జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ అంతరిక్ష రంగంలో సంచలన విజయాలను సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూఆరిజిన్ రెండు అంతరిక్షయాత్రలను విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా మరో మహత్తర ప్రయోగాన్ని లాంచ్ చేసేందుకు జెఫ్ బెజోస్ సంస్థ బ్లూఆరిజిన్ సంస్థ సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ స్టేషన్‌ను నిర్మించాలని బ్లూ ఆరిజిన్ భావిస్తోంది. బ్లూ ఆరిజిన్ ‘ ఆర్బిటల్ రీఫ్’ అనే స్పేస్ స్టేషన్‌ను వచ్చే పదేళ్లలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: చరిత్ర తిరగ రాసిన టెస్లా కంపెనీ
2025- 2030 మధ్య కాలంలో ఆర్మిటల్ రీఫ్ స్పేస్ స్టేషన్‌ను బ్లూ ఆరిజిన్ నిర్మించనుంది. ఈ స్పేస్ స్టేషన్‌లో సుమారు 10 మంది ఉండేట్లుగా నిర్మాణం చేపట్టనున్నారు. ఆర్బిటల్ రీఫ్‌ను బ్లూఆరిజిన్ సంస్ధ పలు సంస్థల భాగస్వామ్యంతో నిర్మించనుంది. ఇందులో సియెర్రా స్పేస్ జాయింట్ వెంచర్, బోయింగ్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ సహయంతో ఈ స్పేస్ స్టేషన్‌ను నిర్మించనునున్నారు.
అంతరిక్ష పర్యాటకులకు అతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని ఆర్బిటల్ రీఫ్ కలిగి ఉంది. ఆర్బిటల్ రీఫ్‌ను నిర్మాణం కోసం కంపెనీ తన న్యూ గ్లెన్ రాకెట్‌ను ఉపయోగించాలని యోచిస్తోంది. స్పేస్ స్టేషన్ యుటిలిటీ సిస్టమ్‌లు, కోర్ మాడ్యూల్‌లను కూడా అందిస్తుంది.
అంతరిక్ష పర్యాటకంపై కన్ను..!
అంతరిక్ష పర్యాటకం రంగంపై జెఫ్‌బెజోస్ కన్నేశాడు. ఏకంగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్‌ను నిర్మించడంతో ఎక్కువ మేర అంతరిక్ష ప్రయాణాలను చేపట్టే అవకాశం ఉంటుందని జెఫ్ బెజోస్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
చదవండి: Elon Musk: అది ప్రజల క్రిప్టోకరెన్సీ ..! అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా..!
Comments
Please login to add a commentAdd a comment