స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు మరో భారీ షాక్ తగిలింది. త్వరలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ప్రారంభించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అక్టోబర్ 1న స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్‌గా సంజయ్ భార్గవను నియమించారు. అయితే ఇప్పుడు సంజయ్ భార్గవ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్‌లో తన లాస్ట్ వర్కింగ్ డే డిసెంబర్ 31 అని అధికారంగా వెల్లడించారు.
ఎలన్ మస్క్ 1999లో ఆన్ లైన్ పేమెంట్ సంస్థ పేపాల్‌ను ఏర్పాటు చేశారు. 2000సంవత్సరంలో మనదేశానికి చెందిన సంజయ్ బార్గవ పేపాల్ సంస్థలో కీరోల్ ప్లే చేశారు. తాజాగా ఆయన పనితీరు మెచ్చిన మస్క్..,సంజయ్ భార్గవను స్టార్ లింక్ ఇండియా డైరక్టర్‌గా నియమించారు. అలా నియమించిన మూడు నెలలకే సంజయ్ బార్గవ స్టార్‌లింక్ నుంచి వైదొలుగుతున్నట్లు లింక్డిన్‌లో పోస్ట్ చేశారు.
స్టార్ లింక్ ఇండియా బోర్డ్ చైర్మన్ పదవితో పాటు కంట్రీ డైరక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంజయ్ భార్గవ లింక్డిన్ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు స్టార్‌లింక్ సంస్థ నుంచి బయటకి రావడంపై తాను ఎలాంటి కామెంట్ల చేయడం లేదని, మీడియా సైతం తాను తీసుకున్న నిర్ణయం పట్ల గౌరవించాలని కోరారు.
చదవండి: భారత్ దెబ్బకు..కిందకు దిగొచ్చిన ఎలన్ మస్క్ కంపెనీ..!
Comments
Please login to add a commentAdd a comment