Elon Musk Achievements In 2021: ఆకాశమే హద్దుగా కొంగొత్త ఆవిష్కరణలు చేస్తూ నిబంధనలకు కట్టబడని వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు ఎలన్‌మస్క్. ఆయన జీవితంలో 2021 ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఎన్నో ప్రత్యేకమైన మైలురాళ్లు ఈ ఏడాదిలోనే ఆయన అధిగమించారు.
దక్షిణాఫ్రికా మీదుగా
దక్షిణాఫ్రికాలో 1971 జూన్ 28న జన్మించిన ఎలన్‌మస్క్ పెరుగుతున్న క్రమంలో కెనడా మీదుగా అమెరికా వచ్చి అక్కడ పౌరసత్వం పొందారు. అక్కడగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మారుతున్న కాలానికి తగ్గట్టు ముందుగానే ఇంటర్‌నెట్‌కి ఎడాప్ట్ అయ్యాడు. ఆ తర్వాత పేపాల్ ద్వారా మంచి ఎంట్రప్యూనర్‌గా గుర్తింపు పొందాడు. అటు నుంచి టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల వరకు ఎలన్‌మస్క్ ప్రయాణం అప్రతిహాతంగా సాగుతోంది. ప్రస్తుతం 50వ పడిలో ఉన్న ఎలన్‌మస్క్ 2021లో అనేక మైలురాళ్లను చేరుకున్నాడు.
- టెస్లా మార్కెట్ క్యాపిటల్ ఆకాశమే హద్దుగా పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఎలన్‌మస్క సంపద కొండంతయి కూర్చుంది. అప్పటి వరకు ప్రపంచ కుబేరిగా నంబర్ వన్ స్థానంలో ఉన్న జెఫ్‌బేజోస్‌ని వెనక్కి నెట్టి 300 బిలియన్ డాలర్లతో అత్యంత ఐశ్వర్యవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం ఎలన్‌మస్క్ నెటవర్త్ 335 బిలియన్ డాలర్ల ( ఇండియన్ కరెన్సీలో 25 లక్షల కోట్లు)ని అంచనా.
- సంపాదించడడమే కాదు ప్రపంచలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆదాయపు పన్ను చెల్లించిన ఘనత కూడా ఎలన్‌మస్క్‌కే దక్కింది. ఈ ఏడాది ఆయన ఏకంగా 11 బిలియన్ డాలర్లు (రూ. 83 వేలకు పైగా కోట్లు) ఇన్‌కంట్యాక్స్‌గా చెల్లించాడు. ఈ భూగోళంపై ఉన్న చాలా దేశాల జీడీపీల కంటే ఇది ఎక్కువ.
- ఎలన్‌మస్క్ వరుసగా సాధిస్తున్న విజయాలను, భవిష్యత్తులో అతని ప్రణాళికలు చేరుకునే లక్ష్యాలను అంచనా వేసిన టైం మ్యాగజైన్ ఎలన్‌మస్క్‌ని పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించింది. కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.
- మెగా ఫ్యాక్టరీలకే తెలిసిన పారిశ్రామిక ప్రపంచానికి గిగాఫ్యాక్టరీలు అనే కొత్త కాన్సెప్టును పరిచయం చేసిన ఘనుడు ఎలన్‌మస్క్. భారీ ఎత్తున టెస్లా కార్లు తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎలన్‌మస్క్ నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించాడు. వీటి ద్వారా ఈ ఏడాది టెస్లా కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక కార్ల (దాదాపు 5 లక్షలు)ను ఉత్పత్తి చేయగలిగింది.
- ఎలన్‌మస్క్ వ్యవహార శైలిపై ఎన్ని వివాదాలు ఉన్నా అతని ప్రతిభ మీద ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు లేవు. అందువల్లే నాసా సంస్థ తన అంతరిక్ష పరిశోధనల విషయంలో 3 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును ఎలన్‌మస్క్‌కి కట్టబెట్టింది. దీనిపై జెఫ్‌బేజోస్ బ్లూ ఆరిజిన్ కోర్టుకు వెళ్లినా.. చివరకు ఎలన్‌మస్క్ పై చేయి సాధించారు.
- తన స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా ఎనిమిది మంది వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి తీసుకెళ్లి రికార్డు సృష్టించాడు.
- భవిష్యత్తు టెక్నాలజీగా పేర్కొంటున్న లో ఎర్త్ ఆర్బిట్ (లియో) విభాగంలోనూ ఎలన్‌మస్క్ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఎలన్‌మస్క్‌కి చెందిన స్టార్‌లింక్ సంస్థ 900లకు పైగా కొత్త శాటిలైట్లను ప్రయోగించింది. వీటి ద్వారా టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ విభాగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.
చదవండి:పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment