
సాక్షి,సిటీబ్యూరో:ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ప్రతిష్టాత్మకమైన జీఈఎస్ సదస్సుకు ఆహ్వానించకపోవడం దారుణమని టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌తో సహా దేశ,విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న సదస్సుకు ఆయనున్న పిలవక పోవడం.. తెంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రజలపై ఎంత ద్వేషముం దో వెల్లడవుతోందన్నారు. అంతకుముందు కార్యక్రమంలో పార్టీ నాయకులు వనం రమేశ్, బద్రినాథ్ యాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
పూలే చిత్రపటానికి పూలమాల వేస్తున్న టీడీపీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment