భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలతో ఆకట్టుకోవాలనుకున్న ఎలన్ మస్క్ చివరకు వెనక్కి తగ్గాడు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్ లభించలేదన్న విషయం మనకు తెలిసిందే. లైసెన్స్ లేకుండా దేశంలో స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ప్రీ ఆర్డర్స్ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. దీంతో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రీ బుకింగ్ సంస్థ నిలిపివేసింది. పోర్టల్‌లో "స్టార్‌లింక్ ఆర్డర్ చేయడం కోసం ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు! స్టార్‌లింక్ సేవలు మీ ప్రాంతంలో అందుబాటులో లేవు" అని ఉంది.
స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో లైసెన్స్ లభించకున్న 99 డాలర్ల(రూ.7,400)తో బేటా వెర్షన్ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ఈ నేపథ్యంలో ఐదు వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్ భారత్ హెడ్ సంజయ్ భార్గవ ఈమధ్యే వెల్లడించారు కూడా. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) స్టార్‌లింక్ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డీఓటీ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్‌ఎక్స్‌కు సూచించింది. అంతేకాదు స్టార్‌లింక్‌ను ఎవరూ బుక్ చేసుకోవద్దంటూ జనాలకు సూచించింది. కేంద్ర ఈ విధంగా సూచించిన తర్వాత స్టార్‌లింక్ తన ప్రీ బుకింగ్ సౌకర్యాన్ని నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment