priorities
-
ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పథకాలు వ్యయప్రాధాన్యతను వక్రీకరిస్తాయని చెప్పారు. ఉచిత పథకాల అంశంలో పోటాపోటీగా నడుస్తున్న రాజకీయాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉచిత పథకాలతో ప్రజల జేబులు నింపడం సరికాదని జగ్దీప్ ధన్‌ఖడ్ అన్నారు. ప్రజల జీవన శైలి, సమర్థత, నైపుణ్యాలను మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. భారత్ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. ఉచితాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయని ఆయన చెప్పారు. ‘అమృత్ కాల్’ సమయంలోనే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ శోంబి షార్ప్ పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా తీవ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులపై దాని ప్రభావం తీవ్రమైన సమస్యగా ప్రస్తావించారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
యూట్యూబ్‌లో వారికే మొదటి ప్రాధాన్యత: సీఈవో నీల్మోహన్
కంటెంట్ క్రియేటర్లు, ఆర్టిస్టులు యూట్యూబ్‌కు గుండె కాయ లాంటి వారని, వారికే తాను మొదటి ప్రధాన్యత ఇస్తానని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ స్పష్టం చేశారు. గత నెలలో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన యూట్యూబ్ కమ్యూనిటీతో తన భావాలను పంచుకున్నారు. ప్రధాన్యతలు తెలియజేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే తన సామర్థ్యాలను చాటుతోందని, వీడియోల స్వరూపాన్నే మార్చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రోజులు ముందున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నుంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు కూడా ప్రయోజనం పొందుతారన్నారు. యూట్యూబ్ సరికొత్త ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను తమ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో ప్రవేశపెట్టనుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలకు అద్భుతమైన హంగులు జోడించేందుకు వీలు కలుగుతుంది. ఏఐ ఉత్పత్తుల్లో ఇప్పటికే ముందున్న ఓపెన్ఏఐ, మైక్రోసాఫ్ట్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో గూగుల్ ఈ ప్రయత్నం చేస్తోంది. చదవండి: త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో సరికొత్త ఏఐ సాధనాలను విడుదల చేయాలనే ఆతృతలో ఉన్న ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్.. ఇప్పటికే ఉన్న దాని సొంత సాధనాలు, సేవలను మెరుగుపరచడంలో నిదానంగా ఉందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో పోటీదారులు ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీని, మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ చాట్‌బాట్‌ను విడుదల చేశాయి. కంపెనీకి డిజిటల్ యాడ్లు తగ్గిపోవడం, చాట్బాట్ల కారణంగా కంపెనీ ప్రధాన ఆదాయమైన ఇంటర్నెట్ సెర్చ్ వ్యాపారం మందగించడం వంటి ఎదురుదెబ్బలతో గూగుల్ కూడా గత ఫిబ్రవరిలో బార్డ్ అనే ఏఐ చాట్‌బాట్‌ను ప్రకటించింది. ఏది ఏమైనా ఏఐ విషయంలో గూగుల్ అప్రమత్తంగా ఉందనే విషయం యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ మాటల్లో వ్యక్తమౌతోంది. చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్! -
కొత్త ప్రధాని చేయాల్సిన 5 పనులేంటి?
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈనెల 26వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన ముందు అనేక సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. మందగించిన వృద్ధి రేటు, బలహీనపడ్డ ఆర్థిక వ్యవస్థ, అన్ని రంగాల్లో వెనకబాటుతనం... ఇలా అనేక సమస్యలు దేశం ముంగిట ఉన్నాయి. అయితే, కొత్త ప్రధానమంత్రి ముందుగా చేపట్టాల్సిన పనులు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆయన ముందున్న ఐదు తొలి ప్రాధాన్యాలు ఏవేంటి? మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. -
తెలంగాణ సీఎం చేపట్టాల్సిన 5 ముఖ్యమైన పనులు
కోటి ఆశల కొత్త తెలంగాణా ఇంకొన్ని రోజుల్లో ఏర్పడబోతోంది. కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కొత్త ముఖ్యమంత్రి చేయాల్సిన అయిదు ముఖ్యమైన పనులేమిటి? విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధికల్పన, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కొత్త ముఖ్యమంత్రి ప్రాథమ్యాలేమిటి? నీటిపారుదల రంగం రానున్న రోజుల్లో అత్యంత కీలకమైన రంగం. ఈ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి ఏం చేయాలి? విద్యుత్ సరఫరా లోనూ తెలంగాణకు పలు రకాల ఇబ్బందులు రానున్నాయి. ఈ విషయాన్ని ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలూ అంగీకరిస్తున్నాయి. ఉద్యమ పార్టీలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాయి. తొలి ముఖ్యమంత్రి ఈ రంగంలో రాబోయే సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి? హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సీమాంధ్రనుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్యా చాలా ఎక్కువగా ఉంది. వారికి ముఖ్యమంత్రి ఎలాంటి భరోసా కల్పించాలి? ఎలాంటి చర్యలు చేపట్టాలి? మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. ఫేస్ బుక్ ద్వారా కూడా తెలియచేయవచ్చు.