
సీమాంధ్ర ఆరోగ్య భరోసా: కొత్త సీఎం ఏం చేయాలి?
వైద్యుడు లేని ఊళ్లో ఉండొద్దన్నారు మన పెద్దలు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన తరువాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవల సంగతేమిటి? సీమాంధ్ర ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను ఎలా అందించాలి? ప్రతిదానికి హైదరాబాద్ పరిగెత్తుకు రాకుండా అక్కడే వైద్య సదుపాయాలను ఎలా మెరుగుపరచాలి? అయిదు కోట్ల సీమాంధ్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ఏది?
- సీమాంధ్రలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఏజెండాలో ప్రజారోగ్యమే పెద్ద ప్రశ్న! ఈ గణాంకాలను పరిశీలించంది.
- సీమాంధ్రలో విద్యుత్ సరఫరా అందక ఇంక్యుబేటర్లు పనిచేయక నాలుగు వేల మంది పిల్లలు చనిపోతున్నారు.
- ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు వేలాది ప్రాణాలను ప్రతి ఏటా కబళిస్తున్నాయి.
- సీమాంధ్ర ప్రాంతంలో ప్రజారోగ్యం పడకేసింది. ఆరోగ్య శ్రీ, 108 వంటి సేవలు అడుగంటిపోయాయి.
- ఒకప్పుడు కుయ్ కుయ్ కుయ్ మంటూ ఆరోగ్య భరోసా వినిపించిన 108 కూత ఇప్పుడు వినిపించడం లేదు.
- స్పెషాలిటీ వైద్య పరిశోధనా కేంద్రాలేవీ సీమాంధ్ర లో లేవు.
- అన్నిటికీ హైదరాబాదే శరణ్యం అన్న ధోరణి సీమాంధ్ర వైద్యరంగంలో ఉంది.
ఈ నేపథ్యంలో సీమాంధ్రలో ఏర్పడబోయే తొలి ప్రభుత్వం ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రజారోగ్యానికి ఎలాంటి భరోసా ఇవ్వాలి?
మీరేమనుకుంటున్నారు?
ప్రభుత్వ వైద్యాన్ని ఎలా మెరుగుపరచాలి?
ప్రజలు వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకోవాలంటే ఏం చేయాలి?
అట్టడుగు పేదకు అతిపెద్ద వైద్యం ఎలా అందుబాటులోకి తేవాలి?
ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాల సమన్వయంతో ఆరోగ్యాన్ని అందరికీ ఎలా పంచాలి?
మీ సలహాల మూట విప్పండి!
మీ సజెషన్ల మాట చెప్పండి!!
మీరిచ్చే సలహా సీమాంధ్ర ఆరోగ్యానికి శ్రీరామరక్ష కావచ్చు.
మీరిచ్చే సజెషన్ కోట్లాది ప్రజల పాలిట సంజీవని కావచ్చు.