Elon Musk Retired To Pursue Full Time Job On filing Says Jeff Bezos- Sakshi
Sakshi News home page

Elon Musk: ‘బెజోస్‌ దావాలు వేయడానికే తప్పుకున్నాడేమో! హహహా..’

Published Sat, Aug 28 2021 11:28 AM | Last Updated on Sat, Aug 28 2021 12:42 PM

Elon Musk Satires On Jeff Bezos Over Serial Sues - Sakshi

ప్రపంచ కుబేరుల మధ్య వ్యాపార వైరం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. నాసా ఒప్పందం ‘మాకంటే మాకే దక్కాలంటూ’ బ్లూ ఆరిజిన్‌ జెఫ్‌ జెబోస్‌- స్పేస్‌ఎక్స్‌ ఎలన్‌మస్క్‌లు కోర్టుకెక్కి మరీ కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బెజోస్‌ తీరుపై టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ అసహనం వ్యక్తం చేశాడు. 

స్పేస్‌ఎక్స్‌కు చెందిన బ్రాడ్‌బాండ్‌ కంపెనీ స్టార్‌లింక్‌ సర్వీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎఫ్‌ఎఫ్‌సీ(Federal Communications Commission)ని ఆశ్రయించింది అమెజాన్‌. ఈ వార్తను వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్టర్‌(స్పేస్‌ రిపోర్టింగ్‌) క్రిస్టియన్‌ డావెన్‌పోర్ట్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ ట్వీట్‌కు బదులుగా స్పందించిన మస్క్‌.. బెజోస్‌పై సెటైర్లు వేశాడు.  చదవండి: తాలిబన్లకు ఎలన్‌ మస్క్‌ సూటి ప్రశ్న!

‘స్పేస్‌ ఎక్స్‌కు వ్యతిరేకంగా దావాలు వేయడం బెసోస్‌ పనిగా పెట్టుకున్నాడేమో. బహుశా.. అందుకే అమెజాన్‌ సీఈవో బాధ్యతల నుంచి రిటైర్‌ అయ్యాడేమో’ అంటూ వెటకారంగా ట్వీట్‌ చేశాడు. విషయం ఏంటంటే..  తాజాగా విలువైన నాసా కాంట్రాక్ట్‌ స్పేస్‌ ఎక్స్‌కు వెళ్లింది.

దీనిని వ్యతిరేకిస్తూ బ్లూ ఆరిజిన్‌, స్పేస్‌ఎక్స్‌పై దావా వేసింది. ఆ వెంటనే ఇప్పుడు శాటిలైట్‌ బ్రాడ్‌బాండ్‌ స్టార్‌లింక్‌ మీద పడింది. ఈ నేపథ్యంలోనే తన ఫ్రస్టేషన్‌ను ప్రదర్శిస్తున్నాడు ఎలన్‌ మస్క్‌.

చదవండి: నాసా కాంట్రాక్ట్‌.. అదిరిపోయే పాయింట్‌తో మస్క్‌కు షాక్‌ ఇచ్చిన బ్లూఆరిజిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement