భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ముఖేశ్ అంబానీకి ఏదైనా అభ్యంతరం ఉందేమో అడగాలని ఇలొన్‌మస్క్ అన్నారు. దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై ముఖేశ్ అంబానీ, ఇలొన్‌మస్క్ పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల వైరల్‌గా మారిన ఓ మీమ్‌కు సంబంధించి ఇలొన్‌మస్క్ స్పందించారు.
ఎక్స్‌లో డోజీ డిజైనర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చిన మీమ్‌కు మస్క్ రిప్లై ఇచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ‘భారత్‌లో అత్యధిక ధనవంతుడిగా ఉన్న ముఖేశ్ అంబానీకి ఇలొన్‌మస్క్ అంటే ఎందుకంత భయం? మస్క్ స్టార్‌లింక్ ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యానికి ప్రతిబంధకంగా మారుతుందా?’ అని మీమ్‌ను పోస్ట్ చేశారు. దీనిపై మస్క్ రిప్లై ఇస్తూ ‘భారత్‌లో ప్రజలకు ఇంటర్‌నెట్ సేవలందించేందుకు స్టార్‌లింక్ వల్ల ఏదైనా సమస్య ఉందేమో అంబానీకి కాల్ చేసి అడుగుతాను’ అని అన్నారు.
Why is Indian billionaire Mukesh Ambani afraid of Elon Musk? Is he worried about Starlink's entry into India disrupting his telecom empire? pic.twitter.com/GJiXztmJDg
— DogeDesigner (@cb_doge) October 14, 2024
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని ముఖేశ్ అంబానీ అభిప్రాయ పడుతున్నారు. కానీ నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపితే సరిపోతుందని మస్క్ అన్నారు. కొంతకాలంగా దీనిపై వివిధ మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ వేలం ప్రక్రియ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానానికి విరుద్ధమన్నారు. దాంతో నేరుగా స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఎయిర్‌టెల్ అధికారులు కూడా మస్క్ అభిప్రాయాలకు మద్దతు పలికారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. భారత్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment