కోటి ఆశల కొత్త తెలంగాణా ఇంకొన్ని రోజుల్లో ఏర్పడబోతోంది. కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కొత్త ముఖ్యమంత్రి చేయాల్సిన అయిదు ముఖ్యమైన పనులేమిటి? విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధికల్పన, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కొత్త ముఖ్యమంత్రి ప్రాథమ్యాలేమిటి?
నీటిపారుదల రంగం రానున్న రోజుల్లో అత్యంత కీలకమైన రంగం. ఈ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి ఏం చేయాలి? విద్యుత్ సరఫరా లోనూ తెలంగాణకు పలు రకాల ఇబ్బందులు రానున్నాయి. ఈ విషయాన్ని ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలూ అంగీకరిస్తున్నాయి. ఉద్యమ పార్టీలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాయి. తొలి ముఖ్యమంత్రి ఈ రంగంలో రాబోయే సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి?
హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సీమాంధ్రనుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్యా చాలా ఎక్కువగా ఉంది. వారికి ముఖ్యమంత్రి ఎలాంటి భరోసా కల్పించాలి? ఎలాంటి చర్యలు చేపట్టాలి?
మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. ఫేస్ బుక్ ద్వారా కూడా తెలియచేయవచ్చు.