Youngest Engineer Kairan Quazi: తెలివికి వయసుతో సంబంధం లేదని మళ్ళీ నిరూపించాడు 14 ఏళ్ల 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi). త్వరలోనే ఈ చిన్నారి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరనున్నారు. ఇప్పటికే ఇతడు స్పేస్ఎక్స్ టెక్నాలజీ ఛాలెంజింగ్ ఇంటర్వ్యూను కూడా క్లియర్ చేసాడు. ఇంత గొప్ప విజయం సాధించిన కైరాన్ క్వాజీ ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన క్వాజీ 11 సంవత్సరాల వయసులోనే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చదవడం ప్రారంభించాడు. గత మే నెలలో శాంటా క్లారా యూనివర్సిటీ (SCU) నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. చిన్నప్పటి నుంచి స్పేస్‌ఎక్స్‌లో పనిచేయాలని కోరిక ఉన్న క్వాజీ ఆ వైపుగానే అడుగులు వేసాడు. అనుకున్నది సాధించాడు.
జాబ్‌కి సెలెక్ట్ అయిన వెంటనే కైరాన్ క్వాజీ లింక్డ్‌ఇన్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో నా నెక్స్ట్ స్టాప్ స్పేస్ఎక్స్. నేను త్వరలో ఇంజినీరింగ్ బృందంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరుతాను. కంపెనీ నా వయసుని చూడలేదు.. నా సామర్థ్యం మాత్రమే చూసిందని రాసాడు. సంస్థ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ లెటర్ స్క్రీన్‌షాట్ కూడా ఇందులో యాడ్ చేశారు.
(ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబెత్‌కే గిఫ్ట్ ఇచ్చేంత కుబేరుడితడు.. భారతదేశపు ఫస్ట్ బిలీనియర్!)
క్వాజీ తన ఫ్యామిలీతో కలిసి స్పేస్‌ఎక్స్‌లో పనిచేయడం ప్రారంభించేందుకు కాలిఫోర్నియాలోని ప్లెసాంటన్ నుంచి వాషింగ్టన్‌కు వెళ్లాలని యోచిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా ఉద్యోగ ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నట్లు తెలియజేశాడు. ఈ పోస్ట్ చేసిన కొన్ని వారాల తర్వాత, ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు వెల్లడించారు.
(ఇదీ చదవండి: ఈ బాలీవుడ్ కపుల్స్ కొన్న లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా?)
నిజానికి క్వాజీ తన తొమ్మిదేళ్ల వయసులో మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటెల్ ల్యాబ్స్‌లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్‌షిప్ పొందాడు. ఆ తరువాత 11 సంవత్సరాల వయసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో రీసర్చ్ ప్రారంభించాడు. 2022 లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా నాలుగు నెలలు పనిచేశాడు. కాగా తన తల్లి వాల్ స్ట్రీట్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. కైరాన్ తండ్రి ముస్తాహిద్ క్వాజీ ఒక ఇంజనీర్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment