బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్ తయారుచేస్తున్న ఉపగ్రహాలను 2024 చివరినాటికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్పేస్‌ఎక్స్‌కు చెందిన రైడ్‌షేర్ మిషన్లు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)ను ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.
ఈ సందర్భంగా పిక్సెల్ సీఈఓ అవైస్ అహ్మద్ మాట్లాడుతూ..‘కంపెనీకు స్పేస్‌ఎక్స్, పీఎస్‌ఎల్‌వీ రెండింటిలోనూ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే, ఇది ఉపగ్రహాల సంసిద్ధత, ప్రయోగ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. సంస్థ వద్ద ప్రస్తుతం ఏటా 40 పెద్ద ఉపగ్రహాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం పరిశోధకుల బృందం ఆరు ఉపగ్రహాలపై పని చేస్తోంది. వీటిని ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోని ప్రవేశపెట్టనున్నాం. 2024లో మరిన్ని ఉపగ్రహాలను తయారుచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదు
ఈ ఏడాది జనవరిలో పిక్సెల్ బెంగుళూరులో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘మెగాపిక్సెల్’ అనే ఫెసిలిటీని ప్రారంభించింది. ఇందులో ఆరు హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజరీ ఉపగ్రహాలను ప్రయోగాలు జరుపుతున్నారు. ఇవి వ్యవసాయం, ఎనర్జీ, అటవీ, పర్యావరణ పర్యవేక్షణతో సహా వివిధ పరిశ్రమలకు ఉపయోగపడుతాయని కంపెనీ వర్గాలు చెప్పాయి. 2022లో పిక్సెల్ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్‌ను ఉపయోగించి ‘శకుంతల’ (టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్-2) ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
Comments
Please login to add a commentAdd a comment