సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో మొబైల్ ఇంటర్‌నెట్ స్పీడ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరింత దిగజారింది. యుద్ధంతో మసకబారిన ఇరాక్‌తో పాటు పొరుగు దేశాల కన్నా భారత్‌లో మొబైల్ ఇంటర్‌నెట్ స్పీడ్ నాసిరకంగా ఉండటం గమనార్హం. ఊక్లా తాజా గణాంకాల ప్రకారం ఇంటర్‌నెట్ స్పీడ్‌లో పాకిస్తాన్, నేపాల్‌లు మనకంటే మెరుగైన స్ధితిలో ఉన్నాయి. ఊక్లా సెప్టెంబర్ స్పీడ్ ఇండెక్స్‌లో 121 ఎంబీపీఎస్‌తో మొబైల్ ఇంటర్‌నెట్ స్పీడ్‌లో దక్షిణ కొరియా అగ్రస్ధానంలో నిలిచింది. 12.07 ఎంబీపీఎస్ సగటు వేగంతో భారత్ ఈ జాబితాలో 131వ స్ధానానికి దిగజారింది. పాకిస్తాన్ 17.13 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ జాబితాలో 116వ స్ధానంలో నిలవడం విశేషం.
నేపాల్ 17.12 ఎంబీపీఎస్ వేగంతో 117వ స్ధానంలో ఉంది. 19.95 ఎంబీపీఎస్ స్పీడ్‌తో శ్రీలంక మెరుగైన స్ధానంలో నిలిచింది. ఇరాక్ సైతం 12.24 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ జాబితాలో భారత్ కంటే మెరుగైన స్ధానం దక్కించుకుంది. ఇక బ్రాడ్‌బ్యాండ్ స్సీడ్‌లో 226 ఎంబీపీఎస్ సగటు వేగంతో సింగపూర్ నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో మాత్రం నేపాల్ (113), పాకిస్తాన్ (159)ల కంటే భారత్ (70) ఊక్లా ర్యాంకింగ్‌లో మెరుగైన స్ధానం సాధించింది. ఈ ఏడాది మార్చి నుంచి మొబైల్ ఇంటర్‌నెట్, బ్రాడ్‌బ్యాండ్ వేగాల్లో మెరుగుదల సాధించిందని ఊక్లా పేర్కొంది. చదవండి : ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందని.. ఫోన్ కొట్టేశాడు
Comments
Please login to add a commentAdd a comment