మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో | India to launch eight satellites in two different orbits | Sakshi
Sakshi News home page

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

Published Thu, Sep 22 2016 5:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 26న పీఎస్ఎల్‌వీ రాకెట్ ద్వారా ఒకేసారి ఎనిమిది శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం ద్వారా తొలిసారిగా రెండు వేరు వేరు కక్ష్యల్లోకి ఒకే రాకెట్ ప్రయోగం ద్వారా శాటిలైట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో అధికారులు గురువారం తెలిపారు.

సోమవారం ఉదయం 9:12 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి శాటిలైట్లను ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎనిమిది శాటిలైట్లలో వాతావరణ అధ్యయన శాటిలైట్ ఎస్‌సీఏటీఎస్ఏటీ-1 తో పాటు రెండు దేశీయ శాటిలైట్లు, మరో ఐదు విదేశీ శాటిలైట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 377 కిలోల బరువున్న ఎస్సీఏటీఎస్ఏటీ-1 శాటిలైట్ సముద్రాలు, వాతావరణ అధ్యయనంలో తోడ్పడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement