సాక్షి, బెంగళూరు: అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. జనవరి 12న నెల్లూరులోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. పీఎస్‌ఎల్వీ–సీ40 వాహక నౌక ద్వారా కార్టొశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను నింగిలోకి పంపబోతున్నామని ఇస్రో శాటిలైట్ కేంద్రం డైరెక్టర్ ఎం.అన్నాదురై మంగళవారం తెలిపారు.
ఇందులో 28 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి కాగా, మిగిలిన మూడు స్వదేశీ ఉపగ్రహాలతో ఇస్రో పంపిన వాటి సంఖ్య 100కు చేరుతుందని పేరొన్నారు. 710 కిలోల కార్టోశాట్–2 ఉపగ్రహంతో సుమారు 613 కిలోల బరువున్న మరో 30 ఉపగ్రహాలు ప్రయాణం చేయనున్నాయి. వీటిలో భారత్‌కు చెందిన ఒక మైక్రో, నానో శాటిలైట్లతో సహా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, యూకే, యూఎస్‌ఏలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment