శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు.. రేపటి నుంచే టెస్టింగ్! | Starlink Satellite-To-Cell Phone Service Testing Starts On January 27 | Sakshi
Sakshi News home page

శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్: రేపటి నుంచే టెస్టింగ్!

Published Sun, Jan 26 2025 4:08 PM | Last Updated on Sun, Jan 26 2025 4:40 PM

Starlink Satellite-To-Cell Phone Service Testing Starts On January 27

ఇప్పటికి కూడా మారు మూల ప్రాంతాల్లో, ప్రకృతి విపత్తులు జరిగిన సమయాల్లో సెల్‌ఫోన్‌లకు సిగ్నల్స్ లభించవు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులకు ఇలాన్ మస్క్ (Elon Musk) స్టార్‌లింక్ పరిష్కారం చూపెట్టనుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి టెస్టింగ్ కూడా ఈ నెల 27న ప్రారంభించనుంది.

శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందే విధంగా.. స్టార్‌లింక్ (Starlink) ఇంటర్నెట్ కనెక్షన్ బీటా టెస్టును ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడా నెట్‌వర్క్ సమస్య ఉండదని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే, భూమిపైన ఉన్న సెల్ టవర్లతో పనిలేకుండానే.. సెల్‌ఫోన్‌లకు శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ లభిస్తాయి.

డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్ సర్వీస్
ఇది మొబైల్ ఫోన్‌లను నేరుగా శాటిలైట్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులను తెస్తుంది. ఇది వరకు సెల్ టవర్లను ఫిక్స్ చేసేవారు. కాబట్టి కొన్ని మారుమూల ప్రాంతాల్లో.. లేదా దట్టమైన అడవుల్లో సిగ్నల్స్ లభించవు. అయితే డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్ సర్వీస్ ద్వారా మీరు ఎక్కడున్నా.. సిగ్నల్స్ లభిస్తాయి. ఆపత్కాల పరిస్థితుల్లో కూడా ఇది మీ కమ్యూనికేషన్‌ను కొనసాగించడానికి అనుమతిస్తుంది. బీటా పరీక్షలు విజయవంతమైన తరువాత ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement