ఇంటర్నెట్‌ స్పీడ్‌ సమస్యలకు పరిష్కారం... ఎల్‌ఈవో | Tata Group Subsidary Nelco Jont Hands With Telesat For Satellite Broadband Services In India | Sakshi
Sakshi News home page

శాటిలైట్‌ ఎల్‌ఈవో ఇంటర్నెట్‌ సర్వీస్‌లోకి టాటా గ్రూపు

Published Tue, Aug 10 2021 1:21 PM | Last Updated on Tue, Aug 10 2021 1:29 PM

Tata Group Subsidary Nelco Jont Hands With Telesat For Satellite Broadband Services In India - Sakshi

ఇండియాలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీపై కార్పోరేట్‌ కంపెనీలు కన్నేశాయి. వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ అందించేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో బడా కంపెనీలో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సెక్టార్‌లో అడుగుపెడుతోంది. 

టాటా విత్‌ టెలిశాట్‌
టాటా గ్రూప్‌కి చెందిన నెల్కో సంస్థ కెనాడుకు చెందిన టెలిశాట్‌ కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఈ డీల్‌ కుదిరితే ఈ రెండు సంస్థలు సంయుక్తంగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను ఇండియాలో అందివ్వనున్నాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 2024 నాటికి ఇండియాలో వైర్‌లెస్‌ పద్దతిలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కనెక్టివిటీ సమస్య
జియోరాకతో ఇండియాలో ఇంటర్నెట్‌ వాడకంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అర్బన్‌ ఏరియాలో ఇంటర్నెట్‌ నిత్య జీవితంలో ఒక భాగమైంది. వ్యక్తిగత అవసరాలతో పాటు ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలకు ఆన్‌లైన్‌ అనేది తప్పనిసరిగా మారింది. అయితే  రూరల్‌ ఇండియాలో పరిస్థితి ఇందుకు భిన​ంగా ఉంది. దేశంలో సగానికి పైగా ఏరియాల్లో అసలు ఇంటర్నెట్‌ కనెక‌్షన్లు లేవు. ఉన్నా నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంది. లైట్‌ స్పీడ్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తే నెట్‌ స్పీడ్‌ సమస్యలు తీరే అవకాశం ఉంది. డిజిటటీకరణ మరింత వేగం పుంజుకోనుంది.

ఎల్‌ఈవో
ప్రస్తుతం  నెట్‌ ఫైబర్‌ వైర్‌, స్పెక్ట్రమ్‌, శాటిలైట్‌ల ద్వారా  ఇంటర్నెట్‌ పని చేస్తోంది. మన దేశంలో మొబైల్‌ నెట్‌వర్క్‌లు స్పెక్ట్రమ్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందిస్తుండగా ప్రైవేటు కంపెనీలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో ఫైబర్లు ఆప్టికల్‌ ఫైబర్‌ వైర్‌ ద్వారా నెట్‌ అందిస్తున్నాయి. ఈ రెండు కాకుండా భూమి నుంచి 500ల నుంచి 2,000 కి.మీ ఎత్తులో ఉండే ఉపగ్రహం (లో ఎర్త్‌ ఆర్బిట్‌) ద్వారా లైట్‌ స్పీడ్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందివ్వడం వీలవుతుంది. 1990ల నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కమర్షియల్‌గా ఉపయోగించలేదు. ప్రస్తుతం నెట్‌ వినియోగం పెరిగిపోవడంతో ఈ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. సెల్‌ టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యవస్థ లేని చోట కూడా శాటిలైట్‌ ద్వారా నెట్‌ అందివ్వడం ఈ పద్దతిలో సాధ్యం అవుతుంది. 

వచ్చే ఏడాది
లో ఎర్త్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌ కనెక్టివిటీ కోసం టెలిశాట్‌ సంస్థ ఏకంగా ఎనిమిది బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. ఇండియాకు సంబంధించి ఈ సంస్థ టాటా గ్రూపుకి చెందిన నెల్కోతో కలిసి పని చేయనుంది. టాటా కంటే మేందు ఎయిర్‌టెల్‌ సంస్థ సైతం శాటిలైట్‌ ఇంటర్నెట్‌పై దృష్టి సారించింది. ఈ విభాగంలో వన్‌వెబ్‌ సంస్థతో కలిసి పని చేస్తోంది. మరోవైపు అమెజాన్‌ , టెస్లాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థలు కూడా లైట్‌ స్పీడ్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను వచ్చే ఏడాది నుంచి వైర్‌లెస్‌ నెట్‌ సేవలు ప్రారంభించేందుకు ఈ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement