ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా అది సంచలనంగా మారుతుంది. అంతేనా ఆయన ట్వీట్‌లు కూడా నెట్టింట హల్ చేస్తుంటాయి. తాజాగా మస్క్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం గురించి ఇటీవల ఆయన చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు మస్క్‌ను తప్పుబట్టారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాయబారి ఆండ్రిజ్ మెల్నిక్ కూడా ఈ విషయంలో కాస్త నోటి దురుసును చూపించారు. అయితే ఈ వ్యాఖ్యలు అనంతరం ఆయన దేశానికి ఫ్రీ ఇంటర్నెట్ లేకుండా చేసిందని అనిపిస్తోంది.
అసలు ఏం జరిగింది..
అనూహ్య పరిణామాల మధ్య ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఉక్రెయిన్‌కు ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తూ అండగా నిలిచిన మస్క్‌పై ఇటీవల దుర్భాషలాడారు ఆండ్రిజ్ మెల్నిక్. దీని తర్వాత పరిణామంలో.. ఇకపై ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడంపై మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీగా కొనసాగాలంటే మీరు ఫండింగ్ ఇవ్వండని ఆమెరికా ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. దీనికి సంబంధించి మస్క్ పెంటాగాన్‌కి ఓ ట్వీట్ చేశాడు. అందులో స్టార్‌లింక్ సర్వీస్ కోసం ఇకపై చెల్లింపు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. అదే ట్వీట్‌లో ఇలా కూడా ఉంది. మెల్నిక్ సూచించినదే తాను చేస్తున్నానని చెప్పారు మస్క్.
ఖర్చు ఏక్కువైంది.. పేమెంట్ చేయగలరు!
ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవలు పనిచేయాలంటే ఇప్పుడు దాదాపు $120 మిలియన్లు చెల్లించాలని స్పేస్‌ఎక్స్ తాజాగా పెంటగాన్‌ను కోరుతోంది. దీంతో పాటు, వచ్చే ఏడాదికి సంబంధించిన చెల్లింపులను కూడా కంపెనీ ముందుగానే కోరినట్లు సమాచారం. 2023కి పెంటగాన్ $400 మిలియన్లు చెల్లించాల్సి ఉంటుందని తమ అంచనాను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. ఉక్రెయిన్‌కు ఉచిత సేవలందించేందుకు స్టార్‌లింక్ టెర్మినల్స్‌పై స్పేస్‌ఎక్స్ $80 మిలియన్లు ఖర్చు చేసిందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 100 మిలియన్ డాలర్లకు చేరుతుందని మస్క్ గతంలో ట్విట్టర్‌లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment