blue origin
-
రోదసీలోకి తెలుగు తేజం (ఫొటోలు)
-
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
స్పేస్ టూరిజంలో అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ మరో అడుగు ముందుకు వేసింది. బ్లూ ఆరిజన్ సంస్థ టెక్సాస్ కేంద్రంగా అంతరిక్షం అంచు వరకు వెళ్లే మానవ రాకెట్ ప్రయోగాన్ని ప్రారంభించింది. బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ మిషన్ ఎన్ఎస్-25 మిషన్‌ను పశ్చిమ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ నుండి మే 19న ఉదయం 8.30 (భారత్ కాలమాన ప్రకారం..సాయంత్రం 7.30) గంటలకు రాకెట్ బయలుదేరుతుంది. ఈ ఎన్ఎస్ -25 మెషిన్లో భారత్‌కు చెందిన గోపి తోటకూర సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు.కాగా, గోపి తోటకూరతో పాటు వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్మెన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్మెన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్.. ఈ స్పేస్ యాత్రకు వెళ్లారు. -
చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు జాక్ పాట్!
యాబై ఏళ్ల తర్వాత చంద్రుడి మీదకు మనుషులను పంపించే అర్టెమిస్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ భారీ నాసా కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో బెజోస్ ఏరో స్పెస్ కంపెనీ బ్లూ ఆరిజన్ని స్థాపించిన విషయం తెలిసింది. తాజాగా నాసా ‘ఆర్టెమిస్ వి’ ప్రాజెక్ట్‌లో భాగంగా బ్లూ ఆరిజన్ సంస్థ ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుని మీదికి (మూన్ సర్ఫేస్) పంపే స్పేస్‌క్రాఫ్ట్‌ల తయారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇదే విషయాన్ని నాసా చీఫ్ అధికారికంగా ప్రకటించారు. నాసా నిర్ణయంతో రెండో ప్రాజెక్ట్‌పై బ్లూ ఆరిజన్ పనిచేయనుంది. ఇప్పటికే అర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఆస్ట్రోనాట్స్ లూనార్ సర్ఫేస్‌లోకి అడుగు పెట్టేలా స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్‌లను తయారు చేసింది. 2021లో అదే స్టార్‌షిప్ స్పేస్ క్రాప్ట్ సాయంతో లూనార్ సర్ఫేస్‌లోకి ఆస్ట్రోనాట్స్ విజయ వంతంగా కాలు మోపారు. దాదాపూ పదేళ్ల తర్వాత చేపట్టిన ప్రాజెక్ట్ విజయవంతంమైంది. దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 24,850 కోట్లు. బ్లూ ఆరిజన్ ప్రాజెక్ట్ విలువ రూ.28,150 కోట్లు ఇక తాజాగా జెఫ్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజన్ నాసా నుంచి దక్కించుకున్న కాంట్రాక్ట్ విలువ అక్షరాల 3.4 బిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ.28,150 కోట్లని నాసా ఎక్స్‌ప్లోరేషన్ చీఫ్ జిఫ్ ఫ్రీ తెలిపారు. సంతోషంగా ఉంది. నాసా ప్రాజెక్ట్ దక్కించుకోవడంపై బెజోస్ ట్వీట్ చేశారు. ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడి మీదకు అడుగు పెట్టే నాసా ప్రయత్నాల్లో తాను ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. Honored to be on this journey with @NASA to land astronauts on the Moon — this time to stay. Together, we’ll be solving the boil-off problem and making LOX-LH2 a storable propellant combination, pushing forward the state of the art for all deep space missions. #Artemis… pic.twitter.com/Y0zDhnp1qX — Jeff Bezos (@JeffBezos) May 19, 2023 2029లో ప్రారంభం కానున్న ప్రయోగం నాసా కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకున్న బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజన్ 50 అడుగుల పొడవైన ‘బ్లూమూన్’ అనే స్పేస్ క్ట్రాఫ్ట్ను తయారు చేయనుంది. తయారీ అనంతరం ఈ స్పేస్ క్రాప్ట్‌లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ప్రయాణించి మూన్ సర్ఫేస్‌లో అడుగు పెట్టనున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! -
బ్లూ ఆరిజిన్ యాత్ర సక్సెస్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్షయాన సంస్థ బ్లూ ఆరిజిన్ తన ఐదో పర్యాటక యాత్రను విజయ వంతంగా ముగించింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8గంటల 26నిమిషాలకు వెస్ట్ టెక్సాస్‌లోని ప్రయోగకేంద్రం ఇందుకు వేదికైంది. న్యూ షెపర్డ్(ఎన్ఎస్–21) రాకెట్ ఒక మెక్సికన్ మహిళసహా ఆరుగురు ప్రయాణికులను 106 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష పర్యటనకు తీసుకెళ్లి సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. మెక్సికో మూలాలున్న ఒక మహిళ(కట్యా ఇచాజెరెట్టా) ఇలా అంతరిక్ష పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతరిక్షంలోకి వెళ్లి అత్యంత పిన్న వయస్కురాలైన అమెరికన్‌గా నూ కట్యా (26) చరిత్ర సృష్టించింది. యాత్ర మొత్తం 10 నిమిషాల్లో పూర్తయింది. -
అంతరిక్ష యుద్ధం.. జెఫ్ బేజోస్‌కి మరోసారి ఝలక్ ఇచ్చిన ఎలన్‌మస్క్!
Jeff Bezos Vs Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి రెండో స్థానాల్లో ఉన్న టెస్లా ఎలన్‌మస్క్, అమెజాన్ జెఫ్బేజోస్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. భూమిపై వ్యాపారం విషయంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. తాజాగా అంతరిక్ష ప్రాజెక్టులకు సంబందించిన పనులు దక్కించుకునే విషయంలోనూ వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా వీరిద్దరికి చెందిన స్పేస్ఎక్స్, బ్లూఆరిజిన్ సంస్థల మధ్య వివాదం చెలరేగగా.. చివరకు ఎలన్‌మస్క్ పైచేయి సాధించారు. నాసా ప్రాజెక్ట్ నార్త్ అమెరికా స్పేస్ ఏజెన్సీ (నాసా) చంద్రుడిపై వ్యోమగాము (అస్ట్రోనాట్స్)లను పంపే విషయంలో రెగ్యులర్‌గా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా అస్ట్రోనాట్స్ని మరోసారి చంద్రుడి మీదకు పంపాలని నిర్ణయించింది. అందులో భాగంగా అస్ట్రోనాట్స్ క్షేమంగా చంద్రుడు, భూమిపై దిగేందుకు వీలుగా లూనార్ ల్యాండర్ ప్రాజెక్టును చేపట్టింది. స్పేస్ ఎక్స్‌కి పనులు ఆర్టెమిస్ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్షిప్లో సాగుతోంది. ఇందులో లూనార్ ల్యాండర్‌ను తయారు చేయాల్సిన బాధ్యతలను ఎలన్‌మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ సంస్థకి నాసా అప్పగించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2.9 బిలియిన్ డాలర్లుగా ఉంది. బ్లూ ఆరిజిన్ అభ్యంతరం టెక్నాలజీ పరంగా అనేక లోపాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్పేస్ఎక్స్ సంస్థకి లూనార్‌ల్యాండర్ పనులు కట్టబెట్టారంటూ జెఫ్‌బేజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా మనుషులను ల్యాండింగ్ సంబంధించి ఈ ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ కాంట్రాక్టు రద్దు చేయాలని కోరింది. Not the decision we wanted, but we respect the court’s judgment, and wish full success for NASA and SpaceX on the contract. pic.twitter.com/BeXc4A8YaW — Jeff Bezos (@JeffBezos) November 4, 2021 ఫెడరల్ కోర్టులో మరోవైపు జెఫ్‌బేజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్ చెబుతున్న అభ్యంతరాలపై త్వరగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని, ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం అవుతుందంటూ నాసా సైతం న్యాయస్థానాన్ని కోరింది. ఇరువైపులా వాదనలు విన్న ఫెడరల్ కోర్టు చివరకు బ్లూఆరిజిన్ లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టి పడేసింది. ఈ ప్రాజెక్టులో ముందుకు వెళ్లవచ్చంటూ నాసాకు అనుమతులు జారీ చేసింది. pic.twitter.com/deqktTvS3U — Elon Musk (@elonmusk) November 4, 2021 ట్వీట్‌వార్ ఫెడరల్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ జెఫ్‌బేజోస్ ట్వీట్ చేశారు. ఈ తరహా తీర్పును తాము ఊహించలేదని, ఐనప్పటికీ న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామన్నారు. మరోవైపు ఎలన్‌మస్క్ కూడా ట్విట్టర్ వేదికగా ఓ మీమ్‌తో స్పందించారు. చదవండి: రూటు మార్చిన ఎలన్ మస్క్.. ఇండియా మార్కెట్ కోసం సరికొత్త వ్యూహం -
మరో మహత్తర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..!
జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ అంతరిక్ష రంగంలో సంచలన విజయాలను సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూఆరిజిన్ రెండు అంతరిక్షయాత్రలను విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా మరో మహత్తర ప్రయోగాన్ని లాంచ్ చేసేందుకు జెఫ్ బెజోస్ సంస్థ బ్లూఆరిజిన్ సంస్థ సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ స్టేషన్‌ను నిర్మించాలని బ్లూ ఆరిజిన్ భావిస్తోంది. బ్లూ ఆరిజిన్ ‘ ఆర్బిటల్ రీఫ్’ అనే స్పేస్ స్టేషన్‌ను వచ్చే పదేళ్లలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: చరిత్ర తిరగ రాసిన టెస్లా కంపెనీ 2025- 2030 మధ్య కాలంలో ఆర్మిటల్ రీఫ్ స్పేస్ స్టేషన్‌ను బ్లూ ఆరిజిన్ నిర్మించనుంది. ఈ స్పేస్ స్టేషన్లో సుమారు 10 మంది ఉండేట్లుగా నిర్మాణం చేపట్టనున్నారు. ఆర్బిటల్ రీఫ్‌ను బ్లూఆరిజిన్ సంస్ధ పలు సంస్థల భాగస్వామ్యంతో నిర్మించనుంది. ఇందులో సియెర్రా స్పేస్ జాయింట్ వెంచర్, బోయింగ్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ సహయంతో ఈ స్పేస్ స్టేషన్‌ను నిర్మించనునున్నారు. అంతరిక్ష పర్యాటకులకు అతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని ఆర్బిటల్ రీఫ్ కలిగి ఉంది. ఆర్బిటల్ రీఫ్‌ను నిర్మాణం కోసం కంపెనీ తన న్యూ గ్లెన్ రాకెట్‌ను ఉపయోగించాలని యోచిస్తోంది. స్పేస్ స్టేషన్ యుటిలిటీ సిస్టమ్‌లు, కోర్ మాడ్యూల్లను కూడా అందిస్తుంది. అంతరిక్ష పర్యాటకంపై కన్ను..! అంతరిక్ష పర్యాటకం రంగంపై జెఫ్‌బెజోస్ కన్నేశాడు. ఏకంగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్‌ను నిర్మించడంతో ఎక్కువ మేర అంతరిక్ష ప్రయాణాలను చేపట్టే అవకాశం ఉంటుందని జెఫ్ బెజోస్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: Elon Musk: అది ప్రజల క్రిప్టోకరెన్సీ ..! అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా..! -
మాటల్లో వర్ణించలేని అనుభూతి: లెజెండరీ నటుడు
అప్పుడు రీల్ లైఫ్‌లో.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది!. అందుకే ఆ పెద్దాయన భావోద్వేగానికి గురయ్యారు. 11 నిమిషాల అంతరిక్షయానాన్ని తన జీవితంలో కలకాలం గుర్తుండిపోయే అనుభవమని వ్యాఖ్యానించారు. కెనడియన్ నటుడు విలియమ్ షాట్నర్ సహా నలుగురు బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షయానం విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. తద్వారా తొంభై ఏళ్ల వయసులో అంతరిక్ష యానం చేసిన అత్యంత వయస్కుడిగా కొత్త చరిత్ర సృష్టించాడాయన. జెఫ్ బెజోస్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్‌ఏజెన్సీ సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయాణ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. నటుడు విలియమ్ షాట్నర్తో పాటు బ్లూ ఆరిజిన్ ఎగ్జిక్యూటివ్ ఆడ్రే పవర్స్, ప్లాంట్ లాబ్స్ కో ఫౌండర్ క్రిస్ బోషుజెన్, మెడిడేటా సొల్యూషన్కు చెందిన గ్లోన్ డె వ్రైస్ 11 నిమిషాల అంతరిక్ష యానంలో పాల్గొన్నారు. ‘‘ఇదొక అద్భుతమైన అనుభూతి. మాటల్లో వర్ణించలేను. అంతరిక్షం నుంచి చూస్తే మన గ్రహం ఎంతో అందంగా కనిపించింది. అదేటైంలో ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది” ఎమోషనల్ అయ్యారు షాట్నర్. పశ్చిమ టెక్సాస్ నుంచి అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9.49నిమిషాల సమయంలో బ్లూ ఆరిజిన్ సబ్‌ఆర్బిటల్ రాకెట్(ఎన్ఎస్-18) నింగిలోకి ఎగిసింది. దాదాపు 66 మైళ్ల ఎత్తులో అంతరిక్షంలో గడిపాక.. తిరిగి భూమ్మీదకు చేరుకుంది. ఇదిలా ఉంటే క్యాప్సూల్ దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్లను బయటకు ఆహ్వానించాడు జెఫ్ బెజోస్. అత్యంత వయస్కుడు 60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘స్టార్ ట్రెక్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు కెనడియన్ నటుడు విలియమ్ షాట్నర్. కెప్టెన్ జేమ్స్ క్రిక్ రోల్లో ఆయన నటన అమోఘం. అయితే ఈయన్ని అంతరిక్ష ప్రయాణం చేయించడం ద్వారా బ్లూ ఆరిజిన్ స్పేస్ టూరిజం బిజినెస్ పెంచాలని భావించారు సదరు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బాస్ జెఫ్ బెజోస్. గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్ గ్లెన్ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్ ఏవియేటర్ వాలీ ఫంక్(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్ బ్రేక్ చేశారు . అయితే వాలీఫంక్ వెళ్లొచ్చింది.. ఇప్పుడు 90 ఏళ్ల వయసున్న షాట్నర్ వెళ్లొచ్చేది కార్మన్ లైన్ దాకా మాత్రమే. ఇది భూమ్మీద నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. వీరాభిమాని స్టార్ ట్రెక్కు వీరాభిమాని అయిన జెఫ్ బెజోస్.. తన తొమ్మిదేళ్ల వయసులో ఈ టీవీ సిరీస్ మీద గీసిన ఓ బొమ్మను అపురూపంగా దాచుకోవడం విశేషం. అంతేకాదు స్పేస్ డ్రామాలను ఇష్టపడే బెజోస్.. 2016 స్టార్ టెక్ బియాండ్‌లో ఏలియన్ రోల్లో తళుక్కున మెరిశాడు కూడా. ప్రస్తుత బ్లూ ఆరిజిన్ ప్రయోగం ద్వారా ఇప్పటిదాకా 600 మంది అంతరిక్షయానం పూర్తి చేసుకున్నట్లు అయ్యింది. ఈ ప్రయోగం(బ్లూ ఆరిజిన్ మొదటిది జులైలోనే పూర్తైంది) సక్సెస్ కావడంతో స్పేస్టూరిజంలో బలమైన పోటీ ఇవ్వనుందనే సంకేతాలు పంపింది బ్లూ ఆరిజిన్. చదవండి: దేశీ స్పేస్ పోటీ.. ఆసక్తికరం -
నటుడి అంతరిక్ష ప్రయాణం.. వాయిదా!
ఆయనొక లెజెండరీ నటుడు. ఓ టెలివిజన్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ డమ్ సంపాదించుకున్నారు. అదీ అంతరిక్షానికి ముడిపడిన కథతో నడిచే సిరీస్ కావడం విశేషం. అలాంటి నటుడితో.. స్పేస్ టూరిజం బిజినెస్‌ను పెంచుకోవాలన్న బ్లూ ఆరిజిన్ ప్రయత్నానికి స్పీడ్ బ్రేకర్ ఎదురైంది ఇప్పుడు. 60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘స్టార్ ట్రెక్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు కెనడియన్ నటుడు విలియమ్ షాట్నర్. కెప్టెన్ జేమ్స్ క్రిక్ రోల్లో ఆయన నటన అమోఘం. అయితే ఈయన్ని అంతరిక్ష ప్రయాణం చేయించడం ద్వారా బ్లూ ఆరిజిన్ స్పేస్ టూరిజం బిజినెస్ పెంచాలని భావించారు సదరు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బాస్ జెఫ్ బెజోస్. అక్టోబర్ 12న బ్లూ ఆరిజిన్ సబ్‌ఆర్బిటల్ రాకెట్(ఎన్ఎస్-18) ద్వారా అంతరిక్ష ప్రయాణానికి అంతా సిద్ధం కూడా చేశారు. ఈ దశలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. బలమైన ఈదురుగాలులతో రాకెట్ లాంఛింగ్‌కు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంగళవారం ప్రయోగం ఉండబోదని బ్లూ ఆరిజిన్ మిషన్ ఆపరేషన్స్ టీం ప్రకటించింది. బుధవారానికి మిషన్‌ను వాయిదా వేశామని, అయితే వాతావరణం అనుకూలించకపోతే ఆరోజు కూడా ప్రయోగం ఉండదని స్పష్టం చేసింది. చదవండి: బెజోస్.. కొంపముంచిన అంతరిక్ష యాత్ర! ఒకవేళ 90 ఏళ్ల షాట్నర్ అంతరిక్షంలోకి గనుక వెళ్లొస్తే.. అంతరిక్ష యానం పూర్తిచేసిన అత్యధిక వయసు ఫీట్ దక్కించుకున్న వ్యక్తి అవుతారు. గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్ గ్లెన్ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్ ఏవియేటర్ వాలీ ఫంక్(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్ బ్రేక్ చేశారు . అయితే వాలీఫంక్ వెళ్లొచ్చింది.. ఇప్పుడు షాట్నర్ వెళ్లొచ్చేది కార్మన్ లైన్ దాకా మాత్రమే. ఇది భూమ్మీద నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. చదవండి: 10 నిమిషాల అంతరిక్ష యాత్ర.. ఖర్చు రూ.205 కోట్లు! -
అంతరిక్ష రంగంలో పోటీ పడుతున్న దేశీయ ప్రైవేట్ కంపెనీలు
గత దశాబ్ద కాలంలో అంతరిక్ష ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అమెరికాలో బ్యాక్ టూ బ్యాక్ రాకెట్ ప్రయోగాలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తుంది. స్పేస్ ఎక్స్ నిజంగా యుఎస్ అంతరిక్ష చరిత్రకు పర్యాయ పదంగా ఉండే పేర్లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ లాంటి కంపెనీలు ఈ మధ్య కాలంలో ఈ రంగంలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మన దేశంలో కూడా గత కొద్ది కాలంగా ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. రాకెట్లు నిర్మించడం, లాంచింగ్ వెహికల్స్, ఉపగ్రహాలను ప్రయోగించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడం లాంటి వాటిపై ప్రైవేట్ కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ అద్భుతంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో అంతరిక్ష రంగం వైపు చూస్తోన్న టాప్-4 కంపెనీలు ఏవో చూద్దాం. స్కైరూట్ ఏరోస్పేస్ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది 2018లో స్థాపించిన హైదరాబాద్ కు చెందిన ఏరోస్పేస్ తయారీ సంస్థ. దీనిని ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా కలిసి స్థాపించారు. ఈ సంస్థ తన 'విక్రమ్' శ్రేణి రాకెట్లపై పనిచేస్తోంది. 2022 మధ్యలో విక్రమ్-1 లాంచ్ చేయాలని చూస్తోంది. విక్రమ్-1ను వాణిజ్యీకరించడంతో పాటు ఇదే వరుసలో విక్రమ్-2, విక్రమ్-3ను రూపొందించాలని ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సంస్థ 11 మిలియన్ల డాలర్ల నిధులను సమీకరించినట్లు తెలిపింది. ఈ సంస్థలో పెట్టుబడిదారులుగా వాట్సాప్ గ్లోబల్ బిజినెస్ ఛీఫ్ నీరజ్ అరోర్, మింత్రా వ్యవస్థాపకులు ముఖేశ్ బన్సాల్ కూడా ఉన్నారు.(చదవండి: టయోటా మరో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..!) అగ్నికుల్ కాస్మోస్ అగ్నికుల్ కాస్మోస్ అనేది శ్రీనాథ్ రవిచంద్రన్, మొయిన్ ఎస్పిఎమ్ 2016 లో స్థాపించిన చెన్నైకి చెందిన ఏరోస్పేస్ తయారీ సంస్థ. 3డీ ప్రింటెడ్ ఇంజిన్లతో రెండు ప్రదర్శనల రాకెట్ అయిన 'అగ్నిబాన్' అనే రాకెట్లపై ఈ సంస్థ పనిచేస్తోంది. ప్రస్తుతం స్మాల్-లిఫ్ట్ లాంచ్ వెహికల్ అయిన అగ్నిబాన్ను డెవలప్ చేస్తోంది. ఇది 100 కిలోల పేలోడ్‌ను 700 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యంలో ఉంచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పిక్సెల్ పిక్సెల్ సంస్థ అంతరిక్షంలో 30 కిలోమీటర్ల పై నుంచి భూమిని పరిశీలించే సూక్ష్మ ఉపగ్రహాలపై (మైక్రో శాటిలైట్లు) పరిశోధనలు చేస్తోంది. డేటాను సేకరించడానికి వ్యవసాయం, వాతావరణ మార్పు మొదలైనవాటిని అధ్యయనం చేయడానికి ఈ సంస్థ సుమారు 24 అల్ట్రా-హై రిజల్యూషన్ పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తోంది. ఈ సంస్థ ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి పెట్టింది. సాంకేతికతను అభివృద్ధి చేయడం, ఉపగ్రహాల కూటమిని నిర్మించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. ఈ స్టార్టప్ కు మెషిన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం కూడా ఉంది.(చదవండి: ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు!) బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ఇది శాటిలైట్ ప్రొపల్షన్ లో ప్రత్యేకత కలిగిన భారతీయ ఏరోస్పేస్ ఆర్ అండ్ డి కంపెనీ. ఇది తమిళనాడులోని కోయంబత్తూరు కేంద్రంగా ఉంది. దీనిని రోహన్ ఎం గణపతి, యశస్ కరణం స్థాపించారు. బెల్లాట్రిక్స్ 'చేతక్' అనే రాకెట్ పై పనిచేస్తోంది. ఇది మీథేన్, ద్రవ ఆక్సిజన్ ను ఉపయోగించే ఇంజిన్లతో మొదటి రాకెట్ కావచ్చు. వారు తమ రాకెట్ ను ప్రయోగించడానికి 'మొబైల్ లాంచర్'ను ఉపయోగించాలని యోచిస్తున్నారు. -
అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..!
చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ రష్యా చిత్ర బృందం అక్టోబర్ 5 న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు అంతరిక్ష యాత్రకు సిధ్దమయ్యాడు. స్పేస్ టూరిజం పరుగులు..! పలు అంతరిక్ష సంస్థలు బ్లూ ఆరిజిన్, స్పేస్ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్టూరిజం కోసం అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రెండో అంతరిక్ష యాత్రను త్వరలోనే చేపట్టనుంది. ఈ యాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విలియమ్ షట్నర్ పాలుపంచుకొనున్నాడు. విలియమ్ షట్నర్ స్పందిస్తూ..ఈ అంతరిక్ష యాత్ర పట్ల ఎంతో థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. అంతేస్థాయిలో కొంచెం భయం కూడా వేస్తోందని విలియమ్ షట్నర్ పేర్కొన్నారు. ఈ అంతరిక్ష యాత్ర అక్టోబర్ 12 న జరగనుంది. చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే.. స్టార్ ట్రెక్ సినిమాతో ఫేమస్...! స్టార్ ట్రెక్ సినిమాలో కెప్టెన్ జేమ్స్ టి. కిర్క్ పాత్రను విలియమ్ షట్నర్ పోషించాడు. అంతరిక్షానికి సంబంధించిన సినిమాలో స్టార్ ట్రెక్ అప్పట్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. విలియమ్ షట్నర్ సినిమాలో పొందిన అనుభూతిని ఇప్పుడు నిజజీవితంలో అంతరిక్ష యాత్రను చేపట్టనున్నాడు. అతి పెద్ద వయస్కుడిగా రికార్డు...! ఒకవేళ బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న ప్రయోగం విజయవంతమైతే రోదసీ యాత్రను చేపట్టిన అతి పెద్ద వయస్కుడిగా విలియమ్ షట్నర్ రికార్డును నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం విలియమ్ షట్నర్ వయసు 90. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన అంతరిక్షయాత్రలో పాల్గొన్న 82 ఏళ్ల వాలీ ఫంక్ అత్యంత పెద్ద వయసురాలిగా రికార్డును నమోదుచేసింది. We can’t wait for your mission to space on #NewShepard @williamshatner. See you at Launch Site One. https://t.co/4MLt2yaKh4 — Blue Origin (@blueorigin) October 5, 2021 చదవండి: ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు..! ఆ కంపెనీకి మాత్రం కాసుల వర్షమే..! -
‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా !
Elon Musk Jeff Bezo Rival: పోటీ ప్రపంచంలో పోటాపోటీ విమర్శలూ సహజమే. కానీ, అవి విపరీతానికి చేరితేనే వెగటు పుడుతుంది. బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ జెజోస్‌ల మధ్య మాటల వైరం రోజురోజుకీ శ్రుతి మించుతోంది. వీలు దొరికినప్పుడల్లా బెజోస్పై పరోక్షంగా విరుచుకుపడుతున్న మస్క్.. తాజాగా మరోసారి దురుసు వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అవతలి నుంచి కూడా కౌంటర్ పడడం విశేషం. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్) న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని స్పేస్ఎక్స్ ప్రయోగాలను నెమ్మదించేలా చేస్తున్నాయని ఆరోపించాడు ఎలన్ మస్క్. 2021 కోడ్ కాన్ఫరెన్స్‌లో బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశాడాయాన. ‘‘నీ తరపు లాయర్లు ఎంత గొప్పవాళ్లైనా కావొచ్చు. చంద్రుడి చేరాలనే మా ప్రయత్నాన్ని ఎన్ని దావాలేసినా ఆపలేరు. అంతరిక్ష యానం నీ అబ్బసొత్తు కాదు’’ అంటూ ఒకానొక దశలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మస్క్. ఇదిలా ఉంటే స్పేస్ఎక్స్, స్టార్‌లింక్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బ్లూ ఆరిజిన్ వరుసగా దావాలు వేస్తోందన్నది ఎలన్ మస్క్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అమెజాన్ కౌంటర్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే అమెజాన్ నుంచి కౌంటర్ పడింది. ఎలన్ మస్క్ తాను బెజోస్ లాంటోడేనని గుర్తించ లేకపోతున్నాడంటూ సెటైర్ వేసింది. గతంలో స్పేస్ఎక్స్ వేసిన దావాలకు సంబంధించిన చిట్టాను బయటపెట్టింది అమెజాన్. ఈ మేరకు అమెరికన్ టెక్నాలజీ బ్లాగ్ ది వర్జ్‌కు సంబంధిత డాక్యుమెంట్లను పంపించింది. స్పేస్ఎక్స్ ఇప్పటిదాకా వివిధ కోర్టుల్లో వేసిన 13 దావాలు, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసిన స్టేట్మెంట్ల తాలుకా వివరాలను వెల్లడించింది. 2004 నుంచి అమెరికా ప్రభుత్వం, నాసా, యూఎస్ ఎయిర్ఫోర్స్లకు వ్యతిరేకంగా స్పేస్ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్లు ఇందులో ఉన్నాయి. This is hilarious. Amazon sent us a 13-page PDF to prove Elon Musk is as litigious as Jeff Bezos https://t.co/Kh10AehEgB via @Verge — Eric Berger (@SciGuySpace) September 29, 2021 అమెజాన్ శాటిలైట్ డివిజన్ ప్రతినిధి ప్రాజెక్ట్ కుయిపర్ పేరు మీద ఈ డాక్యుమెంట్లు వర్జ్‌కు వచ్చాయి. ‘‘ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పని చేసిన స్పేస్ఎక్స్.. గతంలో చేసింది ఇదే కదా. ఏకంగా ప్రభుత్వంపైనే బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది’’ అని కుయిపర్ పేరు మీద స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. మొత్తం 39 డాక్యుమెంట్లు ఉండగా, వాటిని 13 పేజీల(పీడీఎఫ్ ఫైల్రూపంలో) కుదించి పంపించారు. SpaceX has sued to be *allowed* to compete, BO is suing to stop competition — Elon Musk (@elonmusk) September 29, 2021 సెటైర్ అయితే తమ దావాల వ్యవహారాన్ని స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ సమర్థించుకున్నాడు. ‘‘మేం పోటీప్రపంచంలోకి అనుమతించాలని స్పేస్ఎక్స్ తరపున దావాలు వేశాం. కానీ, బీవో(బ్లూఆరిజిన్ను ఉద్దేశించి) అసలు పోటీయే ఉండకూడదని దావాలు వేస్తోంది’’ అని వ్యంగ్యం ప్రదర్శించాడు. ఇక న్యాయపరమైన చర్యలతో బ్లూ ఆరిజిన్ కంపెనీ తనకు మోకాలు అడ్డుపెట్టడంపై ఎలన్ మస్క్ ఘాటుగానే స్పందిస్తున్నాడు. బహుశా తమపై కేసులు వేయడానికే బ్లూ ఆరిజిన్ బాస్ జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటాడంటూ గతంలో సెటైర్లు సైతం పేల్చాడు. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మరో నలుగురు!
జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్ సోమవారం న్యూ షెపర్డ్ 18వ మిషన్‌ను ప్రకటించింది. ఎన్ఎస్-18వ మిషన్‌లో భాగంగా అక్టోబర్ 12న నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కక్ష్యలోకి తీసుకొని వెళ్లి మళ్లీ వెనక్కి తీసుకొని వస్తారు. నాసా మాజీ ఇంజనీర్ & ప్లానెట్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్ బోసుయిసెన్, గ్లెన్ డి వ్రీస్ - మెడిడేటా సహ వ్యవస్థాపకుడుతో కలిసి మరో ఇద్దరు అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లనున్నారు. రాబోయే రోజుల్లో ఆ ఇద్దరి వ్యోమగాముల పేర్లను ప్రకటిస్తామని సంస్థ తెలిపింది. బోసుయిసెన్ 2010లో ప్లానెట్ ల్యాబ్స్ (ప్లానెట్)ను సహ-స్థాపించాడు, ఐదు సంవత్సరాలు సీటిఓగా పనిచేశాడు. అతని నాయకత్వంలో ప్లానెట్ నానో ఉపగ్రహాలను వాణిజ్యపరంగా విక్రయించిన మొదటి సంస్థగా మారింది. 2008 నుంచి 2012 వరకు బోస్హుయిసెన్ నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్లో స్పేస్ మిషన్ ఆర్కిటెక్ట్ గా పనిచేశాడు. గ్లెన్ డి వ్రీస్ 1999లో మెడిడేటా సొల్యూషన్స్ ను సహ-స్థాపించారు. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే క్లినికల్ రీసెర్చ్ ఫ్లాట్ ఫారం. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ వ్యోమనౌకలో జూలై 20న నలుగురు సభ్యుల బృందం నింగిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. (చదవండి: నో కాస్ట్ ఈఎమ్ఐ వల్ల కలిగే లాభమేంటి?) We’re excited to welcome Chris Boshuizen (@cboshuizen) and Glen de Vries (@CaptainClinical) on board #NewShepard #NS18 which will lift off from Launch Site One on Oct. 12. The two other crew will be announced soon. Learn more: https://t.co/qbUpI5OuVI — Blue Origin (@blueorigin) September 27, 2021 -
ప్రపంచ రికార్డును నెలకొల్పనున్న నటుడు...!
పలు అంతరిక్ష సంస్థలు బ్లూ ఆరిజిన్, స్పేస్ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్టూరిజం కోసం అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ప్రముఖ హాలీవుడ్ నటుడు విలియమ్ షట్నర్ రోదసీ యాత్రకు సిద్దమైతున్నట్లు తెలుస్తోంది. చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...! ఒకవేళ బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న ప్రయోగం విజయవంతమైతే రోదసీ యాత్రను చేపట్టిన అతి పెద్ద వయస్కుడిగా విలియమ్ షట్నర్ రికార్డును నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం విలియమ్ షట్నర్ వయసు 90. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన అంతరిక్షయాత్రలో పాల్గొన్న 82 ఏళ్ల వాలీ ఫంక్ అత్యంత పెద్ద వయసురాలిగా రికార్డును నమోదుచేసింది. స్టార్ ట్రెక్ హాలీవుడ్ సినిమాలో కెప్టెన్ జేమ్స్ టి. కిర్క్ పాత్రను విలియమ్ షట్నర్ పోషించాడు. అంతరిక్షానికి సంబంధించిన సినిమాలో స్టార్ ట్రెక్ అప్పట్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. గత జూలైలో బ్లూఆరిజిన్ సంస్థ అధినేత జెఫ్‌బెజోస్ కూడినఅతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆలివర్ డెమెన్ అతి తక్కువ వయసులో రోదసీ యాత్రను పూర్తి చేసుకున్న వ్యక్తిగా నిలిచి రికార్డు సృష్టించాడు. చదవండి: Jeff Bezos: జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! -
జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..!
వాషింగ్టన్: జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ నాసా మూన్ ల్యాండర్ కాంట్రాక్ట్ విషయంలో యూఎస్ ప్రభుత్వంపై దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాసాపై పోరాడేందుకు కూడా బ్లూ ఆరిజిన్ సిద్ధమైంది. బ్లూ ఆరిజిన్ యూఎస్ కోర్టులో దావాలను దాఖలు చేయడంతో నాసా ఏకపక్ష నిర్ణయాలపై వెనకడుగు వేసింది. బ్లూ ఆరిజిన్ దెబ్బకు నాసా చంద్రుడిపై ప్రయోగించనున్న మూన్ ల్యాండింగ్ మిషన్ డిజైన్ కాంట్రాక్ట్‌ను ఒకే సంస్థకు ఇవ్వకుండా పలు కంపెనీలకు నాసా అందజేసింది. బ్లూ ఆరిజిన్ సంస్థ నాసాపై దావాలను దాఖలు చేయడంతో పలు కంపెనీలకు ల్యాండింగ్ మిషన్ డిజైన్ కాంట్రాక్టులను అందించినట్లు నిపుణులు భావిస్తున్నారు. చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..! డిజైన్ కాంట్రాక్టు పలు కంపెనీలకు... మానవసహిత మూన్ ల్యాండర్ మిషన్ కోసం 2024లో నాసా ఆర్టిమిస్ ప్రోగ్రాం చేపట్టనుంది. మానవ సహిత మూన్ ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలనే లక్ష్యంతో మూన్ ల్యాండింగ్ డిజైన్‌కు సంబంధించిన ఒప్పందాలను ఐదు కంపెనీలకు నాసా అందజేసింది. ఐదు కంపెనీల్లో బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు కూడా ఉన్నాయి. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సుమారు 9.4 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ దక్కగా..జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ సుమారు 25.6 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ కంపెనీలు స్థిరమైన ల్యాండింగ్ డిజైన్లను రూపోందించనున్నాయి. ఆర్టిమిస్ మిషన్‌లో భాగంగా మొత్తంగా 146 మిలియన్ డాలర్లను మూన్ ల్యాండింగ్ డిజైన్లను అభివృద్ధి చేయడం కోసం డైనటిక్స్ సంస్ధకు 40.8 మిలియన్ డాలర్లు, లాక్హీడ్మార్టిన్ సంస్థకు 35.2 మిలియన్ డాలర్లు, నార్త్రోప్ గ్రుమ్మన్ సంస్థకు 34.8 మిలియన్ డాలర్ల ఒప్పందాలను అందజేసింది. ఈ ప్రాజెక్టు సుమారు 15 నెలల పాటు కొనసాగనుంది. విచారణ అక్టోబర్ 14 న... నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్ కోర్టు మెట్లను ఎక్కింది. నాసా చంద్రుడిపై హ్యూమన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా అక్వసిషన్ ప్రాసెస్‌లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని బ్లూ ఆరిజిన్ సంస్థ కోర్టుకు వెళ్లగా, దీనిపై యూఎస్ ఫెడరల్ కోర్టు అక్టోబర్ 14న విచారించనుంది. చదవండి: Elon Musk : ఫోటో షేర్ చేశాడో లేదో...! ఒక్కసారిగా పెరిగిన కరెన్సీ విలువ...! -
దెబ్బ మీద దెబ్బ.. సెటైర్లతో ముదురుతున్న వివాదం
ప్రపంచ కుబేరుల మధ్య వ్యాపార వైరం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. నాసా ఒప్పందం ‘మాకంటే మాకే దక్కాలంటూ’ బ్లూ ఆరిజిన్ జెఫ్ జెబోస్- స్పేస్ఎక్స్ ఎలన్మస్క్లు కోర్టుకెక్కి మరీ కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బెజోస్ తీరుపై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ అసహనం వ్యక్తం చేశాడు. స్పేస్ఎక్స్కు చెందిన బ్రాడ్‌బాండ్ కంపెనీ స్టార్‌లింక్ సర్వీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎఫ్ఎఫ్సీ(Federal Communications Commission)ని ఆశ్రయించింది అమెజాన్. ఈ వార్తను వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్(స్పేస్ రిపోర్టింగ్) క్రిస్టియన్ డావెన్‌పోర్ట్ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్‌కు బదులుగా స్పందించిన మస్క్.. బెజోస్పై సెటైర్లు వేశాడు. చదవండి: తాలిబన్లకు ఎలన్ మస్క్ సూటి ప్రశ్న! ‘స్పేస్ ఎక్స్‌కు వ్యతిరేకంగా దావాలు వేయడం బెసోస్ పనిగా పెట్టుకున్నాడేమో. బహుశా.. అందుకే అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి రిటైర్ అయ్యాడేమో’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. విషయం ఏంటంటే.. తాజాగా విలువైన నాసా కాంట్రాక్ట్ స్పేస్ ఎక్స్‌కు వెళ్లింది. Turns out Besos retired in order to pursue a full-time job filing lawsuits against SpaceX … — Elon Musk (@elonmusk) August 27, 2021 దీనిని వ్యతిరేకిస్తూ బ్లూ ఆరిజిన్, స్పేస్‌ఎక్స్‌పై దావా వేసింది. ఆ వెంటనే ఇప్పుడు శాటిలైట్ బ్రాడ్‌బాండ్ స్టార్‌లింక్ మీద పడింది. ఈ నేపథ్యంలోనే తన ఫ్రస్టేషన్‌ను ప్రదర్శిస్తున్నాడు ఎలన్ మస్క్. చదవండి: నాసా కాంట్రాక్ట్.. అదిరిపోయే పాయింట్‌తో మస్క్‌కు షాక్ ఇచ్చిన బ్లూఆరిజిన్ -
ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన ప్రత్యర్థి బిలియనీర్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలన్ మస్క్‌కు భారీ దెబ్బె కొట్టాడు. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ నాసా మూన్ ల్యాండర్ కాంట్రాక్ట్ విషయంలో యూఎస్ ప్రభుత్వంపై దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్ కోర్టు మెట్లను ఎక్కింది. నాసా చంద్రుడిపై హ్యూమన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా అక్వసిషన్ ప్రాసెస్‌లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని బ్లూ ఆరిజిన్ సంస్థ కోర్టుకు వెళ్లింది. (చదవండి: Elon Musk: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్ మస్క్...!) చివరికి జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ తన పంతం నెగ్గించుకుంది. నాసా తీసుకున్న ఏకపక్షనిర్ణయంపై యూఎస్ కోర్టు అక్టోబర్ 14న కేసును విచారించనుంది. దీంతో ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు అప్పగించిన మ్యూన్ ల్యాండర్ కాంట్రాక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేయడానికి నాసా అంగీకరించిందని గురువారం నాసా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మ్యూన్ ల్యాండర్ మిషన్‌లో భాగంగా స్పేస్ఎక్స్కు సుమారు 2.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 21,587 కోట్లు) కాంట్రాక్ట్‌ను నాసా ఆఫర్ చేసింది. మ్యూన్ ల్యాండర్ మిషన్ ల్యాండర్ కోసం స్పేస్ఎక్స్, నాసా ఇరు పక్షాలు చేస్తోన్న పనులను ఈ ఏడాది నవంబర్ 1 వరకు తాత్కాలికంగా నిలిపివేయడానికి ఒప్పుకున్నాయి. ఇదిఇలా ఉండగా.. గత నెలలో యూఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (జీఎఓ) బ్లూ ఆరిజిన్ ఎత్తి చూపిన అంశాన్ని తిరస్కరిస్తూ నాసాకు తన మద్దతును తెలిపింది. కాగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్లూ ఆరిజిన్ సంస్థ కోర్టుకు వెళ్లింది. నాసా తీసుకున్న ఏకపక్షనిర్ణయంలో ప్రాథమిక సమస్యలు ఉన్నాయని, తమ పరిమిత అధికార పరిధి కారణంగా జీఎఓ వాటిని పరిష్కరించలేకపోయిందని బ్లూ ఆరిజిన్ సంస్థ పేర్కొంది. బ్లూ ఆరిజిన్ సంస్థ ఈ మిషన్ కోసం నాసాకు భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసింది. తాజాగా కోర్టు తీసుకున్న నిర్ణయంపై స్పేస్ ఎక్స్ ఇంకా స్పందించలేదు. 1972 తరువాత నాసా ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా మరోసారి మానవులను చంద్రుడిపైకి తీసుకుళ్లే పనిలో భాగంగా అంతరిక్ష నౌక కోసం ప్రతిపాదనలు కోరింది. నాసా మ్యూన్ ల్యాండర్ మిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పేస్ ఎక్స్ దక్కించుకుంది. స్పేస్ ఎక్స్ 2024 లోపు మ్యూన్ లాండింగ్ రాకెట్‌ను రెడీచేయనుంది. (చదవండి: ఎలన్ మస్క్ కొత్త ప్లాన్.. ఈసారి అంతరిక్షంలో ఏకంగా..!) -
జెఫ్‌బెజోస్‌కు భారీ దెబ్బకొట్టిన భారత సంతతి వ్యక్తి..!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ నుంచి టాప్ ఇంజనీర్ బయటకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. భారత సంతతికి చెందిన నితిన్ అరోరా బ్లూ ఆరిజిన్ కంపెనీలో మూన్ ల్యాండర్ మిషన్‌కు లీడ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నితిన్ మూడు సంవత్సరాల పాటు బ్లూఆరిజిన్ సంస్థలో లీడ్ ఇంజనీర్‌గా కొనసాగుతున్నారు. (చదవండి: Wikipedia:హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!) మూన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా వివిధ రకాల పేలోడ్లను చంద్రునిపైకి తీసుకెళ్లే మాడ్యుళ్లను నితిన్ డిజైన్ చేశారు. నితిన్ బ్లూ ఆరిజిన్ సంస్థను వీడుతూ..బ్లూ ఆరిజిన్ సంస్థలో మూడు సంవత్సరాల పాటు పనిచేసినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా నితిన్ బ్లూ ఆరిజిన్ సంస్థ నుంచి స్పేస్ ఎక్స్ సంస్థలో జాయిన్ అయ్యారు. తాజాగా నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్ నాసాపై కోర్టులో దావా వేసింది. బ్లూ ఆరిజిన్ ప్రతినిధి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "నాసా హ్యూమన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా అక్వసిషన్ ప్రాసెస్‌లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని వెల్లడించింది. కోర్టుకు వెళ్లేముందు బ్లూ ఆరిజిన్ నాసా నిర్ణయంపై గొంతెత్తింది. అంతేకాకుండా బ్లూ ఆరిజిన్ సంస్థ మూన్ ల్యాండర్ మిషన్కోసం భారీగా 2 బిలియన్ల డాలర్లును నాసాకు ఆఫర్ చేసింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) -
జెఫ్ బెజోస్ కొంపముంచిన అంతరిక్ష యాత్ర...!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ రాకెట్ ద్వారా అంతరిక్షయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. రోదసి యాత్ర విజయవంతమైనందుకు గాను జెఫ్ బెజోస్ అమెజాన్ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్క్షతలను తెలిపారు. కాగా రోదసీయాత్ర పూర్తి చేసుకున్న జెఫ్బెజోస్పై కొంత మంది మండిపడుతున్నారు. జెఫ్ బెజోస్ అంతరిక్షయాత్రను పన్నులు కట్టకుండా డబ్బులను సంపాదించారని సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొంపముంచుతుంది. తాజాగా బెజోస్ అంతరిక్షయాత్రకు వ్యతిరేకంగా పలువురు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ తన అంతరిక్షయాత్ర కోసం అమెజాన్ కస్టమర్ల, ఉద్యోగుల డబ్బులను వాడి వెళ్లి వచ్చారనే అభిప్రాయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్చేస్తున్నారు. అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. పన్నులు కట్టకుండా అమెరికన్లు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులతోనే స్పేస్ టూర్ చేసి వచ్చారని నెటిజన్లు ఎద్దెవా చేస్తున్నారు. జెఫ్ బెజోస్ గత నెలలో జూలై 20 న 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టారు. ఈ పదకొండు నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం 16 లక్షల డాలర్లు ఖర్చు చేశారని నెటిజన్లు దుయ్యబట్టారు. అంతరిక్షయాత్రను పూర్తి చేసిన కొద్ది రోజులకే జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానం నుంచి జెఫ్ బెజోస్ వైదొలిగాడు. బెజోస్ స్థానాన్ని ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(ఎల్వీఎమ్హెచ్) అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్డ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బెర్నాల్డ్ ఆర్నాల్డ్ 200.5 బిలియన్ డాలర్లతో ముందున్నారు. జెఫ్ బెజోస్ 190.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. Tone deaf doesn’t begin to describe this @JeffBezos quote. I’m sure your workers who get blocked from unionizing at every turn are just giddy with excitement about your neato field trip to outer space that they subsidized. https://t.co/pmgCUIp7kp — Nick Knudsen 🇺🇸 (@NickKnudsenUS) July 21, 2021 I'm about to cancel my Amazon prime membership quite literally just bc bezos said "thanks, you guys are the ones who paid for this" upon return from space. — ɴᴀᴅɪᴀ 💉💉 (@VainArab) July 24, 2021 @JeffBezos how about you give every Amazon prime subscriber a freebie considering we paid for you to go to space! I’d like you to pay me to stay at home and rent some films, not much to ask👍 #amazon #BlueOrigin #space #givemeabreak #amazonprime #freerental — FromTheShadows (@FTShadows) July 23, 2021 -
బంపరాఫర్: 14 వేల కోట్ల భారీ డిస్కౌంట్!
అంతరిక్షయానం ఇప్పుడు పక్కా కమర్షియల్‌గా మారిపోయింది. భూమి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కర్మన్ లైన్’ దాటి వెళ్లొస్తూ.. రోదసియానం పూర్తైందని జబ్బలు చరుచుకుంటున్నాయి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు. తద్వారా పాపులారిటీతో పాటు ప్రభుత్వ అంతరిక్ష సంస్థలతో భారీ ఒప్పందాలను సొంతం చేసుకుంటున్నాయి . ఈ క్రమంలో అమెజాన్ ఫౌండర్, బ్లూ ఆరిజిన్ స్పేస్ ఏజెన్సీ ఓనర్ జెఫ్ బెజోస్.. నాసాకు బంపరాఫర్ ప్రకటించాడు. బ్లూ ఆరిజిన్ ఓనర్ జెఫ్ బెజోస్.. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాకు ఓ బహిరంగ లేఖ రాశాడు. నాసా చేపట్టబోయే ‘మూన్ మిషన్-2024’లో మూన్ ల్యాండర్ బాధ్యతలను తమ కంపెనీకి అప్పగించాలని, తద్వారా 2 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో దాదాపు 14 వేల కోట్ల రూపాయలు) డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించాడు. తద్వారా చరిత్రలోనే అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్‌తో వార్తల్లోకెక్కింది ఈ డీల్. అయితే ఈ లేఖపై నాసా ఇంకా స్పందించాల్సి ఉంది. ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా 2024లో చంద్రుడి మీదకు ప్రణాళికలు వేస్తున్న నాసా.. అక్కడి అనుభవాలు 2030-మార్స్ క్రూ మిషన్ కోసం ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో మూన్‌ల్యాండర్ కోసం ఆక్షన్ నిర్వహించింది. సుమారు 2.9 బిలియన్ డాలర్ల విలువైన ‘ది హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్’ కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఎగరేసుకుపోయింది. అయితే ఈ వ్యవహారంపై ప్రత్యర్థి బ్లూ ఆరిజిన్‌తో పాటు డైనెటిక్స్ కంపెనీలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో నాసా పునరాలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో బెజోస్ నుంచి నాసాకు బంపరాఫర్ వెళ్లడం విశేషం. ‘ఫండింగ్ లేని కారణంగా నాసా ఒకే కాంట్రాక్టర్‌ను తీసుకుందనే విషయం తెలుసు, కానీ, పోటీతత్వం ఉంటేనే పని సమర్థవంతంగా సాగుతుందనే విషయం గుర్తించాల’ని ఆ బహిరంగ లేఖలో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు సూచించాడు బెజోస్. అంతేకాదు ‘బ్లూ మూన్ ల్యాండర్’ ప్రత్యేకతలను వివరించడంతో పాటు.. కక్క్ష్యలో ల్యాండర్‌ను పరీక్షించేందుకు అవసరమయ్యే ఖర్చును కూడా తామే భరించుకుంటామని బెజోస్ స్పష్టం చేశాడు. ఒకవేళ ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటే చరిత్రలోనే భారీ డిస్కౌంట్ దక్కించుకున్న క్రెడిట్ నాసా సొంతమవుతుంది. -
అమెజాన్ బాస్ మెడకు ‘ఏలియన్’ లింక్!
కొందరు ఎదుటివాళ్ల సక్సెస్‌ను ఓర్చుకోలేరు. అమెరికాలో అలాంటి బ్యాచ్ ఒకటి ‘కుట్ర సిద్ధాంతకర్తలు’గా కొన్ని సంవత్సరాల నుంచి మనుగడ కొనసాగిస్తోంది. వీళ్లు అమెరికా ప్రభుత్వం, పౌరులు సాధించే ఓ విజయాన్ని భరించలేరు. వాటికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తుంటారు. వీళ్లు చెప్పే థియరీలు ఒక్కోసారి తట్టుకోలేని రేంజ్లో ‘అబ్బో’ అనిపిస్తుంటాయి. అలాంటి ఓ థియరీని అమెజాన్ బాస్ మెడకు చుట్టేశారు. అంతరిక్షంలోకి వెళ్లొచ్చి వారం తిరగలేదు. అప్పుడే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ గురించి తిక్క వార్తలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కుట్ర సిద్ధాంతకర్తలు చెప్పేది ఏంటంటే.. అంతరిక్షంలోకి వెళ్లిన బెజోస్‌ను ఏలియన్లు కిడ్నాప్ చేశాయట. ఆయన ప్లేస్‌లో ఏలియన్ డబుల్ బాడీని తిరిగి భూమ్మీదకు పంపించాయట. కావాలంటే ఆయన మెడ చూడడండి ఎలా సాగిలపడి ఏలియన్లా ఉందో అంటూ ఏవో ఆధారాలు చూపెడుతున్నారు వాళ్లు. ఈ థియరీని అమెజాన్ ‘ఛీ’ కొట్టేసింది. పదకొండు నిమిషాల గ్యాప్‌లో.. అదీ తోడుగా సభ్యులు ఉండగా జరిగిందన్న ఏలియన్ కిడ్నాప్ వ్యవహారం ఒక పిచ్చి వాదన అని అంతా తోసిపుచ్చుతున్నారు. అంతేకాదు ఈ కిడ్నాప్ ద్వారా భూమ్మీద పట్టుసాధించాలని ఏలియన్లు ప్రయత్నిస్తున్నాయనే తట్టుకోలేని మరో వాదనను సైతం వీళ్లు లేవనెత్తుతున్నారు. ప్చ్... -
అంతరిక్షయాత్ర విజయం: రూ.745 కోట్ల అవార్డు ప్రకటించిన బెజోస్
వాషింగ్టన్: జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ నౌక రోదసియాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. భూమ్మీద ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మామూలే. కానీ భూ ఉపరితలాన్ని దాటి.. మనకు పూర్తిగా పరిచయం లేని మరో లోకంలో విహరించాలంటే ఆసక్తి, అభిమానంతో పాటు ఎంతో ధైర్యం కావాలి. అంతరిక్ష యాత్ర ద్వారా బెజోస్ సాహసం చేశారనే చెప్పవచ్చు. అవును మరి అంతరిక్షంలోకి ప్రయాణించి.. క్షేమంగా భూమ్మిదకు చేరడం అంటే మాటలు కాదు. అందుకే తన అంతరిక్ష యాత్ర విజయానంతరం జెఫ్ బెజోస్ కీలక ప్రకటన చేశారు. భూమ్మీదకు తిరిగి వచ్చిన తర్వాత ఓ భారీ అవార్డును ప్రకటించారు. ధైర్యం, పౌరసత్వం(కరేజ్ అండ్ సివిలిటీ) పేరుతో 100 మిలియన్ డాలర్ల (రూ. 7,46,09,40,000) అవార్డు ప్రకటించాడు. మానవ జాతి ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవటానికి ప్రజలను సమాయత్తం చేసే నాయకులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. తొలి అవార్డు విన్నర్ ఎవరంటే.. బెజోస్ ప్రకటించిన కరేజ్ అండ్ సివిలిటీ అవార్డును తొలుత ఇద్దరికి ప్రదానం చేశారు. వీరిలో ఒకరు అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత వాన్ జోన్స్, మన ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్ ఉన్నారు. వీరిద్దరికి 100 మిలియన్ డాలర్లు అందజేస్తారు. అంతరిక్ష యాత్ర విజయం అనంతరం జెఫ్ బెజోస్ మీడియాతో మాట్లాడారు. ‘‘అవార్డు గెలుచుకున్న వాన్ జోన్స్, జోస్ ఆండ్రెస్ ఈ అవార్డు ద్వారా లభించే మొత్తాన్ని ఏదైనా లాభాపేక్షలేని కార్యక్రమం కోసం కానీ.. చాలామందికి పంచడానికి కానీ వినియోగించవచ్చని’’ తెలిపారు. భవిష్యత్తులో చాలామందికి ఈ అవార్డును ప్రదానం చేస్తామన్నారు. ఎవరీ జోస్ ఆండ్రెస్.. స్సానిష్కు చెందిన ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్ ప్రముఖ మానవతావాదిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లాభాపేక్ష లేకుండా నిర్వహించే ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు జోన్ ఆండ్రెస్. 2010లో ప్రారంభించిన వరల్డ్ సెంట్రల్ కిచెన్ ప్రపంచవ్యాప్తంగా పలు సహాయ సంస్థలతో కలిసి ప్రకృతి విపత్తుల బాధితులకు ఆహారం అందిస్తుంది. ప్రపంచ ఆకలిని తీర్చేందుకు వినూత్న ఆలోచనలను చేయడమే కాక.. స్థానిక చెఫ్‌లను వాటిలో భాగస్వామ్యం చేసేలా చేస్తుంది. వాన్ జోన్స్ ఎవరంటే.. వాన్ జోన్స్ ప్రముఖ టీవీ హోస్ట్, రచయిత, రాజకీయ విశ్లేషకుడు. అంతేకాక వాన్ జోన్స్ షో, సీఎన్ఎన్ రిడెమ్షన్ ప్రాజెక్ట్‌కి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ అథర్గా మూడు సార్లు నిలిచారు. 2009లో బరాక్ ఒబామాకు ప్రత్యేక సలహదారుగా పని చేశారు. క్రిమినల్ జస్టిస్ సంస్కర్తగా ప్రశంసలు పొందిన జోన్స్ అనేక లాభాపేక్షలేని సంస్థలను స్థాపించారు. వాటిలో ముఖ్యమైనది ది డ్రీమ్ కార్ప్స్. డ్రీమ్ కార్ప్స్ అనేది ఇంక్యుబేటర్, ఇది సమాజంలో "అత్యంత హాని కలిగించేవారిని ఉద్ధరించడానికి,శక్తివంతం చేయడానికి" తగిన ఆలోచనలు, ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుంది. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో నలుగురు సభ్యులతో నింగిలోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లింది. వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. -
జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయోగం విజయవంతం
జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ నౌక రోదసియాత్ర విజయవంతమైంది. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో నలుగురు సభ్యుల బృందం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లింది.వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. ఆలివర్ డేమెన్ రోదసీలోకి వెళ్లి వచ్చిన అతి పిన్న వయసు వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 1961 లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన వోస్టాక్ 2 మిషన్‌లో 25 ఏళ్ల వయసులో రష్యన్ వ్యోమగామి గెర్మాన్ టిటోవ్ అంతరిక్షానికి వెళ్లిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేకాకుండా 82 ఏళ్ల వాలీ ఫంక్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అతి పెద్ద వయస్కురాలిగా నిలిచి రికార్డు సృష్టించింది. న్యూ ఫెపర్డ్ నౌక భూమి నుంచి అంతరిక్షంగా భావించే ఖర్మాన్ లైన్‌ను దాటి 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. న్యూ షెపర్డ్ నౌకకు ఉపయోగించిన రియూజబుల్ బూస్టర్ సురక్షితంగా లాంచింగ్ స్టేషన్లో చేరుకుంది. వ్యోమనౌక మ్యాడ్యుల్లో ప్రయాణిస్తున్న నలుగురి బృందం అంతరిక్ష యాత్రను ముగించుకొని సురక్షితంగా భూమిని చేరుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడే జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర
-
నేడే బెజోస్ అంతరిక్ష యాత్ర
వాషింగ్టన్: దిగ్గజ సంస్థ ‘ఆమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర నేడే జరగనుంది. 20 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెపర్డ్’ బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి సుమారు 100 కి.మీ.ల ఎత్తున ఉన్న కార్మన్ లైన్‌కు ఆవలికి తీసుకువెళ్తుంది. సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి వారిని భూమిపైకి తీసుకువస్తుంది. బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్, మాజీ పైలట్ అయిన 82 ఏళ్ల మహిళ వేలీ ఫంక్, 18 ఏళ్ల యువకుడు ఆలీవర్ డీమన్ ఈ యాత్ర చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే మరో బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తన సొంత స్పేస్ క్రాఫ్ట్‌లో విజయవంతంగా అంతరిక్ష యాత్ర ముగించిన విషయం తెలిసిందే. పశ్చిమ టెక్సాస్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం బెజోస్ సహా నలుగురు తుది దశ సన్నాహాల్లో ఉన్నారు. భద్రత, సిమ్యులేషన్, భూ గురుత్వాకర్షణ పరిధి దాటిన తరువాత కేబిన్‌లో తేలియాడాల్సిన తీరు, రాకెట్ పనితీరు, అస్ట్రోనాట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర బాధ్యతలు.. తదితర అంశాలపై శిక్షణ పొందుతున్నారు. ఇది అందరూ సివిలియన్సే వెళ్తున్న పైలట్ రహిత అంతరిక్ష యాత్ర కావడం విశేషం. శిక్షణ పొందిన అస్ట్రోనాట్స్ ఎవరూ ఇందులో లేరు. స్పేస్ క్రాఫ్ట్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి ఎగురుతుంది. స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెఫర్డ్’ ప్రయాణానికి సిద్ధంగా ఉందని బ్లూ ఆరిజిన్ సంస్థ అస్ట్రోనాట్ సేల్స్ డైరెక్టర్ ఆరియన్ కార్నెల్ ప్రకటించారు. 1961లో అంతరిక్షానికి వెళ్లిన తొలి అమెరికన్ అలాన్ షెఫర్డ్ పేరును బ్లూ ఆరిజిన్ సంస్థ తమ స్పేస్‌క్రాఫ్ట్‌కు పెట్టింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ తరహాలో దీనిని నిర్మించారు. అయితే, పరిసరాలను 360 డిగ్రీల కోణంలో చూసేలా క్య్రూ క్యాప్సూల్‌ను రూపొందించారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ నిట్టనిలువగా టేకాఫ్ అవుతుంది. అలాగే, నిట్టనిలువుగానే ల్యాండ్ అవుతుంది. ఈ అంతరిక్ష యాత్రకు మరిన్ని ప్రత్యేకతలున్నాయి. 82 ఏళ్ల వృద్ధ మహిళ, 18 ఏళ్ల పిన్న వయస్కుడు కలిసి చేస్తున్న యాత్ర ఇది. -
అంతరిక్ష యానం: నాసా వద్దంది.. బ్లూ ఆరిజన్ రమ్మంది!
న్యూయార్క్: ప్రస్తుతం ధనవంతుల అంతరిక్షల యాత్రల సీజన్ కొనసాగుతోంది. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్‌తో బ్రాన్సన్ నింగిలోకి పయనించగా, త్వరలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షయానానికి రెడీ అవుతున్నారు. ఈ రెండిటిలో భారతీయులు గర్వించే అంశం ఒకటి కామన్‌గా ఉంది. బ్రాన్సన్ ప్రయాణంలో భారత సంతతి వ్యక్తి శిరీష కీలకపాత్ర పోషించినట్లే, బెజోస్ యాత్రలో సైతం మరో భారతీయ యువతి కీలక పాత్ర పోషిస్తోంది. బెజోస్ రాకెట్ నిర్మాణ బృందంలో మరాఠా అమ్మాయి సంజల్ గవాండే(30) ముఖ్య భూమిక వహించింది. గతంలో ఆమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా పౌరసత్వ సమస్యలతో ఎంపిక కాలేదు. అనంతరం బ్లూ ఆరిజన్‌లో సిస్టమ్ ఇంజినీర్‌గా చేరి, ప్రస్తుతం బెజోస్ యాత్రలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని కళ్యాణ్. ఆమె తండ్రి మున్సిపల్ ఉద్యోగి. మహిళ మెకానికల్ ఇంజనీరా? ముంబై యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీర్ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత మాస్టర్స్ చదివేందుకు 2011లో అమెరికాలోని మిషిగన్ టెక్నోలాజిక్ యూనివర్సిటీలో చేరారు. ఒక అమ్మాయి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంచుకోవడమేంటని గతంలో చాలామంది తనతో అన్నారని, కానీ ఆమె అందరి అనుమానాలు పటాపంచలు చేసి తాము గర్వపడేలా చేసిందని సంజల్ తండ్రి అశోక్ గవాండే ఆనందం వ్యక్తం చేశారు. అంతరిక్ష వ్యవహారాలపై ఆసక్తితో ఏరోస్పేస్ సబ్జెక్ట్‌ను ఎంచుకుని సంజల్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. ఆ తర్వాత విస్కన్సిస్‌లోని మెర్క్యురీ మెరైన్ సంస్థలో, టయోటా రేసింగ్ డెవలప్మెంట్లో చేరారు. బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ రూపొందించిన న్యూషెపర్డ్ నౌక జూలై 20న అంతరిక్షంలోకి దూసుకుపోనుంది.