మొబైల్‌లో సిమ్ లేకుండా మెసేజ్ చేయడం సాధ్యమవుతుందా..? ఎందుకు అవ్వదు.. వై-ఫై ద్వారా వీలవుతుంది కదా అంటారా. మరి వై-ఫై లేకపోయినా మెసేజ్‌చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకేవేళ మారుమూల ప్రదేశాలు, అడవులు, కొండలు, సముద్రాలు.. వంటి ప్రాంతాల్లో కూడా మన సమాచారాన్ని ఇతరులకు చేరేవేసే అవకాశం ఉంటే అదిరిపోతుంది కదా. ఇలాంటి కొత్త టెక్నాలజీను ప్రపంచ ప్రఖ్యాత సంస్థ యాపిల్ ప్రవేశపెడుతుంది. కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధానకార్యాలయంలో జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో ఇలాంటి కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తుంది. ఈ ఏడాది చివరినాటికి విడుదలచేసే ఐఓఎస్ 18 వర్షన్‌లో ఈ ఫీచర్లను అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
యాపిల్ ఐఫోన్‌లో శాటిలైట్ మెసేజింగ్ సామర్థ్యాలను విస్తరిస్తోంది. కొత్త iOS 18 వర్షన్ ద్వారా సాటిలైట్ సేవలను వినియోగించుకుని ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపించేలా ఏర్పాటు చేస్తున్నారు. సెల్యులార్, వై-ఫై కనెక్షన్‌లు అందుబాటులో లేనప్పుడు శాటిలైట్ ద్వారా సందేశాలు పంపే టెక్నాలజీను తీసుకొస్తున్నారు. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. 2022లో విడుదల అయిన ఐఫోన్14తోపాటు దాని తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన యాపిల్ ఫోన్‌లలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పింది. ఈమేరకు ఆయా ఫోన్‌ల్లోని యాంటెన్నాలు ఉపగ్రహాల ప్రత్యేక ఫ్రిక్వెన్సీని చేరుకునేలా ఇప్పటికే హార్డ్‌వేర్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అందుకు అనువుగా నిర్దిష్ట సాప్ట్‌వేర్, అల్గారిథమ్‌లను రూపొందించినట్లు యాపిల్ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్‌తో ఐఫోన్ వినియోగదారులు ఐమెసేజ్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా టెక్స్ట్‌లు, ఎమోజీలు పంపవచ్చని వివరించింది.
ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?
యాపిల్ శాటిలైట్ కనెక్టివిటీ కాంపోనెంట్ కోసం అమెరికాకు చెందిన గ్లోబల్‌స్టార్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్లోబల్‌స్టార్ సంస్థ స్పేస్‌టెక్నాలజీ అందిస్తున్న ఎండీఏతో ఈమేరకు ఒప్పందం చేసుకుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment