Vijay Devarakonda Liger Movie Digital And Satellite Rights For Shocking Price, Deets Inside - Sakshi
Sakshi News home page

Liger Movie: లైగర్‌ చిత్రానికి కళ్లు చెదిరే శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌? ఎంతంటే..

Published Mon, Jul 25 2022 12:24 PM | Last Updated on Mon, Jul 25 2022 1:09 PM

Digital, Satellite Rights For Vijay Devarakonda Liger Movie Sold Whopping Price - Sakshi

టాలీవుడ్‌, బాలీవుడ్‌ మోస్ట్‌ అవెయిటెట్‌ మూవీ ‘లైగర్‌’.డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ హీరో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల రిలీజ్‌ చేసిన లైగర్‌ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. డైలాగ్స్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ దద్దరిల్లిపోయింది. విజయ్‌-పూరీ కాంబినేషన్‌తో అనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్‌ విడుదల అనంతరరం ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక మూవీ రిలీజ్‌ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చదవండి: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం, తలైవాకు ఆదాయ పన్నుశాఖ అవార్డు

ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన లైగర్‌ క్రేజ్‌ దృష్ట్యా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ భారీ డీల్‌కు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. శాటిలైట్‌.. డిజిటల్ రైట్స్ కలుపుకుని మొత్తం రూ. 55 నుంచి రూ. 60 కోట్లు పలికినట్టుగా సినీవర్గాల నుంచి సమాచారం. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇందులో రమ్యకృష్ణ హీరో తల్లిగా నటిస్తుండగా.. బాక్సింగ్‌ చాంపియన్‌  మైక్ టైసన్ గెస్టు రోల్‌లో అలరించబోతున్నాడు.

చదవండి: NBK107: కర్నూల్‌ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement