SpaceX company
-
సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం!
వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడానికి మరింత సమయం పట్టనుందని నాసా ప్రకటించింది.వ్యోమగాముల్ని స్పేస్ నుంచి భూమికి తీసుకువచ్చే బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకలో అనేక సాంకేతికత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా సునీత విలియమ్స్, విల్మోర్లు వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లు 8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్మోర్లు ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి సమస్యలు తలెత్తాయి.NASA again delays return of two astronauts stranded on space station.Veteran astronauts Butch Wilmore and Suni Williams arrived at the ISS in June aboard Boeing's Starliner spacecraft, and were due to spend eight days on the orbiting laboratoryhttps://t.co/1ZIsWApfvX pic.twitter.com/AyFR5ifJdd— AFP News Agency (@AFP) December 18, 2024 స్టార్ లైనర్‌లో సమస్యల్ని పరిష్కరించి భూమి మీదకు తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పేస్‌లో చిక్కుకున్న వీరిద్దరిని భూమి మీదకు తెచ్చేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ స్పేస్‌లోకి పంపింది. క్రూ-9 మిషన్ విజయవంతంగా ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. ఇదే క్రూ-9 మిషన్‌లో సునీత విలియమ్స్, విల్మోర్లు వచ్చే ఏడాదిలో రానున్నట్లు నాసా వెల్లడించింది. -
శుభాన్షు శుక్లా... ఎంటర్ ద ‘డ్రాగన్’
ప్రతిష్టాత్మక ఆక్సియం స్పేస్ ఏఎక్స్–4 మిషన్‌కు ఎంపికైన భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా తాము ప్రయాణించబోయే అత్యాధునిక డ్రాగన్ వ్యోమనౌకను తొలిసారి సందర్శించారు. అమెరికాలో హూస్టన్‌లోని స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగతా ముగ్గురు సిబ్బందిని ముఖాముఖి కలుసుకున్నారు. వారంతా కలిసి వ్యోమనౌకలో కాసేపు గడిపారు. స్పేస్సూట్కు కొలతలివ్వడంతో పాటు ప్రెజరైజేషన్ తదితర తప్పనిసరి పరీక్షల్లో వారంతా పాల్గొన్నారు. దీంతో వారందరికీ శిక్షణ ప్రక్రియ లాంఛనంగా మొదలైనట్టయింది. ఈ మిషన్‌కు నాసా వ్యోమగామి పెగీ వాట్సన్ సారథ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 10 రోజుల పాటు పలు ప్రయోగాలు, పరిశోధనల్లో గడుపుతారు. ప్రైవేట్ వ్యక్తులు, పరిశోధకులకు ఐఎస్ఎస్ సందర్శనకు వీలు కలి్పచేందుకు స్పేస్ ఎక్స్ తలపెట్టిన నవతరం వాణిజ్య అంతరిక్ష యాత్రల్లో ఆక్సియం స్పేస్ మిషన్ నాలుగోది. ఆక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్, నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరుగుతోంది. -
ఎలన్ మస్క్ లైంగిక వేధింపులు.. మహిళలను మాత్రమే కాదు..!
-
శత్రు సైన్యాలకు చెక్ పెట్టేలా.. రంగంలోకి దిగిన మస్క్
అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ అమెరికా మిలటరీ విభాగంలో అత్యంత కీలకంగా మారారు. ఇప్పటికే ప్రపంచంలోనే పలు దేశాలకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్న ఆయన తాజాగా అమెరికా సైన్యానికి స్పేస్ ఎక్స్ స్పై శాటిలైట్లను తయారు చేసే పనిలో పడ్డారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ స్పై శాటిలైట్ కార్యకలాపాలు నిర్వహించే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యూఎస్ నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ (ఎన్ఆర్ఓ)తో కలిసి వందలాది స్పై శాటిలైట్లను నిర్మిస్తున్నారు. 2021లో స్పేస్ టెక్ దిగ్గజం , ఎన్ఆర్ఓల మధ్య 1.8 బిలియన్ల భారీ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా స్పేస్ఎక్స్ స్టార్‌షీల్డ్ బిజినెస్ యూనిట్ ఈ స్పై శాటిలైట్లను తయారు చేస్తోంది. స్ప్పై శాటిలైట్ల వల్ల ఉపయోగం అమెరికా ఇంటెలిజెన్స్, ఆర్మీ నిర్వహించే పలు ప్రాజెక్ట్‌లలో స్పేస్ ఎక్స్ తయారు చేస్తున్న స్పై శాటిలైట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్ధి దేశాలు నిర్వహించే అణు పరీక్షలను గుర్తించడం, సైనికుల పహారా, బాంబుల వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయడం, శత్రు సామర్థ్యం గురించి పసిగట్టడంలో ఈ స్పై శాటిలైట్లు పనిచేస్తాయి. ఇలా శత్రు సైన్యాలు ఎత్తుల్ని ముందే పసిగట్టి అమెరికా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందిస్తాయి. మిలటరీ సామ్రాజ్యాన్ని పటిష్ట పరిచేలా మస్క్ నిర్వహిస్తున్న ఈ కీలక ప్రాజెక్ట్ విజయవంతమైతే అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల సైనికుల కదలికల్ని గుర్తిస్తుంది. తద్వారా మిలటరీ సామ్రాజ్యాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలని భావిస్తోంది. -
ISRO: మన బాహుబలికి అంత బలం లేదట!
అంతరిక్ష పరిశోధనల్లో వరుస సక్సెస్‌లతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో(ISRO) ఎదురేలేకుండా దూసుకుపోతోంది. కొత్త ఏడాది ఆరంభం రోజే చేపట్టిన ప్రయోగమూ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు.. మరింత జోష్‌తో తదుపరి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తదుపరి శాటిలైట్ లాంఛ్ కోసం విదేశీ రాకెట్‌ను ఇస్రో ఆశ్రయిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ తరఫున తర్వాతి తరం భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20 (GSAT-20)ని స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించబోతోంది. అయితే దీనిని స్వదేశీ రాకెట్‌తో కాకుండా.. విదేశీ రాకెట్‌తో ప్రయోగించబోతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీలో ఫాల్కన్-9 రాకెట్‌కు భారీ లాంఛర్‌గా పేరున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని లాంఛింగ్ స్టేషన్ నుంచి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఫాల్కన్ రాకెట్‌తో భారత శాటిలైట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఏమందంటే.. గతంలో భారీ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రో కమర్షియల్ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్.. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌స్పేస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకునేది. కానీ, ఇప్పుడు స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు. నిర్ణీత సమయానికి రాకెట్ అందుబాటులో లేనందునే స్పేస్‌ఎక్స్‌ను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. మన బాహుబలి ఉంది కదా! జీశాట్-20 ఉపగ్రహం అత్యంత శక్తివంతమైంది. దీనిని తయారు చేయడానికి ప్రధాన ఉద్దేశం.. మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం. ఇది ఎంత శక్తివంతమైందంటే.. హార్మోనైజ్డ్ టారిఫ్ షెడ్యూల్ (HTS) సామర్థ్యం 48 జీపీబీఎస్. అంతేకాదు.. 32 బీమ్స్ సామర్థ్యంతో అండమాన్ నికోబార్ దీవులు, జమ్ము కశ్మీర్, లక్షదీవులు.. ఇలా పాన్ ఇండియా కవరేజ్ చేయగలిగే సత్తా ఉంది. GSAT-N2గా దీనికి నామకరణం కూడా చేశారు. అయితే ఆ శాటిలైట్ బరువు.. 4,700 కేజీలు. భారత్‌లో ఇస్రో తరఫున ఇప్పటిదాకా ఉన్న లాంఛ్ వెహికిల్ మార్క్ 3(LVM3)నే అత్యధిక బరువు ఉన్న ఉపగ్రహాల్ని మోసుకెళ్తోంది. అందుకే ఇస్రో బాహుబలిగా దానికి పేరు ముద్రపడింది. కానీ, దాని సామర్థ్యం 4 వేల కిలోగ్రాముల దాకానే ఉంది. అందుకే అంతకు మించిన శాటిలైట్ ప్రయోగాల కోసం విదేశీ రాకెట్లపైన ఆధారపడాల్సి వస్తోంది. ఇస్రో ప్రయోగాలకు.. 10 వేల కేజీల రాకెట్లను సైతం మోసుకెళ్లగలిగే తర్వాతి తరం లాంచ్ వెహికిల్స్ (NGLV)రూపకల్పన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో బాహుబలిని మించిన రాకెట్ డిజైన్ రూపకల్పన జరిగిపోయిందట. అయితే.. అది ప్రత్యక్ష రూపంలోకి రావడానికి ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చని సోమనాథ్ అంటున్నారు. -
స్పేస్ఎక్స్లో కనిపించిన 'బుల్లి మస్క్' - ఫిదా అవుతున్న నెటిజన్లు!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటూ చాలామందికి సుపరిచయమయ్యాడు. అయితే ఇటీవల మస్క్ తన కొడుకు 'X AE A-Xii'తో స్పేస్ ఎక్స్ కార్యాలయంలో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్లో తెగ వైరల్ అవుతున్నాయి. 2020 మే 04న జన్మించిన X AE A-Xii ఎలాన్ మస్క్ భార్య గ్రిమ్స్ మొదటి కొడుకు. అయితే ఈ పిల్లవాడితో కలిసి స్పేస్ ఎక్స్ కార్యాలయానికి రావడం బహుశా ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు మస్క్ తల్లి మయే మస్క్, "లేట్ ఆన్ ఎ ఫ్రైడే నైట్ @elonmusk X @SpaceX" అనే క్యాప్షన్‌తో ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. (ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?) Late on a Friday night @elonmusk X @SpaceX ❤️❤️❤️ pic.twitter.com/dhpJqUsflo — Maye Musk (@mayemusk) July 16, 2023 ఈ ఫోటోలు ఇప్పటి వరకు 40 వేల కంటే ఎక్కువ లైకులు పొందాయి. చాలా మంది బిలినీయర్లు పార్టీలు చేసుకుని సరదాగా గడుపుతారు. మస్క్ మాత్రం తన కొడుకుతో ఆఫీసులో గడుపుతున్నాడు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేసాడు. ఈ పిల్లవాడు అసాధ్యాలను సుసాధ్యం చేసే అనుభవాలను తప్పకుండా పొందుతాడు అంటూ మరో వ్యక్తి.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేస్తున్నారు. -
14 ఏళ్లకే వేలకోట్ల కంపెనీలో జాబ్.. ఎవరీ కైరాన్ క్వాజీ?
Youngest Engineer Kairan Quazi: తెలివికి వయసుతో సంబంధం లేదని మళ్ళీ నిరూపించాడు 14 ఏళ్ల 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi). త్వరలోనే ఈ చిన్నారి ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరనున్నారు. ఇప్పటికే ఇతడు స్పేస్ఎక్స్ టెక్నాలజీ ఛాలెంజింగ్ ఇంటర్వ్యూను కూడా క్లియర్ చేసాడు. ఇంత గొప్ప విజయం సాధించిన కైరాన్ క్వాజీ ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన క్వాజీ 11 సంవత్సరాల వయసులోనే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చదవడం ప్రారంభించాడు. గత మే నెలలో శాంటా క్లారా యూనివర్సిటీ (SCU) నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. చిన్నప్పటి నుంచి స్పేస్ఎక్స్లో పనిచేయాలని కోరిక ఉన్న క్వాజీ ఆ వైపుగానే అడుగులు వేసాడు. అనుకున్నది సాధించాడు. జాబ్‌కి సెలెక్ట్ అయిన వెంటనే కైరాన్ క్వాజీ లింక్డ్ఇన్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో నా నెక్స్ట్ స్టాప్ స్పేస్ఎక్స్. నేను త్వరలో ఇంజినీరింగ్ బృందంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరుతాను. కంపెనీ నా వయసుని చూడలేదు.. నా సామర్థ్యం మాత్రమే చూసిందని రాసాడు. సంస్థ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ లెటర్ స్క్రీన్‌షాట్ కూడా ఇందులో యాడ్ చేశారు. (ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబెత్కే గిఫ్ట్ ఇచ్చేంత కుబేరుడితడు.. భారతదేశపు ఫస్ట్ బిలీనియర్!) View this post on Instagram A post shared by Kairan Quazi (@thepythonkairan) క్వాజీ తన ఫ్యామిలీతో కలిసి స్పేస్ఎక్స్లో పనిచేయడం ప్రారంభించేందుకు కాలిఫోర్నియాలోని ప్లెసాంటన్ నుంచి వాషింగ్టన్కు వెళ్లాలని యోచిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా ఉద్యోగ ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నట్లు తెలియజేశాడు. ఈ పోస్ట్ చేసిన కొన్ని వారాల తర్వాత, ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు వెల్లడించారు. (ఇదీ చదవండి: ఈ బాలీవుడ్ కపుల్స్ కొన్న లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Kairan Quazi (@thepythonkairan) నిజానికి క్వాజీ తన తొమ్మిదేళ్ల వయసులో మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటెల్ ల్యాబ్స్‌లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్‌షిప్ పొందాడు. ఆ తరువాత 11 సంవత్సరాల వయసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో రీసర్చ్ ప్రారంభించాడు. 2022 లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా నాలుగు నెలలు పనిచేశాడు. కాగా తన తల్లి వాల్ స్ట్రీట్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. కైరాన్ తండ్రి ముస్తాహిద్ క్వాజీ ఒక ఇంజనీర్ కావడం విశేషం. -
మాట తప్పావ్ ఎలాన్‌మస్క్.. కానీ నువ్వు కార్యసాధకుడివే..
టెస్లా కార్ల కంపెనీ సీఈవో, అంతరిక్షంలోకి కారెట్లు పంపే స్పేస్ ఎక్స్ సంస్థ ఫౌండర్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఎలాన్‌మస్క్‌కి నెటిజన్లు నిలదీస్తున్నారు. పదేళ్ల కిందట చెప్పిన మాటలు నీటి మీద మూటలు అయ్యాయంటున్నారు. మరికొందరు ఇవాల కాకపోతే రేపయినా ఎలాన్ మస్క్ అనుకున్నది సాధిస్తాడంటూ నమ్మకం చూపిస్తున్నారు. స్పేస్ కాలనీలు సరిగ్గా పదేళ్ల కిందట 2011 ఏప్రిల్‌లో వాల్‌స్ట్రీట్ జర్నల్‌కి చెందిన అలెన్ముర్రే అనే జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వూలో ఎలాన్‌మస్క్ మాట్లాడుతూ పరిస్థితులన్నీ చక్కగా అనుకూలిస్తూ రాబోయే పదేల్లలో మార్స్ మీద మానవుల కాలనీలు ఏర్పాటు సాధ్యమే అని చెప్పారు. తమ స్పేస్ ఎక్స్ సంస్థ ఈ పనిలోనే ఉందంటూ వెల్లడించారు. ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా మహా అంటే మరో పదిహేను ఇరవై ఏళ్లకైనా ఇతర గ్రహాలపై మనుషులు నివాసం ఉండటం ఖాయమంటూ ఎలాన్‌మస్క్ ఆత్మవిశ్వాసం కనబరిచారు. pic.twitter.com/AO6WqO2XJI — Wild Geerters (@steinkobbe) May 30, 2022 ఏమైంది బాస్ ఇతర గ్రహాలపై మనుషుల నివాసానికి సంబంధించి ఎలాన్‌మస్క్ చెప్పిన తొలి గడువు ఇటీవల ముగిసింది. దీంతో నెటిజన్లు పాత ఇంటర్వూను ముంగిట వేసుకుని ఎలాన్ మస్క్‌ను నిలదీస్తున్నారు. ఇంకెప్పుడు ఇతర గ్రహాలపైకి మనుషులను తీసుకెళ్తావంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కచ్చితంగా ఎలాన్‌మస్క్ అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చాలానే చేశాడు గత పదేళ్ల కాలంలో ఎలాన్‌మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ గణనీయమైన వృద్ధినే కనబరిచింది. తొలిసారిగా అంతరిక్ష షటిల్ రాకెట్లను తయారు చేయగలగింది. స్పేస్టూరిజం వరకు వెళ్లగలిగింది, నాసా లాంటి పెద్ద సంస్థలకు సాధ్యం కాని ఆవిష్కరణలు స్పేస్ఎక్స్లో జరిగాయి. ఇదే జోరు కనుక కొనసాగితే త్వరలో మస్క్ నేతృత్వంలో మనుషులు ఇతర గ్రహాలపై కాలు మోపడం, అక్కడ కాలనీలు ఏర్పాటు చేయడం పెద్ద కష్టమైన పని కాబోదు. pic.twitter.com/AO6WqO2XJI — Wild Geerters (@steinkobbe) May 30, 2022 చదవండి: మాయదారి ట్విటర్..కరిగిపోతున్న మస్క్ సంపద! -
భారత్‌లో లైసెన్స్ కోసం నిరీక్షణ తప్పదా?
ప్రపంచం మొత్తం తన వ్యాపార రంగాన్ని విస్తరించాలన్న ఎలన్ మస్క్ ప్రయత్నాలను భారత్ ముందుకు పోనివ్వడం లేదు. అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఇదివరకే టెస్లా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. భారత్‌లో మాత్రం దిగుమతి సుంకం దెబ్బకి జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో మరో వ్యాపారానికి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. ఎలన్ మస్క్ సొంత కంపెనీ స్పేస్ ఎక్స్ నుంచి శాటిలైట్ సంబంధిత ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరప్, సౌత్-నార్త్ అమెరికాలోని కొన్ని దేశాలతో పాటు ఓషియానా(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)లలో సేవలు అందుతున్నాయి . ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్ బెస్ట్ కంట్రీగా భావించి.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సేవల కంటే ముందు బుక్సింగ్ సైతం ప్రారంభించించింది కూడా. అయితే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేశారు కూడా. ఇదిలా ఉండగా.. తాజాగా అతిపెద్ద దేశాల్లో టాప్ టెన్‌లో ఉన్న బ్రెజిల్.. స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి బ్రెజిల్ నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఏజెన్సీ (Anatel)తో స్టార్‌లింక్ సంప్రదింపులు జరిపిందే లేదు. అయినప్పటికీ బ్రెజిల్ గవర్నమెంట్ ముందుకొచ్చి.. డీల్ ఓకే చేసుకోవడం గమనార్హం. మరోవైపు భారత్‌లో లైసెన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టిన స్టార్‌లింక్.. కొత్త చీఫ్ కోసం వేట సైతం ప్రారంభించింది. అయితే లైసెన్స్ పరిశీలనలోనూ జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది స్టార్‌లింక్. చదవండి: అయ్యా ఎలన్ మస్క్.. మన దగ్గర బేరాల్లేవమ్మా! -
కష్ట కాలంలో టోంగా దేశానికి అండగా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్..!
కొద్ది రోజుల క్రితం టోంగాకు సమీపంలో ఉన్న సముద్రంలో ఒక భారీ అగ్నిపర్వతం బద్దలవడంతో ఆకాశమంతా ధూళి మేఘాలతో నల్లబారడం, ఆ వెంటనే విరుచుకుపడిన జల ప్రళయం(సునామీ)తో ఈ చిన్న టోంగా దేశం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రకృతి విలయం సృష్టించిన నష్టం అంచనాలకు చిక్కడం లేదు. ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్స్ నెట్వర్క్ తెగిపోవడంతో ఆ దేశంతో ఇతర దేశాలు సంప్రదించడానికి కొంచె కష్టం అవుతుంది. ఈ విపత్తుల వల్ల సముద్రగర్భ కేబుల్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ దేశానికి ఇంటర్నెట్ సేవలు తిరిగి అందించడానికి కనీసం ఒక నెల పాటు సమయం పడుతుందని రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది. ట్విటర్ వేదికగా పోస్టు చేసిన ఈ నివేదికకు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ట్విట్టర్లో స్పందించారు. ఆ దేశ ప్రజలు కోరితే స్టార్ లింకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్దంగా ఉన్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఉత్తరం న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యుడు షేన్ రెటి కూడా టోంగా దేశానికి స్టార్ లింక్ కమ్యూనికేషన్ సేవలను అందించాలని ఎలన్ మస్క్‌కు ట్విటర్ వేదికగా ఒక లేఖ రాశారు. Could people from Tonga let us know if it is important for SpaceX to send over Starlink terminals? — Elon Musk (@elonmusk) January 21, 2022 ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ అనేది ఎటువంటి కేబుల్ అవసరం లేకుండానే ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్ అందిస్తుంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ వేగం కూడా ఇతర వాటితో పోలిస్తే చాలా వేగంగా ఉంటుంది. ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించాలని మస్క్ చూస్తున్నారు. టోంగాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. టోంగాకు పశ్చిమంగా పసిఫిక్ సముద్రంలో తలెత్తిన సునామీ టోంగాను ముంచెత్తింది. పసిఫిక్ అంతటా సునామీ అలలు ఎగసిపడ్డాయి. సునామీ కూడా ఉపశమించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు అగ్ని పర్వతం నుండి విస్ఫోటనాలు కొనసాగుతుండడంతో అక్కడ వాతావరణ పరిస్థితులు, ఆ ప్రభావంతో చుట్టుపక్కల వాతావరణంలో నెలకొనే ప్రభావాల పట్ల పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న టోంగాకు సాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. (చదవండి: సరికొత్త విప్లవం: అమెజాన్ బట్టల దుకాణం) -
మరో ఐదేళ్లకు మార్స్‌పై జెండా ఎగరేద్దాం
స్పేస్ టూరిజం.. ఇప్పుడు ఇది సర్వసాధారణంగా మారిపోయింది. భూమి నుంచి 100 కిలోమీటర్లు దాటితే వచ్చే.. ఖర్మాన్ లైన్‌ను అంతరిక్షంగా ఫీలైపోతున్నారు. ఈ విషయంలో పోటీ స్పేస్‌ఏజెన్సీలకు దీటైన సమాధానమిస్తూ సిసలైన స్పేస్ యాత్రను.. అదీ సాధారణ పౌరులకు రుచి చూపించి శెభాష్ అనిపించుకున్నాడు ఎలన్ మస్క్. ఈ స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు ఆసక్తికర ప్రకటన చేశాడు. రాబోయే ఐదేళ్లలో మనిషి మార్స్ మీదకు చేరడం ఖాయమని, అందుకు తనది హామీ అని, అదీ స్పేస్ఎక్స్ ద్వారానే సాధ్యమవుతుందని ధీమాగా చెప్తున్నాడు. ‘రాబోయే ఐదేళ్లలోనే మార్స్ మీదకు మనిషిని తీసుకెళ్లడం మా బాధ్యత. ఒకవేళ వరెస్ట్ సినారియో ఎదురైతే మాత్రం.. మరో పదేళ్లు పట్టొచ్చు. కానీ, ఆ పదేళ్ల నడుమ మార్స్ యాత్ర జరిగి తీరుతుంది. అందుకు నాదీ హామీ’అని ప్రకటించాడు ఎలన్ మస్క్. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు మస్క్. అయితే డెడ్లైన్లను మిస్ కావడం ఎలన్ మస్క్‌కి కొత్తేం కాదు. గతంలో టెస్లా, స్పేస్ఎక్స్ సహా చాలా ప్రయోగాల విషయంలో ఇదే జరిగింది. కానీ, మార్స్ మీదకు మనిషి ప్రయాణం అనేది ఎలన్ మస్క్ చిన్ననాటి కల. ఆ కలే అతనితో రాకెట్ ఇంజినీరింగ్‌తో పాటు స్పేస్ఎక్స్ ప్రయోగానికి బీజం వేయించింది. మరి అలాంటిదాన్ని తప్పే ప్రసక్తే లేదనుకోవచ్చు మరి. -
రూ. 25 లక్షల కోట్ల సంపద.. రూ.83 వేల కోట్ల ఆదాయపు పన్ను.. ఇంకా మరెన్నో
Elon Musk Achievements In 2021: ఆకాశమే హద్దుగా కొంగొత్త ఆవిష్కరణలు చేస్తూ నిబంధనలకు కట్టబడని వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు ఎలన్‌మస్క్. ఆయన జీవితంలో 2021 ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఎన్నో ప్రత్యేకమైన మైలురాళ్లు ఈ ఏడాదిలోనే ఆయన అధిగమించారు. దక్షిణాఫ్రికా మీదుగా దక్షిణాఫ్రికాలో 1971 జూన్ 28న జన్మించిన ఎలన్‌మస్క్ పెరుగుతున్న క్రమంలో కెనడా మీదుగా అమెరికా వచ్చి అక్కడ పౌరసత్వం పొందారు. అక్కడగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మారుతున్న కాలానికి తగ్గట్టు ముందుగానే ఇంటర్నెట్కి ఎడాప్ట్ అయ్యాడు. ఆ తర్వాత పేపాల్ ద్వారా మంచి ఎంట్రప్యూనర్‌గా గుర్తింపు పొందాడు. అటు నుంచి టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల వరకు ఎలన్‌మస్క్ ప్రయాణం అప్రతిహాతంగా సాగుతోంది. ప్రస్తుతం 50వ పడిలో ఉన్న ఎలన్‌మస్క్ 2021లో అనేక మైలురాళ్లను చేరుకున్నాడు. - టెస్లా మార్కెట్ క్యాపిటల్ ఆకాశమే హద్దుగా పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఎలన్మస్క సంపద కొండంతయి కూర్చుంది. అప్పటి వరకు ప్రపంచ కుబేరిగా నంబర్ వన్ స్థానంలో ఉన్న జెఫ్బేజోస్ని వెనక్కి నెట్టి 300 బిలియన్ డాలర్లతో అత్యంత ఐశ్వర్యవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం ఎలన్‌మస్క్ నెటవర్త్ 335 బిలియన్ డాలర్ల ( ఇండియన్ కరెన్సీలో 25 లక్షల కోట్లు)ని అంచనా. - సంపాదించడడమే కాదు ప్రపంచలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆదాయపు పన్ను చెల్లించిన ఘనత కూడా ఎలన్‌మస్క్‌కే దక్కింది. ఈ ఏడాది ఆయన ఏకంగా 11 బిలియన్ డాలర్లు (రూ. 83 వేలకు పైగా కోట్లు) ఇన్కంట్యాక్స్గా చెల్లించాడు. ఈ భూగోళంపై ఉన్న చాలా దేశాల జీడీపీల కంటే ఇది ఎక్కువ. - ఎలన్‌మస్క్ వరుసగా సాధిస్తున్న విజయాలను, భవిష్యత్తులో అతని ప్రణాళికలు చేరుకునే లక్ష్యాలను అంచనా వేసిన టైం మ్యాగజైన్ ఎలన్‌మస్క్‌ని పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించింది. కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది. - మెగా ఫ్యాక్టరీలకే తెలిసిన పారిశ్రామిక ప్రపంచానికి గిగాఫ్యాక్టరీలు అనే కొత్త కాన్సెప్టును పరిచయం చేసిన ఘనుడు ఎలన్‌మస్క్. భారీ ఎత్తున టెస్లా కార్లు తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎలన్‌మస్క్ నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించాడు. వీటి ద్వారా ఈ ఏడాది టెస్లా కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక కార్ల (దాదాపు 5 లక్షలు)ను ఉత్పత్తి చేయగలిగింది. - ఎలన్‌మస్క్ వ్యవహార శైలిపై ఎన్ని వివాదాలు ఉన్నా అతని ప్రతిభ మీద ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు లేవు. అందువల్లే నాసా సంస్థ తన అంతరిక్ష పరిశోధనల విషయంలో 3 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును ఎలన్‌మస్క్‌కి కట్టబెట్టింది. దీనిపై జెఫ్‌బేజోస్ బ్లూ ఆరిజిన్ కోర్టుకు వెళ్లినా.. చివరకు ఎలన్‌మస్క్ పై చేయి సాధించారు. - తన స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా ఎనిమిది మంది వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి తీసుకెళ్లి రికార్డు సృష్టించాడు. - భవిష్యత్తు టెక్నాలజీగా పేర్కొంటున్న లో ఎర్త్ ఆర్బిట్ (లియో) విభాగంలోనూ ఎలన్‌మస్క్ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఎలన్‌మస్క్‌కి చెందిన స్టార్‌లింక్ సంస్థ 900లకు పైగా కొత్త శాటిలైట్లను ప్రయోగించింది. వీటి ద్వారా టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ విభాగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. చదవండి:పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా? -
సంచలన నిర్ణయం.. టెస్లాకు ఎలన్ మస్క్ గుడ్‌బై?
Elon Musk About Quitting Job Tweet: ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యధిక ధనికుడు. వ్యాపారంతో పాటు తన క్రేజీ చేష్టలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న టెక్ మేధావి. టెస్లా సీఈవోగా, స్పేస్ఎక్స్ అధినేతగా.. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడీయన. అలాంటి వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడా? కొత్త అవతారం ఎత్తబోతున్నాడా? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది ఇప్పుడు. ఎలన్ మస్క్ ఏం చేసినా అదో హాట్ టాపికే!. అలాంటిది తాజాగా ఆయన ట్వీట్ ఒకటి ఆయన అభిమానులను ఓవైపు సరదాగా, మరోవైపు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాను చేస్తున్న పనులన్నింటిని వదిలేసి.. ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవాలనుకుంటున్నట్లు ట్వీటేశాడు. అంతేకాదు దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగాడు కూడా. దీంతో కార్పొరేట్ రంగంలో కలకలం రేగింది. thinking of quitting my jobs & becoming an influencer full-time wdyt — Elon Musk (@elonmusk) December 10, 2021 నమ్మొచ్చా? ఎలన్ మస్క్ నిజంగానే తాను నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? అలాగని జోక్ చేశాడని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మస్క్ చెప్పిందే చేసిన దాఖలాలు ఎక్కువ కాబట్టి. పైగా ట్విటర్ వేదికగా గతంలో ఆయన చెప్పినవెన్నో చేశాడు కూడా. అంతెందుకు ఈమధ్యే టెస్లాలోని తన 10 శాతం వాటాను సైతం అమ్మేద్దామనుకుంటున్నానని ఫాలోవర్స్ అభిప్రాయం కోరినప్పుడు.. అంతా నవ్వుకున్నారు. కానీ, టెస్లా బోర్డు సభ్యులతో సహా అందరికీ షాకిస్తూ.. వాటాను అమ్మేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే 12 బిలియన్ డాలర్ల షేర్లను అమ్మేశాడు కూడా. ఈ తరుణంలో మస్క్ తాజా ట్వీట్ కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. మస్క్ నిర్ణయం ఎలాంటిదైనా.. ఈ ట్వీట్ ప్రభావం స్టాక్ మార్కెట్‌పైనా పడే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెస్లా సీఈవోగానే కాకుండా సొంత రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కూ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు యాభై ఏళ్ల ఎలన్ మస్క్. టెస్లా నుంచి పైసా కూడా జీతంగా తీసుకోకుండా.. తన వాటా ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇక స్పేస్ఎక్స్ ఒప్పందాలు-షేర్లతోనూ బిలియన్లు సంపాదిస్తున్నాడు. వీటితో పాటు ది బోరింగ్ కంపెనీ అనే మౌలిక వసతుల కంపెనీ, బ్రెయిన్ చిప్ స్టార్టప్ ‘న్యూరాలింక్’లకు వ్యవస్థాపకుడి హోదాలో పని చేస్తున్నాడు. కొసమెరుపు.. ఈ ఏడాది జనవరిలో ఓ సదస్సులో ఎలన్ మస్క్ మాట్లాడుతూ.. టెస్లా సీఈవోగా తానే మరికొన్నేళ్లపాటు కొనసాగుతానని చెప్పడం. ఇక ఇన్ఫ్లుయెన్సర్గా మారతాను అని మస్క్ స్టేట్మెంట్కి ఎలాంటి కామెంట్లు వస్తున్నాయో మీరే చూడండి. I’ll be your first subscriber if you make an onlyfans — Albi (SideArms) (@Albi_SideArms) December 10, 2021 I’ll coach u on how to get YouTube views! — MrBeast (@MrBeast) December 10, 2021 if you had a dollar for every shitpost you’d be a… oh wait, nvm — Sami سامي (@samifouad) December 10, 2021 చదవండి: భారత్‌లో ఎలన్ మస్క్ డామినేషన్! -
ఆ దమ్ము ఒక్క ఎలన్‌మస్క్‌కే ఉంది, కానీ..
అపర కుబేరుడు ఎలన్ మస్క్‌కి ఫ్యాన్ పాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ధనవంతుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్న తర్వాత ఆయన మీద ఫోకస్ విపరీతంగా పెరుగుతోంది. అంతెందుకు భారత్ నుంచి ఆనంద్ మహీంద్రా, హార్ష్ గోయెంకా లాంటి బిజినెస్ టైకూన్లు సైతం మస్క్ సక్సెస్‌ను సమీక్షిస్తుండడం విశేషం. తాజాగా ఆయన ఖాతాలో మరో ‘ఊహించని’ పొగడ్త పడింది. అమెరికా బ్యాకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లే, ఎలన్ మస్క్ సంపాదన మీద తాజాగా ఓ ఆసక్తికర కథనం విడుదల చేసింది. టెస్లాతో కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మస్క్.. ఈవీ కంపెనీ టెస్లా కంటే సొంత సంస్థ స్పేస్ఎక్స్తోనే ఖ్యాతిని, సంపదను మరింత పెంచుకునే ఆస్కారం ఉందని మోర్గాన్ స్టాన్లేకు చెందిన ఓ అనలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. "SpaceX Escape Velocity ... Who Can Catch Them?" పేరుతో మంగళవారం మోర్గాన్ స్టాన్లేకు చెందిన ఆడమ్ జోన్స్ ఒక కథనం రాశారు. బ్లూమరాంగ్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ మొత్తం 241.4 బిలియన్ డాలర్ల సంపాదనలో స్పేస్ ఏజెన్సీ స్పేస్ఎక్స్ 17 శాతం వాటా కలిగి ఉంది. ఒకవేళ మస్క్ గనుక స్పేస్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మీద ఫుల్ ఫోకస్ పెడితే మాత్రం కేవలం స్పేస్ఎక్స్ ద్వారానే 200 బిలియన్ డాలర్లు సంపాదించవచ్చని అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ భూమ్మీద తొలి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్ ఎదిగే అవకాశం ఉందని, దరిదాపుల్లో ఎవరూ నిలిచే అవకాశమే లేదని జోన్స్ ఆ కథనంలో అభిప్రాయపడ్డారు. కొసమెరుపు ఏంటంటే.. ఎలన్ మస్క్‌కు, మోర్గాన్ స్టాన్లేకు మధ్య మంచి సంబంధాలు లేకపోవడం. చదవండి: బాప్రే చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
దేశంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో స్టార్ లింక్ సేవలు
స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలలో ప్రారంభించనున్నట్లు ఒక సంస్థ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. స్టార్ లింక్ ప్రాజెక్టు కింద ఉపగ్రహాల సహాయంతో మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అందించాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. హాథోర్న్, కాలిఫోర్నియా ఆధారిత సంస్థ స్పేస్ఎక్స్ 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించాలని అంచనా వేసింది. రాబోయే భవిష్యత్తులో ఈ సేవలను కల్పించడానికి భారతదేశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం దేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తుందని ఇండియా స్టార్ లింక్ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఒక పోస్టులో తెలిపారు. శాసనసభ్యులు, మంత్రులు, బ్యూరోక్రాట్లతో సమావేశం కానున్నట్లు ఆయన సూచి౦చారు. దేశంలో స్టార్ లింక్ వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌గా సంజయ్ భార్గవను స్పేస్ఎక్స్ నియమించింది. స్టార్ లింకు ప్రాజెక్టు కింద మొదట ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 2018లో స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనాకు పోటీగా భారత్ దూకుడు!) స్టార్ లింక్ ప్రస్తుతం 1,600కు పైగా ఉపగ్రహాలను కలిగి ఉంది. వీటి ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి స్పేస్ ఎక్స్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, పోర్చుగల్, యుకె, యుఎస్ వంటి ఇతర 14 దేశాలలో బీటా టెస్టింగ్ కనెక్టివిటీ ప్రారంభించింది స్పేస్ ఎక్స్. స్టార్ లింక్ డిసెంబర్ 2022 నాటికి భారతదేశంలో 2 లక్షల మందికి చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది అని భార్గవ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే 5,000 టెర్మినల్స్ కోసం ముందస్తుగా ఆర్డర్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ.7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ నేరుగా పోటీపడనుంది. -
ఇన్స్పిరేషన్–4 ప్రయోగం సక్సెస్: అంతరిక్షం ఇక అందరిదీ
కేప్ కెనవెరాల్: మూడు రోజుల పాటు ముచ్చటగా సాగిన ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్ర విజయవంతంగా ముగిసింది. అపర కుబేరుడు జేర్డ్ ఐసాక్‌మ్యాన్ నేతృత్వంలో నలుగురు పర్యాటకులతో 3 రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా భూమికి చేరింది. ఫ్లోరిడా తీరంలోని అట్లాంటిక్ మహా సముద్రంలో శనివారం సాయంత్రం స్పేస్ఎక్స్ క్యాప్సుల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇన్స్పిరేషన్–4 పేరుతో నిపుణులైన వ్యోమగాములెవరూ లేకుండా సాధారణ పౌరులతో కూడిన ఈ యాత్ర విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరిన్ని పర్యాటక రోదసి యాత్రలకు బాటలు వేసినట్టయింది. ఈ యాత్రని స్పాన్సర్ చేసిన ఐసాక్ మ్యాన్ స్పేస్ఎక్స్కు ఎంత చెల్లించారో వెల్లడించలేదు. స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ తమ కంపెనీ రాకెట్ ద్వారా మొదటిసారి పర్యాటకుల్ని పంపిన ఘనతని సాధించారు. స్పేస్ఎక్స్ క్యాప్సుల్ సురక్షితంగా భూమ్మీదకి చేరగానే ‘‘మీ మిషన్‌తో అంతరిక్షం మన అందరిదీ’’అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టయిందని స్పేస్ఎక్స్ మిషన్ కంట్రోల్ నినదించింది. ఈ ప్రయాణంలో వారు తినడానికి కోల్డ్ పిజ్జా, శాండ్విచెస్, పాస్తా, గొర్రె మాంసం తీసుకువెళ్లారు. పారాచ్యూట్ల సాయంతో నీటిపైకి దిగుతున్న క్యాప్సుల్ అంతరిక్షం ఓ అద్భుతం అమెరికాలోని ఫ్లోరిడాలో కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం రాత్రి స్పేస్ఎక్స్కు చెందిన వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 585 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ చక్కర్లు కొట్టింది. ఈ క్యాప్సుల్‌కి అతిపెద్ద బబుల్ ఆకారంలో ఉన్న కిటికీని అమర్చారు. ఈ గాజు కిటికీ ద్వారా అందులో ప్రయాణించిన జేర్డ్ ఐసాక్‌మ్యాన్, కేన్సర్ నుంచి కోలుకున్న హేలి అర్సెనాక్స్, డేటా ఇంజనీర్ క్రిస్ సెంబ్రోస్కీ, జియో సైంటిస్ట్ సియాన్ ఫ్రాక్టర్లు అంతరిక్షాన్ని తనివితీరా చూశారు. అలా అంతరిక్షాన్ని చూడడం ఒక అద్భుతమని ఐసాక్‌మ్యాన్ చెప్పారు. రోదసి యాత్ర ముగించుకొని తిరిగి వచ్చాక వారి ఆరోగ్యం బాగానే ఉందని స్పేస్ ఎక్స్ సీనియర్ డైరెక్టర్ బెంజి రీడ్ తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించనున్న ఎలన్ మస్క్..! క్రూ– 3 లేడీ ఇలా వచ్చి అలా వెళ్తోంది -
అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది
గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో... గంధర్వగోళ తతుల దాటి చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు.. తల్చుకుంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. గత కొన్నేళ్లుగా పోటాపోటీ అంతరిక్ష పరిశోధనలతో అగ్రపథాన దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్4’.. చరిత్ర సృష్టించింది. నలుగురు.. అదీ వ్యోమగాములు కానీ వాళ్లు, ఎలాంటి శిక్షణ లేనివాళ్లతో అంతరిక్ష యానం పూర్తి చేయించి.. సురక్షితంగా భూమికి చేర్చడం ద్వారా అంతరిక్షయానంలో కొత్త అధ్యయం లిఖించింది. క్లిక్: బ్రాన్సన్, బెజోస్‌లది ఉత్తుత్తి ఫీట్.. మస్క్ దమ్మున్నోడు! సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించిన SpaceX Inspiration ప్రయోగం విజవంతంగా పూర్తైంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా బుధవారం రాత్రి 8గం.2ని. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన #Inspiration4 బృందం.. మూడు రోజులపాటు అంతరిక్షంలోనే గడిపింది. తిరిగి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫ్లోరిడా సముద్ర భాగాన ల్యాండ్ అయ్యింది క్రూ. బృందంలోని నలుగురు ఆరోగ్యవంతంగా ఉండగా.. వాళ్లను మరికొన్ని గంటలు అబ్జర్వేషన్లోనే ఉంచనున్నారు. అయితే ఏమాత్రం శిక్షణ లేని ఈ నలుగురిని అంతరిక్షంలోకి పంపి.. తద్వారా స్పేస్ టూరిజానికి కొత్త తోవ చూపించాడు ఎలన్ మస్క్. Liftoff of @Inspiration4X! Go Falcon 9! Go Dragon! pic.twitter.com/NhRXkD4IWg — SpaceX (@SpaceX) September 16, 2021 There's the #Inspiration4 crew getting their first taste of natural air after spending about 71 hours in orbit pic.twitter.com/unJXs5TT1A — Joey Roulette (@joroulette) September 18, 2021 Splashdown! Welcome back to planet Earth, @Inspiration4x! pic.twitter.com/94yLjMBqWt — SpaceX (@SpaceX) September 18, 2021 200 మిలియన్ల డాలర్లు.. స్పేస్ఎక్స్ ఇన్స్పిరేషన్4కి ఎంత ఖర్చు అయ్యిందనేది స్పష్టత లేదు. కానీ, ఈ ప్రయోగ ముఖ్యోద్దేశం.. సెయింట్ జూడ్ ఆస్పత్రి క్యాన్సర్ పరిశోధనల కోసం 200 మిలియన్ డాలర్ల సేకరణ. ఫండ్ రైజింగ్ ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టాలన్నది ఎలన్‌మస్క్, ఆ నలుగురు స్పేస్ టూరిస్టుల ఉద్దేశం. ప్రస్తుతం అది 154 మిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. బిలియనీర్, షిఫ్ట్ పేమెంట్స్ వ్యవస్థాపకుడు జేర్డ్ ఐసాక్‌మాన్ నేతృత్వంలోని క్రిస్ సెంబ్రోస్కి(యూఎస్ ఎయిర్‌ఫోర్స్ వెటరన్), సియాన్ ప్రోక్టర్(జియోసైంటిస్ట్), హాయిలే ఆర్కేనాక్స్(అంతరిక్షంలోకి వెళ్లిన యంగెస్ట్ అమెరికన్)లతో కూడిన టీం 71గంటల అంతరిక్ష యానం పూర్తి చేసుకుంది. వీళ్లంతా స్ఫూర్తిదాయకమైన నేపథ్యం ఉన్నవాళ్లే. అందుకే ఈ ప్రయోగానికి ఇన్స్పిరేషన్ అనే పేరు పెట్టాడు ఎలన్ మస్క్. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా భూమికి చేరుకున్న బృందం.. రెండు సెట్ల పారాషూట్స్తో సురక్షితంగా సముద్ర భాగంలో ల్యాండ్ అయ్యింది. పాటలు వింటూ.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) కంటే దూరంలో (సుమారు 575 కిలోమీటర్ల) వీళ్లు స్పేస్‌షిప్‌లో గడిపారు. అంతరిక్షంలో ఉన్నంతసేపు.. సైంటిఫిక్ చేసింది ఇన్స్పిరేషన్4 టీం. స్పేస్‌లో మనిషి శరీరం ఎలా ఉంటుదనే అంశంపై ఫోకస్ చేస్తూ పరిశోధనలు చేశారు వాళ్లు. మధ్యమధ్యలో సంగీతం వింటూ.. కుపోలా(క్యాప్సూల్స్‌లోని స్పెషల్ విండో) ద్వారా కుటుంబ సభ్యులతో ఛాటింగ్ చేస్తూ సరదాగా గడిపారు. ప్రోక్టర్ ఏకంగా మెటాలిక్ మార్కర్స్‌తో ఆర్ట్ వర్క్ వేయడం విశేషం. ఇక సెంబ్రోస్కి ఏకంగా గిటార్ వాయించారు. వీటిని ఫండ్ రైజ్‌లో భాగంగా వేలం వేయనున్నారు కూడా. The Inspiration4 crew were all smiles as they gave a tour of the Dragon capsule and zoomed with patients from St. Jude. The mission is raising funds for the children’s hospital and cancer research.@LesterHoltNBC shares this story. pic.twitter.com/LoZF3vgDlx — NBC Nightly News with Lester Holt (@NBCNightlyNews) September 18, 2021 స్పేస్ టూరిజంలో కొత్త ఒరవడి సృష్టించిన స్పేస్ఎక్స్.. ఇన్స్పిరేషన్4 ప్రయోగంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తాజాగా మరో ఐదు ప్రైవేట్ మిషన్ల కోసం కాంట్రాక్ట్ చేసుకుంది. వీటితో పాటు నాసాకు సంబంధించిన మిషన్స్ సైతం ఉండగా.. ప్రత్యర్థి బ్లూ ఆరిజిన్‌తో కలిసి పని చేయాల్సి వస్తుండడం విశేషం. చదవండి: జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! -
దెబ్బ మీద దెబ్బ.. సెటైర్లతో ముదురుతున్న వివాదం
ప్రపంచ కుబేరుల మధ్య వ్యాపార వైరం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. నాసా ఒప్పందం ‘మాకంటే మాకే దక్కాలంటూ’ బ్లూ ఆరిజిన్ జెఫ్ జెబోస్- స్పేస్ఎక్స్ ఎలన్మస్క్లు కోర్టుకెక్కి మరీ కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బెజోస్ తీరుపై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ అసహనం వ్యక్తం చేశాడు. స్పేస్ఎక్స్కు చెందిన బ్రాడ్‌బాండ్ కంపెనీ స్టార్‌లింక్ సర్వీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎఫ్ఎఫ్సీ(Federal Communications Commission)ని ఆశ్రయించింది అమెజాన్. ఈ వార్తను వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్(స్పేస్ రిపోర్టింగ్) క్రిస్టియన్ డావెన్‌పోర్ట్ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్‌కు బదులుగా స్పందించిన మస్క్.. బెజోస్పై సెటైర్లు వేశాడు. చదవండి: తాలిబన్లకు ఎలన్ మస్క్ సూటి ప్రశ్న! ‘స్పేస్ ఎక్స్‌కు వ్యతిరేకంగా దావాలు వేయడం బెసోస్ పనిగా పెట్టుకున్నాడేమో. బహుశా.. అందుకే అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి రిటైర్ అయ్యాడేమో’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. విషయం ఏంటంటే.. తాజాగా విలువైన నాసా కాంట్రాక్ట్ స్పేస్ ఎక్స్‌కు వెళ్లింది. Turns out Besos retired in order to pursue a full-time job filing lawsuits against SpaceX … — Elon Musk (@elonmusk) August 27, 2021 దీనిని వ్యతిరేకిస్తూ బ్లూ ఆరిజిన్, స్పేస్‌ఎక్స్‌పై దావా వేసింది. ఆ వెంటనే ఇప్పుడు శాటిలైట్ బ్రాడ్‌బాండ్ స్టార్‌లింక్ మీద పడింది. ఈ నేపథ్యంలోనే తన ఫ్రస్టేషన్‌ను ప్రదర్శిస్తున్నాడు ఎలన్ మస్క్. చదవండి: నాసా కాంట్రాక్ట్.. అదిరిపోయే పాయింట్‌తో మస్క్‌కు షాక్ ఇచ్చిన బ్లూఆరిజిన్ -
ఇంటర్నెట్ స్పీడ్ సమస్యలకు పరిష్కారం... ఎల్ఈవో
ఇండియాలో ఇంటర్నెట్ కనెక్టివిటీపై కార్పోరేట్ కంపెనీలు కన్నేశాయి. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అందించేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో బడా కంపెనీలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సెక్టార్లో అడుగుపెడుతోంది. టాటా విత్ టెలిశాట్ టాటా గ్రూప్‌కి చెందిన నెల్కో సంస్థ కెనాడుకు చెందిన టెలిశాట్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ కుదిరితే ఈ రెండు సంస్థలు సంయుక్తంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ఇండియాలో అందివ్వనున్నాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 2024 నాటికి ఇండియాలో వైర్లెస్ పద్దతిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కనెక్టివిటీ సమస్య జియోరాకతో ఇండియాలో ఇంటర్నెట్ వాడకంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అర్బన్ ఏరియాలో ఇంటర్నెట్ నిత్య జీవితంలో ఒక భాగమైంది. వ్యక్తిగత అవసరాలతో పాటు ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలకు ఆన్లైన్ అనేది తప్పనిసరిగా మారింది. అయితే రూరల్ ఇండియాలో పరిస్థితి ఇందుకు భినంగా ఉంది. దేశంలో సగానికి పైగా ఏరియాల్లో అసలు ఇంటర్నెట్ కనెక్షన్లు లేవు. ఉన్నా నెట్ స్పీడ్ తక్కువగా ఉంది. లైట్ స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే నెట్ స్పీడ్ సమస్యలు తీరే అవకాశం ఉంది. డిజిటటీకరణ మరింత వేగం పుంజుకోనుంది. ఎల్ఈవో ప్రస్తుతం నెట్ ఫైబర్ వైర్, స్పెక్ట్రమ్, శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ పని చేస్తోంది. మన దేశంలో మొబైల్ నెట్‌వర్క్‌లు స్పెక్ట్రమ్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తుండగా ప్రైవేటు కంపెనీలు, బీఎస్ఎన్ఎల్, జియో ఫైబర్లు ఆప్టికల్ ఫైబర్ వైర్ ద్వారా నెట్ అందిస్తున్నాయి. ఈ రెండు కాకుండా భూమి నుంచి 500ల నుంచి 2,000 కి.మీ ఎత్తులో ఉండే ఉపగ్రహం (లో ఎర్త్ ఆర్బిట్) ద్వారా లైట్ స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను అందివ్వడం వీలవుతుంది. 1990ల నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కమర్షియల్‌గా ఉపయోగించలేదు. ప్రస్తుతం నెట్ వినియోగం పెరిగిపోవడంతో ఈ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. సెల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థ లేని చోట కూడా శాటిలైట్ ద్వారా నెట్ అందివ్వడం ఈ పద్దతిలో సాధ్యం అవుతుంది. వచ్చే ఏడాది లో ఎర్త్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్ కనెక్టివిటీ కోసం టెలిశాట్ సంస్థ ఏకంగా ఎనిమిది బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. ఇండియాకు సంబంధించి ఈ సంస్థ టాటా గ్రూపుకి చెందిన నెల్కోతో కలిసి పని చేయనుంది. టాటా కంటే మేందు ఎయిర్టెల్ సంస్థ సైతం శాటిలైట్ ఇంటర్నెట్పై దృష్టి సారించింది. ఈ విభాగంలో వన్‌వెబ్ సంస్థతో కలిసి పని చేస్తోంది. మరోవైపు అమెజాన్ , టెస్లాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థలు కూడా లైట్ స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను వచ్చే ఏడాది నుంచి వైర్లెస్ నెట్ సేవలు ప్రారంభించేందుకు ఈ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. -
నంబర్ వన్ కుబేరుడిగా మళ్లీ ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. దీంతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మళ్లీ రెండోస్థానానికి పరిమితమయ్యారు. మస్క్‌కి చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ తాజాగా సెకోయా క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 850 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. కంపెనీ విలువ 74 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి ఇన్వెస్టర్లు మదుపు చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద నికర విలువ 11 బిలియన్ డాలర్లు ఎగిసి.. 199.9 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఆయన నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. బెజోస్ సంపద 194.2 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా షేర్లు పడిపోవడంతో ఈమధ్యే స్వల్పకాలం పాటు బెజోస్ టాప్ బిలియనీర్‌గా నిల్చారు. -
స్పేస్ ఎక్స్‌లో తొలి తెలుగమ్మాయి
పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో ‘సాక్షి’ సంభాషించింది. ‘మా అమ్మాయి అమెరికాలోనే పుట్టినా భారతీయ సంప్రదాయాన్ని విడిచి పెట్టలేదు. పదహారు సంవత్సరాలు వచ్చేవరకు పూర్తి తెలుగుదనంతోనే పెంచాను. కాలేజీలలో చేరాక వారి దారిని వారు ఎంచుకున్నా కూడా తెలుగుని విడవలేదు’ అంటారు సీత తల్లి శారదాపూర్ణ శొంఠి. తండ్రి శ్రీరామ్ శొంఠిది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదివారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహ వ్యవస్థాపకులు కూడా. 1975లో అమెరికా వలస వెళ్ళారు. తల్లి శారదాపూర్ణ శొంఠి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేశారు. తెలుగులో అన్నమాచార్య నృత్య సంగీత కళాభిజ్ఞత మీద, సంస్కృతంలో లక్షణ గ్రంథాల మీద పరిశోధన చేశారు. విలక్షణంగా చెప్పటం వల్లనే... అమెరికాలోని ప్రఖ్యాత ఆమెహెస్ట్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్‌కి చేరడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇక్కడ చేరాలనుకుంటున్నావు అని సీతను ప్రశ్నించారు. ‘మా అమ్మనాన్నలు నన్ను డాక్టర్ లేదా ఇంజనీర్ చదివించాలనుకుంటున్నారు. నాకు ఏదైనా విభిన్నంగా చేయాలని ఉంది. అందువల్ల డిఫరెంట్ ఫీల్డ్ ఏదో మీరే సజెస్ట్ చేయండి. ఏదైనా కొత్తగా సాధించాలనుకుంటున్నాను’ అని సీత చెప్పిన సమాధానం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఆమెకు ఆ కాలేజీలో ప్రవేశం లభించింది. పొలిటికల్ ఎకనామిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆమె ఆసక్తిని తెలుసుకున్న ప్రొఫెసర్ ‘మిడిల్ ఈస్ట్‌లో రాజకీయాలనూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చెయ్. అధ్యయనం తేలికగా ఉండడానికి అరబిక్ నేర్చుకోమ’ని సలహా ఇచ్చారు. వారి సూచన మేరకు సీత తెలుగు, హిందీ, ఫ్రెంచ్, అరబిక్... మొత్తం పది భాషలు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు, సోదరి, పిల్లలతో సీత తొలి తెలుగమ్మాయి స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఏఐఎస్)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ డిపార్ట్మెంట్లో ఎంపికైన మొట్టమొదటి తెలుగమ్మాయి సీత. ఈజిప్టు, లిబియా, సిరియా, క్రొయేషియా, లెబనాన్, ఆఫ్రికా, ఆప్ఘనిస్థాన్ వంటి దేశాలలోని అమెరికన్ ఎంబసీలలో పని చేశారు సీత. చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్‌గా ఉండటం సీతకు ఇష్టం. ‘ఆ సాహసమే సీతను అత్యున్నత స్థాయికి చేర్చింది’ అంటారు ఆమె తండ్రి. యుద్ధ సమయంలో ఇరాక్‌లోనే.. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో గ్రీన్ జోన్లో అంటే కంటోన్మెంట్ ఏరియాలో సైనికులతో పాటు బంకర్ల దగ్గర పని చేశారు సీత. అమెరికా–ఇరాక్ యుద్ధ సమయంలో యుద్ధంలో మరణించిన 150 మందికి మణికట్టుకి బ్యాండ్ కట్టి, వారి వివరాలను అమెరికాకు తెలియచేశారు సీత. అప్పుడు ఆమెకు 22 సంవత్సరాలు. సీత అన్ని రకాల యుద్ధ విద్యలతోపాటు ఏకే 47 కాల్చడంలో కూడా శిక్షణ పొందారు. లిబియాలో గడాఫీ మరణించిన సమయంలో సీత అక్కడే ఉన్నారు. ‘అప్పటికి మా అమ్మాయికి ఇద్దరు పిల్లలు. బాగా చిన్నవాళ్లు కావటంతో నేను కూడా సీతతో పాటు అన్ని దేశాలు తిరిగాను. ఆమెకు సహాయంగా ఉన్నాను. ఆ సమయంలో అమ్మాయి చూపిన ధైర్యం చూసి నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది’ అన్నారు శారదా శొంఠి. పిల్లలు ఇద్దరు... సీతకు ఇద్దరు పిల్లలు. జయరామ్, ఆనంద. పిల్లల్ని చూసుకుంటూ ఆమె వృత్తిలో పురోగతి సాధిస్తున్నారు. ఆమెకు వంట కూడా బాగా వచ్చు. ఏ పదార్థాన్ని ఎంత, ఎలా తినాలి అనే విషయంలో అమితమైన శ్రద్ధ. పిల్లలకూ తానే వండి పెడతారు. ప్రతి ఆదివారం దేవాలయానికి తీసుకువెడతారు. పిల్లలు తెలుగు బాగా మాట్లాడతారు. స్పేస్ ఎక్స్ లాంచింగ్ స్టేషన్ వద్ద సీత సంగీత, నాట్య ప్రదర్శనలు సీత, సోదరితో కలిసి ఉమా రామారావుగారి వద్ద నాట్యం, నేదునూరి కృష్ణమూర్తిగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. భారతీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, నాట్యం నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. వరల్డ్ రెలిజియన్ కాన్ఫరెన్స్‌లో దలైలామా ముందు వేదమంత్రాలకు అనుగుణంగా నర్తించారు. శొంఠి సిస్టర్స్ పేరుతో భారతదేశంలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. మానస సరోవర్ నీళ్లు – గాంధీకి అభిషేకం సీత ఒకసారి మానస్ సరోవర్‌కి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ బృందంలో ఉన్న 70 సంవత్సరాల పెద్దాయన అక్కడ అకస్మాత్తుగా కన్ను మూశారు. వెంటనే సీత ఆయన భౌతిక కాయాన్ని కిందకు తీసుకువచ్చి, దహనక్రియలు పూర్తిచేసి మళ్లీ మానస్ సరోవర్, కైలాస్గిరి దర్శించుకున్నారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కోసమని ఒక గ్యాలన్ నీళ్లు తీసుకువచ్చారు. చికాగోలో గాంధీ విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఈ నీటితోనే అభిషేకించారు. పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో సంభాషించింది. – సంభాషణ: డాక్టర్ పురాణపండ వైజయంతి -
చంద్రుడిపై వచ్చే ఏడాది కార్ల రేసు..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జాబిల్లిపై కార్ల రేస్ జరగబోతోంది! మన చందమామపై కార్లు రయ్ రయ్‌మని దూసుకెళ్లనున్నాయి. ఇందుకోసం అమెరికా హైస్కూల్ విద్యార్థులు రెండు కార్లను డిజైన్ చేయనున్నారు! మన జాబిల్లిపైకి మనుషులింకా అడుగుపెట్టలేదు కానీ అంతరిక్ష పరిశోధనల కారణంగా బోలెడన్ని వాహనాలైతే వెళ్లాయి. రిమోట్ కంట్రోలర్ల సాయంతో వాటిని భూమి మీద నుంచే నడిపించినట్లే.. 2021 అక్టోబర్‌లో నిర్వహించనున్న కార్ల రేసు కూడా అలాగే జరుగుతుందట. ఈ రేసులో పాల్గొనే కార్ల సైజు మాత్రం చాలా చిన్నది. భూమ్మీద ఒక్కో కారు బరువు 2.5 కిలోలు ఉంటే చంద్రుడి పై వాటిని దించేందుకు ఉపయోగించే వ్యవస్థ బరువు ఇంకో 3 కిలోలు ఉంటుంది. రేసులో పాల్గొనేది రెండు కార్లు కాబట్టి మొత్తం ఐదు కిలోలు, దించే వ్యవస్థ మూడు కిలోలు కలుపుకొంటే మొత్తం 8 కిలోల బరువును జాబిల్లికి చేర్చాలన్నమాట. ఈ చిన్న బరువును అక్కడికి తీసు కెళ్లేందుకు కనీసం రూ.73 కోట్లు ఖర్చు కానుంది. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్–9 రాకెట్ ద్వారా ఇంట్యూటివ్ మెషీన్స్ అనే కంపెనీ తయారు చేసిన నోవా–సీ ల్యాండర్ ద్వారా జాబిల్లిపైకి చేరనుంది. జాబిల్లిపైకి ఓషియన్ ప్రోసె ల్లారమ్ ప్రాంతంలో దిగే నోవా–సీ ముందుగా ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా సర్వే చేసిన తర్వాతే వాటిని దించుతుంది. లైవ్‌లో కారు రేసు.. ఈ కార్ల రేసును లైవ్‌లో ప్రసారం చేయా లని ఈ పోటీని నిర్వహిస్తున్న మూన్‌మార్క్ కంపెనీ భావిస్తోంది. మూన్ మార్క్ మిషన్–1 పేరుతో అమెరికాలో 6 వేర్వేరు హైస్కూల్ విద్యార్థుల బృందాలతో కార్ల డిజైన్ చేయిస్తారు. రిమోట్ కంట్రోల్ ద్వారా సంకేతాలు పంపొచ్చని, ఇంట్యూటివ్ మెషీన్స్ ల్యాండర్‌ను వైఫైతో కనెక్ట్ చేయ డం ద్వారా రేసు నడుస్తుందని కంపెనీ సీటీవో టాడ్ వాలాచ్ ‘న్యూ అట్లాస్’తో చెప్పారు. భూమి నుంచి అక్కడకి సమాచారం కాంతి వేగంతో ప్రయాణించినా సంకేతం వెళ్లేందుకు 1.3 సెకన్ల సమయం పడుతుంది. ట్రాక్ మాటేమిటి? ఇక్కడైతే కార్ల రేసులన్నీ తారురోడ్లపై నడుస్తాయి. మరి జాబిల్లిపైని కారు రేసు? ఇందుకు ఫ్రాంక్ స్టీఫెన్సన్ అనే రేసు కారు డ్రైవర్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, జాబిల్లిపై మట్టి ధర్మాలను పరిగణనలోకి తీసుకుని అక్కడే నిర్మిస్తారని కంపెనీ చెబుతున్నా.. వాస్తవానికి ఇది జాబిల్లి మట్టిపైనే జరుగుతుందని అంచనా. అయితే ఈ రేసు నిర్వహణకు కావాల్సిన భారీ మొత్తాన్ని రేసు వీడియోలను ప్రపంచమంతా పంపిణీ చేయడం ద్వారా ఆర్జిస్తామని మూన్‌మార్క్ చెబుతోంది. కానీ.. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే పలు సందేహాలూ కలుగుతున్నాయి. ఇది అసాధ్యమనే వారూ లేకపోలేదు. స్పేస్ ఎక్స్‌తో పాటు పలు ఇతర కంపెనీలు సహకరిస్తే గానీ ఇది సాధ్యం కాదని కొందరు నిపుణులు పెదవి విరుస్తున్నారు. మూన్‌మార్క్ మాత్రం అన్ని ప్రశ్నలకూ కాలమే సమాధానం చెబుతుందని.. 2021 అక్టోబర్ వరకు వేచి చూడాలని చెబుతోంది. -
చనిపోతానని తెలిసినా అక్కడికి వెళతా..
న్యూయార్క్ : చంద్రమండలానికి పర్యాటకులను పంపే ఏర్పాట్లు చేస్తున్న స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూమి మీద జీవించడం తనకు బోర్ కొట్టిందని, అంగారక గ్రహంపై నివసించాలని కోరుకుంటున్నానన్నారు. అక్కడ తాను జీవించి ఉండే పరిస్థితి లేకున్నా తాను అంగారక యాత్రకు వెళ్లే అవకాశాలు 70 శాతం ఉన్నాయని స్పష్టం చేశారు. అంతరిక్ష యానంలో అద్భుతాలు అనదగిన పలు వినూత్న అంశాలను తాము ఇటీవల కనుగొన్నామని, ఇవి తనను ఉత్కంఠకు లోనుచేస్తున్నాయని మస్క్ హెచ్‌బీఓకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు స్ధానిక మీడియా వెల్లడించింది. తాను అక్కడికి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నానని ఆయన తన ఆసక్తిని వెల్లడించారు. తన ఆకాంక్ష సవాల్‌తో కూడినదేనని ఆయన అంగీకరించారు. భూమి కంటే ఎంతో ఎత్తులో ఉన్న అంగారక గ్రహంపై మరణించే అవకాశాలు అధికమని అన్నారు. అంగారక గ్రహానికి మనిషి చేరుకున్నా అక్కడి సంక్లిష్ట పరిస్ధితులను నెగ్గుకురాలేక మరణిస్తాడని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులున్నా తాను వెళ్లేందుకే మొగ్గుచూపుతానని మస్క్ తెలిపారు. పర్వతాలను అధిరోహించే ఆసక్తి కలిగిన వారెందరో ప్రపంచంలో ఉన్నారని, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతూ పలువురు ప్రాణాలు కోల్పోయినా ఆ సవాల్‌ను ప్రేమించే వారు ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు. భూమి నుంచి చంద్రమండలానికి, అంగారకగ్రహానికి మనుషులను చేరవేసేందుకు మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అత్యాధునిక సౌకర్యాలతో బిగ్ ఫాల్కన్ రాకెట్ పేరుతో స్టార్‌షిప్‌ను రూపొందిస్తోంది. ఈ వాహనంలో జపాన్ ఫ్యాషన్ దిగ్గజం, బిలియనీర్ యుసకు మీజవ చంద్రమండలానికి పయనమయ్యేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. స్టార్‌షిప్ 2023లో ప్రైవేట్ పాసింజర్‌తో చంద్రమండలానికి చేరుకోనుంది. జపాన్‌లోని ప్రముఖ ఆన్లైన్ ష్యాషన్ రిటైలర్ జోజో సీఈవో వ్యవస్ధాపకుడు మిజవ ఈ సాహస యాత్రకు రెడీ అవుతున్నారు. -
ప్రియమైన జాబిల్లి...
జలజలా జారిపడుతన్న జలపాతాన్ని చూస్తే...మనలాంటోళ్లు..‘‘అబ్బా.. ఎంత బాగుందో’’ అనుకుంటాం. అదే జలధార...ఓ కవి కంట పడితే.. ఉర్రూతలూగించే కవిత పుట్టుకొస్తుంది.. చిత్రకారుడి కుంచె కదిలి పాలనురగల్లో సప్తవర్ణాలు విరబూస్తాయి! చిత్రదర్శకుడి కెమెరా కన్ను.... మరిన్ని కోణాలను ఆవిష్కరించేస్తాయి! మరి.. ఈ కళాకారులు అందరూ ఒక్కసారి జాబిల్లి అందాలను చూస్తే... ఎంత కవిత్వం వస్తుంది ? ఎంత భావుకత ఉట్టిపడుతుంది ? జపాన్ కోటీశ్వరుడు యుసాకూ మెజవాతోపాటు వీరందరూ జాబిల్లిని చుట్టేయనున్నారు మరి! అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చంద్రుడిపైకి తొలిసారిగా టూరిస్టును పంపడానికి సన్నాహాలు చేస్తోంది. స్పేస్ ఎక్స్‌కి చెందిన బిగ్ ఫాల్కన్ రాకెట్ (బీఎఫ్ఆర్)లో 2023లో ఈ యాత్ర చేపట్టబోతోంది. జపాన్‌కు చెందిన బిలయనీర్ యుసాకూ మెజావా మొదటి స్పేస్ టూరిస్ట్‌గా రికార్డులకెక్కబోతున్నారు. అయిదు రోజుల పాటు జాబిల్లి అందాల్ని చూస్తూ గడపనున్నారు. చంద్రుడి చుట్టూ చక్కెర్లు కొడుతూ చుక్కలతో కబుర్లు చెబుతూ గొప్ప గొప్ప అనుభూతుల్ని మూటకట్టుకోనున్నారు. కళాకారుల సమేతంగా యూసకూ మెజవా ఆనందానికి ఇప్పుడు జాబిల్లే హద్దు. ఆయన ఈ యాత్రపై అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారుల్ని వెంట తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలు, ఆర్కిటెక్చర్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పాకళాకృతులు వంటి విభాగాల్లో రాణిస్తున్న వారిని తన వెంట తీసుకువెళతారు. స్వయంగా రాక్ డ్రమ్మర్ అయిన మెజవా కళాకారులైతే చంద్రుడిపై అనుభూతుల్ని తిరిగి భూమికి వచ్చాక అందరికీ అందంగా పంచుతారని ఆశపడుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడడం లేదు. కళాకారుల ఖర్చులు కూడా ఆయనే స్వయంగా భరిస్తారు. ఈ యాత్రకు ప్రియమైన జాబిల్లి అంటూ ప్రత్యేకంగా ఒక పేరు కూడా పెట్టేసుకున్నారు. 42 ఏళ్ల వయసున్న యుసాకూ మెజవా జపాన్‌లో అత్యంత సంపన్నుల్లో 18వ ర్యాంకు పొందారు. ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు కూడా ఎక్కిన ఆయన ఆస్తిపాస్తుల విలువ 300 కోట్ల డాలర్ల పై మాటే. మెజవా ఆన్లైన్ ఫ్యాషన్ దిగ్గజం కూడా. స్టార్ట్ టుడే కంపెనీతో జపాన్ ఫ్యాషన్ రంగంలో ఆయన ఒక ఐకాన్‌గా నిలిచారు. మెజవా మొదట్లో టీ షర్ట్లు, సీడీల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టి కోట్లకు పడగలెత్తారు. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్‌లు సేకరణ మొదలు పెట్టారు. ఎక్కడ అరుదైన పెయింటింగ్‌ల వేలం జరిగినా అక్కడ మెజవా ప్రత్యక్షమైపోతారు. లక్షల డాలర్లు పోసి పెయింటింగ్‌లు కొనేస్తున్నారు. అలా అమెరికా కళాకారుడు జీన్ మైకేల్ బాస్క్విట్ వేసిన ఒక పెయింటింగ్‌కు ఆయన ఫిదా అయిపోయారు. ఆ పెయింటింగ్ చూసిన తర్వాతే అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆలోచన కలిగింది. తనతో పాటు కొందరు కళాకారుల్ని కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. బాస్క్వట్ ఏమైనా చంద్రుడ్ని అత్యంత సమీపం నుంచి చూశారా ? లేదంటే అంతరిక్షం నుంచి భూమిని కానీ చూశారా ? అంత అద్భుతంగా పెయింటింగ్ వేయడం ఎలా సాధ్యమైందో అంటూ మెజవా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల శరీరాలు తట్టుకోగలవా ? స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ చంద్రుడిపైకి యుసాకూ మెజవా, ఆయనతోపాటు కొందరు కళాకారులు వెళతారని ప్రకటించిన దగ్గర్నుంచి అసలు వాళ్ల శరీరాలు ఈ ప్రయాణాన్ని తట్టుకోగలవా అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. వ్యోమగాములకైతే జీరో గ్రావిటీలో ఉండే శిక్షణ అదీ కఠోరంగా ఇస్తారు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నవారినే ఎంచుకుంటారు. మరి సామాన్యులు ఈ ప్రయాణాన్ని ఎంతవరకు తట్టుకోగలరు ? దీనిపై ఏరోస్పేస్ మెడిసన్ స్పెషలిస్టు డాక్టర్ పెట్రా ఇల్లిగ్ ఏమో ఏమైనా జరగొచ్చు అంటూ కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. అంతరిక్షంలోకి మొదటి సారి వెళ్లే వ్యక్తిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. భావోద్వేగాలు కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి. ఇక కడుపులో వికారం, వాంతులు దగ్గర్నుంచి గుండెపోటువరకు ఏమైనా రావొచ్చు. అయితే మెజావా కళాకారుల బృందం వెళ్లేది నాలుగైదు రోజులే కాబట్టి పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని పెట్రా చెబుతున్నారు. దీర్ఘకాలం స్పేస్‌లో ఉండాల్సి వస్తే మాత్రం మైక్రోగ్రావిటీలో ఉన్న సమయంలో కండరాల పటుత్వం తగ్గిపోవడం, ఎముకల బలహీనంగా మారిపోవడం వంటివి జరుగుతాయి. టేకాఫ్ నుంచే ఆరోగ్య సమస్యలు వాస్తవానికి ప్రయాణికులకు సమస్యలు రాకెట్ టేకాఫ్ అయిన దగ్గర్నుంచి మొదలవుతాయి. చంద్రుడిపైకివెళ్లే క్రమంలో మన శరారానికి అలవాటైన గురుత్వాకర్షణ శక్తికి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది. దీని వల్ల గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. అంతరిక్ష యాత్ర మొదలు పెట్టడానికి ముందే వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి భూకక్ష్య దాటిపోయాక బరువు తగ్గిపోవడం అన్నది సమస్యగా ఉంటుంది. చంద్రుడిపైకి వెళితే మన శరీరం ఒక్కసారిగా బరువుని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల విరోచనాలు పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఇక అంతరిక్షంలోకి వెళ్లాక కడుపులో వికారం అన్నది సర్వసాధారణం. అది సర్దుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది. చంద్రుడిపైకి ఈ యాత్ర నాలుగైదు రోజులే ఉంటుంది కాబట్టి ఉన్నన్ని రోజులు వాళ్లందరికీ కడుపులో వికారం, వాంతి వచ్చినట్టుగా అనిపించడం అనే సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. ఇక ఖగోళ రేడియో ధార్మికత అన్నది మరో సమస్య. బిగ్ ఫాల్కన్ రాకెట్ చంద్రుడి చుట్టూ చక్కెర్లు కొడుతుంది కాబట్టి ఈ రేడియేషన్ వారిని ఎక్కువగా బాధించే అవకాశాలున్నాయి. అన్నింటికంటే ప్రధానమైనది మానసిక ఒత్తిడి. ఒక్కసారి స్పేస్ షిప్‌లోకి ప్రవేశించాక ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులైనా రావొచ్చు. ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా ఎదురు కావచ్చు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే మానసిక బలం చాలా ముఖ్యం. అయితే ఇందుకోసం వారందరికీ తగిన శిక్షణ ఇస్తామని ఎలన్ మస్క్ చెబుతున్నారు. స్పేస్ టూరిస్టులందరికీ తగినంత శిక్షణ ఇచ్చాకే చంద్రుడిపైకి యాత్ర ప్రారంభిస్తామని ఆయన వివరించారు. జపాన్ ఫ్యాషన్ ఐకాన్ మెజావా.. 42 ఏళ్ల వయసున్న యుసాకు మెజావా జపాన్‌లో అత్యంత సంపన్నుల్లో 18వ ర్యాంకు పొందారు. ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు కూడా ఎక్కిన ఆయన ఆస్తిపాస్తుల విలువ 300 కోట్ల డాలర్ల పై మాటే. మెజావా ఆన్లైన్ ఫ్యాషన్ దిగ్గజం కూడా. స్టార్ట్ టుడే కంపెనీతో జపాన్ ఫ్యాషన్ రంగంలో ఆయన ఒక ఐకాన్‌గా నిలిచారు. మెజావా మొదట్లో టీ షర్ట్లు, సీడీల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టి కోట్లకు పడగలెత్తారు. -
చంద్రమండలంలో తొలి ప్రైవేట్ ప్రయాణీకుడు..
లండన్ : జపాన్ బిలియనీర్, ఆర్ట్ క్యూరేటర్ యుసకు మెజవా బిగ్ ఫాల్కన్ రాకెట్ (బీఎఫ్ఆర్)లో ప్రయాణిస్తూ చంద్రమండలంలో అడుగుపెట్టే తొలి ప్రైవేట్ ప్రయాణీకుడు అని ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష రవాణా సంస్థ స్పేస్ ఎక్స్ మంగళవారం వెల్లడించింది. తమ బీఎఫ్‌ఆర్‌లో ఫ్యాషన్ సృష్టికర్త, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్ట్ క్యురేటర్ మెజవానే చంద్రమండలంలో అడుగిడే తొలి ప్రైవేట్ పాసింజర్ అని స్పేస్ఎక్స్ మంగళవారం ట్వీట్ చేసింది. 2023లో చంద్రమండలంలో తన ప్రయాణానికి తనతో పాటుగా మెజావా ఎనిమిది మంది ఆర్టిస్టులను ఆహ్వానిస్తున్నారు.తోటి ఆర్టిస్టులతో కలిసి చంద్రమండలంలోకి వెళ్లాలనుకుంటున్నానని జపాన్‌లోని అతిపెద్ద ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ వెబ్సైట్ జోజోటౌన్ అధినేత, 42 ఏళ్ల మెజవా యూట్యూబ్ వీడియోను షేర్ చేస్తూ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. వీరి అంతరిక్ష యానం ఆరు రోజుల పాటు చంద్రమండలంలో 125 మైళ్లు సాగుతుంది. ఇప్పటివరకూ కేవలం 24 మంది మానవులే చంద్రమండలాన్ని సందర్శించారు. చివరిసారిగా 1972లో అపోలో మిషన్ చంద్రమండలం యాత్ర చేపట్టింది. కాగా స్పేస్ఎక్స్ అభివృద్ధి చేసిన నెక్ట్స్ జనరేషన్ వాహనం బీఎఫ్ఆర్ అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా చెబుతున్నారు. చంద్రుడు, గ్రహాలు, అంతకుమించిన గ్రహాలకు మానవులను చేరవేసే అద్భుత రాకెట్‌గా స్పేస్ఎక్స్ బీఎఫ్ఆర్ను అభివర్ణిస్తూ ట్వీట్ చేసింది.