సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్‌ప్లాంట్‌పై కేబినెట్‌లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్‌లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.
స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్‌లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment