Elon Musk Spends Friday Night With Son At SpaceX, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Elon Musk: స్పేస్ఎక్స్‌లో కనిపించిన 'బుల్లి మస్క్' - ఫిదా అవుతున్న నెటిజన్లు!

Published Mon, Jul 17 2023 8:42 AM | Last Updated on Mon, Jul 17 2023 9:18 AM

Twitter Photos of Elon Musk with son at spacex - Sakshi

ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటూ చాలామందికి సుపరిచయమయ్యాడు. అయితే ఇటీవల మస్క్ తన కొడుకు 'X AE A-Xii'తో స్పేస్ ఎక్స్ కార్యాలయంలో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

2020 మే 04న జన్మించిన X AE A-Xii ఎలాన్ మస్క్ భార్య గ్రిమ్స్‌ మొదటి కొడుకు. అయితే ఈ పిల్లవాడితో కలిసి స్పేస్ ఎక్స్ కార్యాలయానికి రావడం బహుశా ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు మస్క్ తల్లి మయే మస్క్, "లేట్ ఆన్ ఎ ఫ్రైడే నైట్ @elonmusk X @SpaceX" అనే క్యాప్షన్‌తో ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.

(ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?)

ఈ ఫోటోలు ఇప్పటి వరకు 40 వేల కంటే ఎక్కువ లైకులు పొందాయి. చాలా మంది బిలినీయర్లు పార్టీలు చేసుకుని సరదాగా గడుపుతారు. మస్క్ మాత్రం తన కొడుకుతో ఆఫీసులో గడుపుతున్నాడు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేసాడు. ఈ పిల్లవాడు అసాధ్యాలను సుసాధ్యం చేసే అనుభవాలను తప్పకుండా పొందుతాడు అంటూ మరో వ్యక్తి.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement