జూన్ 2 తర్వాతే కొలువుదీరనున్నసభలు
Published Sat, May 17 2014 2:13 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ, శాసనసభ్యులుగా ఎన్నికైన వారు వెంటనే ప్రమాణస్వీకారం చేసే అవకాశంలేదు. రాష్ట్ర విభజన జరిగే వచ్చే నెల 2వ తేదీ తర్వాతే ఉభయ రాష్ట్రాల శాసన సభలు కొలువుదీరనున్నాయి. అప్పటివరకు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగదు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంది.
వచ్చే నెల 1 వరకు రాష్ట్రపతి పాలన ఉంటుంది. వచ్చేనెల 2న రాష్ట్ర విభజన అనంతరం అదే రోజు లేదా ఆ తర్వాత మంచి ముహూర్తం ఉన్న రోజున కొత్త రాష్ట్రాల శాసన సభలు కొలువుదీరనున్నాయి. సభ సమావేశమైన తొలి రోజు ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారు. అనంతరం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఆ తర్వాత ఉభయ శాసన సభల సభ్యులు స్పీకర్లను ఎన్నుకొంటారు. ఉభయ రాష్ట్రాల స్పీకర్లకు రద్దయిన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బాధ్యతలు అప్పగించనున్నారు.
Advertisement
Advertisement