వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ నుంచి టాప్ ఇంజనీర్ బయటకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. భారత సంతతికి చెందిన నితిన్ అరోరా బ్లూ ఆరిజిన్ కంపెనీలో మూన్ ల్యాండర్ మిషన్‌కు లీడ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నితిన్ మూడు సంవత్సరాల పాటు బ్లూఆరిజిన్ సంస్థలో లీడ్ ఇంజనీర్‌గా కొనసాగుతున్నారు. (చదవండి: Wikipedia:హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!)
మూన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా వివిధ రకాల పేలోడ్లను చంద్రునిపైకి తీసుకెళ్లే మాడ్యుళ్లను నితిన్ డిజైన్ చేశారు. నితిన్ బ్లూ ఆరిజిన్ సంస్థను వీడుతూ..బ్లూ ఆరిజిన్ సంస్థలో మూడు సంవత్సరాల పాటు పనిచేసినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా నితిన్ బ్లూ ఆరిజిన్ సంస్థ నుంచి స్పేస్ ఎక్స్ సంస్థలో జాయిన్ అయ్యారు.
తాజాగా నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్ నాసాపై కోర్టులో దావా వేసింది. బ్లూ ఆరిజిన్ ప్రతినిధి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "నాసా హ్యూమన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా అక్వసిషన్ ప్రాసెస్‌లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని వెల్లడించింది. కోర్టుకు వెళ్లేముందు బ్లూ ఆరిజిన్ నాసా నిర్ణయంపై గొంతెత్తింది. అంతేకాకుండా బ్లూ ఆరిజిన్ సంస్థ మూన్ ల్యాండర్ మిషన్‌కోసం భారీగా 2 బిలియన్ల డాలర్లును నాసాకు ఆఫర్ చేసింది.
(చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!)
Comments
Please login to add a commentAdd a comment