టెస్లా అధినేత ఎలొన్‌మస్క్ శ్రీలంకలో స్టార్‌లింక్ సేవలు విస్తరించాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇండోనేషియా-బాలిలో జరిగిన 10వ వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో మస్క్ సమావేశమయ్యారు.
ఎలొన్‌మస్క్ ఇటీవల చైనాతోపాటు ఇండోనేషియాను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించారు. తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. శ్రీలంకలోనూ స్టార్‌లింక్ సేవలు అందించాలనే చర్చ జరిగినట్లు తెలిసింది.
ప్రెసిడెంట్ మీడియా విభాగం తన ఎక్స్ ఖాతాలో ఈ మేరకు సమాచారాన్ని పంచుకుంది. ‘వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో దేశాధ్యక్షుడు స్టార్‌లింక్ అమలుపై మస్క్‌తో చర్చించారు’ అని తెలిపింది. శ్రీలంక నీటి సరఫరా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మినిస్టర్ జీవన్ తొండమాన్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ..‘బాలిలో జరుగుతున్న ఈవెంట్‌లో దేశ అధ్యక్షుడు, ఎలొన్‌మస్క్‌తో కలిసి సమావేశం అయ్యారు. దేశ ఆర్థిక పునరుద్ధరణ, పెట్టుబడికి కొత్త అవకాశాలు వంటి అంశాలపై చర్చించాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మస్క్ స్పందిస్తూ..‘రిమోట్ కమ్యూనిటీలకు ఇంటర్‌నెట్ కనెక్టివిటీను అందుబాటులోకి తీసుకొస్తే విద్య, ఆర్థిక అవకాశాలు మెరుగుపడుతాయి’ అని పేర్కొన్నారు.
Bringing connectivity to remote communities radically improves access to education and economic opportunities
pic.twitter.com/hDVYvpRDKZ— Elon Musk (@elonmusk) May 19, 2024
Comments
Please login to add a commentAdd a comment