఇస్తూ అడ్డంగా దొరికి, లంచం ఇవ్వడం తప్పు కాదని వాదించే మీలాంటి నాయకులు ఉండడం వల్లే రాజకీయాల్లోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే.., లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేసమయంలో లోకేష్ గానీ, లోకేష్ తండ్రి చంద్రబాబు గానీ జైల్లో లేరు. నిజానికి ఆ సమయంలో చేయని తప్పుకు కేసులు పెట్టి జైలుకు పంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. కాంగ్రెస్ కక్ష కడితే, దానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం వంత పాడి కేసుల్లో ఇంప్లీడ్ అయి తప్పుడు అభియోగాలు బనాయించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించారు. ఈ కేసులు తప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. 2014లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు కట్టబెట్టారు. అంటే లోకేష్ చెప్పే అరెస్ట్ ఇదేనా.? తాము అక్రమంగా అరెస్ట్ చేసి పంపామన్న అపరాధన భావనలో ఉన్నాడా? లోకేష్ : మేం ఎనిమిదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకు హైదరాబాద్/సైబరాబాద్‌లో ఎకరం జాగా లేదు. అసలు నిజాలు : లోకేష్, చంద్రబాబు ఆస్తుల వెల్లడి అన్న కార్యక్రమం ఎంత కామెడీనో తెలుగు ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో కట్టిన రాజసౌధం విలువ లక్షల్లోచూపిస్తావు. ఏంటంటే.. కొన్నప్పుడు అంతే ఉందంటావు. ఇక అసలు మాకు ఒక్క గజం భూమి ఉన్నా.. ఇచ్చేస్తానంటావు. మరి మదీనాగూడలో 14 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్ సంగతేంటీ? అంత ఖరీదైన లోకేషన్లో అంత భూమి ఎలా వచ్చింది? ఖరీదైన స్థలాలన్నీ మీ నానమ్మ నీ ఒక్కరికే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది? ఇందులో క్విడ్ ప్రో కోల గురించి ఎప్పుడైనా వివరణలిస్తావా? దీని గురించి వేసిన కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు, మీ కొడుకు దేవాన్ష్ కు ఇచ్చిన బహుమతులు అమ్మణ్ణమ్మ, బాలకృష్ణ ఐటీ రిటర్నులు, ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు లేవు? లోకేష్ : మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా సంస్థ హెరిటేజ్ నిదానంగా ఎదిగింది. లేదంటే సంస్థ విలువ ఇప్పటికీ మూడు రెట్లు పెరిగేది. అసలు నిజాలు : హెరిటేజ్ విలువ ఎంత? ఆ సంస్థ అంచలంచెలుగా ఎలా ఎదిగింది అన్నది చిత్తూరు నుంచి విజయనగరం వరకు ఎవరిని అడిగినా చెబుతారు. పదవిని అడ్డు పెట్టుకుని హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని దివాళా తీయించినప్పుడే వ్యవస్థలను ముంచే మీ ప్రతిభ అర్థం చేసుకోవాలి. అయినా హెరిటేజ్ అసలు లెక్కలు ఎప్పుడయినా బయటపెట్టారా? ఇందులో మీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరయినా కీలక స్థానాల్లో ఉన్నారా? ఈ మధ్యే మీ అమ్మ భువనేశ్వరీ ఏం చెప్పారు? మా సంస్థ హెరిటేజ్‌లో 2% షేర్లు అమ్మినా మాకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ సంస్థ విలువ రూ.20వేల కోట్లు. కేవలం పాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, సూపర్ మార్కెట్ల ద్వారా రూ.20వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మానవ మాత్రుడు ఎవరయినా ప్రపంచంలో ఉంటారా? మీరు తప్ప. ఇందులో అక్రమ సంపాదన ఎంత? వ్యవస్థలను ముంచిందెంత? మీ సంస్థ బాగు కోసం ఎవరెవరిని తొక్కేశారు. కొంచెం లెక్కలు వివరంగా చెబితే అందరూ నోళ్లు వెల్లబెట్టి వింటారు. లోకేష్ : రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావడం ఆమె ఇష్టం. మేం మా దారులు ఎంచుకొన్నాం. అసలు నిజమేంటీ : పార్టీ లోడు నువ్వెత్తడం లేదని విషయం స్పష్టమయిన తర్వాతే మీ నాన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గత మూడు వారాలుగా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలోనే బ్రాహ్మణి పేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణి రావాలి, పాదయాత్ర చేయాలి, పార్టీని నడిపించాలని ప్రచారం చేస్తున్నారు. అంటే దానర్థమేంటన్నది మీ స్టాన్ఫోర్డ్ బ్రెయిన్‌కు అర్థం కానంత గొప్పదేం ఉండదు. మీరు తారా స్థాయిలో రాజకీయాలు నడిపితే బ్రాహ్మణి పేరు ముందుకు ఎందుకు వస్తుంది? హెరిటేజ్ సంస్థను విడిచిపెట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలి అని పచ్చమీడియా పిచ్చిగా ప్రచారం చేస్తోందంటే ఇంతకు మించిన అర్థం ఇంకేముంటుంది? (Courtesy : Nidhi) లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్, రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్, ఫైబర్ గ్రిడ్.. ఈ మూడు ప్రాజెక్టులు నా మంత్రిత్వ పరిధిలోనివి కావు, కాబట్టి వాటికి నేను బాధ్యుడిని కాదు సందేహాలేంటీ : మొన్నటి వరకు ఏం వాదించారు.? బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అంటే అర్థమేంటీ? తప్పు జరిగింది కానీ మాది బాధ్యత కాదంటున్నావు. ఇక ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శాఖలకు కూడా నేను మంత్రిగా పని చేయలేదంటున్నావు. అంటే అర్థమేంటీ? కుంభకోణం జరిగింది కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా లేదని అర్థమా? స్కిల్ డెవలప్మెంట్ మీ నాన్న శాఖలోనిది అయితే మీ ప్రమేయం అంతగా ఎందుకుంది? ఫైబర్ గ్రిడ్‌కు మీకు సంబంధం లేకుంటే.. మీవైపే అన్ని ఆధారాలు ఎందుకు చూపిస్తున్నాయి? మీ సంస్థ భూములు రింగ్‌రోడ్డు చుట్టే భూములు కొనాలని మీకు కలలో ఐడియా వచ్చిందా? పైగా మీ బెయిల్ పిటిషన్లో మీ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏం వాదించారు? కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్‌లో తండ్రి చంద్రబాబుతో కలిసి ఉన్నందుకు నాపై కేసు ఎలా పెడతారని కోర్టు ముందు వాదించారు. అంటే మునగాల్సి వస్తే తండ్రిని కూడా వదిలేస్తారా? ఇవేనా మీరు నేర్చుకున్న కుటుంబ విలువలు? అసలు నోటీసులు రాకముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారు? సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన మంతనాలకు ఇన్ని రోజులు పడుతుందా? అయినా న్యాయశాస్త్రంలో మీరేమీ డాక్టరేట్ చేయలేదు కదా.. మీకున్న ప్రతిభకు సాల్వే, లూథ్రా లాంటి సీనియర్ లాయర్లకు ఏం సూచనలు చేస్తారు? రాజమండ్రిలో కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీ హోటళ్లలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేకంటే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండడం మిమ్మల్ని నాయకుడిగా నిలిపేది కదా. పైగా నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది కాబట్టి ఏపీ నుంచి ఢిల్లీ వచ్చానని నిజాయతీగా చెబితే సగటు తెలుగు ప్రజలకు కనీసం సానుభూతి అయినా వచ్చేది కదా. ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్సయ్యారు? -
ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ఆగ్రహం..!
-
చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు
-
చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. బాబును కలిసేందుకు జైలు అధికారులు ముగ్గురికి అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి తొలుత రాజమహేంద్రవరంవిద్యానగర్లో లోకేశ్ ఏర్పాటు చేసుకున్న క్యాంప్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి లోకేశ్‌తో కలిసి సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ జైల్‌కు సొంత వాహనంలో చేరుకున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి 30నిమిషాలు బాబుతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, బెయిల్, కుటుంబ సభ్యుల యోగక్షేమాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది : భువనేశ్వరి చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, ధైర్యంగా ఉన్నారని ఆయన భార్య నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కట్టించిన బ్లాక్‌లోనే ఆయన్ని కట్టిపడేశారని అన్నారు. ఆయనకు నంబర్ వన్ సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా, ఆ పరిస్థితి అక్కడ లేదన్నారు. బాబు భద్రతపై ఆందోళన కలిగిస్తోందన్నారు. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆయన్ని విడిచి బయటకు వస్తుంటే తనలో ఏదో భాగం వదిలేసిన భావన కలుగుతోందని అన్నారు. ప్రజలు, రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉండాలని చంద్రబాబు నిరంతరం పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిని జైల్లో చూసి బాధేసిందని, అక్కడ కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం ఆలోచించే బాబు కోసం పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని, తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలు, కేడర్ కోసం నిలడుతుందని అన్నారు. మీడియా సమావేశంలో భువనేశ్వరితో పాటు లోకేశ్, బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. చంద్రబాబుతో హైకోర్టు న్యాయవాది భేటీ చంద్రబాబును హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మంగళవారం మధ్యాహ్నం సెంట్రల్ జైలులో కలిశారు. ఇద్దరూ కేసుకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ వేయడం, సీఐడీ కస్టడీ కోరిన నేపథ్యంలో న్యాయపరంగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై వారు చర్చించినట్లు తెలిసింది. రెండో రోజు జైలులో ఇలా.. చంద్రబాబు జైలు జీవితం మంగళవారం రెండో రోజుకు చేరింది. తొలి రోజులాగే రెండో రోజు సైతం వీఐపీ ఖైదీకి అందించే సదుపాయాలన్నీ అందించారు. చంద్రబాబు తొలి రోజు యోగా మాత్రమే చేశారు. మంగళవారం ఉదయం 4 గంటలకే నిద్ర లేచి యోగాతోపాటు వాకింగ్ కూడా చేసినట్లు సమాచారం. అనంతరం మూడు ప్రధాన పత్రికలు తెప్పించుకుని క్షుణ్ణంగా చదివారు. ఆ తర్వాత ఆల్పాహారం, టీ తాగారు. మధ్నాహ్నం, సాయంత్రం పుల్కా, కర్డ్ రైస్ తీసుకున్నట్లు తెలిసింది. స్నేహ బ్లాక్‌కు అదనపు సీసీ కెమెరాల నిఘా బాబుకు రాజమండ్రి కేంద్ర కారాగారంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయన ఉన్న స్నేహ బ్యారక్ వద్ద ప్రస్తుతం ఉన్న వాటితోపాటు అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. 1 + 4 భద్రత ఇస్తున్నారు. ఇతర ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జైలు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అధికారులు అక్కడ వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు. స్నేహ బ్యారక్ ఎదురుగానే 24 గంటలూ వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు వైద్య సిబ్బందికి విధులు కేటాయించారు. జైలు లోపలే కాదు.. ఎలాంటి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా జైలు బయట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
చంద్రబాబు కోసం ఓ ప్రత్యేక వార్డు
-
జైల్లో చంద్రబాబును కలవనున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి..!
-
జీఈఎస్ సదస్సుకు ఉపాసన, బ్రాహ్మణి
-
జీఈఎస్‌లో ఉపాసన, బ్రాహ్మణి
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ సమ్మిట్(జీఈఎస్)కు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు తరలివచ్చారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసన హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరవ్వడం హర్షణీయమని బ్రాహ్మణి అన్నారు. బ్రాండ్ హైదరాబాద్ పురోగతికి సదస్సు ఉపకరిస్తుందని ఆకాంక్షించారు. మహిళల్లో వ్యాపారవేత్తలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని బ్రాహ్మణి అభిప్రాయపడ్డారు. తను వెంచర్ కాపిటలిస్టుగా ఉన్నానని, ఎన్నో కంపెనీలకు నిధులు అందిస్తున్నానని చెప్పారు. అన్నింటిల్లోను మహిళదే ప్రధానపాత్ర అన్నారు. హైదరాబాద్ జీఈఎస్‌కు ఆతిథ్యం ఇవ్వడం స్వాగతించదగినదని అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసనా అన్నారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణించేందుకు సదస్సు మార్గనిర్ధేశం చేస్తుందన్నారు. -
అరుదైన కలయిక : నారా, మెగా కోడళ్లు
నంది అవార్డుల వివాదంతో మెగా, నందమూరి కుటుండాల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతుంటే.. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. తాజాగా మెగా కోడలు ఉపాసన ఓ ఆసక్తికరమైన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఈ రోజు జరిగిన ఓ రక్తదాన శిబిరంలో ఉపాసన, బ్రాహ్మణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన.. 18 ఏళ్ల వయసులో రక్తదానం చేయటం ప్రారంభిస్తే ప్రతీ 90 రోజులకు ఒకసారి చొప్పున 60 ఏళ్ల వరకు చేయవచ్చు.. దాదాపు 500 మంది ప్రాణాలను కాపాడవచ్చు అంటూ కామెంట్ చేసింది. Bhramani & I spent a heartwarming afternoon donating blood. If you begin donating blood at age 18 &donate every 90 days until you reached 60, you would have potentially helped save more than 500 lives! #foodforthought #donateblood - it’s a very powerful & satisfying thing to do. pic.twitter.com/cZtKP2WUks — Upasana Kamineni (@upasanakonidela) 18 November 2017 -
గాలివారి పెళ్లి పత్రికను జీవితంలో చూసి ఉండరు!!
-
బ్రాహ్మణికి బాబు పరామర్శ
బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి స్వల్ప అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు బుధవారం ఉదయం చంద్రబాబు, బాలకృష్ణ ఆస్పత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. మంగళవారం ఉదయం మదీనాగూడ ఫామ్‌హౌస్‌లోని చంద్రబాబు నివాసంలో బ్రాహ్మణి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. నీరసించడం వల్ల కళ్లు తిరిగి కింద పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చంద్రబాబు అసెంబ్లీ నుంచి నేరుగా అపోలోకు వచ్చి కోడలిని పరామర్శించారు. బుధవారం మళ్లీ ఆస్పత్రికి వచ్చిన ఆయన గంటసేపు అక్కడే గడిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బ్రాహ్మణికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, గురువారం డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. -
చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు
* తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ బ్రహ్మణి ప్రకటన * దీంతో ఏపీలో ఉద్యోగ ప్రకటనలు లేవని చెప్పినట్లయిందని బాబు మథనం హైదరాబాద్: తన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరకాటంలో పడ్డారని తెలిసింది. ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట కూడా. ఇంతలా చంద్రబాబును ఇబ్బందుల్లో పడేసే విధంగా ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటన ఏంటంటే...? తెలంగాణలో గ్రూప్ 1, 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో 60 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని ఈ మధ్యనే విలేకరుల సమావేశంలో ప్రకటించారు. శిక్షణ పొందాలనుకున్న వారు ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బ్రహ్మణి ప్రకటనతో చంద్రబాబు సంకట పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకంటే విభజన అనంతరం తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల్లో ప్రస్తుతం 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వస్తున్నప్పటికీ ఆయనపట్టించుకోవడం లేదు. పైగా అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరోపక్క కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా దక్కినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్న బ్రహ్మణి ప్రకటనతో అటు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు.. మరోవైపు ఏపీలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోతున్నట్లు ప్రజలకు తామే చెప్పినట్లయిందని చంద్రబాబు మథనపడ్డారట. బ్రహ్మణి ప్రకటనతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్న విషయాన్ని ఎత్తిచూపినట్టయిందని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. -
చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు బ్రహ్మిణి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కోడలు బ్రహ్మిణి చేసిన ప్రకటనతో ఇరకాటంలో పడ్డారట. ఆ ప్రకటనపై ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట కూడా. ఇంతకు చంద్రబాబు ఇబ్బందుల్లో పడేసే విధంగా ఆయన కోడలు బ్రహ్మిణి చేసిన ప్రకటన ఏంటంటే...? గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, యువకుల్లో ఓ 60 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామంటూ ప్రకటించారు. అలా శిక్షణ పొందాలనుకున్న వారు బుధవారంలోగా ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాల్లో ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపికైన వారికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బ్రహ్మిణి ఈ ప్రకటన చేయడం వల్ల చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమంటే...? ఉద్యోగాల భర్తీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వేలాది సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖల్లో ప్రస్తుతం 1.43 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తి కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోగా ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారు. ఎప్పుడు తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారోనని నిత్యం ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా దక్కినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన వారికి అది కూడా దక్కకపోవడం నిరుద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్న బ్రహ్మిణి ప్రకటన వల్ల అటు తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్టు... మరోవైపు ఏపీలో ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోతోందని ప్రజలకు తెలియజేసినట్లు అయిందని చంద్రబాబు మథనపడ్డారట. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కోడలు బ్రహ్మిణి ఉచితంగా శిక్షణ ఇస్తామని చెబుతూ ఏపీలో ఖాళీగా ఉన్న 1.43 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్న విషయాన్ని ఎత్తి చూపినట్టయిందని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. -
బుల్లి వారసుడి పేరు ఖరారు
హైదరాబాద్: నారావారి వారసుడి పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల ముద్దుల మనవడికి 'దేవాన్ష్'గా నామకరణం చేశారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నారా లోకేష్, బ్రహ్మణిలు తమ కుమారుడికి దేవాన్ష్ అనే పేరు పెట్టినట్లు ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా బుజ్జిబాబు దేవాన్ష్‌తో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని కూడా ట్విట్ చేశారు. ఉగాది పండుగ రోజున దేవాన్ష్ జన్మించిన విషయం తెలిసిందే. On this auspicious day of our grand father's birthday, we announce the name of our son "Devaansh". pic.twitter.com/p66Z9w9cyV — Lokesh Nara (@naralokesh) May 28, 2015 -
బాలయ్యతో పోటీ పడుతున్న మనవడు..
హైదరాబాద్ : నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో ...బుల్లి మనవడు పోటీ పడుతున్నాడు. బాలయ్య కుమార్తె బ్రాహ్మణి (మార్చి 21) ఉగాది రోజున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నారావారి వారసుడి ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నారా బ్రాహ్మణి మంగళవారం ఉదయం తన ఫేస్ బుక్‌లో కొడుకు ఫోటో పోస్ట్ చేశారు. నందమూరి అభిమానులు ఇంకా పేరుపెట్టని బుజ్జిబాబు ఫోటోను షేర్ చేసుకోవటంతో పాటు లైక్‌లు కొడుతున్నారు. ఇప్పటికే మనవడిని చూసి బాలకృష్ణ సంతోషంతో ఉన్నారు. పండగలా దిగివచ్చాడంటూ వారసుడిని చూసి మురిసిపోయారు. -
తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ
-
తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ
హైదరాబాద్: ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన వియ్యంకుడు ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తాతలయ్యారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి(బాలకృష్ణ కుమార్తె) శనివారం సాయంత్రం 4.05 గంటలకు హైదరాబాద్ నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి డాక్టర్లు ఆండాళ్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రసవ సమయంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ ఆస్పత్రి వద్దే ఉన్నారు. సీఎం చంద్రబాబు ఉగాది ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లి తన మనవడిని చూశారు. -
ఉగాది రోజునే బాలయ్య.. తాతయ్యారు!
ఉగాది పండుగ నందమూరి.. నారా కుటుంబాలకు కొత్త సంబరాలు తెచ్చింది. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మగబిడ్డకు జన్మనిచ్చింది. మాదాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు డెలివరీ అయ్యింది. దాంతో ఉగాది రోజునే టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాతయ్యలు అయ్యారు. బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు ఏకైక కుమారుడు లోకేష్‌కు ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఉగాది రోజునే వారికి మగబిడ్డ పుట్టడంతో.. రెండు కుటుంబాల్లో సంతోషం రెట్టింపు అయ్యింది. -
చంద్రబాబు ఆస్తులివీ!
-
బాలయ్య.... ఇక తాతయ్య!
ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరలో తాతయ్య కాబోతున్నారు. ఆయన పెద్ద కుమార్తె, నారా వారి కోడలు బ్రహ్మణి ... త్వరలో తల్లి కాబోతోంది. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్, బ్రహ్మణిల వివాహం 2007లో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను లోకేష్... 'ఎస్ ఇట్స్ ట్రూ అండ్ థాంక్యూ ఫర్ ది విషెస్' అంటూ.... ఓ ఆంగ్ల దినపత్రికకు ధ్రువీకరించారు. ఇక ఇటు నందమూరి, అటు నారావారి కుటుంబంలోకి బుజ్జి పాపాయి రాబోతుండటంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణకు ఇది డబుల్ బొనాంజా అవుతుంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు, బాలయ్య సతీమణి వసుంధర దేవి కూడా తొలిసారి నానమ్మ, అమ్మమ్మ హోదాపై చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇరు కుటుంబాలకు సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మణి ఆరోగ్యంగా ఉన్నారని, బిడ్డ పెరుగుదల కూడా బాగున్నట్లు వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ బుజ్జి పాపాయి కోసం వచ్చే ఏడాది వేసవి వరకూ ఆగాల్సిందేనట. కాగా ఈ విషయంపై బావ చంద్రబాబు, బావమరిది బాలయ్యలు ముసి ముసి నవ్వులే తప్ప, పెదవి మాత్రం విప్పటం లేదు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
వీళ్లు మీ బినామీలు కారా బాబూ!!?
సొంత ఆఫీసు లేని ఐఎంజీకి 850 ఎకరాలు ఎకరా 2 కోట్లు చేసే భూమి... 50 వేలకే కేబినెట్‌కు తెలియకుండా కేటాయింపులు విలువైన పచ్చల హారాన్ని, అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్‌లను ధరించిన నారా వారి కోడలు బ్రహ్మణి చిత్రాలివి. బ్రహ్మణి దగ్గరున్న మొత్తం నగలకు బాబు కట్టిన విలువ 9.9 లక్షలు. కానీ ఈ ఫోటోలు చూసిన వారు కనీసం ఆరు కోట్లకు తక్కువ ఉండవంటున్నారు. మరి బాబు ఎన్ని రెట్లు తక్కువ చేసినట్లు? ఒక బినామీని పెట్టుకుని... ఆ బినామీ చేత కంపెనీ పెట్టించి... దానికి ఆఘమేఘాల మీద 850 ఎకరాలు కేటాయించేసి... ముందు చూపుతో భవిష్యత్తు హక్కుల్ని కూడా ఆ సంస్థకు రాసిచ్చేయటం బహుశా... బాబుకే సాధ్యం. 2003 ఆగస్టు 5న హైదరాబాద్‌లో ‘ఐఎంజీ భారత’ కంపెనీ రిజిస్టరయింది. దాని అధిపతులు అహోబలరావు అలియాస్ బిల్లీరావు, ప్రభాకరరావు అలియాస్ పేట్‌రావు. వీరిద్దరూ నాటి సీఎం బాబుకు బాగా సన్నిహితులు. వాళ్లకు అప్పటికే కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని అమలుచేసే ప్రాజెక్టునూ అప్పగించారు బాబు. కనీసం ఆఫీసు కూడా లేని ఐఎంజీ... రూ.5 లక్షల మూలధనంతో పేపర్‌పై మొదలైంది. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్వరూపాన్ని మార్చేస్తామనే ప్రతిపాదనతో ముందుకొచ్చింది. అంతే! ఫైళ్లు వేగంగా కదిలాయి. నాలుగు రోజులు తిరక్కుండా బాబు ఎంఓయూ చేసుకున్నారు. హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని ఇచ్చేయటానికి సరేనన్నారు. ఈలోపే బాబు మిత్రపక్షమైన ‘ఈనాడు’ పత్రిక శివాలెత్తేసింది. ఐఎంజీకి భూములిస్తే రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ విజేతలు తథ్యమంటూ కథనాలు వండేసింది. ఐఎంజీని ఆకాశానికెత్తేసింది. ఇంతలో చిక్కొచ్చి పడింది. తమ పేరు బిల్లీ దుర్వినియోగం చేస్తున్నారని, ఆయనతో తమకెలాంటి సంబంధం లేదంటూ ఫ్లోరిడాలోని అసలు ఐఎంజీ లేఖ రాసింది. బాబు లెక్కచేయలేదు. ఎందుకంటే బిల్లీ తన జేబులో మనిషాయె. 2003 సెప్టెంబర్ 1న... ఐఎంజీకి హైదరాబాద్‌లోని స్టేడియాలనూ అప్పగించాలని నిర్ణయించారు. ఐఎంజీకి భూమి అప్పగించాలంటూ... 2004 జనవర్లో నాటి రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. ఫిబ్రవరి 10న భూమి రిజిస్ట్రేషన్ పూర్తయింది. 24 గంటలు తిరక్కుండా బాబు టెంకాయ కొట్టేశారు. భూమి ఒక్కటే కాదు. అప్పటికే హైదరాబాద్‌లో కట్టిన 8 మైదానాలను 45 ఏళ్ల పాటు ఐంఎజీకి లీజుకిచ్చేందుకు బాబు ఓకే చేశారు. లీజు గడువు ముగిశాక... ఐఎంజీ తనకు నచ్చిన రేటుకు, నచ్చిన స్టేడియాన్ని సొంతం చేసుకునే అవకాశంమూ ఉదారంగా కల్పించారు. అంతటితో ఆగలేదు లెండి! ఆ స్టేడియాలకయ్యే నిర్వహణ ఖర్చును ఐదేళ్లపాటు ప్రభుత్వమే భరిస్తుందని, ఏడాదికి రూ.2.5 కోట్ల చొప్పున చెల్లిస్తామని జీవో ఇచ్చేశారు. ఇదంతా చూస్తే బాబుకు బిల్లీ ఎంత పెద్ద బినామీయో తెలియటంలేదూ!! ఎమ్మార్ చక్రం... తిప్పింది బాబే 2000లో బాబు దేశంలో ఎక్కడా లేనట్లుగా... ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను రాష్ట్రంలో కట్టాలనుకున్నారు. 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్... చుట్టూ శ్రీమంతులకు విల్లాలు.. ఫైవ్‌స్టార్, బిజినెస్ హోటళ్లు.. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్.. ఇదీ ఆ టౌన్షిప్ స్వరూపం. ఆసక్తి, అనుభవం ఉన్న సంస్థలు ముందుకు రావచ్చంటూ 2001 జూలై 6న ప్రకటన ఇప్పించారు. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్, మలేసియాకు చెందిన ఐఓఐ ప్రాజెక్ట్స్, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ఆసక్తి వ్యక్తంచేశాయి. వీటిలో సోమ్ ఏసియాను, షాపూర్జీ పల్లోంజీను బాబు ప్రభుత్వం పక్కనపెట్టేసింది. మిగిలిన మూడింటినే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌కు (ఆర్ఎఫ్పీ) షార్ట్‌లిస్ట్ చేసింది. చిత్రమేమిటంటే టెండర్లకు ఆఖరుతేదీ అయిన 2001 డిసెంబరు 15 నాటికి ఐఓఐ, ఎల్ అండ్ టీ వెనక్కెళ్లిపోయాయి. ఇక బరిలో మిగిలింది ఎమ్మార్ ఒక్కటే. సహజంగా పోటీదారు లేకుండా ఒకే సంస్థ బరిలో ఉంటే టెండర్లు రద్దు చేస్తారు. కానీ బాబు అలా చేయలేదు. ఎమ్మార్ సంస్థకే కట్టబెట్టేశారు. ఎమ్మార్ కోసం బిడ్లు ఉపసంహరించుకున్న రెండింట్లో ఐఓఐ ఇండియా సంస్థ బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేష్‌ది. ఈ సంస్థకు తరువాతి కాలంలో బాబు హైటెక్ సిటీ రెండో దశను, ఏపీ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ పేరిట బంజారాహిల్స్‌లో విలువైన రెండున్నర ఎకరాలను కట్టబెట్టారు. ఎల్ అండ్ టీతో బాబు దోస్తీ రాష్ట్రం యావత్తూ తెలిసిందే. హైటెక్ సిటీని, కాకినాడ పోర్టును ఇంకెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని కట్టబెట్టినందుకు అది తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను ఉచితంగా నిర్మించిందనే ఆరోపణలూ వచ్చాయి. కోనేరు ప్రసాద్‌తో అప్పటికే లింకులు ఎమ్మార్‌లో కీలక సూత్రధారి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు అప్పటికే బాబుతో సన్నిహిత సంబంధాలుండేవి. 2000వ సంవత్సరంలోనే దుబాయ్ అల్యూమినియం కంపెనీని(దుబాల్) రాష్ట్రానికి తెచ్చారు. విశాఖలో బాక్సైట్ గనుల్ని ఆ సంస్థకు కట్టబెట్టబోయారు బాబు. రస్ అల్ ఖైమాకు చెందిన రాక్ సిరామిక్స్‌ను రాష్ట్రానికి పరిచయం చేసిందీ కోనేరే. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఎమ్మార్‌కు కేటాయించిన స్థలానికి సమీపంలో చంద్రబాబుకు మూడెకరాల స్థలం ఉండేది. తల్లి అమ్మణ్ణమ్మ, భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్ పేరిట ఉన్న ఈ స్థలాన్ని 2000లోనే... అంటే ఎమ్మార్‌కు కేటాయించటానికి మూడేళ్ల ముందే బాబు ఏకంగా ఎకరం కోటి రూపాయల చొప్పున అమ్మారు. మరి మూడేళ్ల తరవాత ఎకరా రూ.14 లక్షలకే అప్పజెప్పారంటే ఏమనుకోవాలి? బాబు భూ పందేరాలు.. బాబు హయాం అంతా భూ పందేరాల మయం. పేరు కూడా తెలియని కంపెనీలను తీసుకొచ్చి... హైదరాబాద్ నడిబొడ్డున పప్పు బెల్లాలకు వందల ఎకరాలు కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబుది. ఐటీ సంస్థల ముసుగులో తన బినామీలకు భూములు కట్టబెట్టిన బాబు... ఐఎంజీ, ఎమ్మార్ వంటి వ్యవహారాల్లో పూర్తిగా బరితెగించేశారు. బినామీ బిల్లీ రావును తీసుకొచ్చి 850 ఎకరాలు రాసిచ్చేశారు. హైటెక్ సిటీ పక్కన ఎకరా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఎమ్మార్‌కు కేవలం 29 లక్షల రూపాయల చొప్పున ధారాదత్తం చేసేశారు. వాటిలో కొన్నింటి వివరాలు చూస్తే... హెరిటేజ్ సంగతేంటి బాబూ? హెరిటేజ్ ఫుడ్స్‌లో బాబు కుటుంబానికున్న వాటా 50 శాతం. దానివిలువను ఆయన దాదాపు 28 కోట్లుగా చూపించారు. కానీ దాని మార్కెట్ విలువ 500 కోట్లు. అంటే బాబు వాటా రూ.250 కోట్లు. ఇది కూడా ఎన్నో రెట్లు తక్కువ చూపించినట్లేగా? హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబునాయుడి ఆరంభ పెట్టుబడి 2 లక్షలు. ఇపుడు బాబు ఆ కంపెనీలో బాబు కుటుంబానికి అధికారికంగా 50 శాతం వాటా ఉంది. దాని విలువ రూ.250 కోట్లు. ఈ సంస్థ కోసం మంత్రిగా, ముఖ్యమంత్రిగా తనకు తానే రాయితీలు ఇచ్చుకుంటూ... జీవోలు విడుదల చేస్తూ... ప్రభుత్వ డెయిరీలను సమాధి చేస్తూ బాబు సాగించిన అరాచకం... నభూతో-నభవిష్యతి. 1992లో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పాలపొడి తయారీ కంపెనీగా శ్రీకారం చుట్టింది హెరిటేజ్ ఫుడ్స్. బాబు రెవెన్యూ మంత్రి కావటంతో దీని దశ తిరిగింది. 1994లో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. 1996 నాటికల్లా పాల ప్రాసెసింగ్‌తో పాటు వెన్న, పెరుగు, మజ్జిగ, నెయ్యి, పాల కోవా, సుగంధపాలు, ఐస్‌క్రీమ్ తయారీ మొదలెట్టింది. బాబు ముఖ్యమంత్రి అయ్యాక హెరిటేజ్‌కు రాయితీల వరద ఆరంభమయింది. బాబు వాటా విలువా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. డిఫర్మెంట్ వల్లే రూ.100 కోట్లపైగా లాభం హెరిటేజ్ సంస్థకు ట్యాక్స్ డిఫర్మెంట్ ద్వారా దక్కింది రూ.15 కోట్లు. దాన్ని తొలి రెండేళ్లలోనే వసూలు చేసుకున్నారు బాబు. ఆ 15 కోట్లను వ్యాపార విస్తరణకు వెచ్చిస్తే ఆ మొత్తం ఎంతవుతుంది? ఊహించలేం!. అలా కాకుండా బ్యాంకులో డిపాజిట్ చేసినా... అప్పట్లో ఉన్న 18 శాతం వార్షిక వడ్డీతో 14 ఏళ్లకు ఇది రూ.152 కోట్లవుతుంది. నెలకు రూపాయి వడ్డీ చొప్పున వేసినా 14 ఏళ్ల తరవాత దాని విలువ రూ.73 కోట్లు. అంతేకాదు. దీన్ని వెంటనే చెల్లించకుండా మరో 14 ఏళ్ల పాటు వాయిదాల్లో చెల్లిస్తారు కనక మొత్తం వడ్డీ రూ.200 కోట్లకు పైమాటే. హెరిటేజా... మజాకా!! ముఖ్యమంత్రిగా బాబు 1994లో బాధ్యతలు చేపట్టాక 1999లో తొలిసారిగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. భారీ ఎత్తున రియల్ ఎస్టేల్ ఆస్తుల్ని చూపిస్తూ.. వాటి విలువను మాత్రం అతి తక్కువగా కట్టారు. అయినా సరే అప్పటికి మొత్తం కుటుంబ ఆస్తులు రూ.7.79 కోట్ల వరకూ ఉన్నట్లు విలువ కట్టారు. 1986 నుంచి చూసుకుంటే ఒక్కసారిగా ఇన్ని కోట్లకు ఆస్తులెలా చేరాయన్నది ఆయనకు మాత్రమే తెలిసిన రహస్యం. కర్షక పరిషత్ చైర్మన్‌గా చంద్రబాబు నియామకం చెల్లదంటూ పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై 1988లో బాబు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ఇది. సంప్రదాయ రైతు కుటుంబం నుంచి తాను వచ్చానని, కుటుంబానికి 1986 నాటికి 77 ఎకరాలుండగా అప్పుడు విడిపోయామని, తాను స్వయంగా కూలీల్ని పెట్టి వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.36,000 సంపాదిస్తున్నానని బాబు స్వయంగా పేర్కొన్నారు.