Elon Musk: Starlink will Transfer Data Close to Speed of Light - Sakshi
Sakshi News home page

కాంతివేగంతో ఇంటర్నెట్‌ స్పీడ్‌...! ఎలన్​ మస్క్​ నుంచి సంచలన ప్రకటన

Published Wed, Sep 8 2021 9:29 PM | Last Updated on Thu, Sep 9 2021 11:20 AM

Starlink Will Transfer Data Close To The Speed Of Light Says SpaceX CEO Elon Musk - Sakshi

వాషింగ్టన్‌:  మన నిత్య జీవితంలో ఇంటర్నెట్‌ ఒక భాగమైంది. ఇంటర్నెట్‌ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేము. 4జీ రాకతో ఇంటర్నెట్‌ స్పీడ్‌ గణనీయంగా పెరిగింది. 4జీ నెట్‌వర్క్‌ సుమారు 10 ఎమ్‌బీపీఎస్‌ స్పీడ్‌ వరకు ఇంటర్నెట్‌ను అందిస్తుంది. తాజాగా పలు టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీపై కూగా దృష్టిసారించాయి. 5జీ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు పలు కంపెనీలు ఇప్పటికే చర్యలను తీసుకుంటున్నాయి. కాగా టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ఒక అడుగు ముందుకేసి స్టార్‌లింక్‌ ద్వారా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్‌ మస్క్‌ వాదనతో ఏకీభవించిన ఆనంద్‌ మహీంద్రా..!

ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ తన సేవలను కూడా ప్రారంభించింది. తాజాగా ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ విషయంలో సంచలన వ్యాఖ్యలను చేశాడు. భవిష్యత్తులో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ఏలాంటి గ్రౌండ్‌ స్టేషన్లను వాడకుండానే ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు.  స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలు సుమారు కాంతి వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చునని ఇంటర్నెట్‌ సైంటిస్ట్‌ స్కాట్‌ మ్యాన్లీతో ట్విటర్‌లో వెల్లడించారు.

స్టార్‌లింక్‌  బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో డౌన్‌లింక్ స్టేషన్ల అవసరాన్ని హైలైట్ చేసిన మస్క్, వచ్చే 4 నుంచి 6 నెలల్లో స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడంతో ఇంటర్-శాటిలైట్ లేజర్ లింక్‌లను కలిగి ఉంటుందని చెప్పారు. స్థానికంగా ఇంటర్నెట్‌కు ఎలాంటి డౌన్‌లింక్ అవసరం లేదని పేర్కొన్నారు. శాటిలైట్‌లో లేజర్‌ లింక్‌లను వాడడంతో గ్రౌండ్‌ స్టేషన్‌ అడ్డంకులను పూర్తిగా తగ్గిస్తాయన్నారు. సిడ్నీ నుంచి లండన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్‌ 40 శాతం సంప్రదాయక ఇంటర్నెట్‌ కంటే వేగంగా, కాంతి వేగానికి దగ్గరిగా స్పీడ్‌ ఉంటుందని వెల్లడించారు.ఒక కిలోమీటర్‌ పర్‌ సెకనుకు 3,00,000 వేగంతో కాంతి ప్రయాణిస్తుంది.

సంప్రదాయక ఆప్టిక్‌ ఫైబర్‌ ద్వారా డేటా వినిమయం 2 లక్షల కిమీ/సెకను వేగంతో ప్రయాణిస్తుంది. ఆప్టిక్‌ ఫైబర్‌ ద్వారా జరిగే డేటా వినిమయ ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఏర్పడడంతో స్పీడ్‌ తగ్గిపోతుంది. స్టార్‌లింక్‌లో వాడే ఇంట్రా లేజర్‌తో డేటా వినిమయాన్ని కాంతి వేగానికి సమానంగా లేదా దగ్గరిగా డేటా వినిమయం చేయవచ్చునని తెలిపారు.  సాధారణంగా ఇంటర్నెట్‌ స్పీడ్‌ సదరు నెట్‌వర్క్‌ లాటెన్సీపై ఆధారపడి పనిచేస్తోంది.

లాటెన్సీ  అనేది ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్‌కు డేటాను పంపడానికి పట్టే సమయం. ఉపగ్రహాలు భూమికి దూరంగా ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ స్పీడ్‌లో జాప్యం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీడియో కాల్‌లు,  ఆన్‌లైన్ గేమింగ్ వంటి కార్యకలాపాల పనితీరు తక్కువగా ఉంటుంది. ఎలన్‌ మస్క్‌ అందించనున్న స్టార్‌లింక్ ఉపగ్రహాలు సాంప్రదాయ ఉపగ్రహాల కంటే భూమికి 60 రెట్లు దగ్గరగా ఉంటాయి. దీంతో లాటెన్సీ అతి తక్కువగా ఉంటుంది.  స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలు సుమారు కాంతి వేగానికి సమానంగా ఉంటుందని ఎలన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు. 

చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement