AP Budget 2021
-
సమర్థంగా ప్రతిపక్ష పాత్ర
సాక్షి, అమరావతి : బడ్జెట్ సమావేశాలను టీడీపీ బాయికాట్ చేసినా తాము పాల్గొని ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, బడ్జెట్‌పై సోము వీర్రాజు వీడియో సందేశాన్ని పార్టీ శుక్రవారం మీడియాకు విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్న తీరుపై సీఎం సమీక్ష నిర్వహించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో పేర్కొన్న కేటాయింపులతో పాటు గవర్నర్ ప్రసంగంలో చోటు కల్పించిన అంశాలపై తాము శాసన మండలిలో తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెప్పారు. కరోనా కట్టడితో పాటు రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాకు తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధుల కేటాయింపు జరగలేదన్నారు. రాష్ట్రంలో ఓడరేవులు, పోర్టులపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని సోము వీర్రాజు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు : ఎమ్మెల్సీ మాధవ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అన్న జగన్.. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. కోవిడ్ పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. -
ఏపీ బడ్జెట్: పేదల సొంతింటి కల సాకారం
సాక్షి, అమరావతి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇప్పటికే 25,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను 30.76 లక్షల మందికి పంపిణీ చేసిన ప్రభుత్వం.. వాటిలో మూడేళ్లలో ఇళ్లను నిర్మించి ఇవ్వడం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ప్రస్తుత బడ్జెట్లో రూ.5,661.57 కోట్లను కేటాయించి చిత్తశుద్ధి చాటింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు చొప్పున అర్హులైన 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలను ఇప్పటికే పంపిణీ చేశారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 4.63 లక్షల మందికి మాత్రమే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే గత సర్కార్ కంటే ఇప్పుడు ఆరు రెట్లు ఎక్కువ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్టు స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 17,005 లే–అవుట్లలో 28.30 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఈ లే–అవుట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో తాగునీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి కాలువలు, అంతర్గత రహదారులు, ప్రధాన రహదారులతో అనుసంధానం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి.. ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి రూ.50,940 కోట్లతో ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. 17,005 ఊళ్లను నిర్మిస్తున్నట్టు స్పష్టమవుతోంది. తక్కువ కాలంలో ఇంత భారీ ఎత్తున కొత్తగా ఊళ్లను నిర్మించిన దాఖలాల్లేవని సామాజికవేత్తలు చెబుతున్నారు. ఏపీ టిడ్కో నేతృత్వంలో 2.60 లక్షల ఇళ్లను నిర్మించి మహిళలకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. -
ఏపీ: బాలల కోసం స్పెషల్ బడ్జెట్
సాక్షి, అమరావతి: రేపటి పౌరులైన నేటి బాలల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక ముందడుగు వేసింది. ప్రాథమిక హక్కులు, బాలల సంక్షేమం కోసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపక్రమించారు. రాష్ట్ర బడ్జెట్లో పిల్లలకు తగిన ప్రాధాన్యమిస్తూ ‘పిల్లల బడ్జెట్’ను ప్రభుత్వం రూపొందించింది. 2021–22 వార్షిక బడ్జెట్లో వివిధ శాఖల ద్వారా 18 ఏళ్లలోపు పిల్లల కోసం ఏకంగా రూ.16,748.47కోట్లు కేటాయించింది. బడ్జెట్లో పిల్లల కోసం కేటాయింపులను ప్రత్యేక నివేదిక రూపంలో ప్రభుత్వం వెలువరించింది. బాలల సర్వతోముఖాభివృద్ధికి మూడు కేటగిరీలుగా ఈ నిధులను కేటాయించారు. నేరుగా సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పన/ఆర్థిక సహకారం, శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాల అభివృద్ధి కేటగిరీలుగా నిధులు కేటాయించినట్టు నివేదికలో పేర్కొన్నారు. రెండు విభాగాలు.. 39 పథకాలు ► పిల్లల సంక్షేమం, అభివృద్ధి కోసం రూపొందించిన వివిధ పథకాలు, వాటికి నిధుల కేటాయింపు వివరాలను ప్రభుత్వం రెండు విభాగాల కింద తన నివేదికలో పేర్కొంది. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 39 పథకాలు ఉన్నాయి. ► మొదటి విభాగంలో 100 శాతం పిల్లల కోసం రూపొందించిన పథకాలకు కేటాయింపులను పొందుపరిచారు. ఆ పథకాల కోసం రూ.12,218.64 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పూర్తిగా పిల్లల కోసం కేటాయించిన 20 పథకాలను ఈ విభాగంలో చేర్చారు. ► రెండో విభాగంలో 100 శాతం కంటే తక్కువ నిధులను పిల్లల కోసం కేటాయిస్తూ రూపొందించిన పథకాలను పొందుపరిచింది. ఆ పథకాల కోసం ప్రభుత్వం రూ.4,529.83 కోట్లు కేటాయించింది. ఈ విభాగంలో 19 పథకాలను చేర్చారు. పాఠశాల విద్యా శాఖదే సింహభాగం ►పిల్లల బడ్జెట్ కేటాయింపుల్లో శాఖల వారీగా చూస్తే పాఠశాల విద్యా శాఖ మొదటి స్థానంలో ఉంది. ఆ శాఖకు రూ.8,228.67 కోట్లు కేటాయించారు. ► రూ.3,314.90కోట్ల కేటాయింపులతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రెండో స్థానంలో నిలిచింది. పిల్లలకు రూ.1,169.62 కోట్ల కేటాయింపులతో వైద్య, ఆరోగ్య శాఖ మూడో స్థానంలో ఉంది. చదవండి: AP Budget 2021: ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,258 కోట్లు -
AP Budget 2021: కేంద్ర పథకాలకు పెరిగిన కేటాయింపులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతానికి కేంద్ర ఆర్థిక చేయూతతో అమలు చేస్తున్న స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్ స్కీమ్స్ కోసం బడ్జెట్లో గతంలో ఎన్నడూలేనిరీతిలో నిధులు కేటాయించారు. 60ః40 నిష్పత్తిలో ఈస్కీమ్స్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయిస్తుంటాయి. కొన్ని పథకాలకు మనం ఎంత ఖర్చు చేస్తే ఆ స్థాయిలోనే కేంద్రం ఆర్థిక చేయూత ఇస్తుంది. 2020–21 బడ్జెట్లో రూ.970.52 కోట్లు కేటాయించారు. దీంతో 2021–22లో ఈ స్కీమ్స్ కోసం అధికారులు రూ.1,555.48 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. కేంద్ర పథకాల సౌజన్యంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఏకంగా రూ.1,989.68 కోట్లు కేటాయించారు. కేంద్ర పథకాలకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు జరగడం ఇదే తొలిసారి అని వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కేంద్రం చేయూతతో అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు (రూ.కోట్లలో) పథకం పేరు 2020-21 2021-22 రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై) 237.23 583.44 నేషనల్ ఫుడ్ సెక్యురిటీ మిషన్స్ (ఎన్ఎఫ్ఎస్ఎం) 86.22 133.08 నేషనల్ ఫుడ్ సెక్యురిటీ మిషన్–ఆయిల్ సీడ్ 36.91 53.87 నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ టెక్నాలజీ (ఎన్ఎంఏఈటీ) 85.09 92.07 సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఎఎం) 207.83 739.46 నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (ఎన్‌ఎంఎస్‌ఎ) 141.73 215.89 పరంపరాగత్ కృషి వికాస యోజన 175.51 171.87 మొత్తం 970.52 1,989.68 చదవండి: AP Budget 2021: హోం శాఖకు రూ.7,039 కోట్లు -
ఏపీ బడ్జెట్: రోడ్లకు దండిగా నిధులు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్లు, రవాణా రంగం అభివృద్ధి, రహదారి భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2021–22 వార్షిక బడ్జెట్లో రోడ్లు, భవనాలు, రవాణా శాఖకు రూ.7,594.06 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.1,005.48 కోట్లను అధికంగా కేటాయింపులు చేసింది. గ్రామీణ రహదారులను పటిష్టపర్చడం, కచ్చా రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయడం, మండల కేంద్రాలను అనుసంధానించే రోడ్లను రెండు లేన్లుగా అభివృద్ధి చేయడం తమ కార్యాచరణలో భాగమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు నాబార్డ్, ఆర్ ఆర్ ప్లాన్, ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈ, ఈఏపీ పథకాల కింద రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపడతామన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రెండు ప్రాజెక్టుల కోసం రూ.6,400 కోట్లు రుణాన్ని సేకరించినట్టు ఆయన తెలిపారు. కేంద్రంతో కలిసి కొత్త రైల్వే లైన్ల అభివృద్ధికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. కోర్ నెట్వర్క్ రోడ్లు, రాష్ట్ర ప్రధాన రోడ్లు, జిల్లా ప్రధాన రోడ్ల విస్తరణకు అధిక నిధులు కేటాయించింది. ఐఆర్సీ ప్రమాణాల మేరకు రోడ్ల నాణ్యత ఉండాలని లక్ష్యంగా నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యను కనీసం 5 శాతం తగ్గించేలా రహదారి భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. చదవండి: AP Budget 2021:పారిశ్రామికాభివృద్ధితో భారీ ఉపాధి కల్పన ప్రధాన కేటాయింపులు ఇలా.. ► రాష్ట్రంలో 100 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.200 కోట్లు కేటాయించింది. ►రోడ్ల విస్తరణకు మొత్తం రూ.883.57కోట్లు కేటాయించారు. వాటిలో కోర్ రోడ్ నెట్వర్క్ పరిధిలోని రోడ్లు 340 కి.మీ., జిల్లా ప్రధాన రహదారులు 400కి.మీ., రాష్ట్ర ప్రధాన రహదారులు 15 కి.మీ., ఎస్టీ సబ్‌ప్లాన్ రహదారులు 50 కి.మీ., ఎస్సీ సబ్ ప్లాన్ రహదారులు 20 కి.మీ. ఉన్నాయి. ► రాష్ట్రంలో 10వేల కి.మీ. జిల్లా ప్రధాన రహదారులు, 900 కి.మీ. ఇతర రోడ్ల మరమ్మతులకు మొత్తం రూ.481 కోట్లు కేటాయించారు. ►మండల కేంద్రాలను అనుసంధానించే 100 కి.మీ. మేర రోడ్లను డబుల్ లేన్ రహదారులుగా విస్తరించేందుకు రూ.175.46కోట్లు, 100 కి.మీ. మేర రోడ్లు/బ్రిడ్జిలు రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌కు రూ.175.46 కోట్లు కేటాయించారు. ►మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.123 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. ►రాయలసీమను అమరావతితో అనుసంధానించే 335 కి.మీ. ‘అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే’ను రూ.18,055 కోట్లతో నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. అందులో భాగంగా 250 కి.మీ. మేర భూసేకరణ కోసం రూ.100 కోట్లు కేటాయించారు. ► సీఆర్ఐఎఫ్ పథకం కింద 700 కి.మీ. రోడ్ల అభివృద్ధి పనులకు రూ.400 కోట్లు కేటాయించారు. 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల కోసం భూసేకరణకు రూ.100 కోట్లు కేటాయించారు. ►రోడ్డు భద్రత కార్యకలాపాలకు రూ.150 కోట్లు కేటాయించారు. -
AP Budget 2021: ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,258 కోట్లు
సాక్షి, అమరావతి: ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ.9,426.49 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.13,830.44 కోట్లకు పెంచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలకు నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి పనులకు రూ.1,535 కోట్లు కేటాయించింది. వైద్యవిధాన పరిషత్‌కు గతేడాది కంటే రూ.77.32 కోట్లు ఎక్కువగా ఇచ్చింది. తొలిసారిగా బడ్జెట్లో కోవిడ్ టీకా కోసం రూ.500 కోట్లు, కోవిడ్ నియంత్రణకు రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్లో 4,403.95 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. పేద రోగులకు భరోసా పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు దేశంలోనే మొదటిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత రాష్ట్రానిది. అంతేకాకుండా రెండ్రోజుల క్రితమే ఖరీదైన బ్లాక్ ఫంగస్ చికిత్సనూ ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉచిత చికిత్సకు అవకాశం కల్పిస్తున్న ఈ పథకానికి ఈ ఏడాది రూ.2,258.94 కోట్లు కేటాయించింది. రూ.5 లక్షల వార్షికాదాయంలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,088 కొత్త అంబులెన్సు (108, 104)లను కొనుగోలు చేసిన ఘనత ప్రభుత్వానిది. ఇప్పుడు ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉన్నాయి. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో 108 అంబులెన్సులు అద్భుతమైన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 104 వాహనాలు ఇంటి వద్దకే వెళ్లి మందులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలకు కలిపి బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు. చదవండి: ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ -
బడ్జెట్‌ను స్వాగతించిన పారిశ్రామిక సంఘాలు
కాన్సెప్ట్ సిటీలతో పెట్టుబడి అవకాశాలు: సీఐఐ సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలోనూ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పారిశ్రామిక అభివృద్ధికి పలు చర్యలు తీసుకోవడంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీస్ (సీఐఐ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రం భారీ పెట్టబడులతోపాటు ఉపాధి అవకాశాలను పొందే అవకాశముందని సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ డి.తిరుపతిరాజు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్రం 6,234.64 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశానికి షోకేస్‌గా నిలబడిందని, కాన్సెప్ట్ సిటీల నిర్మాణంతో భారీగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు. హెల్త్‌కేర్, వ్యవసాయంలో యాంత్రీకరణలను ప్రోత్సహించడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. విపత్తులోనూ వృద్ధి నమోదు చేసే బడ్జెట్: ఫ్యాప్సీ సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలోనూ సుస్థిరాభివృద్ధి చేసే బడ్జెట్‌గా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) శ్లాఘించింది. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు రూ.3,673.34 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రం కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఫ్యాప్సీ అధ్యక్షుడు సీవీ అచ్యుతరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో వైద్యరంగానికి రూ.13,830 కోట్లు కేటాయించడం, ముఖ్యంగా కోవిడ్ కట్టడికి రూ.1,000 కోట్లు ఖర్చు చేయడం ఆహ్వానించదగ్గ నిర్ణయమని ప్రశంసించారు. వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన రాష్ట్రంలో ఈ రంగానికి రూ.31,256 కోట్లు కేటాయించడం ద్వారా అన్ని వర్గాలు ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు. చదవండి: పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,673.34 కోట్లు -
AP Budget 2021: అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.200 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హోం శాఖకు ఈ బడ్జెట్లో రూ.7,039.17 కోట్లను కేటాయించారు. గతేడాది రూ.6,364.98 కోట్లు కేటాయించగా ఈ ఏడాది అదనంగా రూ.674 కోట్లకుపైగా కేటాయింపులు పెరిగాయి. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. కాగా, పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా ప్రభుత్వం ఈ బడ్జెట్లో వారి కోసం రూ.200 కోట్లు కేటాయించింది. గతంలో రూ.264 కోట్లు కేటాయించి రూ.10 వేల లోపు డిపాజిట్లు చేసిన బాధితులకు చెల్లించారు. తాజాగా కేటాయించిన మొత్తాన్ని రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసినవారికి చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. చదవండి: ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ -
AP Budget 2021:పారిశ్రామికాభివృద్ధితో భారీ ఉపాధి కల్పన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక వసతులను పెంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా కొప్పర్తిలోని వైఎస్సార్ ఈఎంసీ, విశాఖలోని నాయుడుపేట క్లస్టర్లను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020–21లో పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు రూ.2,705 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.968.34 కోట్లను పెంచి రూ.3,673.34 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే 35.79 శాతం అదనపు నిధులను పరిశ్రమల శాఖకు కేటాయించారు. ముఖ్యంగా రాష్ట్రంలో విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏపీఐఐసీకి రూ.200 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో నిర్మిస్తున్న వైఎస్సార్ ఈఎంసీకి రూ.200 కోట్లు కేటాయింపులు చేసింది. ఇదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల్లో మౌలిక వసతులు కల్పించడానికి రూ.60.93 కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్న వైఎస్సార్ కడప స్టీల్ ప్లాంట్‌కు గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా రూ.250 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,000 కోట్లు కేటాయించింది. రొయ్యల ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు రాయితీల నిమిత్తం రూ.50 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. కోవిడ్ సమయంలోనూ కొత్త పెట్టుబడులు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం వెన్నాడుతున్నప్పటికీ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.6,234.64 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, తద్వారా 39,578 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్రంలో మరో 117 కంపెనీలు రూ.31,668 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయి. వీటిద్వారా 67,716 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కేవలం ఎంఎస్ఎంఈ రంగంలో రూ.4,383.24 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిద్వారా 87,944 మందికి ఉపాధి లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు, ఐటీ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. తద్వారా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో 30 వేల మందికి ఉపాధి లభించనుంది. చదవండి: AP Budget 2021: వ్యవసాయ రంగానికి భారీగా నిధులు -
ముఖం చెల్లకే టీడీపీ సభకు రాలేదు
-
AP Budget 2021: వ్యవసాయ రంగానికి భారీగా నిధులు
కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. వ్యవసాయ రంగం కుదేలైంది. దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కానీ.. మన రాష్ట్రంలో ప్రభుత్వ అండతో వ్యవసాయ రంగం విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగింది. అన్నదాతకు, వ్యవసాయ రంగానికి అండగా నిలబడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కంటే మిన్నగా నిధులను కేటాయించింది. సాక్షి, అమరావతి: వరుసగా రెండో ఏడాదీ కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే.. ఈ కష్టకాలంలో అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గతేడాది కన్నా మిన్న కేటాయింపులు జరçపడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రకటించడమే కాకుండా.. వరుసగా మూడో బడ్జెట్లోనూ ఈ రంగానికి పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేసింది. 2019–20లో రూ.28,866 కోట్లతో తొలి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో కేటాయింపులను రూ.29,159.97 కోట్లకు పెంచింది. ఈ ఏడాది ఏకంగా రూ.31,256.35 కోట్ల కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,096.38 కోట్లను అదనంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. గతేడాదితో పోల్చుకుంటే వ్యవసాయ, పశు సంవర్ధక, సహకార, పట్టు పరిశ్రమల శాఖలకు కేటాయింపులు భారీగా పెంచడం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకూ నూతన జవసత్వాలనిచ్చింది. అన్నదాతలకు అగ్రతాంబూలం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద గతేడాది 51.95 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు పంపిణీ చేయగా.. ఈ ఏడాది ఈ పథకానికి రూ.6,976.50 కోట్లు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడతగా ఈ నెల 13వ తేదీన 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,928.88 కోట్లు జమ చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటివరకు రూ.17,029.88 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించారు. వ్యవసాయ సబ్సిడీ కోసం టీడీపీ సర్కారు 2018–19లో రూ.2,138.22 కోట్లు ఖర్చు చేస్తే గతేడాది రూ.4,450 కోట్లు కేటాయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.5 వేల కోట్లకు పెంచింది. ఉపాధి హామీతో అనుసంధానం.. వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా గతేడాది కంటే మిన్నగా ఈ ఏడాది కేటాయింపులు జరిపారు. గతేడాది వ్యవసాయ రంగంలో ఉపాధి హామీ పథకం కింద రూ.6,270 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది ఏకంగా రూ.8,116.16 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం గతేడాది 207.83 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఆర్బీకేలకు అనుసంధానంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు కోసం రూ.739.46 కోట్ల కేటాయింపులు పెంచారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గత బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది మూడున్నర రెట్లు పెంచారు. ప్రస్తుత బడ్జెట్లో ఏకంగా రూ.1,802. 82కోట్లు కేటాయించారు. మత్స్య, పశు సంవర్థక శాఖలకూ భారీగా.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పశు సంవర్థక, మత్స్య శాఖలకు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా కేటాయింపులు జరిపారు. గతేడాది పశు సంవర్థక శాఖకు రూ.854.78 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.1,026.37 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 171.59 కోట్లను అదనంగా కేటాయించారు. మత్స్య శాఖకు గతేడాది రూ.299 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.329.48 కోట్లు కేటాయించారు. పశు నష్టపరిహారం, రాజన్న పశువైద్యం, పశు విజ్ఞాన బడి వంటి పథకాలకు కేటాయింపులు జరిపింది. పాల ఉత్పత్తి సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేటాయింపులు పెంచింది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న సహకార శాఖకు గత బడ్జెట్లో రూ.248.38 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.303.04 కోట్లకు పెంచారు. రూ.68 వేల కోట్లు గత రెండేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం రూ.68 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.17,029.88 కోట్లు, çసున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.573 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,252 కోట్లు, పంట నష్టపరిహారం కోసం రూ.1,038 కోట్లు, ధాన్యం కొనుగోలు కోసం రూ.18,343 కోట్లు, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం రూ.4,761 కోట్లు, ఉచిత విద్యుత్ కోసం రూ.17,430 కోట్లు, విద్యుత్ ఫీడర్ ఛానళ్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు, సూక్ష్మ సేద్యం కోసం రూ.1,224 కోట్లు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కింద రూ.1,520 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య చెల్లించాల్సిన వడ్డీ లేని పంట రుణాలు, పావలా వడ్డీ బకాయిలు రూ.688 కోట్లు, విత్తన బకాయిలు రూ.384 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.960 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.716 కోట్లు, రైతుల ఎక్స్‌గ్రేషియా రూ.23 కోట్లు కలిపి మొత్తం రూ.2,771 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. వరుసగా మూడో ఏడాది భారీగా కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి నిధులు కేటాయించడం నిజంగా గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి గతేడాది కంటే మిన్నగా కేటాయింపులు జరిపి రైతులకు అండగా నిలిచింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 2,24,789 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్లో రూ.29,159.97 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది రూ.2,29,779.27 కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.31,256.35 కేటాయించారు. ఇది బడ్జెట్లో 13.6 శాతం. వరుసగా మూడేళ్లు వ్యవసాయ రంగానికి భారీగా నిధులను కేటాయించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబుకు కృతజ్ఞతలు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ వ్యవసాయానికి ఊతం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపడం నిజంగా ముదావాహం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,096.38 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. ముఖ్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మిషన్, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్కు కేటాయింపులు భారీగా పెంచడం నిజంగా గొప్ప విషయం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్ వ్యవసాయ శాఖ చదవండి: AP Budget 2021: జన సాధికార బడ్జెట్ ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ -
ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్
చంద్రబాబు.. ఎల్లో మీడియా తరహాలో మేమూ విమర్శలు చేయగలం. కానీ సాధించేదేంటి? కోవిడ్ సమయంలో అందరూ కలిసి పని చేయాలి. వేలెత్తి చూపేకన్నా ఒకరినొకరం ప్రోత్సహించు కోవడం, ఒకరికి ఒకరం మద్దతు ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రజల మనోధైర్యాన్ని దెబ్బ తీసే వార్తలు రాయొద్దని ఎల్లో మీడియాను కోరుతున్నాం. నిలబడే ప్రాణాలను, ఆడే గుండెలను ఆపేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టే కోవిడ్ నుంచి ప్రజలను కాపాడేందుకు నిజాయితీగా పోరాడుతున్నాం. ఎంత ఖర్చు చేసైనా సరే కోవిడ్ వ్యాక్సిన్ తెప్పిస్తాం. ప్రజలందరికీ ఉచితంగా ఇప్పిస్తాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గురువారం ప్రకటించారు. ప్రభుత్వ కృషి ఫలితంగానే మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ చేరిందన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన సూచన మేరకు కోవిడ్ మృతులకు సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రాణం విలువ బాగా తెలిసిన వాడిని కాబట్టే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు గుండె పగిలిన కుటుంబాలకు అండగా ఉండేందుకు ఓదార్పు యాత్ర చేశానని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ప్రాణం పోసేలా ఆరోగ్య శ్రీని తీర్చిదిద్దానన్నారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామని, వెయ్యి జబ్బులకే పరిమితమైన ఈ పథకాన్ని 2,400 జబ్బులకు అమలయ్యేలా విస్తరించామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 104, 108 వాహనానాలు 1180 కొనుగోలు చేశామన్నారు. వైద్య సదుపాయాలున్న ఈ వాహనాలు ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే ‘కుయ్.. కుయ్.. కుయ్..’ అంటూ వచ్చేలా ప్రతి మండలానికి చేరవేశామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి 2 వేల మందికి హెల్త్ వర్కర్‌ను నియమించామని, ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు కడుతున్నామని తెలిపారు. అక్కడ 91 రకాల మందులు అందుబాటులో ఉంటాయని, 24 గంటలూ ఏఎన్ఎం ఉంటారని, ప్రతీ మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనం అనుసంధానమయ్యేలా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆయువు నిలిపేలా ఆస్పత్రులు ►ఊహించని విధంగా కోవిడ్ సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. గతేడాది మార్చిలో ఏపీలో తొలి కేసు నమోదైంది. అప్పట్లో కోవిడ్ పరీక్షల కోసం శాంపుల్స్ పూనెకు పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 150 లేబొరేటరీలు.. రోజూ లక్ష పరీక్షలు చేస్తున్నాయి. ►తొలి కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు 261 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు వైద్య సేవలందిస్తే.. ఇవాళ 649కి పైగా ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరం (టైర్ వన్ సీటీ) లేకుండా పోయింది. ఆదునిక వైద్యం టైర్వన్ సిటీల్లోనే లభిస్తోంది. ఈ వాస్తవాల్ని గ్రహించే నాడు–నేడు కార్యక్రమం ద్వారా అన్ని స్థాయిల ఆస్పత్రుల రూపు రేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ►కొత్తగా ప్రతి పార్లమెంట్ పరిధిలో బోధనాసుపత్రి, నర్సింగ్ కాలేజీ పెట్టబోతున్నాం. ప్రతి వ్యక్తి దగ్గరకు వైద్యాన్ని తీసుకెళ్లాలనే తపనతోనే ఇవన్నీ చేస్తున్నాం. మొదటి వేవ్ కరోనా సమయంలో 261 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నాం. ఇందులో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అక్కడ డాక్టర్లు, ఆక్సిజన్, మందులు అన్నీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 649 ఆసుపత్రుల్లో 47,285 బెడ్స్ ►రెండో వేవ్‌లో 649 ఆస్పత్రులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గత సెప్టెంబర్ నాటికి ప్రభుత్వం తీసుకున్న 261 ఆస్పత్రుల్లో 34,441 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 649 ఆసుపత్రుల్లో 47,285 బెడ్స్ అందుబాటులోకి తెచ్చాం. కోవిడ్ కేర్ సెంటర్స్‌లోనూ మెరుగైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. మరో 52,471 బెడ్స్ అందుబాటులోకి తెచ్చాం. ►కోవిడ్ సెంటర్లలో 18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేసి, అక్కడ పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్‌ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి, ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం మనదేనేమో. ప్రతిరోజు 25 వేల మంది ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం పొందుతున్నారు. 14 నెలల్లో రూ.2,229 కోట్లు ఖర్చు ►గడిచిన 14 నెలల కాలంలోనే కోవిడ్ కోసం రూ.2,229 కోట్లు ఖర్చు చేశాం. బ్లాక్ ఫంగస్ వస్తోందని తెలిసిన వెంటనే ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది లేకుండా.. దాన్నీ ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇందుకోసం ఈ నెల 18వ తేదీన 17 ఆస్పత్రులను గుర్తించాం. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు స్పెషలిస్టులు, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లను 18,270 మందిని విధుల్లోకి దించాం. ►104 నంబర్‌కు ఫోన్ చేస్తే కోవిడ్ సమాచారం ఇచ్చేలా చేశాం. ఈ నంబర్‌కు ఈ నెల 16వ తేదీ నాటికి 3.12 లక్షల కాల్స్ వచ్చాయి. ఇందులో 60,634 మందిని ఆస్పత్రుల్లో చేర్చారు. మరో 46,421 మందికి పరీక్షలు చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ రోగులకు.. 680 మంది స్పెషలిస్టులతో కలిపి 3,991 మంది డాక్టర్లు టెలీ మెడిసిన్ వైద్యం అందిస్తున్నారు. ఆక్సిజన్ కోసం అనుక్షణం పరుగు ►రాష్ట్రానికి ఆక్సిజన్ తెప్పించే ప్రక్రియలో ఏమాత్రం ఆలస్యం కాకూడదని.. రోజుకు నాలుగైదు ట్యాంకులను ఒరిస్సాకు ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాం. విదేశాల నుంచి ఆక్సిజన్, క్రయోజెనిక్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాం. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్ ద్వారాను తెప్పిస్తున్నాం. ఆక్సిజన్ ఎన్ని వందల కిలోమీటర్లలో దొరుకుతుందన్నా.. ఎంత ఖర్చుకైనా సిద్ధపడి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాం. ►రాబోయే తరాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో 53 ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు నాంది పలికాం. మరో 50 క్రయోజెనిక్ ట్యాంకర్లు తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న వాళ్లకు 5 నుంచి 10 లీటర్ల ఆక్సిజన్ అందించేలా 18,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోలుకు సిద్ధమయ్యాం. అవి కూడా ఈ నెలాఖరులో వస్తాయి. ►10 వేల డి టైప్ సిలెండర్ల కొనుగోలుకు రూ.309 కోట్లతో ఆర్డర్ ఇచ్చాం. గ్రామ స్థాయి ఆశ వర్కర్ల దగ్గర్నుంచి నర్సులు, డాక్టర్లు, శానిటేషన్ పనివాళ్లు, కలెక్టర్లు అందరూ కష్టపడి పని చేస్తున్నారు కాబట్టే కోవిడ్ మరణాలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలో ఏపీ ఒకటి అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. వీరందరికీ హ్యాట్సాఫ్. అందరికీ లబ్ధి ►బీసీలను బ్యాక్‌బోన్ క్లాస్‌గా చేసేందుకు కట్టుబడి ఉన్నాం. రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, మధ్య తరగతి వర్గాల కోసం నిలబడ్డాం. సంక్షేమానికి రూ.93,708 కోట్లు ఖర్చు చేశాం. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా పంపాం. ►మరో రూ.31,714 కోట్లు పరోక్ష లబ్ధి ద్వారా ఇవ్వడం జరిగింది. మొత్తంగా రూ.1.25 లక్షల కోట్లు ప్రజలకు అందించాం. ►ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని నేను భావిస్తాను. మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఇదే చెబుతాను. మనమంతా ప్రజలకు సేవకులం అని గుర్తు పెట్టుకుని పని చేయాలి. అనుభవం లేకున్నా.. హామీలన్నీ పూర్తి ►నాది పెద్ద వయసు కాకపోవచ్చు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం లేకపోవచ్చు. కానీ, చిత్తశుద్ధితో, నిజాయితీగా పని చేస్తున్నా. కోవిడ్ కష్టాల్లోనూ 129 వాగ్దానాల్లో 107 పూర్తిగా అమలు చేశాం. మరో 14 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 8 అమలు చేయాల్సి ఉంది. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో 94.5 శాతం హామీలు పూర్తి చేశాం. పాలనలో కులం, మతం, రాజకీయం, వర్గం చూడలేదు. రాబోయే తరానికి మంచి జరగాలని చూస్తున్నాం. ►విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశాం. శిథిలావస్తలో ఉన్న స్కూళ్ల రూపురేఖలు మార్చాం. మన ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం చదువులు, సీబీఎస్ఈ సిలబస్, గోరుముద్ద, ఇలా అనేక పథకాలతో విద్యా రంగం రూపురేఖలు మారుస్తున్నాం. అన్ని పథకాలలో అమ్మ ఒడి కూడా గొప్పది. ►అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ పథకం, 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తూ చట్టం చేయడం.. ఇవన్నీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఎదిగేందుకు తోడ్పడతాయి. ఇదీ అభివృద్ధి అంటే. పైసా లంచం ఇవ్వకుండా, సిఫార్సులు లేకుండా నేరుగా ఇంటి గడప వద్దకే వచ్చి, తలుపు తట్టి పథకాలను వర్తింప చేస్తుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ►గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామంలోనే వార్డు, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాము. ఆ గ్రామంలోనే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. ఆ ఇళ్ల నుంచే వలంటీర్‌ను ఎంపిక చేసి, వారికి తోడుగా ఉండే వ్యవస్థను తీసుకువచ్చాం. ►62 శాతం మంది వ్యవసాయంపై బతికే రైతు బతుకు మార్చకుండా.. నాలుగు బిల్డింగ్లు కడితే అది అభివృద్ధి కాదు. అందుకే రైతుల చేయి పట్టుకుని అడుగులు వేస్తూ, విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం. ►అందుకే పంచాయతీ, మున్సిపల్.. తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవించారు. కుట్రలు చేసిన వాళ్లు పంచాయతీ కార్యాలయాల మీద నీలం, ఆకుపచ్చ రంగులు తుడిచి వేయగలిగారు కానీ, జనం గుండెల్లోని రంగులను మాత్రం తుడిచేయలేకపోయారు. చివరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు కూడా మొహం చెల్లని విధంగా ప్రతిపక్షాన్ని ప్రజలు తుడిచేశారు. వ్యాక్సిన్ వాస్తవం ఇదీ ►వ్యాక్సినేషన్‌పై కొంతమంది పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో 45 ఏళ్లు పైబడ్డ వాళ్లు 26 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 52 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ కావాలి. 18–45 ఏళ్ల మధ్య వాళ్లు 60 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 120 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ కావాలి. మొత్తం 172 కోట్ల డోస్‌లు అవసరం. ►కానీ భారత్‌లో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ నెలకు 7 కోట్ల డోస్‌లు మాత్రమే. ఇందులో సీరం ఇన్స్టిట్యూట్ కోవీషీల్డ్ 6 కోట్ల డోసులు, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ కోటి డోసులను తయారు చేస్తున్నాయి. అందుకే ఇప్పటివరకు 18.44 (11 శాతం లోపు) కోట్ల మందికే వ్యాక్సినేషన్ జరిగింది. ఏపీలో 45 ఏళ్లు నిండిన వాళ్లు.. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో కలిపితే 1.48 కోట్లు ఉన్నారు. వీరికి రెండు డోసులు వేయడానికి 3 కోట్ల డోస్‌లు కావాలి. 18–45 ఏళ్ల లోపు వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 4 కోట్ల డోస్‌లు కావాలి. మొత్తంగా ఏపీకి 7 కోట్ల డోస్‌లు కావాలి. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది 76,29,580 డోసులు..అంటే 11 %లోపు. ూ వ్యాక్సిన్ ఇవ్వడం లేదంటూ, డబ్బులు ఖర్చు పెట్టడం లేదని రాజకీయ నిందలేçస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు కొడుకు వియ్యంకుడిదే. చంద్రబాబుకూ వాళ్లు బంధువులే. ఆ సంస్థ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో తెలిసి కూడా ఆరోపణలు చేయడం ఏమిటి? ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేస్తుంటే బాధేస్తోంది. పరిష్కారం వ్యాక్సినే ►ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్స్‌కు వెళ్లింది. జూన్ 3న బిడ్స్ వస్తాయి. గ్లోబల్ టెండర్లకు వెళ్లిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంటుంది. కోవిడ్‌ను అడ్డుకునే పరిష్కారం వ్యాక్సినేషనే. గ్లోబల్ టెండర్లలో కంపెనీలు ముందుకు వస్తాయని, కేంద్రం ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నాం. ఇదీ మా సంక్షేమ క్యాలెండర్ ఏప్రిల్ 2021 ♦జగనన్న వసతి దీవెన మొదటి విడత ♦జగనన్న విద్యా దీవెన మొదటి విడత ♦రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ (2019 రబీ) ♦పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు మే 2021 ♦వైఎస్సార్ రైతు భరోసా మొదటి విడత. దాదాపు 50 లక్షల రైతులకు ఇచ్చాం. ♦మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ, డీజిల్ సబ్సిడీ) ఇచ్చాం. ♦వైఎస్సార్ ఉచిత పంటల బీమా (2020 ఖరీఫ్) మే 25న ఇవ్వబోతున్నాం. జూన్ 2021 ♦జగనన్న తోడు తొలి విడత ♦వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత ♦వైఎస్సార్ చేయూత మూడో విడత చెల్లింపులు ♦జూన్ 8న జగనన్న తోడు బ్యాలెన్స్ ఇవ్వబోతున్నాం. ప్రతి మంగళవారం ఒక్కో కార్యక్రమం. జూన్ 8న జగనన్న తోడు, 15న వాహనమిత్ర, 22న చేయూత. జూలై – 2021 ♦జగనన్న విద్యా దీవెన రెండో విడత ♦వైఎస్సార్ కాపు నేస్తం ♦విద్యా కానుక ఆగస్టు 2021 ♦రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు (2020 ఖరీఫ్). ♦ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు. ♦వైఎస్సార్ నేతన్న నేస్తం. ♦అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు. సెప్టెంబర్ 2021 ♦వైయస్సార్ ఆసరా అక్టోబర్ 2021 ♦వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత ♦జగనన్న చేదోడు (రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులు) నవంబర్ 2021 ♦వైఎస్సార్ ఈబీసీ నేస్తం. ఇది ఈ ఏడాది అమలు చేసే కొత్త పథకం. ఏటా రూ.15 వేలు చొప్పున సహాయం. అగ్ర వర్ణాల్లోని 45 ఏళ్లు దాటిన పేద అక్కలకు సహాయం. డిసెంబర్ 2021 ♦జగనన్న వసతి దీవెన రెండో విడత ♦జగనన్న విద్యా దీవెన మూడో విడత ♦వైయస్సార్ లా నేస్తం జనవరి 2022 ♦పెన్షన్ నగదు పెంపు. ఈ నెల నుంచి నెలకు రూ.2,500. ♦వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత ♦జగనన్న అమ్మ ఒడి ఫిబ్రవరి 2022 ♦జగనన్న విద్యా దీవెన నాలుగో విడత చదవండి: AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే.. -
భవిష్యత్తుకు దిశానిర్దేశం
-
‘సీఎం రైతు పక్షపాతి అనడానికి వ్యవసాయ బడ్జెట్ నిదర్శనం’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి అని చెప్పడానికి వ్యవసాయ బడ్జెట్ నిదర్శనం వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు సంక్షేమం, శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. వచ్చే ఖరీఫ్ నాటికి వైఎస్సార్ ల్యాబ్స్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవినీతి లేకుండా లక్షా 25 వేలకోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించామని పేర్కొన్నారు. కానీ కోవిడ్ సమయంలో బాధ్యత లేకుండా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మాట ఇస్తే తప్పరని మరోసారి రుజువైందని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత మంత్రి రాజశేఖర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చరిత్రాత్మక నిర్ణయమని ప్రశంసించారు. ఉద్యోగులు, కార్మిక సంఘాల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని తెలిపారు. చదవండి: అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు కట్టడం కాదు: సీఎం జగన్ -
భయపెట్టి ఆడే గుండెను ఆపేయకండి
-
అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు కట్టడం కాదు
-
అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు కట్టడం కాదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: చిత్తశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తున్నామని.. కుల, మత, ప్రాంత, రాజకీయాలు చూడకుండా సంక్షేమం అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. ''నాలుగు బిల్డింగ్లు కడితే అభివృద్ధి జరిగినట్లు కాదు. నిన్నటికంటే ఈరోజు బాగుండాలి.. రేపు మరింత బాగుంటుందనే భరోసా కల్పించాలి. నాడు-నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మారుస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారతపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో 62 శాతంమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారి బతుకులు మార్చకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది. గతంలో మ్యానిఫెస్టో అంటే ఎన్నికల ప్రచారానికి మాత్రమే. కానీ మేం రెండేళ్ల కాలంలోనే 94.5 శాతం హామీలు నెరవేర్చాం. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు..రైతులకు తోడుగా ఉంటున్నాం. కుట్రలు పన్ని గోడలపై ఉన్న రంగులు తుడిచివేయగలిగారు గానీ.. ప్రజల గుండెల్లో రంగులను తాకలేకపోయారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, తిరుపతి ఉపఎన్నిక సహా ఏ ఎన్నిక వచ్చినా దేవుడి దయతో ఒకే జెండా ఎగిరింది. గత 23 నెలల్లో ప్రజలకు నేరుగా రూ.93,708 కోట్లు అందించాం. మరో రూ.31,714 కోట్లు ప్రజలకు పరోక్షంగా అందించాం. మొత్తం రూ.లక్షా 25 వేలకోట్లు ప్రజలకు చేరవేశాం. మనం ప్రజలకు సేవకులమని గుర్తుపెట్టుకుని పనిచేయాలి'' అని తెలిపారు. చదవండి: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు: సీఎం జగన్ AP Budget 2021: లైవ్ అప్డేట్స్.. -
విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మ గౌరవం
-
భయపెట్టి ఆడే గుండెను ఆపేయకండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లో మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. భయాలు, అపోహలతో ఆడే గుండెలను ఆపకండంటూ ఆవేదన చెందారు. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో చిన్నచిన్న తప్పులు జరిగినా ఒకరినొకరు కలుపుకుని పోవాలని అన్నారు. ప్రజల మనోధైర్యాలను దెబ్బతీసే వార్తలు, అసత్యాలను ప్రచారం చేయొద్దని ఎల్లో మీడియాకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి కరోనాపై పోరు గురించి సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘కోవిడ్ రోగుల కోసం 47 వేల బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం . కోవిడ్ కేర్ సెంటర్లలోనూ 52 వేల బెడ్లను అందుబాటులోకి తెచ్చాం.18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులోకి తెస్తున్నాం. కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నాం. గడిచిన 14 నెలల్లో కోవిడ్ నియంత్రణకు రూ.2,229 కోట్లు కేటాయించాం. కోవిడ్ సమాచారం కోసం 104ను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటివరకు 3.12 లక్షలమంది 104 సేవలు వినియోగించుకున్నారు. 104 ద్వారా 60 వేలమందికిపైగా కోవిడ్ రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశాం. టెలీమెడిసిన్ ద్వారా 3,991 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. చదవండి: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు: సీఎం జగన్ -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం
-
ప్రజల్ని భయపెట్టే వార్తలు వేయొద్దని ఎల్లో మీడియాను కోరుతున్నా
-
నాకు ప్రాణం విలువ బాగా తెలుసు: సీఎం జగన్
-
మహాత్మ గాంధీ ఆశయాలను జగన్ నిజం చేశారు
-
బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం - శ్రీకాంత్ రెడ్డి
-
‘చిన్నారులకు సీఎం జగన్ మేనమామగా మారిపోయారు’
సాక్షి, అమరావతి: నాణ్యమైన చదువును చెప్పించడంతో పాటు, వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలో చిన్నారులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనమామగా మారిపోయారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ, అన్నం పెట్టి.. ఎదుటి వారి ఆకలి తీర్చే ప్రతిఒక్కరూ లోకంలో వందనాలు అందుకోతగినవారేనని, సీఎం వైఎస్ జగన్ ఆ కోవకే చెందినవారని.. అందుకు జగనన్న గోరుముద్ద పథకమే సాక్ష్యమని తెలిపారు. చదువుతో పాటు సరైన పోషకాహారం అవసరాన్ని గుర్తించిన సీఎం జగన్.. పిల్లలకు రుచికరమైన, బలవర్ధకరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారని మంత్రి రాజేంద్రనాథ్ అన్నారు. చదవండి: AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే.. AP Budget 2021: ఏపీ వ్యవసాయ బడ్జెట్.. కీలక కేటాయింపులు -
ఏపీ బడ్జెట్‌పై స్వరూపానందేంద్రస్వామి హర్షం
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయింపులపై స్పందించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ అభినందనీయులు అని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు. సీఎం జగన్‌కు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పారు. శాసనసభలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రెండు లక్షల 29 వేల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. దీంతోపాటు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కేటాయింపులపై అర్చకులు, బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. -
AP Budget 2021: విపత్తులో వెన్నుదన్ను!
సాక్షి, అమరావతి: లాక్డౌన్లు, కర్ఫ్యూలున్నా దేశ మనుగడ కోసం నిరంతరం శ్రమించే అన్నదాతల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమివ్వడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై పెట్టే పెట్టుబడినే ఆకలి, పేదరికంపై పోరాటానికి ఆయుధాలుగా భావిస్తూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు మొత్తం రూ.31,256.36 కోట్ల కేటాయింపులతో 2021–22 వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా రెండో ఏడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతు సంక్షేమం, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఏడాది కంటే అధికంగా నిధులు కేటాయించింది. నిత్యం స్వేదం చిందిస్తూ సేద్యం చేసే రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మంత్రి కన్నబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. గత సర్కారు మిగిల్చిన బకాయిలూ చెల్లించాం.. ►అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు రూ.68 వేల కోట్ల మేర సహాయం అందించింది. టీడీపీ సర్కారు మిగిల్చిన బకాయిలు రూ.2,771 కోట్లు కూడా చెల్లించింది. ► విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో 10,544, పట్టణ కేంద్రాల్లో కొత్తగా 234 కేంద్రాలతో కలిపి మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వివిధ ఉత్పత్తులను నిల్వ చేసి ఆర్బీకేలకు అందించేందుకు 154 హబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. ఒక్కోటి రూ.21.80 లక్షల చొప్పున మొత్తం 10,417 ఆర్బీకే భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ►వైఎస్సార్ పొలం బడుల ద్వారా రైతు సాధికారిత సాధిస్తున్నాం. 10,246 కస్టమ్ హైరింగ్ సెంటర్లు నెలకొల్పాం. ► వైఎస్సార్ రైతు భరోసా కింద 2020–21లో 51.95 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు జమ చేశాం. 2021–22 తొలి విడత సాయంగా 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.3,928.88 కోట్లు ఇచ్చాం. ఇంతవరకు మొత్తం రూ.17,029.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ► విత్తనాల కోసం వ్యయ ప్రయాసలు, సుదూర ప్రయాణాలు, క్యూ లైన్లు, పోలీసుల పహారా లాంటి వాటికి ముగింపు పలికాం. రైతులకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. తొలిసారి టెండర్లు లేకుండా రైతుల నుంచే నేరుగా విత్తనాలు సేకరించి, శుద్ధి చేసి నాణ్యంగా మార్చి తిరిగి అన్నదాతలకే అందజేశాం. రైతులపై రూపాయి భారం లేకుండా... ► దేశంలో రైతులపై ఒక్క రూపాయి కూడా బీమా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ► వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద ఏటా రూ.లక్ష లోపు పంట రుణం తీసుకున్న వారికి వడ్డీ రాయితీని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. తద్వారా 82 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ► రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి కూర్చొని పంటల ప్రణాళిక రూపొందించేలా వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసి క్రియాశీలం చేశాం. ►రైతులకు వారి పొలాల్లోనే శిక్షణ ఇచ్చేందుకు వైఎస్సార్ పొలంబడి పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం. మత్స్య సాగుబడి, పశు విజ్ఞాన బడి, తోటబడి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. 2020–21లో నిర్వహించిన 18,840 పొలం బడులలో 5.65 లక్షల మంది రైతులు శిక్షణ పొందారు. ►ఈ ఏడాది కొత్తగా సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని తెస్తున్నాం. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, భూ సారాన్ని పరిరక్షించడం, సేంద్రీయ పద్ధతులు పాటించటాన్ని ప్రోత్సహిస్తాం. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా ‘ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) అమలు చేస్తున్నాం. ► విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను తనిఖీ చేసిన తరువాతే వినియోగించేలా వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలను వచ్చే ఖరీఫ్‌కి అందుబాటులోకి తెస్తాం. ► ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం చెల్లించే విధానాన్ని దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి సమర్థంగా అమలు చేస్తున్నాం. ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేసి ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా అమలు చేస్తున్నారు. 2020 ఖరీఫ్‌లో జూన్ నుంచి అక్టోబరు వరకు పంటలు నష్టపోయిన 3.80 లక్షల మంది రైతులకు రూ.285.51 కోట్లు పరిహారం జమ చేశాం. 2020 నవంబర్‌లో నివర్ తుపాను వల్ల నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్లు వెంటనే డిసెంబర్లోనే చెల్లించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ► ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణమే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం. టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 462 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందచేశాం. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ఏడాది లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. 2019 నుంచి 2021 మే వరకు రూ.31,782 కోట్లతో 157 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. సీఎం యాప్ ద్వారా ధరల నమోదు.. ►సీఎం యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ఏ పంట ఎంత ధరలు ఉన్నాయో నమోదు చేస్తున్నాం. రైతులకు చెల్లింపుల్లో పారదర్శకతక కోసం ఇ–సంతకం విధానాన్ని ప్రవేశపెట్టాం. గోనె సంచులపై క్యూఆర్ ట్యాగులతో అనుసంధానించాం. ►దేశవ్యాప్తంగా వ్యాపారులతో మన గ్రామస్థాయి మార్కెట్లను అనుసంధానించేందుకు ‘ఇ–ఫార్మ్ మార్కెటింగ్’ వేదికను అందుబాటులోకి తెచ్చాం. ►మహిళా సాధికారికత కోసం మార్కెటింగ్ కమిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ► ప్రతి గ్రామంలో మార్కెటింగ్ మౌలిక వసతుల కల్పన కోసం రూ.14 వేల కోట్లతో ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థను నెలకొల్పుతున్నాం. ►వ్యవసాయ ఉత్పత్తులను పొలాల్లోనే కొనుగోలు చేసేందుకు పంట కోత ముందు, తరువాత అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,718.11 కోట్లతో బహుళార్ద సాధక సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ►డీసీసీబీల్లో హెచ్ఆర్ పాలసీని తెచ్చి పీఏసీఎస్‌లను కంప్యూటరీకరిస్తున్నాం. ►సమీకృత సహకార అభివృద్ధి పథకం రెండో దశ కింద చిత్తూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.609.39 కోట్లతో పనులు మంజూరు చేశాం. మొదటి ఏడాది 67 గిడ్డంగుల నిర్మాణంతోపాటు 44 పాత గిడ్డంగుల మరమ్మతులు, కార్యాలయాల నిర్మాణ పనులు చేపడతాం. ►ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు కోసం రూ.2,850 కోట్లతో ప్రణాళికను ఆమోదించాం. ►రూ.460 కోట్లతో 2020–25లో రాష్ట్రంలో 10,035 సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పేలా ప్రణాళిక రూపొందించాం. ► ఉద్యానవన పంటల విస్తరణ పథకంలో భాగంగా ఈ ఏడాది అదనంగా లక్ష ఎకరాల్లో నూతన పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తాం. ►బైవోల్టైన్ సెరీ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు బైలోల్టైన్ పట్టు గూళ్ల ఉత్పత్తిపై కిలోకు రూ.50 ప్రోత్సాహకం అందిస్తున్నాం. బైవోల్టైన్ ముడి పదార్థం నుంచి సిల్క్ రీలర్స్ ఉత్పత్తికి కిలోకు రూ.130 చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నాం. ►పశువులకు గ్రాసం అందించేందుకు దేశంలో మన రాష్ట్రమే తొలిసారిగా రూ.250 కోట్లతో పశుగ్రాస పథకాన్ని ప్రవేశపెట్టింది. ►రూ.40.86 కోట్లతో పులివెందులలో ముర్రాజాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని ఐదేళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. ►పాల సేకరణ, విక్రయంలో ప్రపంచంలోనే సహకార రంగంలో పెద్దదైన అమూల్ డెయిరీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నూతన అధ్యాయానికి తెరతీశాం. ఈ పథకం అమలవుతున్న గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పాడి రైతులకు అదనంగా రూ.5 నుంచి రూ.17 వరకు లబ్ధి చేకూరుతోంది. ►చేపలు, రొయ్యల దాణా, నాణ్యత పరీక్షలు, సేవలు అందించేందుకు రాష్ట్రంలో 9 తీరప్రాంత జిల్లాల్లో 35 సమీకృత ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకు రూ.50.30 కోట్లు కేటాయించాం. ► ఆక్వా కల్చర్ రంగంపై పర్యవేక్షణ, నియంత్రణ, సుస్థిర అభివృద్ధి కోసం ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని స్థాపించాం. ►పశ్చిమ గోదావరి జిల్లాల్లో షిషరీష్ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాం. n తీరప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు మొదటి దశలో నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా)లలో ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ, ఉప్పాడ (తూర్పు గోదావరి), జువ్వలదిన్నె (నెల్లూరు)లలో కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చేపట్టాం. రెండో దశలో బుడగట్లపాలెం(శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం ), బియ్యపు తిప్ప(పశ్చిమ గోదావరి), కొత్తపట్నం (ప్రకాశం)లో హార్బర్ల నిర్మాణం చేపడతాం. ►వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ కోసం ఫీడర్ల బలోపేతానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ►వైఎస్సార్ జలకళ పథకం కింద నాలుగేళ్లలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేస్తాం. చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు రూ.1,700 కోట్లతో మోటార్లను కూడా ఉచితంగా అందిస్తాం. దీంతో ఐదు లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చి 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. చదవండి: AP Budget 2021: విద్యా రంగానికి రూ.24,624 కోట్లు -
‘చిన్నారులకు ప్రియమైన మేనమామ సీఎం జగన్’
-
ఏపీ బడ్జెట్ 2021: 2 లక్షల 29 వేల కోట్లతో సంక్షేమ బడ్జెట్
-
AP Budget 2021: మహిళా సాధికారతకు పెద్ద పీట
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021 ఏడాదికి గాను బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. మహిళా సాధికారతకు బడ్టెట్‌లో పెద్ద పీట వేశారు. ఇందుకోసం రూపొందించిన వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత పథకాలకు కేటాయింపులు చేశారు. వైఎస్ఆర్ ఆసరా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కలగజేయడం కోసం.. అప్పుల ఊబి నుంచి బయటపడేయటం కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 2019, ఏప్రిల్ 11 నాటికి ఉన్న 27,168 కోట్ల రూపాయల బ్యాంకు బకాయిల్లో.. మొదటి విడతగా 2020 సెప్టెంబర్ 11న 6,337 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రెండవ విడతలో భాగంగా 2021-22 ఏడాదికి గాను మరో 6,337 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఏపీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా 2019-20 సంవత్సారానికి చెందిన రుణాలపై వడ్డీకి సంబంధించి 1400 కోట్ల రూపాయలను బదిలీ చేయడం జరిగింది. మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ 2021లో ఈ పథకానికి 1,112 కోట్ల రూపాయలు విడుదల చేయగా.. 2021-22కు గాను మరో 1,112 కోట్ల రూపాయలను కేటాయించింది. వైఎస్ఆర్ చేయూత మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం 2020 ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 45-60 ఏళ్ల లోపు షెడ్యూల్డ్ కులాల, తెగల, వెనకబడిన తరగతుల, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 23 లక్షల 76 వేల మహిళా లబ్దిదారులకు 4,455 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రెండో విడతలో భాగంగా 2021-22కు గాను మరో 4,455 కోట్లు కేటాయించింది. చదవండి: AP Budget 2021: కోవిడ్‌పై పోరుకు రూ.1000 కోట్లు -
ఏపీ బడ్జెట్: గతేడాది కన్నా రెట్టింపు కేటాయింపులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక కేటాయింపులు చేసింది. అసెంబ్లీ సమావేశంలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొన్ని శాఖల వారీగా గతేడాది (2020-21) కేటాయింపులు.. ఈ ఏడాది కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. ఈబీసీ సంక్షేమం 8 శాతం అధిక కేటాయింపులు ఈ ఏడాది (2020-21) రూ.5,478 కోట్లు గతేడాది (2020-21) రూ.5,088.55 కోట్లు కాపు సంక్షేమం 2020-21లో రూ.3,090 కోట్లు ఈ ఏడాది రూ.3,306 కోట్లు. మొత్తం 7 శాతం అధిక కేటాయింపులు బ్రాహ్మణుల సంక్షేమం 2020-21లో రూ.124 కోట్లు ఈ ఏడాది రూ.359 కోట్లు 189 శాతం అత్యధిక కేటాయింపులు ఎస్సీ ఉప ప్రణాళిక 22 శాతం అధిక కేటాయింపులు చేశారు. ఈ ఏడాది రూ.17,403 కోట్లు గతేడాది రూ.14,218 కోట్లు ఎస్టీ ఉప ప్రణాళిక ఈ ఏడాది రూ.6,131 కోట్లు కేటాయింపు.. ఇది గత ఏడాది కంటే 27 శాతం అధిక కేటాయింపు గతేడాది: రూ.4,814 కోట్లు మైనార్టీ యాక్షన్ ప్లాన్‌తో పాటు మైనార్టీ ఉప ప్రణాళికలో కేటాయింపులు భారీగా పెంచారు. మొత్తం 27 శాతం అధిక కేటాయింపులు ప్రభుత్వం చేసింది. ఈ ఏడాది మొత్తం కేటాయింపులు రూ.3,840.72 కోట్లు 2020-21లో రూ.1,634 కోట్లు -
ఏపీ బడ్జెట్ 2021: స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
-
AP Budget 2021: కోవిడ్‌పై పోరుకు రూ.1000 కోట్లు
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కోవిడ్ కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహమ్మారిపై పోరు కోసం బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక బడ్జెట్లో ఆరోగ్య రంగానికి మొత్తం 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు.. ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు.. కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు.. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్ల చెప్పున కేటాయించింది. -
AP Budget 2021: విద్యా రంగానికి రూ.24,624 కోట్లు
సాక్షి, అమరావతి: పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బలంగా నమ్ముతారు. రాష్ట్ర విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్లో విద్యా రంగానికి సంబంధించిన కేటాయింపులతో ఈ విషయం మరోమారు స్పష్టమైంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా.. పాఠశాలల్లో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు, జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు కేటాయించారు. కాగా గత బడ్జెట్లో ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 2021-22 వార్షిక బడ్జెట్: విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు చదవండి: AP Budget 2021: హైలెట్స్ -
AP Budget 2021: 2 లక్షల 29 వేల కోట్లతో సంక్షేమ బడ్జెట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం కాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు ఇలా.. బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు కాపు సంక్షేమం: రూ.3,306 కోట్లు ఈబీసీ సంక్షేమం: రూ.5,478 కోట్లు బ్రాహ్మణ సంక్షేమం: రూ.359 కోట్లు మైనార్టీ యాక్షన్ ప్లాన్: రూ.1,756 కోట్లు చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు వైఎస్సార్ పింఛన్ కానుక: రూ.17 వేల కోట్లు వైఎస్సార్ రైతు భరోసా: రూ.3,845 కోట్లు జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు వైఎస్సార్-పీఎం ఫసల్ బీమా: రూ.1802 కోట్లు డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247 కోట్లు రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు వైఎస్సార్ కాపు నేస్తం: రూ.500 కోట్లు వైఎస్సార్ జగనన్న చేదోడు: రూ.300 కోట్లు వైఎస్సార్ వాహన మిత్ర: రూ.285 కోట్లు వైఎస్సార్ నేతన్న నేస్తం: రూ.190 కోట్లు వైఎస్సార్ మత్స్యకార భరోసా: రూ.120 కోట్లు మత్స్యకారులకు డీజిల్ రాయితీ: రూ.50 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు: రూ.200 కోట్లు రైతులకు నష్ట పరిహారం: రూ.20 కోట్లు లా నేస్తం: రూ.16.64 కోట్లు ఈబీసీ నేస్తం: రూ.500 కోట్లు వైఎస్సార్ ఆసరా: రూ.6,337 కోట్లు అమ్మఒడి: రూ.6,107 కోట్లు వైఎస్సార్ చేయూత: రూ.4,455 కోట్లు రైతు పథకాలు: రూ.11,210.80 కోట్లు -
కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్: గవర్నర్
-
AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే..
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,29,779.27 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. రూ.47,283 కోట్లతో జెండర్ బడ్జెట్ తెచ్చింది. ►2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు ►రెవెన్యూ వ్యయం - రూ.లక్షా 82 వేల 196 కోట్లు ►మూలధన వ్యయం - రూ.47,582 కోట్లు ►రెవెన్యూ లోటు - రూ.5 వేల కోట్లు ►ద్రవ్యలోటు - రూ.37,029.79 కోట్లు ►జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం ►రెవెన్యూ లోటు 0.47 శాతం ►బీసీ సబ్ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు ►కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు ►ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు ►బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు ►ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు ►ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు ►మైనార్టీ యాక్షన్ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు ►చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు ►మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు ►వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు ►విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు ►వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు ►వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.17 వేల కోట్లు ►వైఎస్ఆర్ రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు ►వైఎస్ఆర్-పీఎం ఫసల్ బీమా యోజనకు రూ.1802 కోట్లు ►రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు ►రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు ►జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు ►డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు ►పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు ►వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు ►వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు ►వైఎస్ఆర్ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు ►వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు ►మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు ►అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు ►వైఎస్ఆర్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు ►లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు ►ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు ►వైఎస్ఆర్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు ►జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు ►అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు ►వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు ►వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.243.61 కోట్లు ►వైఎస్ఆర్ చేయూత కోసం రూ.4,455 కోట్లు ►రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు ►వైఎస్ఆర్ టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు ►వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు ►వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు ►వైఎస్ఆర్ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు ►జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు ►విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు ►స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు ►జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు ►ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు ►ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు ►ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు ►ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు ►కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు ►ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు ►శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు ►హౌసింగ్, మౌలిక వసతులకు రూ.5,661 కోట్లు ►పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ.1000 కోట్లు ►ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు రూ.200 కోట్లు ►కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు ►ఏపీఐఐసీకి రూ.200 కోట్లు కేటాయింపు ►ఎంఎస్ఎంఈలో మౌలిక వసతులకు రూ.60.93 కోట్లు ►పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు ►రోడ్లు భవనాల శాఖకు రూ.7,594.6 కోట్లు ►ఎనర్జీ రంగానికి రూ.6,637 కోట్లు ►దిశ కోసం రూ.33.75 కోట్లు ►అంగన్వాడీల్లో నాడ-నేడు కార్యక్రమాలకు రూ.278 కోట్లు ►వైఎస్ఆర్ బీమాకు రూ.372.12 కోట్లు ►అర్చకుల ఇన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు ►ఇమామ్, మౌజాంల ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు ►పాస్టర్ల ఇన్సెంటివ్‌లకు రూ.40 కోట్లు ►ల్యాండ్ రీసర్వే కోసం రూ.206.97 కోట్లు ►పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖకు రూ.8,727 కోట్లు ►నీటిపారుదల శాఖకు రూ.13,237.78 కోట్లు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం.. బీఏసీ సమావేశం అనంతరం తిరిగి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. సభలో పలువురికి సంతాప తీర్మానాలు చేశారు. పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది. కాసేపట్లో ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. ముగిసిన బీఏసీ సమావేశం.. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. బీఏసీ భేటీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఒక్క రోజు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను కొద్దిసేపట్లో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్: గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్. కొత్తగా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. తి ప్రైవేట్ ఆస్పత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద ఏర్పాటు చేశాం. ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచీ క్రయోజనిక్ ఆక్సిజన్ తెప్పించాం’’ అని గవర్నర్ తెలిపారు ‘‘ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశాం. ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్ వచ్చింది. ప్రతిరోజూ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం. జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచింది. 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచింది. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం. 21.64 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని’’ గవర్నర్ పేర్కొన్నారు. ‘‘జగనన్న విద్యాదీవెన కోసం 4879.30 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.1049 కోట్లు కేటాయించాం. మనబడి-నాడు నేడు కింద 15717 స్కూళ్ల ఆధునికీకరణ చేపట్టాం. స్కూళ్ల ఆధునికీకరణకు రూ.3,948 కోట్లు కేటాయించాం. విద్యాశాఖకు అన్ని పథకాల కింద రూ.25,714 కోట్లు కేటాయించాం. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మఒడి వర్తింప చేశాం. జగనన్న అమ్మఒడి కింద రూ.13,022 కోట్లు, జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మందికి రూ.1600 కోట్లు ఇచ్చాం. ఇరిగేషన్ కింద 14 ప్రాజెక్టులు పూర్తి చేశాం. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద 2019-20 ఏడాదికి 52.38 లక్షలమంది రైతులకు 17030 కోట్లు కేటాయించాం. వైఎస్ఆర్ కాపు నేస్తంలో 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల మహిళలకు 5 విడతల్లో రూ.75 వేలు. ఈ ఏడాది 3.2 వైఎస్సార్ కాపు నేస్తం కింద 491 కోట్లు కేటాయించి 3.27 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం 390.74 కోట్లు కేటాయించి నేతన్నలకు 81,783 మంది లబ్ధి చేకుర్చాం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను బీసీలకు వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని’’ గవర్నర్ తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 87,74,674 మంది మహిళలకు 6792.21 కోట్లు కేటాయించాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 8.78 లక్షల మహిళా సంఘాలకు రూ.1399.79 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహళలకు 4604.13 కోట్లు కేటాయించాం. పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేశాం. ఒక స్కిల్ వర్శిటీతోపాటు 25 మల్టీ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలోని 3 ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు. విజయనగరంలో భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. రాష్ట్రంలో 6 పోర్టులు, 2 ఫిషింగ్ హార్బర్లను రెండు విడతల్లో అభివృద్ధి చేస్తామని’’ గవర్నర్ అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని గవర్నర్ తెలిపారు. ప్రజలను కోవిడ్ నుంచి కాపాడుకోవడం కోసం సర్వశక్తులను వినియోగిస్తామన్నారు. ప్రజలందరూ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రాబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)