Broad Band
-
గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లు
రిలయన్స్ జియో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఏడాదిలో 34.5 శాతం పెరిగారు. ఇదే సేవలందిస్తున్న ఎయిర్టెల్ వినియోగదారలు గతేడాదితో పోలిస్తే 24.2 శాతం పెరిగినట్లు ప్రకటన విడుదల చేశారు.భారత్‌లో 5జీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) సేవలు వేగంగా పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు కూడా అధికమవుతున్నారు. ఈ విభాగంలో సేవలందిస్తున్న జియో తన ప్రత్యర్థిగా ఉన్న ఎయిర్టెల్ యూజర్ల సంఖ్యను అధిగమించింది.మే 2023-మే 2024 మధ్య జియో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఎయిర్టెల్ 24.2%తో పోలిస్తే 34.5% పెరిగారు. మే చివరి నాటికి ఎయిర్టెల్ వాడుతున్న 80 లక్షల వినియోగదారులతో పోలిస్తే జియో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య 1.2 కోట్లకు చేరుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం మే చివరి నాటికి భారతదేశ వైర్డు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 4.13 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద! -
బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనం మార్పు.. కనీస డౌన్లోడ్ స్పీడ్ ఎంతంటే
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ నిర్వచనాన్ని ప్రభుత్వం సవరించింది. కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు (మెగాబిట్స్ పర్ సెకండ్) పెంచింది. 2013 జూలై నాటి నిర్వచనం ప్రకారం ఇది 512 కేబీపీఎస్‌గా (కిలోబిట్స్ పర్ సెకండు) ఉండేది. తాజా మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంత వినియోగదారులకు ఈ కొత్త నిర్వచనంతో ప్రయోజనం చేకూరగలదని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టీవీ రామచంద్రన్ చెప్పారు. డౌన్లోడ్ స్పీడ్‌ను బట్టి ఫిక్సిడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను బేసిక్, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఊక్లా నిర్వహించే స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం గతేడాది డిసెంబర్లో భారత్‌లో సగటున మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ 25.29 ఎంబీపీఎస్‌గా నమోదైంది. నవంబర్‌లో ఇది 18.26 ఎంబీపీఎస్‌గా ఉండేది. 2022 నవంబర్ 30 నాటికి దేశీయంగా 82.54 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉండగా, వీరిలో 79.35 కోట్ల మంది వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త, ఉచిత డేటా ఆఫర్..ఎంతకాలం అంటే?
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ సంస్థ టాటా ప్లే ఫైబర్ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఆ సంస్థ రూ.1150 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను దాని కొత్త సబ్స్క్రైబర్లకు ఒక నెల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ‘ట్రై అండ్ బై’ పథకం కింద ఈ ప్లాన్ వినియోగదారులకు ఒక నెలపాటు ఉచితంగా బ్రాండ్ బ్యాండ్ ను వినియోగించుకోవచ్చు. అయితే కంపెనీ వినియోగదారులు ముందుగా సర్వీస్ నాణ్యతను పరీక్షించి, ఆపై కనెక్షన్‌ని కొనుగోలు చేస్తే ఈ ప్లాన్‌ను ఉచితంగా పొందొచ్చని టాటా ప్లే ఫైబర్ నిర్వాహకులు తెలిపారు. రూ.1150 ప్లాన్ కింద రూ.1150 ప్లాన్ కింద వినియోగదారులకు 200 ఎంబీపీఎస్ డౌన్లోడ్, అప్లోడ్ వేగంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను పొందవచ్చు. కొత్త సబ్స్క్రైబర్లకు ఈ ప్లాన్ ఉచితంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ వినియోగదారులు రూ.1500 ఒక్కసారి రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రై అండ్ బై స్కీమ్ కంపెనీ అందించే ఈ ప్రమోషనల్ ఆఫర్ న్యూ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గ్రేటర్ నోయిడా, ముంబైతో పాటు దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉండనుందని ఆ సంస్థ నిర్వహాకులు ప్రకటించారు. ట్రై అండ్ బై ఇనిషియేటివ్ కస్టమర్లు 1000జీబీ హై స్పీడ్ డేటాను ఉచితంగా పొందుతారు. కంపెనీ నుండి పూర్తి రీఫండ్ పొందడానికి అర్హత పొందడానికి 30 రోజులలోపు కనెక్షన్‌ని రద్దు చేయాల్సి ఉంటుంది. 30 రోజుల తర్వాత రద్దు చేస్తే రూ.500 సర్వీస్ ఛార్జ్ విధించి, మిగిలిన రూ.1000 వాపస్ ఇస్తుంది. ఆఫర్ పొందాలంటే కనెక్షన్‌తో పాటు టాటా ప్లే ఫైబర్ ట్రయల్ వ్యవధిలో వినియోగదారులకు ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా అందిస్తుంది. దీంతో పాటు కనీసం 3 నెలల పాటు 100 ఎంబీపీఎస్ ప్లాన్ ను ఎంపిక చేసుకుంటే పూర్తి రూ.1500 రీఫండ్ లభిస్తుంది. 3 నెలల పాటు 50 ఎంబీపీఎస్ ప్లాన్‌ని ఎంచుకుంటే రూ. 500 మాత్రమే వాపస్ పొందవచ్చు. మిగిలిన రూ.1000 సెక్యూరిటీ డిపాజిట్ వాలెట్లో ఉంటుంది. నెలవారీ ప్లాన్‌ను పొందినట్లయితే, మూడు నెలల వినియోగ తర్వాత రూ.1000 వాపసు చేయబడుతుంది. మిగిలిన రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ వాలెట్లో ఉంటుందని టాటా ప్లే ఫైబర్ వెల్లడించింది. -
ఇక బ్రాడ్ బ్యాండ్ కనీస స్పీడ్ 2 ఎంబీపీఎస్..!
వేగంగా అభివృద్ధి చెందుతున్న మనదేశంలో అంతే వేగంగా ఆన్ లైన్ మార్కెట్ పెరుగుతోంది. అలాగే, కరోనా మహమ్మరి వల్ల ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ, మనదేశంలో ఇంకా ఇంటర్నెట్ సగటు వేగం 512 కేబీపీఎస్ గానే(కిలో బిట్స్ పర్ సెకన్) ఉంది. ఈ నేపథ్యంలో.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్నెట్ వేగాన్ని అందుకోవడానికి చర్యలు తీసుకోవాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కనీస బాడ్ర్ బ్యాండ్ స్పీడును 2 ఎంబీపీఎస్ (మెగాబిట్స్ పర్ సెకన్)కు పెంచాలని పేర్కొంది.(చదవండి: మార్కెట్లోకి సరికొత్త డుగ్ డుగ్ బండి వచ్చేసింది!) బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకాలను అందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లకు సబ్ స్క్రైబ్ చేసుకునేలా ప్రోత్సహించడానికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ(డీబీటీ) పథకాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రాయ్ కేంద్ర ప్రభుత్వానికి పేర్కొంది. టెలికాం రెగ్యులేటర్ పత్రికా ప్రకటన ప్రకారం.. భారతదేశంలో బ్రాడ్ బ్యాండ్ సేవలు బేసిక్, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అనే మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. 2 ఎంబీపీఎస్ నుంచి 50 ఎంబీపీఎస్ మధ్య వేగం ఉంటే 'బేసిక్' కనెక్షన్ అని, 'ఫాస్ట్' కనెక్షన్ వేగం 50 ఎంబీపీఎస్ నుంచి 300 ఎంబీపీఎస్ మధ్య ఉంటుంది. అయితే 'సూపర్ ఫాస్ట్' కనెక్షన్ వేగం 300 ఎంబీపీఎస్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కనీస వేగం 2 ఎంబీపీఎస్ అందించడానికి బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లకు ట్రాయ్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇది లైసెన్స్ ఫీజుల నుంచి మినహాయింపు రూపంలో ఉంటుంది. ప్రస్తుతం, బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లు లైసెన్స్ ఫీజు రూపంలో వారి ఆదాయంపై 8% వసూలు చేస్తున్నారు. -
ఇంటర్నెట్ స్పీడ్ సమస్యలకు పరిష్కారం... ఎల్ఈవో
ఇండియాలో ఇంటర్నెట్ కనెక్టివిటీపై కార్పోరేట్ కంపెనీలు కన్నేశాయి. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అందించేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో బడా కంపెనీలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సెక్టార్లో అడుగుపెడుతోంది. టాటా విత్ టెలిశాట్ టాటా గ్రూప్‌కి చెందిన నెల్కో సంస్థ కెనాడుకు చెందిన టెలిశాట్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ కుదిరితే ఈ రెండు సంస్థలు సంయుక్తంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ఇండియాలో అందివ్వనున్నాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 2024 నాటికి ఇండియాలో వైర్లెస్ పద్దతిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కనెక్టివిటీ సమస్య జియోరాకతో ఇండియాలో ఇంటర్నెట్ వాడకంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అర్బన్ ఏరియాలో ఇంటర్నెట్ నిత్య జీవితంలో ఒక భాగమైంది. వ్యక్తిగత అవసరాలతో పాటు ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలకు ఆన్లైన్ అనేది తప్పనిసరిగా మారింది. అయితే రూరల్ ఇండియాలో పరిస్థితి ఇందుకు భినంగా ఉంది. దేశంలో సగానికి పైగా ఏరియాల్లో అసలు ఇంటర్నెట్ కనెక్షన్లు లేవు. ఉన్నా నెట్ స్పీడ్ తక్కువగా ఉంది. లైట్ స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే నెట్ స్పీడ్ సమస్యలు తీరే అవకాశం ఉంది. డిజిటటీకరణ మరింత వేగం పుంజుకోనుంది. ఎల్ఈవో ప్రస్తుతం నెట్ ఫైబర్ వైర్, స్పెక్ట్రమ్, శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ పని చేస్తోంది. మన దేశంలో మొబైల్ నెట్‌వర్క్‌లు స్పెక్ట్రమ్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తుండగా ప్రైవేటు కంపెనీలు, బీఎస్ఎన్ఎల్, జియో ఫైబర్లు ఆప్టికల్ ఫైబర్ వైర్ ద్వారా నెట్ అందిస్తున్నాయి. ఈ రెండు కాకుండా భూమి నుంచి 500ల నుంచి 2,000 కి.మీ ఎత్తులో ఉండే ఉపగ్రహం (లో ఎర్త్ ఆర్బిట్) ద్వారా లైట్ స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను అందివ్వడం వీలవుతుంది. 1990ల నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కమర్షియల్‌గా ఉపయోగించలేదు. ప్రస్తుతం నెట్ వినియోగం పెరిగిపోవడంతో ఈ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. సెల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థ లేని చోట కూడా శాటిలైట్ ద్వారా నెట్ అందివ్వడం ఈ పద్దతిలో సాధ్యం అవుతుంది. వచ్చే ఏడాది లో ఎర్త్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్ కనెక్టివిటీ కోసం టెలిశాట్ సంస్థ ఏకంగా ఎనిమిది బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. ఇండియాకు సంబంధించి ఈ సంస్థ టాటా గ్రూపుకి చెందిన నెల్కోతో కలిసి పని చేయనుంది. టాటా కంటే మేందు ఎయిర్టెల్ సంస్థ సైతం శాటిలైట్ ఇంటర్నెట్పై దృష్టి సారించింది. ఈ విభాగంలో వన్‌వెబ్ సంస్థతో కలిసి పని చేస్తోంది. మరోవైపు అమెజాన్ , టెస్లాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థలు కూడా లైట్ స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను వచ్చే ఏడాది నుంచి వైర్లెస్ నెట్ సేవలు ప్రారంభించేందుకు ఈ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. -
ఏడాది కాలంలో 47 శాతం పెరిగిన ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్
భారతదేశంలోని మొబైల్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాలను జూన్ లో ఓక్లా పరీక్షించి విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో గతంలో కంటే మెరుగైన స్థానాన్ని సాధించుకుంది. దేశంలో మేలో సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 15.34 ఎంబీపీఎస్ నుంచి 17.84 ఎంబీపీఎస్(16.3 శాతం పెరిగి)కు చేరుకుంది. మొబైల్ ఇంటర్నెట్ తో పాటు, దేశంలో సగటు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగం 4.53 శాతం పెరిగి 55.65 ఎంబీపీఎస్ నుంచి 58.17 ఎంబీపీఎస్ కు పెరిగింది. జూన్ లో మొబైల్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాల పరంగా రెండూ గ్లోబల్ ఇండెక్స్ లో మంచి స్థానాన్ని పొందాయి. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ జూన్ డేటా ప్రకారం.. మొబైల్ ఫిక్సిడ్ బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగాలు వరుసగా ఆరు స్థానాలు పెరిగి 122 వ స్థానానికి, మూడు పాయింట్లు పెరిగి 70కి చేరుకుంది. గత రెండు నెలలుగా మొత్తంగా మొబైల్ డౌన్లోడ్ వేగంలో స్థిరమైన మెరుగుదలను చూపించినట్లు ఓక్లా తెలిపింది. జూన్ లో మొబైల్ ఇంటర్నెట్ వేగం ఓక్లా విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. దేశంలో గత ఏడాది జూన్ 2020లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 12.16 ఎంబీపీఎస్ ఉంటే ఈ ఏడాది 17.84 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 46.71 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. దేశంలో సగటు మొబైల్ అప్ లోడ్ వేగం కూడా గత ఏడాది ఇదే నెలలో 4.35 ఎంబీపీఎస్ ఉంటే జూన్ 2021లో 18.85 శాతం పెరిగి 5.17 ఎంబీపీఎస్ కు చేరుకుంది. మొబైల్ నెట్ వర్క్ లపై దేశంలో సగటు లేటెన్సీ రేటు మే లో 50 మిల్లీసెకన్ల నుంచి జూన్ లో 48 మిల్లీ సెకన్లకు పడిపోయింది. సగటు జిట్టర్ రేటు కూడా మేలో 48 మిల్లీ సెకన్ల నుండి జూన్ లో 43 మిల్లీ సెకన్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఓక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 193.51 ఎంబీపీఎస్ తో తన ఆధిక్యాన్ని కొనసాగించింది. తర్వాత దక్షిణ కొరియా 180.48 ఎంబీపీఎస్ వద్ద ఉంది. జూన్ లో ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ వేగం ఇక ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ విషయానికి వస్తే ఓక్లా స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. భారతదేశంలో సగటు డౌన్లోడ్ వేగం జూన్ 2021లో 58.17 ఎంబీపీఎస్ గా ఉంటే, జూన్ 2020లో 38.19 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 52.32 శాతం పెరుగుదలను నమోదు సూచిస్తుంది. మరోవైపు దేశంలో సగటు ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ అప్ లోడ్ వేగం 2021 జూన్ లో 54.43 ఎంబీపీఎస్ కు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే నెలలో 34.22 ఎంబీపీఎస్ నుంచి 59.06 శాతం పెరిగింది. దేశంలో ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ సగటు లేటెన్సీ రేటు జూన్ లో ఒక మిల్లీ సెకను నుంచి 17 మిల్లీసెకన్లకు పెరిగింది. జూన్ లో సగటు బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగం పరంగా 260.74 ఎంబీపీఎస్ తో మొనాకో అగ్రదేశంగా అవతరించింది. -
Nirmala Sitha Raman: బ్రాడ్‌బ్యాండ్‌కి భారీగా నిధులు
దేశంలో ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కనెక్టివీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్ నెట్ పథకానికి భారీగా నిధులు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఇప్పటికే అమలవుతున్న ఈ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఇంటర్నెట్తో కోవిడ్ పోరు టీకా వేయించుకోవాలనుకునే వారు కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాలంటూ కేంద్రం ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంత ప్రజలు ఎలా రిజిస్ట్రర్ చేసుకుంటారంటూ ప్రతిపక్షలు ఘాటుగా విమర్శించాయి. మరోవైపు టెలి మెడిసిన్‌పై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివి పెంచడం లక్ష్యంగా ఉద్దేశించిన భారత్‌నెట్‌కు భారీగా నిధులు కేటాయించింది. రూ. 19,041 కోట్లు భారత్ నెట్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ పథకానికి అప్పుడు రూ. 42,048 కోట్లు కేటాయించారు. తాజాగా రూ.19,041 కోట్లు అదనంగా జత చేశారు. దీంతో ఈ పథకం మొత్తం విలువ రూ. 61,109 కోట్లకు చేరుకుంది. మారుమూల ప్రాంతాలకు నెట్ భారత్‌నెట్ ద్వారా దేశంలో ఉన్న 2,50,000 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బాండ్ కనెక్షన్ అందివ్వడం లక్ష్యంగా నిర్దేశించారు. 2021 మే 31 నాటికి 1,56,223 గ్రామ పంచాయతీలకు నెట్ కనెక్షన్ అందించారు. చదవండి : థర్డ్ వేవ్ ఎఫెక్ట్.... పిల్లలపై కేంద్రం ఫోకస్ -
రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తున్నాయి. తాజాగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరకే కొత్త ఇంటర్నెట్ ప్లాన్స్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399, రూ.555 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ధరకు కూడా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. బిఎస్ఎన్ఎల్ రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కింద 100జీబీ డేటా 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో అందిస్తున్నారు. డేటా పూర్తీ అయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ ఆరు నెలలే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో 200జీబీ డేటా అందిస్తారు. డేటా పరిమితి అయిపోయిన తర్వాత వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. రూ.555 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబిపిఎస్ వేగంతో 500జీబీ డేటా వస్తుంది. డేటా పూర్తైన తర్వాత ఇంటర్నెట్ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. కొత్త వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399 ప్లాన్లు తీసుకోవాలంటే రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. చదవండి: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు బీమా పాలసీదారులకు శుభవార్త! -
మొబైల్ నెట్ స్పీడ్‌లో భారత్ ర్యాంక్ ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరింత దిగజారింది. యుద్ధంతో మసకబారిన ఇరాక్‌తో పాటు పొరుగు దేశాల కన్నా భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ నాసిరకంగా ఉండటం గమనార్హం. ఊక్లా తాజా గణాంకాల ప్రకారం ఇంటర్నెట్ స్పీడ్‌లో పాకిస్తాన్, నేపాల్‌లు మనకంటే మెరుగైన స్ధితిలో ఉన్నాయి. ఊక్లా సెప్టెంబర్ స్పీడ్ ఇండెక్స్‌లో 121 ఎంబీపీఎస్‌తో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో దక్షిణ కొరియా అగ్రస్ధానంలో నిలిచింది. 12.07 ఎంబీపీఎస్ సగటు వేగంతో భారత్ ఈ జాబితాలో 131వ స్ధానానికి దిగజారింది. పాకిస్తాన్ 17.13 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ జాబితాలో 116వ స్ధానంలో నిలవడం విశేషం. నేపాల్ 17.12 ఎంబీపీఎస్ వేగంతో 117వ స్ధానంలో ఉంది. 19.95 ఎంబీపీఎస్ స్పీడ్‌తో శ్రీలంక మెరుగైన స్ధానంలో నిలిచింది. ఇరాక్ సైతం 12.24 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ జాబితాలో భారత్ కంటే మెరుగైన స్ధానం దక్కించుకుంది. ఇక బ్రాడ్‌బ్యాండ్ స్సీడ్‌లో 226 ఎంబీపీఎస్ సగటు వేగంతో సింగపూర్ నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో మాత్రం నేపాల్ (113), పాకిస్తాన్ (159)ల కంటే భారత్ (70) ఊక్లా ర్యాంకింగ్‌లో మెరుగైన స్ధానం సాధించింది. ఈ ఏడాది మార్చి నుంచి మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ వేగాల్లో మెరుగుదల సాధించిందని ఊక్లా పేర్కొంది. చదవండి : ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందని.. ఫోన్ కొట్టేశాడు -
కరోనా : బీఎస్ఎన్ఎల్, నెల రోజులు ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్ననేపథ్యంలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల సౌలభ్యం కోసం ఒక ఆఫర్‌ను తీసుకొచ్చింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఇంటినుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ లైన్ వినియోగదారులకోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 'వర్క్ ఫ్రమ్ హోమ్' ను బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. ప్రమోషనల్ ఆఫర్ తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో ల్యాండ్‌లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజులు పాటు ఈ సేవలను అందించనుంది. ప్రమోషనల్ వ్యవధి ముగిసిన తరువాత, పై ప్లాన్ కింద ఉన్న కస్టమర్లు వారి ఉపయోగాల ప్రకారం సాధారణ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మరలతారని బీఎస్ఎన్ఎల్ తన సర్క్యులర్‌లో తెలిపింది. ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్ఎస్ డౌన్ స్పీడ్‌ను, రోజుకు 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉండి, బ్రాడ్‌బ్యాండ్ లేని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ బ్రాడ్‌బ్యాండ్ సేవను ఒక నెల ఉచితంగా అందిస్తున్నామని, తద్వారా వారు ఈ సేవను ఇంటి నుండి పని చేయడానికి, ఇంటి నుండే విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సిఎఫ్ఎ వివేక్ బంజాల్ చెప్పారు. ఇంటి నుండే కిరాణాను ఆన్లైన్లో కొనుగోలు, లేదా అవసరమైన అవసరాల నిమిత్తం బయటికి వెళ్లవలసిన అవసరాన్ని తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా ల్యాండ్‌లైన్ వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులుగా మార్చడంలో ఈ సరికొత్త ప్లాన్ సహాయపడుతుందని అంచనా. ముఖ్యంగా ప్రధాన పోటీదారులు, ఎయిర్టెల్, జియోతోపాటు, ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లతో బాగా పోటీ పడటానికి సహాయపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
డిసెంబర్‌కల్లా భారత్ నెట్ రెండో దశ పూర్తి
న్యూఢిల్లీ: దాదాపు 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించే దిశగా తలపెట్టిన భారత్ నెట్ ప్రాజెక్ట్ రెండో దశ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వాస్తవానికి దీని గడువు 2019 మార్చి దాకా ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే పూర్తి కావొచ్చని తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. రెండో దశను వేగవంతం చేసే దిశగా సకాలంలో పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం... లేకపోతే జరిమానా విధించడం మొదలైన నిబంధనలు కాంట్రాక్టుల్లో చేర్చాల్సి ఉందని ఆయన చెప్పారు. తొలి దశలో లక్ష గ్రామ పంచాయతీలకు హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరో 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు కూడా బ్రాడ్‌బ్యాండ్‌ని అందుబాటులోకి తెచ్చేలా రెండో దశ ప్రక్రియ ప్రారంభమైందని, క్యాబినెట్ దీనికి ఆమోదముద్ర వేసిందని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు అందుబాటు ధరల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ ఈ భారీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. -
1.2 కోట్ల గృహాలకు బ్రాడ్‌బ్యాండ్
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం 1.2 కోట్ల గృహాలకు 10-15 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఒక్కో గృహం నుంచి నెలకు రూ.150 వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు అమలుకు ఐదేళ్లకుగాను రూ.4,913 కోట్లు ఖర్చవుతాయని ఏపీ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే ‘డిజిటల్ ఆంధ్ర కార్పొరేషన్’ పేరుతో పీపీపీ పద్ధతిలో ఓ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన వివిధ అంశాలకు ఈ కార్పొరేషన్ బాధ్యత వహించనుంది. -
ఐటీ.. తోడ్పాటేదీ!
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి. కానీ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఈ రంగం నీరుగారిపోతోంది. పేరుకు ఎస్ఈజెడ్లు మంజూరు చేసి ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటున్నారు. వీటికి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. విద్యుత్ సమస్యల కారణంగా ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్నాం. భూములిచ్చిన కంపెనీలకు వాటిపై బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నాయి. ఇంకేం ఉద్యోగాలొస్తాయి. మా కంపెనీలో విదేశీ నిపుణులను తీసుకువద్దామనుకుంటే విశాఖలో అత్యున్నతస్థాయి విద్యా వ్యవస్థలు లేవు. దీని వల్ల నిపుణులు విశాఖకు రావడానికి ఇష్టపడడం లేదు. మహిళా ఉద్యోగులకు రా త్రి వేళల్లో భద్రత లేకపోవడంతో ఉద్యోగా లు మానేస్తున్నారు’ అని పలు కంపెనీల యజమానులు గళమెత్తారు. మంగళవారం విశాఖ నగరంలో సీఐఐ ఆధ్వర్యంలో ఐటీశాఖ ఉన్నతాధికారులు, కంపెనీ యాజ మాన్యాల ముఖాముఖీ జరిగింది. ఇందు లో పలువురు ఐటీ యజమానులు సమస్యలపై ఎలుగెత్తారు. భద్రతలేక మహిళా ఉద్యోగుల రాజీనామా రుషికొండ హిల్ నంబర్-2లో ఐటీ కంపెనీలకు కనీస భద్రత లేదు. ఇక్కడ వీధి దీపాలు లేవు. మహిళా ఉద్యోగులు రాత్రి వేళ విధులకు రావడానికి భయపడుతున్నారు. చాలా మంది ఉద్యోగం మానేస్తున్నారు. పోలీసు భద్రత ఎక్కడా కనిపించడంలేదు. ఇలా అయితే కంపెనీలు ఎలా నడపాలి?. మరోవైపు కంపెనీకి బ్రాడ్‌బ్యాండ్ సమస్య తీవ్రంగా ఉంది. ఏ నెట్వర్క్ కూడా పనిచేయడంలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. -సతీష్ కనుమూరి, సీఈవో, న్యూనెట్ విదేశీ నిపుణులు విశాఖకు రావడం లేదు ఐటీ కంపెనీలను విద్యుత్ సమస్య వేధిస్తోంది. జనరేటర్లతో కంపెనీలను నడపడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా గురించి పట్టించుకోవడం లేదు. ఉన్న కంపెనీలను విస్తరించాలంటే అనుమతుల కోసం తిరగాల్సి వస్తోంది. మా కంపెనీలో సీనియర్ నిపుణుల అవసరం ఉండడంతో అమెరికాలో పనిచేస్తున్న ఉత్తరాది ఉద్యోగులను విశాఖకు పిలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. వారి పిల్లలకు ఇక్కడ సరైన విద్యా వసతుల్లేక రావడానికి ఇష్టపడడంలేదు. ప్రభుత్వం ఐటీ నిపుణుల పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఇటువంటి సౌకర్యాలు కల్పించాలి. -మాధురి, మిరాకిల్ కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ పరిశ్రమలు పెట్టనివ్వరా! టీవీ చానల్ లేదా హోటల్ పెడతామంటే ఏపీఐఐసీ నరకం చూపిస్తోంది. అధికారుల చుట్టూ తిరిగితే భూమి మంజూరు చేయడం లేదు. డెయిరీ పెడదామనుకున్నా అదే పరిస్థితి. కేవలం లంచం ఇవ్వనందుకే ఇలా ఇబ్బంది పెడుతున్నారు. పరిశ్రమలు పెట్టాలనుకునే వారిని నిరుత్సాహ పర్చకండి. 500 మందికి ఉద్యోగం కల్పించాలనే నా ఆశయాన్ని అంతా కలిసి నీరుగార్చేశారు. -వై.వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్రభుత్వం సహకరించడం లేదు విశాఖలో అనేక ఐటీ కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సమస్య ఎదుర్కొంటున్నాయి. గూగుల్ కంపెనీ తరపున విశాఖలో బ్రాడ్‌బ్యాండ్ సమస్య పరిష్కారానికి మేం చాలా ప్రయత్నించాం. కానీ ప్రభుత్వం నుంచి సరైన మద్దతు దొరకడం లేదు. డీమ్డ్ ఎక్స్‌పోర్ట్స్ స్టేటస్ ఇవ్వాలి. విశాఖలో మాకు సహకరిస్తే ఆ తర్వాత విజయవాడలోనూ ఐటీ రంగానికి మా వంతు సహకారం అందిస్తాం. -శ్రీనివాస్, గూగుల్ కంపెనీ ప్రతినిధి పేరుగొప్ప.. ఊరుదిబ్బ ఐటీ కంపెనీలు సమావేశాలు నిర్వహించుకోవడానికి కనీసం ఇంక్యుబేషన్ సెంటర్ లేదు. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కలగానే మిగిలింది. ఐటీ కంపెనీలకు ఎగ్జిట్ పాలసీ అమలుచేయాలి. 100 ఎకరాలను జో న్గా ఏర్పాటుచేసి చిన్న కంపెనీలకు ఎకరం చొప్పున కార్యాలయాల కు స్థలం మంజూరుచేయాలి. ఐటీ కంపెనీలకు సమీపంలో ఉద్యోగులకు మోడల్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం చేపడితే వారి సమస్యలు తీరుతాయి. -ఓ.నరేష్కుమార్, సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈవో