హెచ్‌ఐసీసీలో మాట్లాడుతున్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
మాదాపూర్: మ్యాపింగ్, సర్వే, సెర్చింగ్‌లలో జియో ఫేషియల్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని.. ఈ టెక్నాలజీలో యువతను, పరిశోధకులను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న జియో స్మార్ట్ ఇండియా–2021ను మంగళవారం గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారతీయులే ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
కేంద్రం డిజిటల్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఇస్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment