జెఫ్ బెజోస్(ఎడమ), విలియమ్ షాట్‌నర్(కుడి)
ఆయనొక లెజెండరీ నటుడు. ఓ టెలివిజన్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ డమ్ సంపాదించుకున్నారు. అదీ అంతరిక్షానికి ముడిపడిన కథతో నడిచే సిరీస్ కావడం విశేషం. అలాంటి నటుడితో.. స్పేస్ టూరిజం బిజినెస్‌ను పెంచుకోవాలన్న బ్లూ ఆరిజిన్ ప్రయత్నానికి స్పీడ్ బ్రేకర్ ఎదురైంది ఇప్పుడు.
60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘స్టార్ ట్రెక్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు కెనడియన్ నటుడు విలియమ్ షాట్‌నర్. కెప్టెన్ జేమ్స్ క్రిక్ రోల్‌లో ఆయన నటన అమోఘం. అయితే ఈయన్ని అంతరిక్ష ప్రయాణం చేయించడం ద్వారా బ్లూ ఆరిజిన్ స్పేస్ టూరిజం బిజినెస్ పెంచాలని భావించారు సదరు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బాస్ జెఫ్ బెజోస్. అక్టోబర్ 12న బ్లూ ఆరిజిన్ సబ్‌ఆర్బిటల్ రాకెట్(ఎన్‌ఎస్-18) ద్వారా అంతరిక్ష ప్రయాణానికి అంతా సిద్ధం కూడా చేశారు.
ఈ దశలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. బలమైన ఈదురుగాలులతో రాకెట్ లాంఛింగ్‌కు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంగళవారం ప్రయోగం ఉండబోదని బ్లూ ఆరిజిన్ మిషన్ ఆపరేషన్స్ టీం ప్రకటించింది. బుధవారానికి మిషన్‌ను వాయిదా వేశామని, అయితే వాతావరణం అనుకూలించకపోతే ఆరోజు కూడా ప్రయోగం ఉండదని స్పష్టం చేసింది.
చదవండి: బెజోస్.. కొంపముంచిన అంతరిక్ష యాత్ర!
ఒకవేళ 90 ఏళ్ల షాట్‌నర్ అంతరిక్షంలోకి గనుక వెళ్లొస్తే.. అంతరిక్ష యానం పూర్తిచేసిన అత్యధిక వయసు ఫీట్ దక్కించుకున్న వ్యక్తి అవుతారు. గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్ గ్లెన్ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్ ఏవియేటర్ వాలీ ఫంక్(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్ బ్రేక్ చేశారు . అయితే వాలీఫంక్ వెళ్లొచ్చింది.. ఇప్పుడు షాట్‌నర్ వెళ్లొచ్చేది కార్మన్ లైన్ దాకా మాత్రమే. ఇది భూమ్మీద నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment