
న్యూఢిల్లీ: వెబ్ కాన్ఫరెన్స్ కంపెనీ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ (జెడ్‌వీసీ)కి తాజాగా భారత్‌లో దేశవ్యాప్త టెలికం లైసెన్స్ లభించింది. దీంతో ఇకపై బహళ జాతి కంపెనీలు, వ్యాపార సంస్థలకు తమ క్లౌడ్ ఆధారిత ప్రైవేట్ ఎక్స్చేంజ్ (పీబీఎక్స్) ’జూమ్ ఫోన్’ టెలిఫోన్ సర్వీసులను కూడా అందించడానికి వీలవుతుందని జెడ్‌వీసీ జీఎం సమీర్ రాజె తెలిపారు. భారత మార్కెట్‌కు కట్టుబడి ఉన్న తమకు ఇది కీలక మైలురాయిలాంటిదని ఆయన పేర్కొన్నారు. దేశీ యూజర్లకు వినూత్న సొల్యూషన్స్ అందించేందుకు కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment