తెల్లారితే తెలంగాణలో ఓటు....
తెల్లారితే తెలంగాణలో ఓటు....
Published Tue, Apr 29 2014 12:44 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ఏప్రిల్ 30. తెలంగాణకి అతి ముఖ్యమైన రోజు. 2.81 కోట్ల మంది ఓటర్లు తెలంగాణ లో కొత్త ప్రభుత్వానికి ఓటేయబోతున్నారు. అందుకే ఇది చరిత్రాత్మకమైన ఓటు. 119 అసెంబ్లీ స్థానాలకు 1669 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 17 లోకసభ స్థానాలకు 265 మంది పోటీ పడుతున్నారు.
ప్రధానంగా పోటీలో కాంగ్రెస్, టీఆర్ ఎస్ లు ఉన్నాయి. టీడీపీ-బిజెపి కూటమి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎంలు కూడా పోటీలో ఉన్నాయి.
ప్రధానంగా లోకసభ పోటీలో ఉన్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సీపీఐ కార్యదర్శి కె నారాయణ, మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ఛాయా రతన్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, కేసీఆర్ కుమార్తె కవిత తదితరులు ఉన్నారు. ఇక అసెంబ్లీలో పోటీలో ఉన్న వారిలో కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు ఉన్నారు.
పోటీలో ఉన్న రెండు పార్టీలు, కూటముల బలాబలాలేమిటో చూద్దాం.
టీఆర్ ఎస్ -
బలాలు -
* తెలంగాణవాదం, సెంటిమెంట్ ఈ పార్టీకి ప్రధానమైన బలం.
* తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా గుర్తింపు
* కెసీఆర్ కరిష్మా
బలహీనతలు -
* పార్టీకి ఉప ఎన్నికల పార్టీగా పేరుంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఎప్పుడు పెద్దగా గెలవలేదు.
* హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండల్లో పార్టీకి బలం లేకపోవడం. దీని వల్ల దాదాపు 65 సీట్లలో పార్టీ పోటీలో లేకపోవడం. హైదరాబాద్, రంగారెడ్డిల్లోని 29 సీట్లలో సీమాంధ్ర ఓటర్లే నిర్ణయాత్మక పాత్ర.
* పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా బలహీనంగా ఉంది.
* కుటుంబ పార్టీ అన్న ప్రచారం ప్రజల్లో బాగా నాటుకుంది. కెసిఆర్ కుటుంబానికి చెందిన అయిదుగురు పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్
బలాలు -
* సీపీఐతో పొత్తు వల్ల కొన్ని ప్రాంతాల్లో పార్టీకి సానుకూలత
* తెలంగాణ తెచ్చిన పార్టీ కావడం.
* దళితుడిని లేదా మహిళను సీఎం చేస్తానని చెప్పడం.
బలహీనతలు -
* తెలంగాణలో సరైన నాయకత్వం లేకపోవడం, ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని ఓడించేందుకు ప్రయత్నించడం
* పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత
Advertisement