స్పేస్ టూరిజంలో అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ మరో అడుగు ముందుకు వేసింది. బ్లూ ఆరిజన్ సంస్థ టెక్సాస్ కేంద్రంగా అంతరిక్షం అంచు వరకు వెళ్లే మానవ రాకెట్ ప్రయోగాన్ని ప్రారంభించింది.
బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ మిషన్ ఎన్‌ఎస్-25 మిషన్‌ను పశ్చిమ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ నుండి మే 19న ఉదయం 8.30 (భారత్ కాలమాన ప్రకారం..సాయంత్రం 7.30) గంటలకు రాకెట్ బయలుదేరుతుంది. ఈ ఎన్‌ఎస్ -25 మెషిన్‌లో భారత్‌కు చెందిన గోపి తోటకూర సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు.
కాగా, గోపి తోటకూరతో పాటు వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్‌మెన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్‌మెన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్.. ఈ స్పేస్ యాత్రకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment