Sanjay bhargava
-
విడాకులు.. మగవాళ్లదే తప్పు కాదు, నా భార్య ఏం చేసిందో..!
ఒకప్పుడు హీరోగా సినిమాలు చేశాడు కన్నడబ్బాయి ప్రశాంత్. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ అతడికి సంజయ్ భార్గవ్ అనే స్క్రీన్ నేమ్ సూచించడంతో ఆ పేరుతోనే కంటిన్యూ అయ్యాడు. అతడి తల్లి భరతనాట్య కళాకారిణి. అలా చిన్నప్పటినుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. పిల్లల మనసు పాడు చేయొద్దు తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చాడు. 'పెళ్లయిన కొంతకాలానికే విడిపోతున్నారు. కానీ పిల్లలున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. భార్యాభర్తల మధ్య ఏదున్నా అది వారి మధ్యే ఉండాలి. పిల్లల మనసును పాడుచేయకూడదు. నా విషయంలో ఇదే జరిగింది. ఎవరైనా విడిపోయారనగానే మగవాడిదే తప్పంటారు. మహిళా శక్తి అంటూ ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తారు. ఇద్దరినీ సమానంగా చూడాలి. ఎఫైర్ ఉందా? అని చెడుగా.. ముఖ్యంగా పిల్లల మనసు కలుషితం చేయకూడదు. నేను నా భార్యకు విడాకులిచ్చినప్పుడు చెన్నైలో ఉన్నాను. చాలామంది.. నీకు ఎవరితోనైనా ఎఫైర్ ఉందా? అందుకనే విడాకులు తీసుకున్నావా? అని పిచ్చి ప్రశ్నలు వేశారు. ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన నేను చెడిపోయినట్లేనా? ఆ మాటలు విన్నప్పుడు బాధేస్తుంది. నా పిల్లలు మాజీ భార్య దగ్గరే ఉంటారు. వారికి ఆర్థికంగా సాయం చేస్తుంటాను. అయినా సరే వాళ్లు నన్ను కలవడానికి, మాట్లాడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపరు. రెండో పెళ్లి నా మాజీ భార్య ఏం చేసిందో నాకు తెలుసు. అది నేను బయటకు చెప్పలేను. ఇప్పుడైతే నా పిల్లలు సెటిలయ్యారు. 2016లో నేను విడాకులు తీసుకున్నాను. రెండో పెళ్లి జోలికి వెళ్లకూడదనుకున్నాను. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా హేమను కలుసుకున్నాను. 2017లో మేము పెళ్లి చేసుకున్నాం. ఆ మరుసటి ఏడాదే కూతురు పుట్టింది. ఇప్పటివరకు సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను. ఓటీటీలో కూడా చేయాలనుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌కు అమ్మ నగలు గిఫ్టిచ్చేవాడిని.. పెళ్లిలో.. -
ఎలన్ మస్క్‌కు మరో భారీ షాక్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు మరో భారీ షాక్ తగిలింది. త్వరలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ప్రారంభించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అక్టోబర్ 1న స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్‌గా సంజయ్ భార్గవను నియమించారు. అయితే ఇప్పుడు సంజయ్ భార్గవ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్‌లో తన లాస్ట్ వర్కింగ్ డే డిసెంబర్ 31 అని అధికారంగా వెల్లడించారు. ఎలన్ మస్క్ 1999లో ఆన్ లైన్ పేమెంట్ సంస్థ పేపాల్‌ను ఏర్పాటు చేశారు. 2000సంవత్సరంలో మనదేశానికి చెందిన సంజయ్ బార్గవ పేపాల్ సంస్థలో కీరోల్ ప్లే చేశారు. తాజాగా ఆయన పనితీరు మెచ్చిన మస్క్..,సంజయ్ భార్గవను స్టార్ లింక్ ఇండియా డైరక్టర్‌గా నియమించారు. అలా నియమించిన మూడు నెలలకే సంజయ్ బార్గవ స్టార్‌లింక్ నుంచి వైదొలుగుతున్నట్లు లింక్డిన్లో పోస్ట్ చేశారు. స్టార్ లింక్ ఇండియా బోర్డ్ చైర్మన్ పదవితో పాటు కంట్రీ డైరక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంజయ్ భార్గవ లింక్డిన్ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు స్టార్‌లింక్ సంస్థ నుంచి బయటకి రావడంపై తాను ఎలాంటి కామెంట్ల చేయడం లేదని, మీడియా సైతం తాను తీసుకున్న నిర్ణయం పట్ల గౌరవించాలని కోరారు. చదవండి: భారత్ దెబ్బకు..కిందకు దిగొచ్చిన ఎలన్ మస్క్ కంపెనీ..! -
భారత్‌లో ఎలన్ మస్క్‌కి ఎదురు దెబ్బ
TRAI Barred Elon Musk's Starlink Broadband Pre Orders in India: అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి భారీ షాకిచ్చింది భారత ప్రభుత్వం. మానసపుత్రిక స్పేఎస్‌ఎక్స్ అందించే బ్రాడ్‌బాండ్ సర్వీస్‌కు భారత్ నుంచి ముందస్తు ఆర్డర్స్ తీసుకోకుండా నిషేధించింది. అంతేకాదు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్కు ఎవరూ ప్రీ ఆర్డర్లతో సబ్ స్క్రయిబ్ కావొద్దంటూ భారతీయులకు సూచించింది కేంద్ర సమాచార శాఖ. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలతో ఆకట్టుకోవాలన్న ఎలన్ మస్క్ ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. తాజాగా లైసెన్స్ లేకుండా స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రీ ఆర్డర్స్ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్ లభించలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 99 డాలర్ల(రూ.7,400)తో బేటా వెర్షన్ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ఈ నేపథ్యంలో ఐదు వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్ భారత్ హెడ్ సంజయ్ భార్గవ ఈమధ్యే వెల్లడించారు కూడా. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ విభాగం(Department of Telecommunications (DoT).. స్టార్ లింక్ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డాట్ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్ఎక్స్కు సూచించింది. అంతేకాదు స్టార్‌లింక్‌ను ఎవరూ బుక్ చేసుకోవద్దంటూ జనాలకు సూచించింది. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు సంజయ్ భార్గవ నిరాకరించారు. ఇదిలా ఉంటే స్టార్‌లింక్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది స్టార్‌లింక్. ఇక భారత్‌లో స్టార్‌లింక్‌కు మొదటి నుంచే ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ బిడ్‌ను తిరస్కరించాలని కోరుతూ బ్రాడ్‌బాండ్ అసోసియేషన్‌లోని వన్‌వెబ్(ఇది కూడా స్పేస్ ఆధారిత సేవలు అందించేదే!), అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ తదితర కంపెనీలు ట్రాయ్, ఇస్రోలకు లేఖలు రాశాయి కూడా. చదవండి: 'జియో' కంటే తక్కువ ధరకే Starlink శాటిలైట్ ఇంటర్నెట్..! -
భారతీయులకు శుభవార్త..! 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..!
భారతీయులకు శుభవార్త. త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఇప్పటికే జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదుచేసింది.అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్ను అందించిన మొబైల్ నెట్వర్క్ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎలన్ మస్క్ కేంద్రం ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు కొలిక్కి వస్తే మనదేశంలో ఇంటర్నెట్ యూజర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు అతితక్కువ ధరకే లభించనున్నాయి. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు ఎలా ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతుండగా.. స్టార్ లింక్ స్పందించింది. భారతీయులకు అనుగుణంగా శాటిలైట్ ఇంటర్నెట్ను సబ్సిడీకి అందివ్వనున్నట్లు తెలిపింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మనదేశంలో స్టార్‌లింక్ తన సబ్స్క్రిప్షన్ ప్లాన్లను సబ్సిడీ రేట్లతో అందించే ఆలోచనలో ఉన్నట్లు స్టార్లింక్కి ఇండియా హెడ్ సంజయ్ భార్గవ తెలిపారు. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధర తక్కువగా ఉంటాయని అన్నారు. వినియోగదారులు చెల్లించే ధరలకంటే అందించే సేవలు ఎక్కువగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ లింక్ ప్రస్తుతం దేశంలోని అంతర్గత ప్రాంతాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం. తక్కువ ధర, సరైన సదుపాయల్ని కల్పించడం ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ రూపురేకల్ని మార్చవచ్చని అన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు స్పేస్ఎక్స్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. బుకింగ్‌లో భాగంగా కొనుగోలుదారులు రూ.7,500 డిపాజిట్ చెల్లించాలి.అలా చెల్లించిన వారికి ప్యాకేజీలో భాగంగా, స్టార్‌లింక్ డిష్ శాటిలైట్, రిసీవర్, సెటప్ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తుంది. ప్రారంభంలో ఇంటర్నెట్ స్పీడ్ 100-150ఎంబీపీఎస్ పరిధిలో ఉంటుంది. అయితే, తక్కువ భూ కక్ష్యలో మరిన్ని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపడం ద్వారా ఇంటర్నెట్ వేగం జీబీపీఎస్‌కి చేరుకోవచ్చని స్టార్‌లింక్ ప్రతినిధులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రారంభదశలోఉండగా..వచ్చే ఏడాది జూన్ జులై నాటికి కమర్షియల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. 100 స్కూళ్లకు ఉచితం నివేదికలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సెటప్‌ను స్టార్‌లింక్ సంస్థ 100 పాఠశాలలకు ఉచితంగా అందజేస్తుందని, వాటిలో 20 సెటప్‌లు ఢిల్లీ పాఠశాలలకు, మిగిలిన 80 సెటప్‌లు ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు స్టార్‌లింక్ ఇండియా బాస్ సంజయ్ భార్గవ స్పష్టం చేశారు. -
Work From Village: పల్లెల్లో వర్క్‌ఫ్రం హోం ? గ్రామీణ ప్రాంతాలపై స్టార్‌లింక్ దృష్టి
న్యూఢిల్లీ: పొలం గట్టున కూర్చునో.. మంచె మీద కంప్యూటర్ పెట్టుకునో.. పెరట్లో చెట్టు నీడన.. ఊరిపట్టున ఉంటూనే వర్క్‌ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగం చేసే అవకాశం అతి త్వరలోనే రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అన్ని కుదిరితే అతి త్వరలో వైర్‌సెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు పల్లెలను పలకరించనున్నాయి. నీతి అయోగ్ నిర్ణయంతో అమెరికాకు చెందిన బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థ స్టార్‌లింక్ తన కార్యకలాపాల్లో భాగంగా భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం దేశీ టెలికం కంపెనీలతో జట్టు కట్టాలని భావిస్తోంది. స్టార్‌లింక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఈ విషయాలు తెలిపారు. జిల్లాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్రణాళికకు సంబంధించి నీతి ఆయోగ్ ఫేజ్–1లో గ్రామాలను ఎంపిక చేసిన తర్వాత తాము బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో చర్చలు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. టార్గెట్ రూరల్ గ్రామీణ జిల్లాల్లో 100 శాతం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి ఇతర సంస్థలతో కూడా తాము కలిసి పని చేయాలనుకుంటున్నట్లు భార్గవ చెప్పారు. దేశీయంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు అవసరమయ్యే టెర్మినల్స్ ను కంపెనీ భారత్‌లో తయారు చేయబోతోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్థానికంగా వాటి ని ఉత్పత్తి చేసే యోచనేదీ ప్రస్తుతం లేదని పేర్కొ న్నారు. స్టార్‌లింక్ మెరికాకు చెందిన బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్కు స్టార్‌లింక్ అనుబంధ సంస్థ. ఇది ఇటీవలే భారత్‌లో కంపెనీ పేరు నమోదు చేసుకుంది. ఉపగ్రహ సాంకేతికత ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులు అందించనుంది. ఇందుకోసం 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో 5,000 పైచిలుకు ప్రీ–ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వైర్లెస్ స్టార్‌లింక్ సంస్థ లో ఎర్త్ ఆర్బిట్ (లియో) మోడ్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. పోల్స్, వైర్లు, ఫిక్స్డ్ ఏరియా వంటి చిక్కులు లేకుండా లియో ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ పొందవచ్చు. కరోనా తర్వాత వర్క్‌ఫ్రం విధానం పాపులర్‌గా మారింఇ. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎక్కువగా అందుబాటులో లేక చాలా మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేశారు. ఇక ఊర్లకు వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు వస్తే అక్కడ కూడా వర్క్‌ఫ్రం హోం కల్చర్ చేసుకునేందుకు వీలవుతుంది. -
రూటు మార్చిన ఎలన్ మస్క్.. ఇండియా మార్కెట్ కోసం సరికొత్త వ్యూహం
న్యూఢిల్లీ: ఇండియాలో తన వ్యాపార విస్తరణకు సంబంధించి ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ సరికొత్త వ్యూహం ఎంచుకున్నారు. ఇప్పటి వరకు టెస్లా కార్ల అమ్మకాల ద్వారా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. అయితే ఈ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. దీంతో వ్యూహం మార్చి ఇంటర్నెట్ సేవలను తెర మీదకు తెచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ తాజాగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు వేగవంతం చేసింది. స్థానికంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు భారత్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌సీపీఎల్) పేరిట దీన్ని నెలకొల్పినట్లు స్టార్‌లింక్ కంట్రీ డైరెక్టర్ (ఇండియా) సంజయ్ భార్గవ తెలిపారు. ఇక తాము లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు, బ్యాంక్ ఖాతాలు తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్మిషన్ల పనిలో ప్రభుత్వ అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో డిసెంబర్ 2022 నుంచి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి 5,000 ప్రీ–ఆర్డర్లు వచ్చాయని కంపెనీ చెబుతోంది. ఒకో కస్టమర్ నుంచి 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. సెకనుకు 50–150 మెగాబిట్స్ స్పీడ్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందిస్తామని చెబుతోంది. దేశీయంగా రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతి గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ పోటీపడాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోంది. -
ఇండియాలో టార్గెట్ ఫిక్స్,స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ ప్రారంభం అప్పుడే
న్యూఢిల్లీ: స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించే యోచనలో ఎలాన్ మస్క్ ఉన్నారని ఇండియా స్టార్‌లింక్ కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో వీటిని ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. భారత్‌లో ప్రీ–ఆర్డర్ల సంఖ్య 5,000 స్థాయిని దాటేసిందని సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించడంపై తమ సంస్థ ఆసక్తిగా ఉందని భార్గవ వివరించారు. బీటా దశలో 50 నుంచి 150 మెగాబిట్ పర్ సెకన్ స్థాయిలో డేటా స్పీడ్ అందిస్తామని స్టార్‌లింక్ చెబుతోంది. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ నేరుగా పోటీపడనుంది. అంతర్జాతీయంగా స్టార్‌లింక్ కనెక్షన్లకు ప్రీ–ఆర్డర్లు 5,00,000 స్థాయిని దాటేసిందని భార్గవ చెప్పారు. దేశీయంగా రాబోయే నెలల్లో ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీకండక్టర్ల కొరత కారణంగా స్టార్‌లింక్ కిట్లను తయారు చేసే వేగం మందగించిందని ఆయన వివరించారు. చదవండి: ‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా ! -
అజ్ఞాతవాసం: సురభి ఝవేరీ... మారిందేమి నీ దారి?!
‘మేనత్త కూతురివే మెరుపంటి మరదలివే’ అంటూ ‘పల్నాటి పౌరుషం’లో సంజయ్ భార్గవ్ పాడుతుంటే... మాకూ ఇలాంటి మరదలుంటే బాగుణ్ను అను కున్నారు యువకులు. ‘సిరివెన్నెల్లో విరిసింది ఓ మల్లికా... వీచే చిరు గాలిలో వేచే వనకన్యలా’ అంటూ ‘కొండపల్లి రత్తయ్య’ కూతురిని చూసి హరీష్ పాడుతోంటే... మాకు దొరకదేం ఇలాంటి వన్నెల చిలుక అంటూ అసూయపడ్డారు పురుష పుంగవులు. కొంటె చూపులు, తుంటరి నవ్వులతో గిలిగింతలు పెట్టిన ఆమె ఇప్పుడు కనిపించదే మి? కాదనుకుని వెళ్లిందా? కావాలని తప్పుకుందా? సక్సెస్ఫుల్ హీరోయిన్ అని ఎవరిని అనాలి? ఎక్కువ సినిమాలు చేసినవారినా? ఎక్కువ ప్రేక్షకాదరణ పొందినవారినా? వీటిలో ఏది కరెక్ట్ అయినా సురభిని సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఆమె చాలా సినిమాలే చేసింది. పల్నాటి పౌరుషం, ఎమ్.ధర్మరాజు ఎంఏ, మనీ మనీ, అల్లరోడు, కొండపల్లి రత్తయ్య, కేటు-డూప్లికేటు, డియర్ బ్రదర్, చెన్కోల్ (మలయాళం)... ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె ఫిల్మోగ్రఫీ పెద్దగానే కనిపిస్తుంది. ఇక ప్రేక్షకాదరణ సంగతి చెప్పాల్సిన పని లేదు. ‘పల్నాటి పౌరుషం’లో చూసి ఈ పిల్లెవరో బాగుందే అనుకున్నవాళ్లు... ‘మనీ మనీ’లో సురభిని చూశాక ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఈ జాబిలి తునక అనుకున్నారు. అంతగా అందరి మనసులనూ దోచిందామె. కానీ ఏమయ్యిందో ఏమో... ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయింది సురభి. ఆమె ఎందుకు వెళ్లింది? ఎక్కడికి చేరింది? మూలాలు అక్కడున్నాయి... సురభి గురించి మన తెలుగువారికి తెలిసింది చాలా తక్కువే. ఆమె పూర్తి పేరు సురభి ఝవేరీ. గుజరాత్‌కు చెందిన అమ్మాయి. నటన అంటే ఆమెకు సినిమాయే కాదు... నాటకం కూడా. నాటక రంగంలో ఆమెకు మంచి పేరు ఉంది. ఇమేజ్ ఉంది. తర్వాత సినిమాల్లోకి వచ్చింది. మొదట కొన్ని సినిమాలు చేసినా... రామ్గపాల్ వర్మ చేతిలో పడ్డాక ఫేటు మారింది. ఆయన నిర్మించి, శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘మనీ మనీ’ చిత్రంలో సురభిని చూసి మనసు పారేసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. విలన్ గ్యాంగ్ చేతుల్లో చిక్కి అష్టకష్టాలు పడే అమాయకురాలిగా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ‘అల్లరోడు’ చిత్రం కూడా సురభికి మంచిపేరే తెచ్చిపెట్టింది. అమ్మాయిల పిచ్చోడయిన రాజేంద్ర ప్రసాద్‌ని అదుపు చేయాలని ప్రయత్నించే భార్యగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో పాతిక సినిమాల వరకూ చేసింది. కానీ సడెన్‌గా అదృశ్యమయ్యింది. ఆమె నటించడం లేదన్న విషయాన్ని అందరూ గుర్తించేలోపూ తెలుగు ప్రేక్షకుల ఆలోచనల నుంచి పూర్తిగా తప్పుకుంది. సురభి నటన మానేయడానికి కారణాలు ఎవరికీ పెద్దగా తెలియవు. అవకాశాలు తగ్గడంతోనే వెళ్లిపోయిందని కొందరన్నారు. పెళ్లి చేసుకున్నదని ఇంకొందరన్నారు. అయితే అసలు కారణం ఏంటనేది మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. అడుగుదామంటే సురభి మళ్లీ మనవైపు తొంగి చూసిందీ లేదు. కానీ చాలా యేళ్ల తరువాత ఆమె ఒక సీరియల్లో తళుక్కుమనడంతో సురభి గురించి కాస్తయినా తెలుసుకునే చాన్స్ దొరికింది. కలర్స్ చానెల్లో ప్రసారమైన ‘ముక్తిబంధన్’ సీరియల్లో ఒకరోజు సడెన్‌గా ప్రత్యక్షమయ్యింది సురభి. నిజానికి మొదట్లో ఆమెని ఎవరూ గుర్తు పట్టలేదు. బాగా లావైపోయింది. రూపం గుర్తు పట్టలేనట్టుగా తయారైంది. ఆమె సురభియేనా కాదా అన్నంతగా మారిపోయింది. అయితే మనిషి మారిందేమో కానీ టాలెంట్‌లో మాత్రం మార్పు లేదు. చారులతా విరానీగా ఆ సీరియల్లో ఆమె నటన అందరినీ అలరించింది. అప్పుడే ఆమె గురించి కొన్ని వివరాలు తెలిశాయి. ప్రముఖ నాటక, టెలివిజన్ నటుడు, సహాయ దర్శకుడు అయిన ధర్మేష్వ్యాస్ని పెళ్లాడి... సురభి ఝవేరీ వ్యాస్‌గా మారింది సురభి. తెలుగు తెరకు దూరమయ్యింది కానీ గుజరాతీ, మరాఠీ నాటకాల్లో నటిస్తోంది. కొన్నేళ్ల గ్యాప్ తరువాత ‘ముక్తిబంధన్’ ద్వారా హిందీ సీరియల్స్‌లోకి ప్రవేశించింది. ఓ పక్క సీరియల్, మరోపక్క నాటకాలతో తిరిగి బిజీగా అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కానీ తెలుగు సినిమాల వైపుగానీ, సీరియళ్ల వైపుగానీ మళ్లీ వచ్చే ప్రయత్నాలు చేయడం లేదు సురభి. ఇక్కడికి రావడం ఆమెకు ఇష్టం లేదా? రాకూడదని అనుకుంటోందా? లేక ఎవరైనా పిలిస్తే వద్దామని ఎదురు చూస్తోందా? సీనియర్ నటీమణులకు పిలిచి పెద్దపీట వేసే మన దర్శక నిర్మాతలు సురభిని కూడా పిలుస్తారేమో చూద్దాం!