internet speed
-
బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ మొబైల్ టారిఫ్‌లను 15 శాతం వరకు పెంచాయి. ఈ ధరల పెంపు చాలా మంది వినియోగదారులను బీఎస్ఎన్ఎల్కి మారడానికి ప్రేరేపించింది. పెరుగుతున్న ఈ ఆసక్తికి అనుగుణంగా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే ప్రైవేటు టెలికాం కంపెనీలకు పోటీగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను కూడా మెరుగుపరుస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల తన చవకైన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై స్పీడ్ లిమిట్స్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కంపెనీ తన రూ.249, రూ.299, రూ.329 ప్లాన్లలో వేగాన్ని పెంచింది.రూ. 249 ప్లాన్ఈ ప్లాన్‌లో గతంలో 10 Mbps వేగంతో నెట్ వచ్చేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద 10 GB నెట్‌ను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. దీని తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కొత్త సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్రూ. 299 ప్లాన్ఇందులోనూ నెట్ స్పీడ్ 10 Mbps నుండి 25 Mbpsకి పెరిగింది. పరిమితిని చేరుకున్న తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీ 20జీబీ నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే.రూ. 329 ప్లాన్ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో మామూలుగా 20 Mbps నెట్ స్పీడ్ ఉండేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఇక 1000 జీబీ గణనీయమైన ఎఫ్‌యూపీని అందిస్తుంది. ఆ తర్వాత వేగం 4 Mbpsకి తగ్గుతుంది. ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. -
నెట్ స్పీడ్‌లో ఎవరెక్కడ? ఎగబాకిన భారత్ ర్యాంక్
ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఎంటర్టైన్మెంట్ నుంచి ఆన్లైన్ చదువుల దాకా.. ఆర్థిక లావాదేవీల నుంచి నిత్యావసరాల బుకింగ్ దాకా.. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్.. ఏదైనా ఇంటర్నెట్ అత్యవసరంగా మారిపోయింది. ఈ ఇంటర్నెట్ ఎంత వేగంగా ఉంటే.. మన పని అంత వేగంగా పూర్తవుతుంది. ఈ క్రమంలో ఊక్లా సంస్థకు చెందిన స్పీడ్‌టెస్ట్ వెబ్సైట్.. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో సగటు ఇంటర్నెట్ వేగం ఎంత అన్నదానిపై ర్యాంకింగ్స్ ఇచ్చింది. ♦ మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో 36.35 ఎంబీపీఎస్ స్పీడ్‌తో భారత్ 60వ స్థానంలో నిలిచింది. మార్చిలో భారత్ ర్యాంకు 64కాగా.. నెలలో నాలుగు స్థానాలు ఎగబాకింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 51.12 ఎంబీపీఎస్‌తో 83వ స్థానంలో నిలిచింది. మార్చితో పోలిస్తే ఒక ర్యాంకు ఎగబాకింది. ♦ మొబైల్ ఇంటర్నెట్కు సంబంధించి 138 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. యెమెన్ (3.38 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (4.46), క్యూబా (4.48), వెనెజువెలా (6.90), హైతీ (8.03) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. క్యూబా (1.97 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (2.31), సిరియా (3.93), తుర్క్మెనిస్తాన్ (4.03), యెమెన్ (4.29) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా సగటున మొబైల్ ఇంటర్నెట్ వేగం 42.07 ఎంబీపీఎస్కాగా.. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ వేగం 80.12 ఎంబీపీఎస్ కావడం గమనార్హం. ♦ ప్రపంచంలో సగటున 100 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ నెట్ స్పీడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మొబైల్ ఇంటర్నెట్లో కేవలం పది దేశాలు, ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కేవలం 33 దేశాలు మాత్రమే ఈ వేగాన్ని అందుకున్నాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మొబైల్ స్పీడ్‌లో మెరుగుపడ్డ భారత్.. 5జీ రాకతో దూకుడు!
దేశంలో 5జీ సేవలు విస్తృతం కావడంతో మొబైల్ స్పీడ్‌లో భారత్ మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా సగటు మొబైల్ వేగంలో మన దేశం జనవరిలో 10 స్థానాలు ఎగబాకింది. డిసెంబర్లో 79వ స్థానంలో ఉన్న భారత్ జనవరిలో 69వ స్థానానికి చేరుకున్నట్లు ఊక్లా నివేదిక పేర్కొంది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లోనూ భారత్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. డిసెంబర్లో 81వ స్థానంలో ఉండగా జనవరిలో 79వ స్థానానికి చేరుకుందని నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్సైట్స్ ప్రొవైడర్ ఊక్లా నివేదించింది. ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటు డిసెంబర్లో 49.14 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 50.02 ఎంబీపీఎస్‌కి స్వల్పంగా పెరిగింది. కాగా ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటులో భారత్ నవంబర్‌లో 105వ స్థానంలో ఉండేది. ఈ ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటు గత డిసెంబర్లో 25.29 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 29.85 ఎంబీపీఎస్‌కు మెరుగుపడింది. జనవరి స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ ఓవరాల్ సగటు మొబైల్ స్పీడ్ చార్ట్‌లో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. ఇదే సమయంలో పపువా న్యూగినియా ర్యాంక్ ఏకంగా 24 స్థానాలు మెరుగుపడటం గమనార్హం. ఇక ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటులో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా సైప్రస్ 20 స్థానాలను మెరుగుపరుచుకుంది. -
బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనం మార్పు.. కనీస డౌన్లోడ్ స్పీడ్ ఎంతంటే
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ నిర్వచనాన్ని ప్రభుత్వం సవరించింది. కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు (మెగాబిట్స్ పర్ సెకండ్) పెంచింది. 2013 జూలై నాటి నిర్వచనం ప్రకారం ఇది 512 కేబీపీఎస్‌గా (కిలోబిట్స్ పర్ సెకండు) ఉండేది. తాజా మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంత వినియోగదారులకు ఈ కొత్త నిర్వచనంతో ప్రయోజనం చేకూరగలదని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టీవీ రామచంద్రన్ చెప్పారు. డౌన్లోడ్ స్పీడ్‌ను బట్టి ఫిక్సిడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను బేసిక్, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఊక్లా నిర్వహించే స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం గతేడాది డిసెంబర్లో భారత్‌లో సగటున మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ 25.29 ఎంబీపీఎస్‌గా నమోదైంది. నవంబర్‌లో ఇది 18.26 ఎంబీపీఎస్‌గా ఉండేది. 2022 నవంబర్ 30 నాటికి దేశీయంగా 82.54 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉండగా, వీరిలో 79.35 కోట్ల మంది వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? కానీ, సెకనుకు 1.25 లక్షల జీబీ ఉంటే!
మీ ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? 50 ఎంబీపీఎస్ నుంచి 200 ఎంబీపీఎస్ దాకా ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలో, బాగా అవసరమున్న చోటనో అయితే 2 జీబీపీఎస్ (సెకనుకు రెండు గిగాబైట్ల) వరకు ఉంటుంది. ఇంకా అవసరమైతే మరో కనెక్షన్ అదనంగా తీసుకుంటుంటారు. కానీ కేవలం ఒకే ఆఫ్టికల్ ఫైబర్ కనెక్షన్‌తో ఏకంగా పెటాబిట్ (1.25 లక్షల గిగాబైట్లు) డేటా ట్రాన్స్ఫర్ జరిగితే? జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) శాస్త్రవేత్తలు.. సరికొత్త సాంకేతికతతో ఈ వేగాన్ని సాధించారు. ఒక సెకనులో 51.7 కిలోమీటర్ల దూరంలోని పరికరాల మధ్య 1.02 పెటాబిట్స్ డేటాను ట్రాన్స్ఫర్ చేయగలిగారు. ఇది 5జీ ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే సుమారు లక్ష రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అంతేకాదు ఇప్పుడున్న ఫైబర్ ఆఫ్టిక్ కేబుళ్లనే దీనికి వాడుకోవచ్చని.. కొద్దిపాటి అదనపు మార్పులు, కొత్త పరికరాలను అనుసంధానం చేస్తే సరిపోతుందని ఎన్ఐసీటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పరిశోధన వివరాలను ఇటీవల జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ లేజర్ అండ్ ఎలక్ట్రో–ఆప్టిక్స్–2022’లో వెల్లడించారు. -
జెట్ స్పీడ్‌లో రిలయన్స్ జియో 5జీ..స్పీడ్ ఎంతంటే..?
భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో 5జీ నెట్వర్క్ కవరేజ్‌ను మరింత వేగంగా విస్తరించేందుకు ప్రణాళిలను రచిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1000కిపైగా నగరాల్లో 5జీ సేవలను అందించేందుకు జియో సిద్దమైంది. కాగా తాజాగా నిర్వహించిన 5జీ టెస్టింగ్‌లో రిలయన్స్ జియో రికార్డు వేగాన్ని సాధించింది. రెండు గంటల సినిమా ఒక నిమిషంలోనే..! 91మొబైల్స్ ప్రకారం...రిలయన్స్ జియో 5G నెట్వర్క్ , 4G నెట్‌వర్క్‌తో పోల్చితే ఎనిమిది రెట్లు వేగంగా డౌన్లోడ్ స్పీడ్, 15 రెట్లు వేగవంతమైన అప్లోడ్ స్పీడ్‌ను అందిస్తుంది. జియో 5జీ నెట్వర్క్ 420Mbps డౌన్లోడ్ స్పీడ్, 412 Mbps అప్లోడ్ స్పీడ్ సాధించినట్లు 91మొబైల్స్ వెల్లడించింది. ఈ స్పీడ్‌తో రెండు గంటల నిడివి గల సినిమాను ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో డౌన్లోడ్ చేయవచ్చును. ఈ 5జీ టెస్ట్‌ను ముంబైలో పరిక్షించారు. దాంతో పాటుగా జియో 4జీ డౌన్లోడ్ స్పీడ్ 46.82Mbpsగా, అప్లోడ్ స్పీడ్ 25.31Mbpsగా నమోదైంది. 5G నెట్‌వర్క్‌తో యూజర్లు వేగవంతమైన ఇంటర్నెట్ను ఆస్వాదించే అవకాశం ఉంది. తొలుత 13 నగరాల్లో..! దేశవ్యాప్తంగా 13 నగరాల్లో మొదట 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా 1,000 టాప్ సిటీలకు 5G కవరేజ్‌ను రిలయన్స్ జియో ప్లానింగ్ చేస్తోంది. 5జీ టెక్నాలజీతో హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో అధునాతన సదుపాయాలను ఉపయోగించి జియో ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. త్రీడీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ ద్వారా 5జీ సేవల సామర్థ్యాన్ని పరీక్షించనుంది. చదవండి: జియో నుంచి మరో సంచలనం..! అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్..! ధర ఎంతంటే..? -
వేగం పెంచిన వోడాఫోన్.. 5జీ వేగం ఎంతంటే?
న్యూఢిల్లీ: 5జీ ట్రయల్స్‌లో భాగంగా వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌పై వేగం 9.85 జీబీపీఎస్ నమోదైందని టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా తెలిపింది. 80 గిగాహెట్జ్ స్పెక్ట్రంలో ఈ–బ్యాండ్ మైక్రోవేవ్‌ను వినియోగించి ఈ ఘనతను సాధించినట్టు వెల్లడించింది. ఫైబర్ కేబుల్స్ వేయలేని ప్రాంతాల్లో ఈ–బ్యాండ్ ద్వారా.. స్మాల్సెల్స్, మాక్రోసెల్స్ను అనుసంధానించడం ద్వారా ఫైబర్ స్థాయి వేగంతో 5జీ సేవలను అందించేందుకు వొడాఫోన్ ఐడియా ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని కంపెనీ తెలిపింది. -
ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో ఇలా చెక్ చేయండి..!
మన నిత్యజీవితంలో ఇంటర్నెట్ ఒక భాగమైంది. ఇంటర్నెట్ లేకుండా మన డే స్టార్ట్ అవ్వడం కష్టమే. సాంకేతిక కారణాల వల్ల మనకు ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం స్లోగా వస్తుంది. పలు టెలికాం నెట్వర్క్స్ సంస్థలు మా నెట్వర్క్ ఇంతా స్పీడ్ వస్తోందని యాడ్స్‌ను ఇవ్వడం మనం చూసే ఉంటాం. వారు చెప్పేది ఒకటి మనకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ మరొకటి. మనం వాడుతున్న ఆయా టెలికాం నెట్వర్క్ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో అనే విషయాన్ని పలు యాప్స్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చును. మీకు ఆయా టెలికాం నెట్వర్క్ అందిస్తోన్న స్పీడ్‌ను టెలికాం నెట్వర్క్ ఆపరేటర్‌కు తెలియజేస్తే మీరు ఉండే పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్‌ను బూస్ట్ చేసేందుకు చర్యలను తీసుకుంటారు. చదవండి: Google Pay: గూగుల్ పేలో ఆ సేవలు కష్టమే..! ఊక్లా ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్: ఊక్లా , ఇంటర్నెట్ యాక్సెస్ పనితీరు కొలమానాలను అందించే వెబ్ సర్వీస్ సంస్థ. ప్రముఖ టెలికాం కంపెనీలు ఊక్లా టెస్ట్‌ను ఆధారం చేసుకొనే నెట్వర్క్ స్పీడ్‌ను ప్రకటిస్తాయి. యాపిల్ స్టోర్‌లో అప్లికేషన్ అందుబాటులో ఉంది. ఇది అత్యంత విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. యాప్‌లో యూజర్ లొకేషన్‌తో పాటు ఇతర అనుమతులను ఊక్లా అడుగుతోంది. స్పీడ్‌టెస్ట్ మాస్టర్: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను పరీక్షించడానికి స్పీడ్‌టెస్ట్ మాస్టర్ సులభమైన అప్లికేషన్. ఇది 4జీ, డీఎస్ఎల్, 5జీ, ఏడీఎస్ఎల్ వంటి వివిధ నెట్‌వర్క్‌ల వేగాన్ని పరీక్షించే అవకాశం ఉంది. మోటియోర్ : ఈ యాప్‌ను ఉపయోగించి అతి తక్కువ స్థాయిలో ఇంటర్నెట్ స్పీడ్‌ను కొలవవచ్చును. గూగుల్ స్పీడ్ టెస్ట్ : మీరు ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయకూడదనుకుంటే మీకు గూగుల్ స్పీడ్ టెస్ట్ ప్రయోజనకరంగా ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి గూగుల్ స్పీడ్ టెస్ట్‌ని సెర్చ్ చేశాక ...గూగుల్ స్పీడ్ టెస్ట్‌పై క్లిక్ చేశాక మీ నెట్వర్క్ డౌన్లోడ్ వేగం, ఆప్‌లోడ్ వేగాలను గుర్తించవచ్చును. చదవండి: సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతోందా..! ఇలా చేయండి..! -
ఇంటర్నెట్ స్పీడ్.. మినిమమ్ 2 ఎంబీపీఎస్!
TRAI Recommandations On Internet Speed: ఇంటర్నెట్ మినిమమ్ స్పీడ్ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లకు, కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది టెల్కామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్). ప్రస్తుతం ఉన్న మినిమ్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు పెంచాలని తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో ట్రాయ్ కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం ఉన్న 512 కేబీపీఎస్ స్పీడ్ బేసిక్ అప్లికేషన్స్ కూడా తెరవడానికి సరిపోవని అభిప్రాయపడింది. మినిమమ్ డౌన్లోడ్ స్పీడ్ 2 ఎంబీపీఎస్(megabits per second) ఉండేటా చేసుకోవాలని సూచించింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల వేగాన్ని పెంచాలని, అందుకోసం మంత్లీ సబ్ సబ్ స్క్రిప్ట్షన్ ఫీజులో 50 శాతం రీయంబర్స్మెంట్ రూరల్ కనెక్షన్‌దారులకు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది ట్రాయ్. గతంలో 256 కేబీపీఎస్ స్పీడ్‌ను 2014లో 512 కేబీపీఎస్‌కు అప్‌గ్రేడ్ చేయించింది ట్రాయ్. ఇప్పుడు ఆ స్పీడ్‌ను నాలుగు రెట్లు పెంచాలని చెబుతోంది. అంతేకాదు ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ ఆధారంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను యూకే, యూరప్ తరహాలో కేటగిరీలుగా విభజించాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి దేశాల్లో బేసిక్ బ్రాడ్‌బ్యాండ్.. 2-50 ఎంబీపీఎస్ స్పీడ్, ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్.. 50-300 ఎంబీపీఎస్ స్పీడ్, సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్.. 300 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ స్పీడ్‌తో కేటగిరీలుగా విభజించారు. ఈ సూచనలతో పాటు దేశంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను పెంచేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేంద్రానికి తెలిపింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద కేవలం 9.1 శాతం ఇళ్లకు మాత్రమే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. చాలా మంది మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. కేబులింగ్ వ్యవస్థ ద్వారా లైన్ సర్వీసులను పొడిగించే ప్రయత్నం చేయాలని తెలిపింది. అలాగే రూ. 200 కంటే తక్కువ ఛార్జీల నెలవారీ ప్యాక్.. సగం రీయంబర్స్మెంట్ దిశగా ప్రణాళిక అమలు చేయాలని కేంద్రానికి తెలిపింది. ఈ-రూపీ ద్వారా ఆ డబ్బును కనెక్షన్‌దారుడికి జమ చేయాలని సూచించింది. అయితే ట్రాయ్ చేసిన ఈ సూచనల్ని సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా పాటించాలన్న రూల్ లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం పరిగణనలోకి తీసుకుని చట్టం చేయొచ్చు. చదవండి: 2022కల్లా ఏపీలో ప్రతి పల్లెకు బ్రాడ్‌బ్యాండ్ -
కాంతివేగంతో ఇంటర్నెట్ స్పీడ్...! ఎలన్ మస్క్ నుంచి సంచలన ప్రకటన
వాషింగ్టన్: మన నిత్య జీవితంలో ఇంటర్నెట్ ఒక భాగమైంది. ఇంటర్నెట్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేము. 4జీ రాకతో ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. 4జీ నెట్వర్క్ సుమారు 10 ఎమ్‌బీపీఎస్ స్పీడ్ వరకు ఇంటర్నెట్ను అందిస్తుంది. తాజాగా పలు టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీపై కూగా దృష్టిసారించాయి. 5జీ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు పలు కంపెనీలు ఇప్పటికే చర్యలను తీసుకుంటున్నాయి. కాగా టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఒక అడుగు ముందుకేసి స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..! ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ తన సేవలను కూడా ప్రారంభించింది. తాజాగా ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో సంచలన వ్యాఖ్యలను చేశాడు. భవిష్యత్తులో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఏలాంటి గ్రౌండ్ స్టేషన్లను వాడకుండానే ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు సుమారు కాంతి వేగంతో డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చునని ఇంటర్నెట్ సైంటిస్ట్ స్కాట్ మ్యాన్లీతో ట్విటర్లో వెల్లడించారు. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో డౌన్‌లింక్ స్టేషన్ల అవసరాన్ని హైలైట్ చేసిన మస్క్, వచ్చే 4 నుంచి 6 నెలల్లో స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడంతో ఇంటర్-శాటిలైట్ లేజర్ లింక్‌లను కలిగి ఉంటుందని చెప్పారు. స్థానికంగా ఇంటర్నెట్కు ఎలాంటి డౌన్‌లింక్ అవసరం లేదని పేర్కొన్నారు. శాటిలైట్‌లో లేజర్ లింక్‌లను వాడడంతో గ్రౌండ్ స్టేషన్ అడ్డంకులను పూర్తిగా తగ్గిస్తాయన్నారు. సిడ్నీ నుంచి లండన్‌కు డేటా ట్రాన్స్ఫర్ 40 శాతం సంప్రదాయక ఇంటర్నెట్ కంటే వేగంగా, కాంతి వేగానికి దగ్గరిగా స్పీడ్ ఉంటుందని వెల్లడించారు.ఒక కిలోమీటర్ పర్ సెకనుకు 3,00,000 వేగంతో కాంతి ప్రయాణిస్తుంది. సంప్రదాయక ఆప్టిక్ ఫైబర్ ద్వారా డేటా వినిమయం 2 లక్షల కిమీ/సెకను వేగంతో ప్రయాణిస్తుంది. ఆప్టిక్ ఫైబర్ ద్వారా జరిగే డేటా వినిమయ ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఏర్పడడంతో స్పీడ్ తగ్గిపోతుంది. స్టార్‌లింక్‌లో వాడే ఇంట్రా లేజర్‌తో డేటా వినిమయాన్ని కాంతి వేగానికి సమానంగా లేదా దగ్గరిగా డేటా వినిమయం చేయవచ్చునని తెలిపారు. సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ సదరు నెట్వర్క్ లాటెన్సీపై ఆధారపడి పనిచేస్తోంది. లాటెన్సీ అనేది ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్‌కు డేటాను పంపడానికి పట్టే సమయం. ఉపగ్రహాలు భూమికి దూరంగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ స్పీడ్‌లో జాప్యం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీడియో కాల్లు, ఆన్లైన్ గేమింగ్ వంటి కార్యకలాపాల పనితీరు తక్కువగా ఉంటుంది. ఎలన్ మస్క్ అందించనున్న స్టార్‌లింక్ ఉపగ్రహాలు సాంప్రదాయ ఉపగ్రహాల కంటే భూమికి 60 రెట్లు దగ్గరగా ఉంటాయి. దీంతో లాటెన్సీ అతి తక్కువగా ఉంటుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు సుమారు కాంతి వేగానికి సమానంగా ఉంటుందని ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
రికార్డు సృష్టించిన స్టార్‌లింక్ ఇంటర్నెట్..! స్పీడ్ ఎంతంటే..
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌సేవలను అందించడం కోసం ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ప్రోగ్రాంను ముందుకుతెచ్చిన విషయం తెలిసిందే. స్టార్‌లింక్ ప్రోగ్రాంలో భాగంగా శాటిలైట్లనుపయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఇప్పటికే అమెరికాతో సహా 11 దేశాల్లో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ సేవలను ప్రారంభించవచ్చునని స్పేస్ ఎక్స్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పోలిస్తే స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ గరిష్ట వేగంతో ఇంటర్నెట్ను అందిస్తుంది. తాజాగా ఊక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ రికార్డు సృష్టించింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ నివేదిక ప్రకారం 2021 రెండో త్రైమాసికంలో అమెరికాలోని ఇతర బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోన్న హ్యూస్ నెట్, వియాసట్ బ్రాడ్‌బ్యాండ్‌తో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను పోల్చింది.యునైటెడ్ స్టేట్స్లో మెరుపువేగంతో ఇంటర్నెట్ సేవలను అందిస్తోన్న బ్రాడ్‌బ్యాండ్‌గా ప్రొవైడర్‌గా స్టార్‌లింక్ మాత్రమే నిలిచింది. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సరాసరిగా 97.23 Mbps స్పీడ్‌ను అందిస్తోంది. హ్యూస్నెట్ రెండో స్థానంలో 19.73 Mbps వేగంతో, వియాసత్ మూడో స్థానంలో 18.13 Mbps వేగంతో నిలిచాయని ఊక్లా పేర్కొంది. కాగా స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ గరిష్టంగా 139.39 Mbps డౌన్లోడ్ వేగాన్ని అందించింది. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ అప్లోడింగ్ వేగంలో కూడా రికార్డులను నమోదు చేసింది. స్టార్‌లింక్ ఇంటర్నెట్, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అప్లోడింగ్ స్పీడ్ ను అధిగమించింది. అప్లోడింగ్ వేగంలో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 15.99 Mbps, రెండో త్రైమాసికంలో 17.18 Mbps నమోదు చేసింది. స్టార్‌లింక్ తరువాత వియాసత్ అప్లోడింగ్ స్పీడ్‌లో రెండో స్థానంలో నిలిచింది. వియాసత్ అప్లోడింగ్ స్పీడ్‌లో 3.38 Mbps, హ్యూస్నెట్ అప్లోడింగ్ స్పీడ్‌లో 2.43 Mbps వద్ద నిలిచింది. స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్లోని ఉపగ్రహాలు ‘లో ఎర్త్ ఆర్బిట్’లో కలిగి ఉండడం ద్వారా ఈ స్పీడ్ సాధ్యమైందని ఊక్లా పేర్కొంది. -
ఏడాది కాలంలో 47 శాతం పెరిగిన ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్
భారతదేశంలోని మొబైల్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాలను జూన్ లో ఓక్లా పరీక్షించి విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో గతంలో కంటే మెరుగైన స్థానాన్ని సాధించుకుంది. దేశంలో మేలో సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 15.34 ఎంబీపీఎస్ నుంచి 17.84 ఎంబీపీఎస్(16.3 శాతం పెరిగి)కు చేరుకుంది. మొబైల్ ఇంటర్నెట్ తో పాటు, దేశంలో సగటు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగం 4.53 శాతం పెరిగి 55.65 ఎంబీపీఎస్ నుంచి 58.17 ఎంబీపీఎస్ కు పెరిగింది. జూన్ లో మొబైల్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాల పరంగా రెండూ గ్లోబల్ ఇండెక్స్ లో మంచి స్థానాన్ని పొందాయి. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ జూన్ డేటా ప్రకారం.. మొబైల్ ఫిక్సిడ్ బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగాలు వరుసగా ఆరు స్థానాలు పెరిగి 122 వ స్థానానికి, మూడు పాయింట్లు పెరిగి 70కి చేరుకుంది. గత రెండు నెలలుగా మొత్తంగా మొబైల్ డౌన్లోడ్ వేగంలో స్థిరమైన మెరుగుదలను చూపించినట్లు ఓక్లా తెలిపింది. జూన్ లో మొబైల్ ఇంటర్నెట్ వేగం ఓక్లా విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. దేశంలో గత ఏడాది జూన్ 2020లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 12.16 ఎంబీపీఎస్ ఉంటే ఈ ఏడాది 17.84 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 46.71 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. దేశంలో సగటు మొబైల్ అప్ లోడ్ వేగం కూడా గత ఏడాది ఇదే నెలలో 4.35 ఎంబీపీఎస్ ఉంటే జూన్ 2021లో 18.85 శాతం పెరిగి 5.17 ఎంబీపీఎస్ కు చేరుకుంది. మొబైల్ నెట్ వర్క్ లపై దేశంలో సగటు లేటెన్సీ రేటు మే లో 50 మిల్లీసెకన్ల నుంచి జూన్ లో 48 మిల్లీ సెకన్లకు పడిపోయింది. సగటు జిట్టర్ రేటు కూడా మేలో 48 మిల్లీ సెకన్ల నుండి జూన్ లో 43 మిల్లీ సెకన్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఓక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 193.51 ఎంబీపీఎస్ తో తన ఆధిక్యాన్ని కొనసాగించింది. తర్వాత దక్షిణ కొరియా 180.48 ఎంబీపీఎస్ వద్ద ఉంది. జూన్ లో ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ వేగం ఇక ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ విషయానికి వస్తే ఓక్లా స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. భారతదేశంలో సగటు డౌన్లోడ్ వేగం జూన్ 2021లో 58.17 ఎంబీపీఎస్ గా ఉంటే, జూన్ 2020లో 38.19 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 52.32 శాతం పెరుగుదలను నమోదు సూచిస్తుంది. మరోవైపు దేశంలో సగటు ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ అప్ లోడ్ వేగం 2021 జూన్ లో 54.43 ఎంబీపీఎస్ కు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే నెలలో 34.22 ఎంబీపీఎస్ నుంచి 59.06 శాతం పెరిగింది. దేశంలో ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ సగటు లేటెన్సీ రేటు జూన్ లో ఒక మిల్లీ సెకను నుంచి 17 మిల్లీసెకన్లకు పెరిగింది. జూన్ లో సగటు బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగం పరంగా 260.74 ఎంబీపీఎస్ తో మొనాకో అగ్రదేశంగా అవతరించింది. -
సంచలనం.. సెకనుకు 319 టెరాబైట్ ఇంటర్నెట్ స్పీడ్
జపాన్ దేశం ఇంటర్నెట్ స్పీడ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇంత వేగంగా డేటాను ట్రాన్స్ఫర్ చేయలేదు. ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో సెకన్ల వ్యవధిలో భారీ మొత్తంలో డేటాను జపాన్ విజయవంతంగా ట్రాన్స్ఫర్ చేసింది. జపాన్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎన్ ఐసీటీ) రీసెర్చర్ల బృందం ఒక సెకనకు 319 టెరాబైట్ల(Tbps) వేగంతో ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ఫర్ చేసి విజయం సాధించారు. ఈ బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌తో 57వేల సినిమాలను ఒక సెకనులో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో భాగంగా 3,001 కిలోమీటర్ల దూరం 319 టీబీపీఎస్ వేగంతో డేటాను ప్రసారం చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. బెంజమిన్ జె.పుట్నం నేతృత్వంలోని పరిశోధకుల బృందం 0.125 మి.మీ ప్రామాణిక వ్యాసంలో 4-కోర్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా సుదూర దూరం మొదటి ఎస్, సీ, ఎల్-బ్యాండ్ల ద్వారా డేటా ప్రసారం చేయడంలో విజయం సాధించారు. మల్టీప్లెక్సింగ్ టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకునే సామర్థ్యంతో ప్రసార వ్యవస్థను నిర్మించినట్లు బృందాలు తెలిపాయి. వారు విభిన్న యాంప్లిఫయర్ టెక్నాలజీలను మిళితం చేసి 319 టీబీపీఎస్ డేటా స్పీడ్‌తో ట్రాన్స్ మిషన్ చేసి విజయం సాధించారు. -
4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా!
ప్రపంచం దృష్టి రాబోయే 5జీ మీద ఉంటె మనదేశంలో మాత్రం చాలా ప్రాంతాలలో సరిగ్గా 4జీ స్పీడ్ రాక భాదపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన మొబైల్ లో 4జీ డేటా స్పీడ్ ఎందుకు తక్కువగా వస్తుంది అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. మన మొబైల్ స్పీడ్ అనేది మీరు మొబైల్ టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు, ఎంత మంది వినియోగదారులు 4జీ మొబైల్ టవర్ ను ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే, మీరు మీ ఇంటి లోపల లేదా వెలుపల ఉన్నారా అనే దానిపై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా రాత్రి సమయంలో డేటా స్పీడ్ తక్కువగా రావడం గమనించవచ్చు. అయితే, కొన్ని పరిస్థితులలో మన మొబైల్ లో ఉండే నెట్ వర్క్ సిగ్నల్ సెట్టింగ్స్ కారణంగా కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 4జీ వోఎల్టీఈ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య నానాటికి పెరగడం ఒక కారణం. ఇంటర్నెట్ స్పీడ్ అనేది పరిమిత పరిధిలో స్పెక్ట్రమ్ ఫలితంగా వస్తుంది. మీరు మీ ఫోన్ లో 4జీ వేగాన్ని మెరుగుపరచడానికి కొన్ని పద్ధతులు తెలుసుకుందాం.. మొదట మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లి మొబైల్ నెట్వర్కుల ద్వారా "4జీ"ను ఎనేబుల్ చేయండి. మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగుకు వెళ్లి యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి ఏపీఎన్ ను డిఫాల్టుగా రీసెట్ చేయండి కొన్ని అవసరం లేని యాప్స్ ఇంటర్నెట్ వేగాన్నీ తగ్గిస్తాయి వాటిని ఆన్ ఇంస్టాల్ చేయడం లేదా బ్యాక్ గ్రౌండ్ డేటా ఆప్షన్ నిలిపి వేయడం ఉత్తమం 4జీ ఇంటర్నెట్ సరిగ్గా రాణి సందర్భంలో ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయడం మంచిది కొన్ని ప్రత్యేక సందర్భాలలో మీ నెట్వర్క్ సెట్టింగ్స్ ను రీసెట్ చేయడం మంచిది చదవండి: 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ భారత్‌లో మూడు నెలల్లో 5జీ సిద్ధం -
కనీసం 2 ఎంబీపీఎస్ వేగం ఉండాలి
న్యూఢిల్లీ: ‘దేశంలో బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనాన్ని మార్చాలి. ఇంటర్నెట్ కనీస వేగం ఇప్పుడున్న 512 కేబీపీఎస్ నుంచి 2 ఎంబీపీఎస్‌కు చేర్చాలి’ అని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం తన లేఖలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని కోరింది. నిర్వచనం మార్పు, వేగం పెంపు ప్రతిపాదనలు ఎన్నాళ్ల నుంచో పెండింగులో ఉన్నాయని ఫోరం తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ వేగం పెంపునకు ప్రణాళిక అన్న అంశంపై ట్రాయ్ సంప్రదింపుల పత్రంపై ఫోరం తన స్పందనను తెలియజేసింది. ‘కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానం కొన్నేళ్లుగా తీవ్రంగా మారిపోయింది. దేశంలో డేటా సేవలకు పూర్తిగా నూతన మార్కెట్లు పుట్టుకొచ్చాయి. ఇంటర్నెట్ ఆధారిత ఆధునిక అప్లికేషన్స్, వాటి వినియోగానికి ప్రస్తుత నిర్వచనం ప్రకారం నిర్దేశించిన దాని కంటే అధిక స్పీడ్ ఉండాలి. బ్రాడ్‌బ్యాండ్ ప్రస్తుత నిర్వచనం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి తగ్గట్టుగా లేదు. హైస్పీడ్ కోరుకునే కస్టమర్ల అవసరాలను తీర్చదు’ అని లేఖలో బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం స్పష్టం చేసింది. దేశంలో 4జీ అమలైనప్పటికీ.. ప్రస్తుతం ఉన్న 512 కేబీపీఎస్ వేగం చాలా తక్కువ. 2 ఎంబీపీఎస్‌కు చేర్చాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగులో ఉందని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టి.వి.రామచంద్రన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలే కాదు, నేషనల్ పాలసీ ప్రకారం కూడా ఈ వేగం తక్కువ అని ఆయన అన్నారు. ‘4జీ అమలైనప్పటికీ ప్రపంచంలోని మెరుగైన పద్ధతులతో పోలిస్తే సగం కంటే తక్కువగా వేగం ఉంది. టెక్నాలజీ ఏది వాడినా 2 ఎంబీపీఎస్ డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్ అందించేలా నెట్వర్క్ ఉంటేనే బ్రాడ్‌బ్యాండ్‌గా పరిగణించాలి. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా బేసిక్, ఫాస్ట్, అల్ట్రా–ఫాస్ట్ విభాగాలుగా బ్రాడ్‌బ్యాండ్ అందించాలి. సేవల అభివృద్ధి, వినియోగదార్ల అంచనాలకు అనుగుణంగా తరచూ పరిశీలన జరగాలి. 2 ఎంబీపీఎస్ కంటే వేగం అనే ప్రామాణికం ప్రధాన అవసరం ఇప్పుడు. అధిక నాణ్యత కలిగిన సేవలకై అదనపు మార్గదర్శకాలను ట్రాయ్ చేర్చాలి. 15 ఎంబీపీఎస్ వేగాన్ని ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌గా, 30 ఎంబీపీఎస్‌ను అల్ట్రా ఫాస్ట్‌గా నిర్వచించాలి’ అని ఫోరం అభిప్రాయపడింది. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, ఇంటెల్, క్వాల్కామ్, జియో, స్టార్, సిస్కో వంటి సంస్థలు ఫోరం సభ్యులుగా ఉన్నాయి. -
మొబైల్ నెట్ స్పీడ్‌లో భారత్ ర్యాంక్ ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరింత దిగజారింది. యుద్ధంతో మసకబారిన ఇరాక్‌తో పాటు పొరుగు దేశాల కన్నా భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ నాసిరకంగా ఉండటం గమనార్హం. ఊక్లా తాజా గణాంకాల ప్రకారం ఇంటర్నెట్ స్పీడ్‌లో పాకిస్తాన్, నేపాల్‌లు మనకంటే మెరుగైన స్ధితిలో ఉన్నాయి. ఊక్లా సెప్టెంబర్ స్పీడ్ ఇండెక్స్‌లో 121 ఎంబీపీఎస్‌తో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో దక్షిణ కొరియా అగ్రస్ధానంలో నిలిచింది. 12.07 ఎంబీపీఎస్ సగటు వేగంతో భారత్ ఈ జాబితాలో 131వ స్ధానానికి దిగజారింది. పాకిస్తాన్ 17.13 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ జాబితాలో 116వ స్ధానంలో నిలవడం విశేషం. నేపాల్ 17.12 ఎంబీపీఎస్ వేగంతో 117వ స్ధానంలో ఉంది. 19.95 ఎంబీపీఎస్ స్పీడ్‌తో శ్రీలంక మెరుగైన స్ధానంలో నిలిచింది. ఇరాక్ సైతం 12.24 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ జాబితాలో భారత్ కంటే మెరుగైన స్ధానం దక్కించుకుంది. ఇక బ్రాడ్‌బ్యాండ్ స్సీడ్‌లో 226 ఎంబీపీఎస్ సగటు వేగంతో సింగపూర్ నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో మాత్రం నేపాల్ (113), పాకిస్తాన్ (159)ల కంటే భారత్ (70) ఊక్లా ర్యాంకింగ్‌లో మెరుగైన స్ధానం సాధించింది. ఈ ఏడాది మార్చి నుంచి మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ వేగాల్లో మెరుగుదల సాధించిందని ఊక్లా పేర్కొంది. చదవండి : ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందని.. ఫోన్ కొట్టేశాడు -
డౌన్‌లోడ్‌లో మనమెంత స్లోనో తెలుసా?
ముంబై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం కేంద్రం కలలు కంటోంది. హైస్పీడ్ ఇంటర్నెట్, అత్యున్నత సైబర్ భద్రత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కానీ ఒకవైపు పెద్దనోట్ల రద్దు.. మరోవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలోనూ సైబర్ భద్రత విషయంలో దేశం పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. తాజా అంతర్జాతీయ సర్వేలో డౌన్లోడ్ స్పీడ్ విషయంలో భారత్ 96వ స్థానంలో నిలువగా, బ్యాండ్‌విడ్త్ అందుబాటు విషయంలో మరీ దారుణంగా 105స్థానంలో ఉంది. ఇంటర్నెట్ భద్రత విషయంలోనూ దేశం చాలా వెనుకబడి ఉంది. డౌన్లోడ్ స్పీడ్ విషయంలో బంగ్లాదేశ్, నేపాల్ కంటే వెనుకబడి ఉన్న భారత్.. ’రాన్సమ్వేర్ అటాక్’ (సైబర్ దాడుల) విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకులు, రహస్య సమాచారం కలిగిన సంస్థలు లక్ష్యంగా ఇటీవలికాలంలో హ్యాకింగ్లు, సైబర్ దాడులు పెరిగిపోవడం గమనార్హం. దేశంలో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో, డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు సామాన్య ప్రజలు వెనుకాడుతున్నారని, తాము కూడా హ్యాకింగ్ బారిన పడి.. వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం కోల్పోయే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించే నగదు లావాదేవీలన్నింటికీ తగిన భద్రత కల్పించాలని, ఇందుకు అవసరమైన నిఘా, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. సైబర్ నేరాలు అత్యధికంగా జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ ఆరోస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక బ్యాండ్‌విడ్త్ అందుబాటు విషయంలో శ్రీలంక, చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేసియా మనకంటే ఎంతో ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఇంటర్నెట్ అందుబాటును మరింతగా పెంచడమే కాకుండా.. అటు సైబర్ భద్రతను మరింత పటిష్టపరచాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. -
జియో.. యూజర్లకు పెద్ద తలనొప్పి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ జియో సర్వీస్ అంటూ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. తక్కువ రోజుల్లోనే కోట్లమంది జియో సిమ్ యూజర్లను సంపాదించుకున్నారు. టెల్కోలు గగ్గోలు పెడుతున్నా తన పంథాను ఏ మాత్రం మార్చుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఆగస్టులో జియో సర్వీస్ తీసుకొచ్చినా.. సెప్టెంబర్ 5నుంచి అధికారికంగా ఈ జియో సిమ్ సర్వీస్ లాంచ్ చేశారు. ఈ డిసెంబర్ 31వరకూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, డాటా బ్రౌజింగ్, డౌన్ లోడ్ సర్వీసులు అంటూ మార్కెట్లోకి దూసుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన కస్టమర్లు తొలుత జియో సిమ్స్ అంటూ రిలయన్స్ డిజిటల్స్, రిలయన్స్ మినీ స్టోర్స్ ముందు క్యూ కట్టేవారు ప్రస్తుతం ఇతర నెట్ వర్క్ యూజర్స్ నెట్ వర్క్ పోర్టబిలిటీ ద్వారా నంబర్ మార్చే అవసరం లేకుండా జియోకు మారిపోతున్నారు. అధికారికంగా 50లక్షల మంది జియో యూజర్లు నమోదైనట్లు సమాచారం. ఇక జియో అధినేత అంచనా ప్రకారం వీరి సంఖ్య 10కోట్లకు చేరితే ఆపై ఈ సమస్య తీవ్రత ఎలా ఉంటుందో కూడా అంచనా వేయడం కష్టం. జియో వచ్చిన తొలి రోజుల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే జియో వెలకం ఆఫర్ తెలుసు కాబట్టి.. ఫ్రీ సిమ్ పొంది హాయిగా నెట్ వాడేశారు. కానీ, సెప్టెంబర్ 5తర్వాత జియో ప్రభంజనం మొదలైంది. యూజర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. అందులో ముఖ్యమైన సమస్యలు ఇవే.. వాయిస్ కాల్స్ ఫెయిల్యూర్ ఎలాంటి రీచార్జ్ చేయకుండానే నెట్ సౌకర్యం ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉన్నా, ఇతర నెట్ వర్క్ వారు జియో యూజర్లకు ఇంటర్ కాల్స్ కనెక్షన్ సౌకర్యం కల్పించకపోవడంతో గతవారం వరకూ 15 కోట్ల వాయిస్ కాల్స్ చేయగా అందులో దాదాపు 12 కోట్ల కాల్స్ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. జియో ఉన్నా, ఎమర్జెన్సీ కాల్స్ కోసం ఇతర నెటవర్క్ సిమ్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుందని యూజర్లు వాపోతున్నారు. తగ్గిన ఇంటర్ నెట్ స్పీడ్ జియో వచ్చిన తొలిరోజుల్లో దాదాపు చాలా ప్రాంతాల్లో 40ఎంబీపీఎస్ స్పీడ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 5ఎంబీపీఎస్ లోపే ఉండగా, కొన్ని నగరాలలో 6-10 వేగంతో నెట్ వస్తుందని చెబుతున్నారు. మూవీ చూస్తే కనీసం ఒక్కసారి కూడా బఫర్ కాని పరిస్థితి నుంచి చిన్న వీడియో చూసినా చాలా సమయం తీసుకుంటుంది. జియో యాప్స్ తో సమస్యలు జియో యాప్స్ లో ఏ ఒక్కటి స్మార్ట్ ఫోన్లో లేకున్నా.. ఇతర యాప్స్ పై ఆ ప్రభావం కనిపిస్తుంది. జియో 4జీ వాయిస్ చాలా సందర్భాలలో ఆఫ్ లైన్ అని వస్తుంది. ఆ సమయంలో మనం డాటా వాడుకోవచ్చు కానీ, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడానికి వీలుండదు. జియో టీవీ యాప్ క్రాష్ అయితే, తిరిగి టీవీ ఆన్ చేయడానికి చాలా సమయం వృథా చేసుకోకతప్పదు. వీఓఎల్టీఈ సపోర్ట్ లేదు 4జీ సౌకర్యం ఉన్న చాలా రకాల స్మార్ట్ ఫోన్లలో ఎల్టీఈ మాత్రమే ఉంది. VOLTE సపోర్ట్ చేయని యూజర్లకు ఈ కష్టాలు కాస్త ఎక్కువ. జియో 4జీ వాయిస్ వారికి నెట్ అందుబాటులో ఉన్నా సౌకర్యాన్ని వాడుకోలేరు. ఇప్పటివరకూ మార్కెట్లో ఉన్న ఫోన్లలో 3జీ మొబైల్స్ వాడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. బ్యాటరీని తోడేస్తుంది రిలయన్స్ జియో తమ సర్వీస్ లను 4జీ పై అందిస్తున్నాయి. 2జీ, 3జీ సపోర్టెట్ మొబైల్స్ కంటే 4జీ మొబైల్స్ వేగంగా పనిచేయడంతో తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ తీసుకుంటుంది. కొన్ని కంపెనీలు 4జీ సర్వీసులు అందిస్తున్నా, బ్యాటరీ విషయంలో కనీసం 3వేల ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కూడా అందించడం లేదు. నెట్ వినియోగించి తరచూ వీడియోలు వీక్షించే యూజర్లు ఎక్కువగా తమ ఫోన్ ను చార్జింగ్ కు కనెక్ట్ చేసి ఉంటున్న విషయం తెలిసిందే. -
మొబైల్ లో డేటా స్పీడ్ చెక్ చేసే ‘ట్రాయ్’ యాప్
ట్రాయ్ మై స్పీడ్ పేరుతో అందుబాటులోకి న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్‌ను చెక్ చేసే యాప్‌ను మంగళవారం టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్ అందుబాటులోకి తెచ్చింది. భారత మొబైల్ వినియోగదారుల కోసం డేటా సర్వీస్ నాణ్యతను మెరుగుపరచడానికి ‘ట్రాయ్ మైస్పీడ్ యాప్’ పేరుతో ఈ యాప్‌ను అందిస్తున్నామని ట్రాయ్ తెలిపింది. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో ఈ యాప్ చెక్ చేస్తుందని, ఈ విషయాన్ని ట్రాయ్‌కు కూడా నివేదిస్తుందని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ చెప్పారు. ఇలా వినియోగదారుల నుంచి సమీకరించిన డేటా ఆధారంగా సేవల నాణ్యత నిబంధనలను కొత్తగా రూపొం దిస్తామని, ఈ ప్రక్రియ ఒక నెలలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ యాప్ కారణంగా పారదర్శకత నెలకొంటుందని, వినియోగదారులు ఎంచుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయని, ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని వివరించారు. ఏడాది కాల వ్యవధితో డేటా పథకాలు! న్యూఢిల్లీ: ఏడాది కాల వ్యవధితో కూడిన మొబైల్ ఇంటర్నెట్ రీచార్జ్ పథకాలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ట్రాయ్ ముందుకు తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 90 రోజల వ్యాలిడిటీ మించరాదు. దీంతో అధిక కాల వ్యవధితో కూడిన పథకాల కోసం అభ్యర్థనలు రావడంతో ట్రాయ్ ఆ మేరకు చర్యలు చేపట్టింది.