వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను భూమి మీదకు తీసుకురావడానికి మరింత సమయం పట్టనుందని నాసా ప్రకటించింది.
వ్యోమగాముల్ని స్పేస్ నుంచి భూమికి తీసుకువచ్చే బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకలో అనేక సాంకేతికత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా సునీత విలియమ్స్, విల్‌మోర్‌లు వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది.
వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్‌మోర్‌లు 8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్‌లు ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి సమస్యలు తలెత్తాయి.
NASA again delays return of two astronauts stranded on space station.
Veteran astronauts Butch Wilmore and Suni Williams arrived at the ISS in June aboard Boeing's Starliner spacecraft, and were due to spend eight days on the orbiting laboratoryhttps://t.co/1ZIsWApfvX pic.twitter.com/AyFR5ifJdd— AFP News Agency (@AFP) December 18, 2024
స్టార్ లైనర్‌లో సమస్యల్ని పరిష్కరించి భూమి మీదకు తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పేస్‌లో చిక్కుకున్న వీరిద్దరిని భూమి మీదకు తెచ్చేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ స్పేస్‌లోకి పంపింది. క్రూ-9 మిషన్ విజయవంతంగా ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. ఇదే క్రూ-9 మిషన్‌లో సునీత విలియమ్స్, విల్‌మోర్‌లు వచ్చే ఏడాదిలో రానున్నట్లు నాసా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment