బ్లూ ఆరిజిన్ తొలి మిషన్‌లో అంతరిక్షంలోకి ప్రయాణించే తొలి కస్టమర్‌గా 18 ఏళ్ల విద్యార్థి అదృష్టాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆధ్వర్యంలో అంతరిక్షంలోకి ప్రయాణించే అతి పిన్న వయస్కుడుగా నెదర్లాండ్స్‌కు చెందిన ఆలివర్ డెమెన్ నిలిచాడు. ఈ విషయాన్ని బ్లూ ఆరిజిన్ గురువారం అధికారికంగా ప్రకటించింది. 28మిలియన్ డాలర్ల వెచ్చించి మరీ తనసీటును కొనుక్కున్న వ్యక్తి అనూహ్యంగా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడంతో ఆలివర్ డెమెన్ ఈ లక్కీ చాన్స్ కొట్టేశాడు.
జెఫ్ బెజోస్‌తో కలిసి బ్లూ ఆరిజిన్ వ్యోమ నౌకలో ప్రయాణించేందుకు ఆలివర్ డెమెన్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. ఈ నెల 20న జెఫ్ బెజోస్, అతని సోదరుడు మార్క్ బెజోస్ వాలీ ఫంక్, తదిరులతో కలిసి రోదసీయానం చేయనున్నాడు. న్యూ షెపర్డ్‌లో ప్రయాణించడానికి ఆలివర్‌ను స్వాగతిస్తున్నామని బ్లూ ఆరిజిన్ సీఈవో బాబ్ స్మిత్ వెల్లడించారు. నిజానికిగా వేలం పాట ద్వారా సీటు దక్కించుకున్న వ్యక్తి అనూహ్యంగా తప్పుకోవడంతో ఆలివర్ డెమెన్ ఈ చాన్స్ కొట్టేశాడు. ఆలివర్ తమ రెండో విమానం కోసం ఆయన తన సీటును రిజర్వ్ చేసుకోగా, షెడ్యూలింగ్ సమస్యలు, తొలి విమానంలో సీటు ఖాళీ అవడంతో ఆలివర్ ప్రయాణాన్ని ముందుకు జరిపినట్టు స్పష్టం చేశారు. అయితే ఎంత ధరకు ఈ సీటను దక్కించుకున్నాడు అనేది కంపెనీ బహిర్గంతం చేయలేదు. అంతరిక్షంలోకి వెళ్లే అతిచిన్న వాడిగా ఆలివర్‌గా, 82 ఏళ్ల వ్యోమగామి ఫంక్ పెద్ద వయస్కుడిగా నిలవనున్నారు.
కాగా ఆలివర్‌కు చిన్నప్పటినుంచీ ఆకాశం, నక్షత్రాలు, చందమామపై ఆసక్తి ఎక్కువ. అలా రాకెట్ల పట్ల ఆకర్షితుడయ్యాడు, ఆస్ట్రోనాట్ కావాలానేది ప్రస్తుతం నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్ విద్యార్థిగా ఉన్న ఆరిజన్ చిన్ననాటి కల. ఈ క్రమంలో ప్రైవేట్ పైలట్ లైసెన్స్ తీసుకోవడం విశేషం. ఆలివర్ తండ్రి జోస్ డెమెన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అలాగే ప్రైవేట్ ఈక్విటీ ,ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సోమర్సెట్ క్యాపిటల్ పార్టనర్స్ వ్యవస్థాపకుడు, సీఈవో కూడా. బ్లూ ఆరిజిన్ సమాచారం ప్రకారం 159 దేశాల నుంచి 7,600 మంది బిడ్డర్లు ఈ వేలంలో పాల్గొన్నారు.
Welcome to the crew, Oliver! We’re grateful to have you as our first customer to mark the beginning of commercial operations. #NSFirstHumanFlight https://t.co/gwZ6qBOFpi pic.twitter.com/SuOwxe2353
— Blue Origin (@blueorigin) July 15, 2021
Comments
Please login to add a commentAdd a comment