
న్యూఢిల్లీ: 5జీ ట్రయల్స్‌లో భాగంగా వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌పై వేగం 9.85 జీబీపీఎస్ నమోదైందని టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా తెలిపింది. 80 గిగాహెట్జ్ స్పెక్ట్రంలో ఈ–బ్యాండ్ మైక్రోవేవ్‌ను వినియోగించి ఈ ఘనతను సాధించినట్టు వెల్లడించింది.
ఫైబర్ కేబుల్స్ వేయలేని ప్రాంతాల్లో ఈ–బ్యాండ్ ద్వారా.. స్మాల్‌సెల్స్, మాక్రోసెల్స్‌ను అనుసంధానించడం ద్వారా ఫైబర్ స్థాయి వేగంతో 5జీ సేవలను అందించేందుకు వొడాఫోన్ ఐడియా ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment