గూగుల్‌తో స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ జతకట్టారు. వీరిద్దరి కలయికతో ఇప్పుడు ఉపగ్రహానికి హై స్పీడ్ ఇంటర్నెట్, సురక్షిత కనెక్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అతని శాటిలైట్-టు-ఇంటర్నెట్ సేవా సంస్థ స్పేస్‌ఎక్స్. దీనిని ‘స్టార్‌లింక్’ అని పిలుస్తారు.
స్టార్‌లింక్ ప్రపంచంలోని ఏ మూలనైనా ఇంటర్నెట్ సేవలను అందించడం సులభతరం చేస్తుంది. ప్రస్తుతం గూగుల్ కలయికతో ఇకపై వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండా అధిక వేగంతో ఇంటర్నెట్ అందించనుంది. వీరి ఒప్పందం ప్రకారం ఎలోన్ మస్క్ అంతరిక్ష అభివృద్ధి సంస్థ గూగుల్ క్లౌడ్ ద్వారా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను ప్రారంభించనుంది. అందుకోసం స్టార్‌లింక్ ఉపగ్రహాలకు అనుసంధానించడం కోసం గూగుల్ డేటా సెంటర్లలో స్టార్‌లింక్ గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 2021 రెండవ భాగంలో కస్టమర్లకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని టెక్ దిగ్గజం తెలిపింది. ఇటీవల ఆదాయ నివేదిక ప్రకారం, గూగుల్ క్లౌడ్ వ్యాపారం మొత్తం ఆదాయంలో 7% వాటాను కలిగి ఉంది.
( చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్! )
Comments
Please login to add a commentAdd a comment