ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులో ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ ప్రోగ్రాం మరికొద్ది రోజుల్లోనే చరిత్ర సృష్టించనుంది. స్టార్‌లింక్ ప్రోగాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్‌లింక్ కృషి చేస్తోంది. కాగా ప్రస్తుతం స్టార్ లింక్ సేవలు కేవలం 11 దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. స్టార్‌లింక్ కవరెజీని ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తోందని మంగళవారం జరిగిన మాక్వేరీ గ్రూప్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో స్పేస్‌ఎక్స్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ షాట్‌వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ స్టార్ లిక్ ప్రోగ్రాం కోసం 18 వందల శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పంపించామని గ్విన్ షాట్‌వెల్ తెలిపారు. మిగిలిన శాటిలైట్లను సెప్టెంబరు లోపు పంపించి త్వరలోనే గ్లోబల్ కవరెజీ అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. కాగా ప్రతి దేశంలో స్టార్‌లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురావలంటే ఆయా దేశాల ఆమోదం పొందడానికి సమయం పడుతుందని అభిప్రాయపడింది.
స్టార్‌లింక్ ప్రోగ్రాంలో భాగంగా తొలిదశలో సుమారు 12వేల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని స్పేస్‌ఎక్స్ చూస్తోంది. మొత్తంగా 42 వేల ఉపగ్రహాలను పంపనుంది. ఇప్పటికే 12 వేల ఉపగ్రహలను లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ ప్రోగ్రాం కోసం సుమారు పది బిలియన్ డాలర్లను వెచ్చించనుంది. స్టార్‌లింక్ సేవలను పొందడానికి ఇప్పటికే సుమారు 5 లక్షల వరకు ఫ్రీ ఆర్డర్లు బుక్ అయ్యాయని స్పేస్‌ఎక్స్ కంపెనీ సీవోవో గ్విన్ షాట్‌వెల్ పేర్కొన్నారు.
చదవండి: స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ షట్‌డౌన్.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..!
Comments
Please login to add a commentAdd a comment