![ISRO postpones space docking experiment to 9 January 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/7/is.jpg.webp?itok=2KPEUHXW)
సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట: రోదసీ పరిశోధనల్లో మరో మైలురాయిని అధిగమించేందుకు ఇస్రో సమాయత్తమైంది. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట రెండు ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం 7న జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఈ నెల 9కి ఇస్రో వాయిదా వేసింది.
డాకింగ్ ప్రక్రియకు గ్రౌండ్ సిమ్యులేషన్ ద్వారా మరిన్ని పరీక్షలు అవసరమైనందునే రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్ష రంగంలో దేశం మరింత ఎత్తుకు, మరో మెట్టుకు ఎదిగేందుకు ఇస్రోకు డాకింగ్ ప్రయోగం ఎంతో కీలకం. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే స్పేస్ డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసుకోగలిగాయి. ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతమైతే భారత్ నాలుగో దేశంగా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment