లండన్ : జపాన్ బిలియనీర్, ఆర్ట్ క్యూరేటర్ యుసకు మెజవా బిగ్ ఫాల్కన్ రాకెట్ (బీఎఫ్‌ఆర్)లో ప్రయాణిస్తూ చంద్రమండలంలో అడుగుపెట్టే తొలి ప్రైవేట్ ప్రయాణీకుడు అని ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష రవాణా సంస్థ స్పేస్ ఎక్స్ మంగళవారం వెల్లడించింది. తమ బీఎఫ్‌ఆర్‌లో ఫ్యాషన్ సృష్టికర్త, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్ట్ క్యురేటర్ మెజవానే చంద్రమండలంలో అడుగిడే తొలి ప్రైవేట్ పాసింజర్ అని స్పేస్‌ఎక్స్ మంగళవారం ట్వీట్ చేసింది. 2023లో చంద్రమండలంలో తన ప్రయాణానికి తనతో పాటుగా మెజావా ఎనిమిది మంది ఆర్టిస్టులను ఆహ్వానిస్తున్నారు.తోటి ఆర్టిస్టులతో కలిసి చంద్రమండలంలోకి వెళ్లాలనుకుంటున్నానని జపాన్‌లోని అతిపెద్ద ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైల్ వెబ్‌సైట్ జోజోటౌన్ అధినేత, 42 ఏళ్ల మెజవా యూట్యూబ్ వీడియోను షేర్ చేస్తూ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
వీరి అంతరిక్ష యానం ఆరు రోజుల పాటు చంద్రమండలంలో 125 మైళ్లు సాగుతుంది. ఇప్పటివరకూ కేవలం 24 మంది మానవులే చంద్రమండలాన్ని సందర్శించారు. చివరిసారిగా 1972లో అపోలో మిషన్ చంద్రమండలం యాత్ర చేపట్టింది. కాగా స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన నెక్ట్స్ జనరేషన్ వాహనం బీఎఫ్‌ఆర్ అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా చెబుతున్నారు. చంద్రుడు, గ్రహాలు, అంతకుమించిన గ్రహాలకు మానవులను చేరవేసే అద్భుత రాకెట్‌గా స్పేస్‌ఎక్స్ బీఎఫ్‌ఆర్‌ను అభివర్ణిస్తూ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment