రిలయన్స్ జియో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఏడాదిలో 34.5 శాతం పెరిగారు. ఇదే సేవలందిస్తున్న ఎయిర్‌టెల్ వినియోగదారలు గతేడాదితో పోలిస్తే 24.2 శాతం పెరిగినట్లు ప్రకటన విడుదల చేశారు.
భారత్‌లో 5జీ ఆధారిత ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) సేవలు వేగంగా పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు కూడా అధికమవుతున్నారు. ఈ విభాగంలో సేవలందిస్తున్న జియో తన ప్రత్యర్థిగా ఉన్న ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్యను అధిగమించింది.
మే 2023-మే 2024 మధ్య జియో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఎయిర్‌టెల్ 24.2%తో పోలిస్తే 34.5% పెరిగారు. మే చివరి నాటికి ఎయిర్‌టెల్ వాడుతున్న 80 లక్షల వినియోగదారులతో పోలిస్తే జియో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య 1.2 కోట్లకు చేరుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం మే చివరి నాటికి భారతదేశ వైర్డు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 4.13 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద!
Comments
Please login to add a commentAdd a comment