satillites
-
ఎస్ఎస్ఎల్వీడీ-3 ప్రయోగం సక్సెస్
సాక్షి,సూళ్లూరుపేట/తిరుమల: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం(ఆగస్టు16) స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3)ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.కౌంట్‌డౌన్ ముగియగానే అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాకెట్ 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం నాలుగు దశల్లో 17 నిమిషాలపాటు జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథన్ ప్రకటించారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి. -
సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?
మొబైల్లో సిమ్ లేకుండా మెసేజ్ చేయడం సాధ్యమవుతుందా..? ఎందుకు అవ్వదు.. వై-ఫై ద్వారా వీలవుతుంది కదా అంటారా. మరి వై-ఫై లేకపోయినా మెసేజ్చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకేవేళ మారుమూల ప్రదేశాలు, అడవులు, కొండలు, సముద్రాలు.. వంటి ప్రాంతాల్లో కూడా మన సమాచారాన్ని ఇతరులకు చేరేవేసే అవకాశం ఉంటే అదిరిపోతుంది కదా. ఇలాంటి కొత్త టెక్నాలజీను ప్రపంచ ప్రఖ్యాత సంస్థ యాపిల్ ప్రవేశపెడుతుంది. కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధానకార్యాలయంలో జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో ఇలాంటి కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తుంది. ఈ ఏడాది చివరినాటికి విడుదలచేసే ఐఓఎస్ 18 వర్షన్లో ఈ ఫీచర్లను అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.యాపిల్ ఐఫోన్లో శాటిలైట్ మెసేజింగ్ సామర్థ్యాలను విస్తరిస్తోంది. కొత్త iOS 18 వర్షన్ ద్వారా సాటిలైట్ సేవలను వినియోగించుకుని ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపించేలా ఏర్పాటు చేస్తున్నారు. సెల్యులార్, వై-ఫై కనెక్షన్లు అందుబాటులో లేనప్పుడు శాటిలైట్ ద్వారా సందేశాలు పంపే టెక్నాలజీను తీసుకొస్తున్నారు. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. 2022లో విడుదల అయిన ఐఫోన్14తోపాటు దాని తర్వాత మార్కెట్లోకి వచ్చిన యాపిల్ ఫోన్లలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పింది. ఈమేరకు ఆయా ఫోన్ల్లోని యాంటెన్నాలు ఉపగ్రహాల ప్రత్యేక ఫ్రిక్వెన్సీని చేరుకునేలా ఇప్పటికే హార్డ్‌వేర్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అందుకు అనువుగా నిర్దిష్ట సాప్ట్వేర్, అల్గారిథమ్‌లను రూపొందించినట్లు యాపిల్ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్‌తో ఐఫోన్ వినియోగదారులు ఐమెసేజ్, ఎస్ఎంఎస్ల ద్వారా టెక్స్ట్‌లు, ఎమోజీలు పంపవచ్చని వివరించింది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?యాపిల్ శాటిలైట్ కనెక్టివిటీ కాంపోనెంట్ కోసం అమెరికాకు చెందిన గ్లోబల్‌స్టార్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్లోబల్‌స్టార్ సంస్థ స్పేస్టెక్నాలజీ అందిస్తున్న ఎండీఏతో ఈమేరకు ఒప్పందం చేసుకుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్న స్టార్టప్ సంస్థ
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్ తయారుచేస్తున్న ఉపగ్రహాలను 2024 చివరినాటికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్పేస్ఎక్స్కు చెందిన రైడ్‌షేర్ మిషన్లు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)ను ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.ఈ సందర్భంగా పిక్సెల్ సీఈఓ అవైస్ అహ్మద్ మాట్లాడుతూ..‘కంపెనీకు స్పేస్ఎక్స్, పీఎస్ఎల్వీ రెండింటిలోనూ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే, ఇది ఉపగ్రహాల సంసిద్ధత, ప్రయోగ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. సంస్థ వద్ద ప్రస్తుతం ఏటా 40 పెద్ద ఉపగ్రహాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం పరిశోధకుల బృందం ఆరు ఉపగ్రహాలపై పని చేస్తోంది. వీటిని ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోని ప్రవేశపెట్టనున్నాం. 2024లో మరిన్ని ఉపగ్రహాలను తయారుచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ ఏడాది జనవరిలో పిక్సెల్ బెంగుళూరులో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘మెగాపిక్సెల్’ అనే ఫెసిలిటీని ప్రారంభించింది. ఇందులో ఆరు హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజరీ ఉపగ్రహాలను ప్రయోగాలు జరుపుతున్నారు. ఇవి వ్యవసాయం, ఎనర్జీ, అటవీ, పర్యావరణ పర్యవేక్షణతో సహా వివిధ పరిశ్రమలకు ఉపయోగపడుతాయని కంపెనీ వర్గాలు చెప్పాయి. 2022లో పిక్సెల్ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్‌ను ఉపయోగించి ‘శకుంతల’ (టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్-2) ఉపగ్రహాన్ని ప్రయోగించింది. -
కుంగిపోరాని నింగి పయనం
కొన్నేళ్ళుగా నిరీక్షిస్తున్న కల నిజమవుతోందని ఆనందిస్తున్న వేళ ఆఖరి నిమిషంలో అర్ధంతరంగా కల కరిగిపోతే ఎలా ఉంటుంది? భారతదేశ రాకెట్ల సేనలోకి సరికొత్తగా వచ్చి చేరిన ‘చిన్న ఉపగ్రహ వాహక నౌక’ (ఎస్ఎస్ఎల్వీ) తొలి ప్రయోగం ఆ భావననే కలిగించింది. గడచిన మూడేళ్ళలో అనేక సార్లు వాయిదాపడ్డ ఈ రాకెట్ వినువీధి ప్రయోగం విజయవంతమైనా, ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే మిషన్‌లో అది విఫలమవడం తీపి, చేదుల మిశ్రమ అనుభూతి. వినువీధిలో దేశానికి ఎన్నో విజయాలను అందించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగి, తప్పొప్పుల ఆత్మ పరిశీలనకు దిగాల్సిన స్థితి. వాణిజ్యపరంగా వివిధ దేశాల, సంస్థల ఉపగ్రహాలను విహాయసంలోకి పంపుతూ, వాణిజ్యపరంగానూ రెక్కలు విప్పుకోవడానికి మరికొన్నాళ్ళు వేచిచూడక తప్పని పరిస్థితి. 34 మీటర్ల పొడవు, 120 టన్నుల బరువున్న ‘ఎస్ఎస్ఎల్వీ–డి1’ను ఆదివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇస్రో రూపొందించిన భూగ్రహ పరిశీలక మైక్రో – శాటిలైట్ ‘ఈఓఎస్–02’, దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్ళలో చదివే ఆడపిల్లలు తయారుచేసిన ‘ఆజాదీ శాట్’ – ఈ రెండు ఉపగ్రహాలనూ దానితో పాటు పంపారు. వాటిని మోసుకుంటూ, రూ. 56 కోట్ల విలువైన భారతదేశ సరికొత్త రాకెట్ దూసుకెళ్ళింది. మూడు దశల్లోనూ రాకెట్ ప్రయోగం విజయవంతంగానే సాగింది. ప్రణాళిక ప్రకారం నింగిలో దాదాపు 12 నిమిషాలు ప్రయాణించాక అది రెండు ఉపగ్రహాలనూ కక్ష్యలో ప్రవేశపెట్టాలి. ముందుగా ‘ఈఓఎస్–2’నూ, ఆ తర్వాత కొద్ది సెకన్లకు ‘ఆజాదీశాట్’నూ నిర్ణీత కక్ష్యలోకి పంపాలి. సరిగ్గా ఇక్కడే ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ఇక్కట్ల పాలైంది. ఉపగ్రహాలు రెండూ నిర్ణీత సమయం ప్రకారం విడివడ్డాయి. అన్ని దశల్లోనూ రాకెట్ పనితీరూ ఊహించినట్టే సాగింది. కానీ, ఇస్రో మాటల్లో చెప్పాలంటే ‘రాకెట్ తుది దశలో కొంత డేటా నష్టం జరిగింది’. వృత్తాకార కక్ష్యలోకి వెళ్ళాల్సిన ఉపగ్రహాలు కాస్తా దీర్ఘవృత్తాకార కక్ష్యల్లోకి వెళ్ళాయి. ఆజాదీ శాట్ అనేది ‘హ్యామ్’ అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ల గ్రహణశక్తిని పెంచడానికి ఉద్దేశించినది. అనుకున్న దాని కన్నా తక్కువ కక్ష్యలోకి చేరడంతో, అస్థిరంగా మారి ఆ ఉపగ్రహాలు నిరుపయోగమయ్యాయి. తక్కువ కక్ష్యలోకి చేరడమంటే అవి అంతరిక్షంలో ఉండక, అనతికాలంలోనే భూమి పైకి ఇంటిదారి పడతాయన్న మాట. చిన్న శాటిలైట్లతో నింగిలోకి ప్రయాణం వరకు విజయవంతమైనా, ‘ఎస్ఎస్ఎల్వీ–డి1’ తన మిషన్‌ను పూర్తి చేయడంలో మాత్రం విఫలమైందని అంటున్నది అందుకే! రాగల కాలంలో ‘ఎస్ఎస్ఎల్వీ’ రాకెట్ తమకు ప్రధాన ప్రయోగ వాహక నౌక అవుతుందని ఇస్రో ఆశలు పెట్టుకొంది. తీరా ఉపగ్రహాలను పంపాల్సిన కక్ష్యలో జరిగిన పొరపాటు ఊహించని ఎదురుదెబ్బ. చిన్న ఉపగ్రహాలను వాణిజ్యస్థాయిలో నింగిలోకి పంపడమనేది కొన్ని వందల కోట్ల డాలర్ల విలువైన కొత్త విపణి. ఆ మార్కెట్లో జెండా పాతాలనుకుంటున్న భారత్ ఆశలకు ఇది అవాంతరం. అలాగే, రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలతో నిమ్న భూ కక్ష్య ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో మనకు కొన్ని దశాబ్దాల రికార్డుంది. కానీ, కొత్త సిరీస్ భూ పరిశీలక ఉపగ్రహాలను (ఈఓఎస్లను) పంపడంలో రెండేళ్ళలో మనకిది రెండో వైఫల్యం. నిరుడు శక్తిమంతమైన ‘ఈఓఎస్– 03’ని ‘జీఎస్ఎల్వీ–ఎఫ్10’తో పంపాలని యత్నించాం. ప్రయోగ వైఫల్యంతో అది సాధ్యం కాలేదు. చాలాకాలంగా కేవలం 5 నుంచి వెయ్యి కిలోల లోపల బరువుండే చిన్న ఉపగ్రహాలను సైతం ఇతర, భారీ ఉపగ్రహాలను తీసుకెళ్ళే రాకెట్లతోనే అంతరిక్షంలోకి పంపాల్సి వస్తోంది. అనేక వ్యాపారసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చివరకు విశ్వవిద్యాలయాలు, పరిశోధనాశాలలు తమ చిన్న ఉపగ్రహాలను ఈ పెద్ద ఉపగ్రహాలతో కలిపి మోసుకెళ్ళేలా చేయడానికి దీర్ఘకాలం వేచిచూడక తప్పని పరిస్థితి. దానికి ఖర్చు, నిరీక్షణ సమయం ఎక్కువే. గత పదేళ్ళలో అంతరిక్ష డేటా, కమ్యూనికేషన్, నిఘా, వాణిజ్య అవసరాలు పెరగడంతో అలాంటి చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే ప్రత్యేక వాహక నౌకలకు గిరాకీ హెచ్చింది. సుదీర్ఘ అనుభవమున్న ఇస్రో లాంటి వాటికి ఇది పెద్ద వ్యాపార అవకాశం. అందుకే, చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్ళే ‘ఎస్ఎస్ఎల్వీ’ని అది రూపొందించింది. ఇప్పుడున్న పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ లాంటి ఇతర ఉపగ్రహ నౌకల తయారీకి ఒక్కోదానికీ 70 నుంచి 80 రోజులకు పైగా పడుతుంది. అందులో పదోవంతు ఖర్చుతో, 72 గంటల్లోనే అయిదారుగురి బృందం ఎస్ఎస్ఎల్వీని సిద్ధం చేయగలదు. రాగల పదేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా పదుల వేల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలు నింగికి పోనున్న వేళ భారత్‌కు ఇది అద్భుత అవకాశం. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి చకచకా తలుపులు తీస్తున్న మన దేశంలో ఇప్పటికే కనీసం మరో 3 ప్రైవేట్ సంస్థలు చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్ళే రాకెట్లను తయారు చేస్తున్నాయి. ఏటా 2–3 ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితమైన ప్రభుత్వ ఇస్రో సైతం ఎస్ఎస్ఎల్వీ సఫలమైతే వారానికో ప్రయోగం చేయగలదు. కరోనాతో పాటు కొంత పనితీరులో జాప్యంతో ఇప్పటికే నాలు గేళ్ళుగా ఈ ప్రయోగం ఆలస్యమైంది. అలాగని తాజా వైఫల్యంతో కుంగిపోనక్కర లేదు. సెన్సార్ పనితీరులో లోపం ఒక్కటీ పక్కనపెడితే ‘ఎస్ఎస్ఎల్వీ’ పనితీరు బాగుండడం ఇస్రో విజయమే. ఇప్పుడిక జరిగిన తప్పును నిపుణుల సంఘం విశ్లేషించనుంది. అనంతరం సరిదిద్దిన తదుపరి వెర్షన్ రాకెట్ (ఎస్ఎస్ఎల్వీ–డి2)తో ఇస్రో మళ్ళీ ముందుకు వస్తుంది. దాంతో వినువీధిలో మన అంతరిక్ష శోధనల వాణిజ్య పతాక ఎగురుతుంది. ఎందుకంటే, ప్రతి వైఫల్యం ఓ కొత్త విజయానికి సోపానమే! -
లైగర్ చిత్రానికి కళ్లు చెదిరే శాటిలైట్, డిజిటల్ రైట్స్? ఎంతంటే..
టాలీవుడ్, బాలీవుడ్ మోస్ట్ అవెయిటెట్ మూవీ ‘లైగర్’.డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ హీరో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన లైగర్ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ దద్దరిల్లిపోయింది. విజయ్-పూరీ కాంబినేషన్‌తో అనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్ విడుదల అనంతరరం ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం, తలైవాకు ఆదాయ పన్నుశాఖ అవార్డు ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన లైగర్ క్రేజ్ దృష్ట్యా శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ డీల్‌కు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. శాటిలైట్.. డిజిటల్ రైట్స్ కలుపుకుని మొత్తం రూ. 55 నుంచి రూ. 60 కోట్లు పలికినట్టుగా సినీవర్గాల నుంచి సమాచారం. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇందులో రమ్యకృష్ణ హీరో తల్లిగా నటిస్తుండగా.. బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ గెస్టు రోల్లో అలరించబోతున్నాడు. చదవండి: NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి! -
ఇంటర్నెట్ స్పీడ్ సమస్యలకు పరిష్కారం... ఎల్ఈవో
ఇండియాలో ఇంటర్నెట్ కనెక్టివిటీపై కార్పోరేట్ కంపెనీలు కన్నేశాయి. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అందించేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో బడా కంపెనీలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సెక్టార్లో అడుగుపెడుతోంది. టాటా విత్ టెలిశాట్ టాటా గ్రూప్‌కి చెందిన నెల్కో సంస్థ కెనాడుకు చెందిన టెలిశాట్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ కుదిరితే ఈ రెండు సంస్థలు సంయుక్తంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ఇండియాలో అందివ్వనున్నాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 2024 నాటికి ఇండియాలో వైర్లెస్ పద్దతిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కనెక్టివిటీ సమస్య జియోరాకతో ఇండియాలో ఇంటర్నెట్ వాడకంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అర్బన్ ఏరియాలో ఇంటర్నెట్ నిత్య జీవితంలో ఒక భాగమైంది. వ్యక్తిగత అవసరాలతో పాటు ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలకు ఆన్లైన్ అనేది తప్పనిసరిగా మారింది. అయితే రూరల్ ఇండియాలో పరిస్థితి ఇందుకు భినంగా ఉంది. దేశంలో సగానికి పైగా ఏరియాల్లో అసలు ఇంటర్నెట్ కనెక్షన్లు లేవు. ఉన్నా నెట్ స్పీడ్ తక్కువగా ఉంది. లైట్ స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే నెట్ స్పీడ్ సమస్యలు తీరే అవకాశం ఉంది. డిజిటటీకరణ మరింత వేగం పుంజుకోనుంది. ఎల్ఈవో ప్రస్తుతం నెట్ ఫైబర్ వైర్, స్పెక్ట్రమ్, శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ పని చేస్తోంది. మన దేశంలో మొబైల్ నెట్‌వర్క్‌లు స్పెక్ట్రమ్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తుండగా ప్రైవేటు కంపెనీలు, బీఎస్ఎన్ఎల్, జియో ఫైబర్లు ఆప్టికల్ ఫైబర్ వైర్ ద్వారా నెట్ అందిస్తున్నాయి. ఈ రెండు కాకుండా భూమి నుంచి 500ల నుంచి 2,000 కి.మీ ఎత్తులో ఉండే ఉపగ్రహం (లో ఎర్త్ ఆర్బిట్) ద్వారా లైట్ స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను అందివ్వడం వీలవుతుంది. 1990ల నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కమర్షియల్‌గా ఉపయోగించలేదు. ప్రస్తుతం నెట్ వినియోగం పెరిగిపోవడంతో ఈ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. సెల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థ లేని చోట కూడా శాటిలైట్ ద్వారా నెట్ అందివ్వడం ఈ పద్దతిలో సాధ్యం అవుతుంది. వచ్చే ఏడాది లో ఎర్త్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్ కనెక్టివిటీ కోసం టెలిశాట్ సంస్థ ఏకంగా ఎనిమిది బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. ఇండియాకు సంబంధించి ఈ సంస్థ టాటా గ్రూపుకి చెందిన నెల్కోతో కలిసి పని చేయనుంది. టాటా కంటే మేందు ఎయిర్టెల్ సంస్థ సైతం శాటిలైట్ ఇంటర్నెట్పై దృష్టి సారించింది. ఈ విభాగంలో వన్‌వెబ్ సంస్థతో కలిసి పని చేస్తోంది. మరోవైపు అమెజాన్ , టెస్లాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థలు కూడా లైట్ స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను వచ్చే ఏడాది నుంచి వైర్లెస్ నెట్ సేవలు ప్రారంభించేందుకు ఈ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. -
మరో మైలురాయికి చేరువైన ఇస్రో
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని పీఎస్ఎల్వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇందులో మూడు భారత్‌వి, కాగా మిగిలినవి విదేశాలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు. దేశీయ అవసరాల కోసం భౌగోళిక పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కార్టోశాట్ ఉపగ్రహ వ్యవస్థను 2005లో ప్రారంభించారు. భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను ఈ వ్యవస్థ పంపుతోంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, సముద్ర తీర ప్రాంతాల పర్యవేక్షణ, నీటి పంపిణీపై కీలక సమాచారాన్ని సమకూరుస్తోంది. భారత్‌కు చెందిన చివరి ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే ఇప్పటి వరకు ఇస్రో పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య వందకు చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సీ–40 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇస్రోకు బ్రహ్మాస్త్రం పీఎస్ఎల్వీ ఇస్రోకు పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) తిరుగులేని బ్రహ్మాస్త్రంగా మారింది. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా ఇది పేరొందింది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి జరిగిన 61 ప్రయోగాల్లో 41 ప్రయోగాలు పీఎస్ఎల్వీ రాకెట్‌దే కావడం విశేషం. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో ఫ్రాన్స్, రష్యా నుంచి పంపిస్తుంటే అతిచిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయం తెచ్చిపెడుతోంది. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్ఎల్వీకే సొంతం. ఇప్పటివరకు 41 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 210 విదేశీ ఉపగ్రహాలు, 39 స్వదేశీ ఉపగ్రహాలు ప్రయోగించారు. రెండు రకాలుగా.. పీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో రెండు రకాలుగా ఉపయోగిస్తోంది. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేప్పుడు స్ట్రాఫాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. దీనిని కోర్ అలోన్ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు. అదే ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేందుకు అత్యంత శక్తివంతమైన స్ట్రాఫాన్ బూస్టర్లతో చేస్తారు. ఎక్సెఎల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఇప్పటివరకు 19 ప్రయోగాలు చేశారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా పీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను పంపుతోంది. అయితే గతేడాది ఆగస్ట్ 31న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ39 ప్రయోగం విఫలమైంది. దిగ్విజయంగా జైత్రయాత్ర చేస్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ రెండోసారి విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగు నెలలు పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం 42వ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 28 విదేశీ ఉపగ్రహాలతో పాటు మూడు స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే పీఎస్ఎల్వీ ద్వారా 238 విదేశీ, 40 స్వదేశీ ఉపగ్రహాలను పంపించినట్లవుతుంది. ఇస్రోకు వాణిజ్యపరంగా సంవత్సరానికి సుమారుగా రూ.1,500 కోట్లు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది పీఎస్ఎల్వీ రాకెట్లే కావడం విశేషం. తేదీ వెహికల్ ఉపగ్రహాలు 20–09–1993 పీఎస్ఎల్వీ–డీ1 విఫలం 15–10–1994 పీఎస్ఎల్వీ–డీ2 ఐఆర్ఎస్–పీ2 21–03–1996 పీఎస్ఎల్వీ–డీ3 ఐఆర్ఎస్–పీ3 29–09–1997 పీఎస్ఎల్వీ–సీ1 ఐఆర్ఎస్–1డీ 26–05–1999 పీఎస్ఎల్వీ–సీ2 ఓషన్‌శాట్–1 22–10–2001 పీఎస్ఎల్వీ–సీ3 టెస్ 12–09–2002 పీఎస్ఎల్వీ–సీ4 కల్పన–1 17–10–2003 పీఎస్ఎల్వీ–సీ5 రీసోర్స్శాట్–1 05–05–2005 పీఎస్ఎల్వీ–సీ6 కార్టోశాట్–1,హామ్‌శాట్ 10–01–2007 పీఎస్ఎల్వీ– సీ7 కార్టోశాట్–2 23–04–2007 పీఎస్ఎల్వీ–సీ8 వాణిజ్య ప్రయోగం 21–01–2008 పీఎస్ఎల్వీ–సీ10 వాణిజ్య ప్రయోగం 28–04–2008 పీఎస్ఎల్వీ–సీ9 కార్టోశాట్–2ఏతో 10 ఉపగ్రహాలు 22–10–2008 పీఎస్ఎల్వీ–సీ11 చంద్రయాన్–1 20–04–2009 పీఎస్ఎల్వీ–సీ12 రీశాట్–2 23–09–2009 పీఎస్ఎల్వీ–సీ14 ఓషన్‌శాట్–2 12–07–2010 పీఎస్ఎల్వీ–సీ15 కార్టోశాట్–2బీ 20–04–2011 పీఎస్ఎల్వీ–సీ16 రీసోర్స్శాట్–2, యూత్‌శాట్ 15–07–2011 పీఎస్ఎల్వీ–సీ17 జీశాట్–12 12–10–2011 పీఎస్ఎల్వీ–సీ18 మెఘాట్రోఫిక్ 26–04–2012 పీఎస్ఎల్వీ–సీ19 రీశాట్–1 09–09–2012 పీఎస్ఎల్వీ–సీ21 వాణిజ్య ప్రయోగం 25–02–2013 పీఎస్ఎల్వీ–సీ20 సరళ్ 01–07–2013 పీఎస్ఎల్వీ–సీ22 ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ 05–11–2013 పీఎస్ఎల్వీ–సీ25 మార్స్ ఆర్బిటర్ ఉపగ్రహం 04–04–2014 పీఎస్ఎల్వీ–సీ24 ఐఆర్ఎన్ఎస్ఎస్–1బీ 30–06–2014 పీఎస్ఎల్వీ–సీ23 వాణిజ్య ప్రయోగం 16–10–2014 పీఎస్ఎల్వీ–సీ26 ఐఆర్ఎన్ఎస్ఎస్–1సీ 28–03–2015 పీఎస్ఎల్వీ–సీ27 ఐఆర్ఎన్ఎస్ఎస్–1డీ 10–07–2015 పీఎస్ఎల్వీ–సీ28 వాణిజ్యపరమైన ఉపగ్రహాలు 28–09–2015 పీఎస్ఎల్వీ–సీ30 ఆస్ట్రోశాట్ 16–12–2015 పీఎస్ఎల్వీ–సీ29 వాణిజ్య ప్రయోగం 20–01–2016 పీఎస్ఎల్వీ–సీ31 ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఈ 16–03–2016 పీఎస్ఎల్వీ–సీ32 ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఎఫ్ 28–04–2016 పీఎస్ఎల్వీ–సీ33 ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ 22–06–2016 పీఎస్ఎల్వీ–సీ34 కార్టోశాట్–సీ, ప్రథమ్, ఫైశాట్తోపాటు 17 విదేశీ ఉపగ్రహాలు 26–09–2016 పీఎస్ఎల్వీ–సీ35 స్కాట్‌శాట్–1 07–12–2016 పీఎస్ఎల్వీ–సీ36 రీసోర్స్శాట్–2ఏ 15–02–2017 పీఎస్ఎల్వీ–సీ37 కార్టోశాట్–2 సీరిస్ 23–06–2017 పీఎస్ఎల్వీ–సీ38 కార్టోశాట్–2 సీరిస్ 31–08–2017 పీఎస్ఎల్వీ–సీ39 ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ విఫలం 12–01–2018 పీఎస్ఎల్వీ–సీ40 కార్టోశాట్–2సిరీస్‌లో మైక్రో, నానో శాటిలైట్‌తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలు -
12న వందో ఉపగ్రహం: ఇస్రో
సాక్షి, బెంగళూరు: అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. జనవరి 12న నెల్లూరులోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. పీఎస్ఎల్వీ–సీ40 వాహక నౌక ద్వారా కార్టొశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను నింగిలోకి పంపబోతున్నామని ఇస్రో శాటిలైట్ కేంద్రం డైరెక్టర్ ఎం.అన్నాదురై మంగళవారం తెలిపారు. ఇందులో 28 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి కాగా, మిగిలిన మూడు స్వదేశీ ఉపగ్రహాలతో ఇస్రో పంపిన వాటి సంఖ్య 100కు చేరుతుందని పేరొన్నారు. 710 కిలోల కార్టోశాట్–2 ఉపగ్రహంతో సుమారు 613 కిలోల బరువున్న మరో 30 ఉపగ్రహాలు ప్రయాణం చేయనున్నాయి. వీటిలో భారత్‌కు చెందిన ఒక మైక్రో, నానో శాటిలైట్లతో సహా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, యూకే, యూఎస్ఏలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలున్నాయి. -
మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 26న పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఒకేసారి ఎనిమిది శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం ద్వారా తొలిసారిగా రెండు వేరు వేరు కక్ష్యల్లోకి ఒకే రాకెట్ ప్రయోగం ద్వారా శాటిలైట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో అధికారులు గురువారం తెలిపారు. సోమవారం ఉదయం 9:12 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి శాటిలైట్లను ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎనిమిది శాటిలైట్లలో వాతావరణ అధ్యయన శాటిలైట్ ఎస్సీఏటీఎస్ఏటీ-1 తో పాటు రెండు దేశీయ శాటిలైట్లు, మరో ఐదు విదేశీ శాటిలైట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 377 కిలోల బరువున్న ఎస్సీఏటీఎస్ఏటీ-1 శాటిలైట్ సముద్రాలు, వాతావరణ అధ్యయనంలో తోడ్పడనుంది.