మొబైల్ లో డేటా స్పీడ్ చెక్ చేసే ‘ట్రాయ్’ యాప్ | Here's how to use TRAI's MySpeed App to check internet speeds | Sakshi
Sakshi News home page

మొబైల్ లో డేటా స్పీడ్ చెక్ చేసే ‘ట్రాయ్’ యాప్

Published Wed, Jul 6 2016 12:35 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

మొబైల్ లో డేటా స్పీడ్ చెక్ చేసే ‘ట్రాయ్’ యాప్ - Sakshi

మొబైల్ లో డేటా స్పీడ్ చెక్ చేసే ‘ట్రాయ్’ యాప్

ట్రాయ్ మై స్పీడ్  పేరుతో అందుబాటులోకి
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్‌ను చెక్ చేసే యాప్‌ను మంగళవారం టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్ అందుబాటులోకి తెచ్చింది. భారత మొబైల్ వినియోగదారుల కోసం డేటా సర్వీస్ నాణ్యతను మెరుగుపరచడానికి ‘ట్రాయ్ మైస్పీడ్ యాప్’ పేరుతో ఈ యాప్‌ను అందిస్తున్నామని ట్రాయ్ తెలిపింది. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో ఈ యాప్ చెక్ చేస్తుందని, ఈ విషయాన్ని ట్రాయ్‌కు కూడా నివేదిస్తుందని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ చెప్పారు. ఇలా వినియోగదారుల నుంచి సమీకరించిన డేటా ఆధారంగా సేవల నాణ్యత నిబంధనలను కొత్తగా రూపొం దిస్తామని,  ఈ ప్రక్రియ ఒక నెలలో  ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ యాప్ కారణంగా పారదర్శకత నెలకొంటుందని, వినియోగదారులు ఎంచుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయని, ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని వివరించారు.

 ఏడాది కాల వ్యవధితో డేటా పథకాలు!
న్యూఢిల్లీ: ఏడాది కాల వ్యవధితో కూడిన మొబైల్ ఇంటర్నెట్ రీచార్జ్ పథకాలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ట్రాయ్ ముందుకు తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 90 రోజల వ్యాలిడిటీ మించరాదు. దీంతో అధిక కాల వ్యవధితో కూడిన పథకాల కోసం అభ్యర్థనలు రావడంతో ట్రాయ్ ఆ మేరకు చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement