మణిపూర్‌ హింసకు స్టార్‌లింక్‌ వినియోగం.. మస్క్‌ ఏమన్నారంటే? | Elon Musk Denies Claims of Starlink Usage in Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్‌ హింసకు స్టార్‌లింక్‌ వినియోగం.. మస్క్‌ ఏమన్నారంటే?

Published Wed, Dec 18 2024 1:28 PM | Last Updated on Wed, Dec 18 2024 3:25 PM

Elon Musk Denies Claims of Starlink Usage in Manipur

ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో అగంతకులు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు.

మణిపూర్‌లో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. 24 గంటల్లోపు హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్  చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్‌లో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడిచేసి నిప్పుపెట్టారు. ముఖ్యమంత్రి బిరెన్  సింగ్  అల్లుడి ఇళ్లు సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు. 
 


అయితే, ఈ ఆందోళన అనంతరం,భద్రతా బలగాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు కొన్ని ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. కైరావ్ ఖునౌ అనే ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇంటర్నెట్ శాటిలైట్ యాంటెన్నా, ఒక ఇంటర్నెట్ శాటిలైట్ రూటర్, 20 మీటర్ల ఎఫ్‌టీపీ కేబుల్స్‌ లభ్యమయ్యాయని రాష్ట్ర పోలీసులు ధృవీకరించారు.  

పోలీసులు స్వాధీనం చేసుకున్న పరికరాలలో ఒకదానిపై స్టార్‌లింక్ లోగో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంఘ విద్రోహ శక్తులు స్టార్‌లింక్ శాటిలైట్‌ను వినియోగిస్తున్నారు. స్టార్‌లింక్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈ దుర్వినియోగాన్ని నియంత్రిస్తారని ఆశిస్తున్నాము’అంటూ నెటిజన్లు ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై మస్క్‌ స్పందించారు. ‘ఇది తప్పు. స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ సేవలు భారత్‌లో నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement