సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కోవిడ్ కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహమ్మారిపై పోరు కోసం బడ్జెట్‌లో 1000 కోట్ల రూపాయలు కేటాయించింది.
ఇక బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి మొత్తం 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు.. ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు.. కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు.. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్ల చెప్పున కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment